సంకలనాలు
Telugu

త్రీడీ ప్రింటింగ్ నగలకు కేరాఫ్ ఆగ్రవ్

పోయినచోటే గెలిచిన ఫౌండర్ వివేక్ఆన్ లైన్ నగల వ్యాపారంలో అగ్రస్థానానికి ఆగ్రవ్ఏడాది పాటు బిజినెస్ మరచి తిరిగిప్రారంభంకస్టమర్ ఈమెయిల్ తో మారిన స్టార్టప్ తలరాత

ashok patnaik
11th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఈ కామర్స్ రంగంలో లాభాలు సంపాదించడానికి నిత్యం కొత్త దారులు వెతుక్కుంటూ పోవాల్సిందే. స్టార్టప్‌ను ప్రారంభించి వదిలేయడాలు పరిపాటే. కొత్తది ట్రై చేయడం, పాతవాటికి మంగళం పాడటం లాంటివి ఇక్కడ కొత్త విషయం అయితే కాదు. ఇందులో కొంతమంది మాత్రమే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని తప్పులను సరిచేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇలాంటి వారిలో వివేక్ క్రిష్ణ ఒకరు. 2006లో కొయంబత్తూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పొందారాయన. రెండేళ్లు ఐబిఎంలో ఉద్యోగం చేసిన ఆయన తర్వాత చదువును కొనసాగించారు. పిజి అయ్యాక 2010లో విదేశాలకు వెళ్లి మరో రెండేళ్లు పనిచేశారు. 2012 లో ఈకామర్స్ ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు దేశంలో అడుగుపెట్టారు. నగలకు సంబంధించిన ఈకామర్స్ ను ప్రారంభించారు. సూర్యమాణిక్యం తో కలసి ఈ వెంచర్ కు శంకుస్థాపన చేశారు. సూర్యమాణిక్యం ప్రొగ్రామర్ గా తన సాయం అందించారు. అనంతరం కంపెనీని అడోబే కొనుగోలు చేసింది. సూర్య వారితో పనిచేయడానికే నిర్ణయంచుకున్నారని వివేక్ అన్నారు.

image


మాది కొయంబత్తూరు.. మీకు తెలుసో లేదో .. ఇండియాలో ఇది గొల్డ్ వ్యాలీ(సిలికాన్ వ్యాలీలాగానే). పెద్ద సంఖ్యలో బంగారు నగలు తయారవుతాయిక్కడ. దేశంలో ఈకామర్స్ వ్యాప్తి చెందుతుంటంతో సహజంగా ఇక్కడున్న అవకాశాన్ని వినియోగించుకోవాలని అనుకున్నా అని వివరించారు వివేక్.

అలా మొదలైంది

వివేక్, సూర్య కలసి క్రిజ్డా డాట్ కామ్ ప్రారంభించారు. క్రిజ్డా ఆన్ లైన్లో నగలపై ఆఫర్లిస్తారు. మొదటి సారి ఆంథ్రపెన్యువర్ గా వివేక్ చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనవసరమైన ఖర్చులు చేయాల్సి వచ్చింది. ప్రాడక్ట్ షిప్పింగ్ చేయాల్సిన డబ్బుల కంటే ఎక్కువ డబ్బులతో లోగో డిజైన్ ను ఖర్చుపెట్టారట. మొదట్లో చాలా సవాళ్లను ఎదుర్కోవల్సి వచ్చింది. తయారీ దారులను ఒప్పించడానికి తలప్రాణం తొకలోకొచ్చింది. వారితో కలసి పనిచేయడానికి మొదట్లో నగల తయారీ దార్లు ససేమిరా అన్నారు. నెమ్మది నెమ్మదిగా వ్యాపారంలో ఉన్న లోటుపాట్లు తెలుసుకున్నారు. స్టాక్ ఫోటోగ్రఫీ, కొరియర్ కంపెనీలను ఒప్పించడం లాంటివి ఎంతోచాకచక్యంగా చేయగలిగారు. టెకీ కావడం వల్ల, టెక్ పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు వివేక్. దీంతో మార్కెటింగ్ పై పెద్దగా ఆసక్తి కనపరచలేదు. ఆ విషయాల్లో పెద్దగా తలదూర్చేవారు కాదు. సాధారణంగా చాలా స్టార్టప్ లు అవగాహన లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతాయి. వాటి నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకొని ముందుకు పోయాం. మేం పూర్తిగా టెక్, యూజర్ ఇంటర్‌ఫేస్, యూజర్ ఎక్స్‌పీరియన్స్‌నే నమ్ముకున్నాం. దీంతో ఎంత ప్రాఫిట్ వస్తుందో ప్రతిసారి చూసుకోవాల్సిన పనిలేదు. మేం పూర్తిగా ప్లెయిన్ గోల్డ్ (నాణ్యమైన బంగారం) అమ్ముతాం. ప్రాఫిట్ మార్జిన్ పెద్దగా ఉండదు. భారీ మొత్తం లో అమ్మకాలు చేసినప్పుడు కచ్చితంగా లాభాలొస్తాయని వివరించారాయన.

image


మల్టిపుల్ పివోట్స్ అండ్ ఆగ్రవ్

కొన్నాళ్లు అమ్మకాలు చేసిన తర్వాత వారికి అనుకున్నంతగా వ్యాపారం నడవలేదు. కనీసం కొనుగోలు సొమ్ముని కూడా పొందలేకపోయారు. దీంతో టెక్ మోడ్ నుంచి వివేక్ బయటకు వచ్చేశారు. సేల్స్ ఆపేసారు. వరుసగా స్టార్టప్ ఈవెంట్లకు అటెండ్ అయ్యేవారు. ఆసమయంలోనే వివేక్ కి నందిని విధ్యానాథన్ పరిచయం అయ్యారు. తాను కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సూర్య హైయర్ స్టడీస్ కోసం కంపెనీని విడిచిపెట్టాల్సి వచ్చింది. ప్రతి స్టోరు వెబ్ సైటు లాంచ్ చేయాలని చూస్తోందన్న విషయం గ్రహించిన వివేక్ వీటన్నింటికి ఓ అగ్రిగ్రేటర్ ని తయారు చేయాలని అనుకున్నారు. లావాదేవీలను విశ్లేషించడం మొదలు పెట్టారు. ఈ సారి సూపర్ స్మార్టర్ అయిన ఐదుగురితో కూడిన ఓ చిన్న టీం ని తయారు చేశారు. ఇందలో టెక్ తోపాటు మార్కెటింగ్ పై ప్రావీణ్యం ఉన్న వ్యక్తులు ఉండటం విశేషం.

ఈ పని చేస్తుండగానే వివేక్ కి ఓ ఈమెయిల్ వచ్చింది. ఇది మొత్తం కధను మార్చేసింది. ఏడాదిన్నర క్రితం ఓ కస్టమరు గోల్డ్ నాణెం ఒకటి వీళ్ల దగ్గర కొన్నారు. దానిలాంటి కాయిన్ మరొకటి కావాలనేది ఆ మెయిల్ సారాంశం. అది యునిక్ పీస్. అలాంటిదే కావాలని ఫోటో గ్రాఫ్ తో సహా మెయిల్ లో వివరించి ఉంది.

“సైట్ మూసేసి దాదాపు ఏడాది పూర్తి అయిన తర్వాత కూడా కస్టమర్లు నా దగ్గరకు రావడం ఏంటని కాస్త ఆశ్చర్యం అంతకు మించిన ఆనందాన్ని పొందాను” అన్నారు వివేక్. తర్వాతి రోజు నుంచే సింగిల్ పేజి వెబ్ సైట్ ప్రారంభించారు. అనతికాలంలోనే ఆర్డర్లను తీసుకోవడం ప్రారంభించారు. చివరగా వారి ఫోకస్సంతా త్రీడీ ప్రింట్ చేసిన బంగారు నగలపైకి మళ్లింది. తర్వాత్ ఆగ్రవ్ పేరుతో కొత్త స్టార్టప్ ప్రారంభమైంది. ఆగ్రవ్, క్రిజ్డలు రెండు వేరు వేరు కంపెనీలయినప్పటికీ వారి పేరెంటింగ్ కంపెనీ క్రిజ్డ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గా కొనసాగింది.

ఇది ఎలా పనిచేసింది

ఒకసారి కస్టమర్ వివేక్ కి టచ్ లోకి వస్తే, టీం దానికోసం పూర్తి స్థాయిలో చర్చించేది. తర్వాత డిజైన్ టీం వచ్చి ఫైనల్ డిజైన్ చేసేది. చివరగా ప్రాడక్ట్ తయారు చేసేముందుకస్టమర్ దగ్గరకు ఎప్రోవల్ కోసం పంపేవారు. ప్రాడక్ట్ అనేది లగ్జరీ బ్రాండ్ కావడంతో మంచి మార్జిన్ కూడా ఉండేది. మొదటి నెలలోనే కంపెనీ రెండున్నర లక్షలను సంపాదించింది. ఆ తర్వాత వెనుతిరిగి చూసింది లేదు. పర్సనలైజింగ్ గోల్డ్ జూయలరీ అనేది చాలా కొత్త సెక్టార్. ఆన్ లైన్ సేల్స్ లో కాంపిటీషన్ కూడా అంతంత మాత్రమే. ఇందులో కూడా రోచాఫ్యాషన్,ఆడిమోన్, ఓయ్లా,మిర్రా, బ్లూస్టోన్, క్యారట్లేన్ లు తప్పితే చెప్పుకోదగిన వారు లేరు. అయితే చాలావరకూ వన్ టు వన్ బిజినెస్ కావడంతో కస్టమైజేషన్ చాలా సులభతరం. దీంతో ఈ మార్కెట్ లో నిలదొక్కుకోగలిగామని వివేక్ ముగించారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags