సంకలనాలు
Telugu

SP బాలు ఆ రకంగా ఆంత్రప్రెన్యూర్ అయ్యారు..

22nd Dec 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

జిల్ మోర్ పేరుతో హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఓ స్టార్టప్ కు మెంటర్షిప్ చేస్తున్నారు బాలసుబ్రమణ్యం. స్టార్టప్ కు మెంటర్షిప్ చేయడం తను పాటలు పాడటం కంటే చాలాసులభం అంటున్న బాలులో సరికొత్త ఆంత్రప్రెన్యూర్ కనిపిస్తున్నారు.

“నేను ప్రమోట్ చేసినా, బ్రాండ్ ఎండార్స్ చేసిన ప్రాడక్టులు చాలా చూజీగా ఉంటాయి.” spబాలు

మరి నేను మెంటార్షిప్ చేస్తోన్న ఈ ప్రాడక్టు వాల్యూ ఏంటో అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చారాయన.

image


అసలేంటి జిల్ మోర్?

జిల్ మోర్ అనేది ఆర్టిస్టుల డేట్స్ చూసే ఏజెన్సీలా పనిచేసే ఓ స్టార్టప్. ఇందులో సింగర్స్, మిమిక్రీ ఆర్టిస్టులు, యాంకర్లు ఇతర్ ఆర్టిస్టులు తమ ప్రొఫైల్ తో రిజిస్ట్రర్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఈవెంట్ లకు ఆర్టిస్టులు కావాలంటే ఈ యాప్ లో లిస్ట్ నుంచి ఎంచుకోవచ్చు. సాధారణంగా బ్రాండ్స్ లకు డేట్స్ ఎడ్వర్టైజింగ్ ఏజెన్సీలు చూస్తాయి. ఈవెంట్లకు మేనేజర్లు చూస్తారు. కానీ అది పెద్ద స్టార్లకు. మరి చిన్నా చితక ఆర్టిస్టుల పరిస్థితేంటి? వారికోసమే ఈ జిల్ మోర్.

“జిల్ మోర్ అటు ఆర్టిస్టులకు, ఇటు యూజర్లకు ఉపయోగపడుతూ ఉభయతారకంగా ఉంటుంది.” బాలు

ఇప్పటి వరకూ వెయికి పైగా డౌన్ లోడ్స్ ఉన్న ఈ యాప్ లో యాక్టివ్ యూజర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందన్నారాయన. జిల్ మోర్ లాంటి యాప్ అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో అవసరం అని బాలు చెప్పుకొచ్చారు.

image


నాకు సంగీతమే పెద్ద చాలెంజ్

స్టార్టప్ కు మెంటార్షిప్ చేయడంలో మీరెలాంటి చాలెంజ్ ను చవిచూశారని అడిగి ప్రశ్నకు ఎస్పీ బాలు ఇలా సమాధానం ఇచ్చారు.

“స్టార్టప్ మెంటర్షిప్ లో పెద్ద చాలెంజ్ ఉందని నేనుకోవడం లేదు.” బాలు

నాలుగున్నర దశాబ్దాల సంగీత జీవితంలో చవి చూసిన వాటికంటే ఇది అంత కష్టమేం కాదని అభిప్రాయపడ్డారు బాలసుబ్రమణ్యం. ఆర్టిస్టుల అసెస్మెంట్ , సింగర్ సెలక్షన్ లాంటి పనులు చేస్తూ వారి వివరాలను యాప్ లో భద్రపరచడమే. అయితే నా జీవితానుభవంతో పనిచేయడం చాలా ఈజీ అని అన్నారాయన. గొప్ప గొప్ప సింగర్స్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్న బాలూకీ మహమ్మద్ రఫీ ఫేవరేట్ సింగర్ అట.

image


సంగీతంలో పడి చాలా మిస్ అయ్యా

సంగీతానికి నేను ఎడిక్ట్ అయిపోయా. దీంతో జీవితంలో చాలా విషయాలు మిస్ అయ్యానని బాలు అన్నారు.

“సంగీతానికి నేను బానిసను, అదే నా వ్యసనం” బాలు

సంగీతంలో పడి తన పిల్లలు ఎప్పుడు పెద్దవాళ్లయ్యారనే సంగతి కూడా తనకు గుర్తు లేదన్నారు బాలు. యవ్వనంలో ఉన్పప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోలేదు. 15భాషల్లో నలభై ఏళ్లకు పైగా పాటలు పాడుతున్నా. ఇప్పటికీ నా ఆడియన్స్ కు నా వాయిస్ బోర్ కొట్టడం లేదు. ఇంకా పాడుతునే ఉంటా అన్నారు. పాటల పాడుతూ పర్సనల్ లైఫ్ పూర్తిగా నెగ్లెక్ట్ చేశా. అయినా ఇప్పుడు దాని గురించి ఆలోచించడం వల్ల ప్రయోజనం లేదని నవ్వుతూ అన్నారాయన.

ఏదీ ఇక్కడ పర్ ఫెక్ట్ కాదు

జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయకుండా ఉండాల్సింది అని మీకెప్పుడైనా అనిపించిందా అన్న ప్రశ్నకు సమాధానంగా బాలసుబ్రమణ్యం ఇలా స్పందించారు. తన పాత పాటలు వింటున్నప్పుడల్లా, ఇన్ని తప్పులు చేశానా అని బాధపడుతుంటారట.

“ప్రపంచంలో ఏదీ పర్ ఫెక్ట్ కాదు. తప్పులెక్కువ చేస్తేనే పర్ ఫెక్షనిస్ట్ కావడానికి అవకాశం ఉంది.” బాలు

తప్పులు చేశామని నా దగ్గరకు చాలా మంది వస్తుంటారు. వారందరికీ నేనిచ్చే సలహా వొక్కటే. ఎన్ని తప్పులు చేస్తే అంత చక్కగా భవిష్యత్ ఉంటుంది. తప్పు చేశామని ఆగిపోతే అక్కడే ఉండిపోతాం. ప్రపంచంలో ఎవరూ పర్ ఫెక్ట్ కాదని , పర్ ఫెక్ట్ అనేది ఓ ఊహాజనితం మాత్రమే అని బాలు అన్నారు.

ఆంత్రప్రెన్యూర్ ప్రస్థానం

సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాక్టర్ , మ్యూజిక్ డైరెక్టర్ తోనే నా పని అయిపోయిందని నేను భావించడంలేదు. నా అనుభవంతో ఎంతో మందికి సలహాలు సూచనలు ఇస్తూ చాలా విషయాల్లో మెంటార్ గా మారాను.

"జిల్ మోర్ ఫౌండర్ నాదగ్గరకు వచ్చినప్పుడు నాకెందుకీ ఆలోచన రాలేదనుకున్నా" బాలు

కానీ నన్ను మెంటార్ గా ఉండమనడం నాకు ఆనందాన్ని కలిగించిందన్నారాయన. అలాగైనా నాలో ఉన్న మరో క్వాలిటీని బయట పెట్టే అవకాశం వస్తుందని భావించా. అలా ఆంత్రప్రెన్యూర్ ని అయ్యానని బాలు చెప్పుకొచ్చారు.

image


జిల్ మోర్ టీం- దాని పనితీరు

జిల్ మోర్ టీం విషయానికొస్తే రసాల సారధి బాబు దీని ఫౌండర్ సిఈఓగా ఉన్నారు. ఈయనతో పాటు మరో నలుగురు టీంలో ఉన్నారు. ఎస్పీ బాలు దీనికి మెంటార్షిప్ చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఆరునెలల క్రితం ప్రారంభమైన ఈ స్టార్టప్ యాభై లక్షల సీడ్ ఫండింగ్ పొందింది. ఇటీవలే మరో 10లక్షల సీడ్ ఫండింగ్ పొందింది. వచ్చే ఏడాదిలో పది బిలియన్ల మార్కెట్ లో రెండు శాతం వాటా పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సారధి బాబు ప్రకటించారు. ఆర్టిస్టులు ఇతర సింగర్స్ ను ఐడింటిఫై చేయడంపై బ్యాకెంట్ టీం వర్క్ చేస్తుందన్నారు.

“దేశంలోనే ఈ తరహా స్టార్టప్ లలో ఇదే మొదటి కావడం విశేషం అని ముగించారు సారధి”
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags