సంకలనాలు
Telugu

రూ.500 కోట్ల టర్నోవర్ దాటిన హైదరాబాద్ స్టార్టప్ గ్రాబ్ ఆన్

ashok patnaik
19th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


ఆన్ లైన్ కూపన్స్ ఉపయోగించేవారికి గ్రాబ్ ఆన్ గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. యూజర్లకు వీలైనంత తక్కువ ధరకు వస్తువులను ఇప్పించడంపైనే దృష్టిసారించిన ఈ కంపెనీ- అనతి కాలంలోనే కోట్ల టర్నోవర్ కు చేరుకుంది. ఎప్పటికప్పుడు డీల్స్, ఆఫర్స్ గురించి యూజర్లకు అందజేస్తూ మార్కెట్ ను దున్నేస్తోంది. కాస్ట్ పర్ సేల్ మోడల్, ఎండ్ సేల్ ఆధారంగా నడుస్తున్న ఈ కంపెనీ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.

అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన అశోక్ రెడ్డి అనే ఓ తెలుగు ఎన్నారై ఆలోచన నుంచి ప్రారంభమైందే ఈ గ్రాబాన్. అప్పటి వరకూ కూపన్ మామా, కూపన్ వాలా అంటూ కూపన్ పేర్లతోనే ఉండే వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించారాయన గ్రాబ్ ఆన్ లాంచ్ చేయడానికి ఏడాది పాటు మార్కెట్ రీసెర్చి చేశారు అశోక్.

గ్రాబ్ ఆన్ పనితీరు

ఆన్ లైన్ లో కస్టమర్లకు కూపన్లు అందించి అటు ఈ-కామర్స్ కంపెనీలకు ప్రమోషన్ చేసే ప్లాట్ ఫాం ఇది. 2014 ఏప్రిల్ లో ఐదుగురు ఉద్యోగులతో ప్రారంభమైన సంస్థ ఇప్పుడు రూ. 500 కోట్ల టర్నోవర్ దాటింది. నెలకి 5.5మిలియన్ల యునిక్ యూజర్లున్నారు. గ్రాబ్ ఆన్ లో 48మంది ఆన్ రోల్ ఉద్యోగులున్నారు. 2017కల్లా 25 మిలియన్ యూజర్లు యాడ్ అవుతారని అంచానా. ప్రస్తుతం రోజుకి 2 లక్షల మంది యూజర్లున్నారు. మూడు కోట్ల మంది యాక్టివ్ యూజర్ బేస్ సంపాదించుకున్నారు. నూరుశాతం ట్రాఫిక్ ఉంది. మేం సాధించిందంతా పూర్తిగా ఆర్గానిక్ గ్రోత్ మాత్రమే అంటారు అశోక్

జర్నీలో ఎన్నో ఈ-కామర్స్ కంపెనీలకు మద్దతిచ్చారు. అందులో ఓలా క్యాబ్ నుంచి బిగ్ బాస్కెట్ దాకా ఎన్నో బిగ్ జెయింట్స్ ఉన్నాయి. వేరే స్టార్టప్ లకు ఆర్గానిక్ గ్రోత్ సస్టెయినబుల్ మోడల్లో సాధ్య పడదు. కానీ గ్రాబ్ ఆన్ కి 85శాతం ఆర్గానిక్ గ్రోత్ సాధ్యమైందని అశోక్ చెప్పుకొచ్చారు. దాదాపు 47 శాతం రిపీటెడ్ కస్టమర్లు ఉంటే 53 శాతం కొత్త కస్టమర్లు ఉన్నారు. ప్రతి నెలా 10నుంచి 15 శాతం పెరుగుతుందన్నారు. 

మేకిన్ ఇండియాలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న స్టార్టప్ లలో గ్రాబ్ ఆన్ ఒకటి. పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాకే మార్కెట్ లోకి ప్రవేశించాం. అంతేగానీ ఏదో యాక్సిడెంటల్ గా మాత్రం జరగలేదు- అశోక్ రెడ్డి 

గ్రాబాన్ టీం

అశోక్ రెడ్డి అన్నా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ డిగ్రీ చేశారు. 1999 లో నోర్టల్ నెట్ వర్క్ నుంచి కెరీర్ ప్రారంభించారు. అనంతరం ఇన్ఫోసిస్. అమెరికాలో మైక్రోసాఫ్ట్ లో కొన్నాళ్లు. ఈబే, పేపాల్ కంపెనీల్లో పనిచేశారు. తర్వాత న్యూ జెర్సీలో 2007 నుంచి 2011 దాకా స్టార్టప్ లకోసం పనిచేశారు. తర్వాత ఇండియా వచ్చి ఇక్కడ గ్రాబాన్ 2013 లోనే బేటా వర్షన్ లో ప్రారంభించారు. చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా ఉన్న సిల్వర్ స్టర్ గ్రాబ్ ఆన్ టీంలో మరో ముఖ్యమైన వ్యక్తి. ఐఐటి ఖరగ్ పూర్ నుంచి డిగ్రీ పొందిన ఆయన గూగుల్ తో పాటు ఎమ్మెన్సీల్లో 6 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉంది. వీరితో పాటు 48 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

సవాళ్లు,పోటీ దారులు

కూపన్లు అందించే తమలాంటి కంపెనీలకు యజర్ బేస్ పెద్ద సవాలు. మార్కెట్ సెంటిమెంట్ అంతగా లేదు. యూజర్ బేస్ ని కాపాడుకుంటూ, కొత్త యూజర్లను తీసుకురావడం తో దీన్ని అధిగమిస్తున్నామని అశోక్ అంటున్నారు. కూపన్ డాట్ కామ్ అనే మరో సంస్థ ఉన్నప్పటికీ, ఈ తరహా బిజినెస్ మోడ్ లో లేదని అశోక్ అంటున్నారు. 

భవిష్యత్ ప్రణాళికలు

గ్రాబాన్ ఆఫ్ లైన్ స్టోర్లకూ సేవలను విస్తరించాలని చూస్తోంది. పూర్తి బూట్ స్ట్రాపుడ్, సెల్ఫ్ సస్టెయిన్ మోడ్ లో దూసుకు పోతున్న గ్రాబాన్- మొదటి సారి ఫండింగ్ కు సిద్ధమంటోంది. దాదాపు 10 నగరాల్లో సేవలను విస్తరించాలని చూస్తోంది.10 నుంచి15 మిలియన్ డాలర్లతో ఎవరైనా ముందుకొస్తే ఫండింగ్ తీసుకోడానికి సిద్ధంగా ఉన్నామని అశోక్ ప్రకటించారు. సిరీస్ ఏ రౌండ్ ఈ ఏప్రిల్, మే లోపు రెయిజ్ చేస్తామని ధీమాగా ఉన్నారాయన. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ఇంటిగ్రేటెడ్ ప్లాట్ ఫాంతో 10 నగరాల్లో విస్తరించే ప్లాన్ లో ఉన్నారు. 

వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

image

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags