భలే ఉంది వీళ్ల కిరాణా వ్యాపారం స్టయిల్

భలే ఉంది వీళ్ల కిరాణా వ్యాపారం స్టయిల్

Tuesday March 01, 2016,

4 min Read

రైస్ బ్యాగ్- ఒకటి

పంచదార - కేజీ

కందిపప్పు - రెండు కేజీలు

మినపప్పు - 2 కేజీలు

సన్ ఫ్లవర్ ఆయిల్ - 5 లీటర్ల టిన్, దాంతోపాటే మరికొన్ని సరుకులు..

అప్పుడే వచ్చిన ఆర్డర్ మెసేజీని పదే పదే కంప్యూటర్ లో చూసుకుంటున్నారు సౌరవ్, అభిషేక్. అది నిజమేనా అని సైట్ ని క్లోజ్ చేసి.. మళ్లీ మళ్లీ ఓపెన్ చేసుకుంటున్నారు. రెండుసార్లు అలా చేసిన తర్వాత నిజమేనని వారికి అర్థమయింది. ఒక్కసారి "యాహూ" అని గట్టిగా కేకేశారు. వారు ఇంతగా ఎగిరి గంతేయడానికి కారణం "షాపిట్ డైలీ" అనే యాప్. దానికి వచ్చిన తొలి ఆర్డర్ చూసి కేరింతలు కొట్టకుండా ఉండలేకపోయారు. అంతకంటే మరో హపీ థింగ్ ఏంటంటే.. యాప్, సైట్ ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. అదికూడా లాంఛ్ చేసిన రెండుగంటల్లోనే. యాప్ ను ఇంత త్వరగా డౌన్ లోడ్ చేసుకుంటారని... అంతే వేగంగా ఆర్డర్లు కూడా ఇస్తారని అస్సలు ఊహించలేకపోయారు. తొలి ఆర్డర్ సక్సెస్ ఫుల్. కావల్సినంత ఆత్మవిశ్వాసం. ఇంకేముంది స్టార్టప్ ని స్టాండప్ చేసేందుకు నడక ప్రారంభించారు. 

దానిదేముంది బాస్.. మెట్రో నగరాల్లో ఇదేమంత పొంగొపోయే విషయం కాదు అని తేలిగ్గా తీసిపారేయకండి. షాపిట్ డైలీ మొదట ప్రారంభించింది టూ టైర్ సిటీ అయిన ఇండోర్ లో. ఆ మాటకొస్తే మెట్రో నగరాల్లోనే కిరాణా సామాన్లు, కూరగాయాలు ఆన్ లైన్లో కొనుగోలు చేయడంపై ఎన్నో అనుమానాలున్నాయి. అలాంటిది ద్వితీయశ్రేణి నగరమైన ఇండోర్ లో ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని కంగారుపడ్డారు. కానీ వీరి అనుమానాలు పటాపంచలు అయ్యాయి. ఇండోర్ ప్రజలు అద్భుతంగా ఆదరించారు. ఆగస్టు 2014లో ఒక్క ఆర్డర్ తో ప్రారంభమైన వీరి స్టార్టప్ ఇప్పుడు నెలకు లక్ష ఆర్డర్ల వరకు ఎదిగింది. ఇండోర్ నుంచి వడోదరాకూ సేవలు పొడిగించారు. 25 కి.మీ దూరంలోపు ఆర్డర్స్ ని 90 నిమిషాల్లోపు డెలీవరీ చేస్తున్నారు. కార్పొరేట్ హౌస్ లకు, కంపెనీలకూ కూడా కావాల్సిన వస్తువుల్ని సరఫరా చేస్తున్నారు. ఆన్ లైన్ లోనే కాకుండా వాట్సాప్, ఫోన్ల ద్వారానూ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. ఈ మిత్రులిద్దరూ ద్వితీయ శ్రేణి నగరాలపైనే దృష్టి కేంద్రీకరించారు.

భోపాల్, ఉదయ్ పూర్, ఉజ్జయిని, సూరత్, రాజ్ కోట్, జైపూర్ లాంటి నగరాలపై మేము ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాం. ద్వితీయ శ్రేణి నగరాల్లోని ఆన్ లైన్ కిరాణా స్టార్టప్ లలో మాది ఉబెర్ లాంటిది. అందరూ ఎమ్మార్పీ మీద డిస్కౌంట్ ఇస్తారు. కానీ మేము మాత్రం హోల్ సేల్ రేట్లపైనే డిస్కౌంట్ ఇస్తాం- సౌరవ్ శ్రీవాత్సవ, షాపిట్ డైలీ, కో ఫౌండర్
సౌరవ్, అభిషేక్, షాపిట్ డైలీ ఫౌండర్స్<br>

సౌరవ్, అభిషేక్, షాపిట్ డైలీ ఫౌండర్స్


ఇప్పుడు ఆన్ లైన్ కిరాణ సామాన్లు అమ్మే స్టార్టప్ లకు ఇంకా ఎంతో మార్కెట్ ఉందని సౌరవ్, అభిషేక్ గట్టిగా నమ్ముతున్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ప్రజల జీవనం బిజీగా మారుతోంది. కిరాణా సామాన్ల కోసం గంటల తరబడి షాపింగ్ చేసే తీరిక ఎవరికీ ఉండటం లేదని వారు గుర్తు చేస్తున్నారు. మేము వారికి అలాంటి ఇబ్బందులు లేకుండా క్వాలిటీలో రాజీపడకుండా కిరాణా సామాన్లు అందించే విశ్వాసం చూరగొంటున్నామని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

28 ఏళ్ల సౌరవ్, 30 ఏళ్ల అభిషేక్ చదవు అయిపోయిన వెంటనే ఒకరు ఆదిత్యాబిర్లా గ్రూప్, మరొకరు ఏబీఎన్ ఆమ్రోలో పనిచేశారు. కానీ ఇద్దరూ ఓ కార్యక్రమంలో కలిసి కలిసి తమ అభిప్రాయాలు పంచుకోవడం టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. స్టార్టప్ విషయంలో ఇద్దరి ఆలోచనలూ ఒకటే కావడంతో రంగంలోకి దిగారు. మెట్రో సిటీల్లో కన్నా... ద్వితీయశ్రేణి నగరాల్లోనే అయితే చాలెంజింగ్ గా ఉంటుందని.. ఇండోర్ ని ఎంచుకున్నారు. చిన్ననగరాల్లో వినియోగదారులకు నమ్మకం కలిగించడం అంత తేలిక కాదని, ఈ 18 నెలల్లో తెలుసుకోగలిగానని అభిషేక్ అంటారు. సమర్థమైన టీంతో సమస్యలను సునాయాసంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు.

"నువ్వు చేస్తున్న పని జీవితంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించినప్పుడు...నువ్వు దానితో అంకితభావంతో పూర్తి చేయడమే గ్రేట్ వర్క్ గా నమ్మాలి. నువ్వు నీ పనిని ప్రేమించినప్పుడే అది సాద్యం" అన్న స్టీవ్ జాబ్ వ్యాఖ్యలనే తాము ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకుంటామని సౌరవ్ అంటారు.
షాపిట్ డైరీ గ్రోత్ ఎనాలసిస్<br>

షాపిట్ డైరీ గ్రోత్ ఎనాలసిస్


నిజానికి మంచి ఉద్యోగాలు వదిలేసి స్టార్టప్ కంపెనీ ప్రారంభిస్తామంటే చాలా మందికి వ్యతిరేకత వ్యక్తమవుతూంటుంది. సేఫ్ గేమ్ ఆడమని చెబుతారు. కానీ సౌరవ్, అభిషేక్ విషయంలో మాత్రం కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. వీరి స్టార్టప్ కు వినియోగదారులు చేరడానికి రిఫరెల్స్ గా కూడా ఉపయోగపడ్డారు. సౌరవ్,అభిషేక్ తమ జీవిత భాగస్వాములకు మరింత ఎక్కువగా ధ్యాంక్స్ చెబుతారు. వారి షాపిట్ డైలీకి పిల్లర్ల లాంటివారని అంటారు. షాపిట్ డైలీ ప్రస్తుతం 70:30 రెవిన్యూ మోడల్ ను ఫాలో అవుతోంది.


70 పర్సంట్ ఇన్వెంటరీ మోడల్ ను మరో 30శాతాన్ని మార్కెట్ ప్లేస్ మోడల్ ను ఫాలో అవుతున్నాం. మార్కెట్ ప్లేస్ మోడల్ లో మా మార్జిన్ ను వెండార్ తో ఫిక్స్ చేసుకుంటాం. ఇది మరింత ఎక్కువ రెవిన్యూ రావడానికి ఉపయోగపడుతుంది. ఇన్వెంటరీ మోడల్ లో అయితే ఏడు నుంచి ఎనిమిది శాతం మార్జిన్ ఉంటుంది. గత ఏడాది సెప్టెంబర్ కే బ్రేక్ ఈవెన్ సాధించారు. ఈ ఆర్థిక సంవత్సరం లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నాం-సౌరవ్, షాపిట్ డైలీ, కో ఫౌండర్

షాపిట్ డైలీ నెలకు లక్ష వినియోగదారులను అధిగమించింది. ఇప్పటికే 25,000 మంది రిజిస్టర్ యూజర్లుగా చేరారు. షాపిట్ డైలీలానే నాగపూర్, లక్నో, త్రివేండ్రం, నాసిక్ లలో ఆన్ లైన్ కిరాణ స్టార్టప్ లు మంచి వృద్ధి రేటు నమోదు చేస్తున్నాయి. 2019కల్లా ఇండియన్ ఆన్ లైన్ గ్రోసరీ మార్కెట్ 2.7బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కెన్ రీసెర్చ్ సర్వే నివేదిక చెబుతోంది. మెట్రోల్లో వీటి ఆదరణ అమాంతం పెరిగే అవకాశం ఉన్నా.. ద్వితీయశ్రేణి నగరాల్లోనూ వృద్ధి అంచనాలకు అందని విధంగానే ఉంటుందని నిపుణుల అంచనా. అంటేనే మరెన్నో స్టార్టప్ లకు ఇక్కడ ప్లేస్ మిగిలే ఉందన్నమాట..!