మూడేళ్లలో 50 వేల మంది మహిళా డ్రైవర్ కమ్ ఓనర్స్ లక్ష్యమంటున్న ఓలా క్యాబ్స్

మహిళా సాధికారత కోసం ఓలాక్యాబ్స్ పక్కా ప్రణాళికడ్రైవర్ ఆంట్రప్రెన్యూర్స్‌గా మహిళలకు ప్రోత్సాహండ్రైవింగ్‌, స్కిల్ డెవలప్‌మెంట్లలో శిక్షణప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తోన్న ఓలా

6th Jul 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close
రేణుక, ఓలాకు చెందిన మహిళా డ్రైవర్ ఎంటర్‌ప్రెన్యూర్

రేణుక, ఓలాకు చెందిన మహిళా డ్రైవర్ ఎంటర్‌ప్రెన్యూర్


గత కొన్నేళ్లుగా మహిళా డ్రైవర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఏడాది కాలంగా అయితే.. ఈ సంఖ్య పెరుగుదల వేగం మరీ స్పీడ్‌గా ఉంది. మహిళల భద్రతపై ప్రశ్నలు పెరిగిపోతున్న సమయంలోనే... డ్రైవర్లుగా ఒంటరిగా ప్రయాణం చేసేవారి సంఖ్య కూడా పెరగడం ఆశ్చర్యకరమే. ఇప్పుడు అనేక క్యాబ్ కంపెనీలు మహిళా సాధికారికతకు ప్రాధాన్యతనిస్తున్నాయి. అందుకే ఈ కంపెనీలు మహిళా ప్రయాణికుల కోసం స్త్రీలనే డ్రైవర్లుగా పంపేందుకు... వీరికి ప్రోత్సాహమిస్తున్నాయి. ఇది వారి భద్రతకు భరోసా ఇవ్వడమే కాకుండా... వారిని డ్రైవర్ ఆంట్రప్రెన్యూర్లుగా మార్చేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.

డ్రైవర్లుగా అవకాశమిస్తూ మహిళల కోసం చేపట్టిన విధానాన్ని... మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలని ఓలా నిర్ణయించింది. వారిని మైక్రో ఆంట్రప్రెన్యూర్‌లుగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. క్యాబ్ డ్రైవర్లుగా అవకాశమివ్వడంతో పాటే ఓలా విమెన్ ఆంట్రప్రెన్యూర్స్‌గా అభివృద్ధి చెందేందుకు అడగడుగునా తోడ్పడుతోంది. “మహిళల్లో ఆర్థిక స్వావలంబన పెంచడం ప్రాథమిక లక్ష్యమయినా... ఈ మోడల్ ద్వారా వారంతట వారే... పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సహాయం అందిస్తున్నాం” అని చెప్పారు ఆనంద్ సుబ్రమణియన్. ఈయన ఓలా సంస్థకు మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ విభాగానికి డైరెక్టర్.

కొన్నాళ్ల క్రితం ఓలా పింక్ అంటూ... ఈ సంస్థ కొత్త విభాగాన్ని ప్రారంభించింది. సోర్సింగ్, ట్రైనింగ్ వంటి చర్యలు చేపడుతుంది. దీనికోసం పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది ఓలా. వీటిలో ఎంపవర్ ప్రగతి ఒకటి. ఇది నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన పెట్టుబడుల విభాగం. అలాగే ట్రైనింగ్, నైపుణ్యం పెంపు కోసం ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌తోనూ ఓలా ఒప్పందం కుదుర్చకుంది.

ట్రైనింగ్, స్కిల్ డెవలప్‌మెంట్


పింక్ క్యాబ్స్ ద్వారా... మహిళలకు కొత్త ఉద్యోగ అవకాశాలను, తద్వారా స్వయం వృద్ధికి బాటలు పరిచింది ఓలా. స్త్రీలను కొన్ని రంగాలకు దూరంగా ఉంచేసిన సమాజం విధానాలను ఛేదించి, ఈ రంగంలో వారికి అవకాశం కల్పిస్తోంది. డ్రైవింగ్, ప్రాక్టీస్, రిపేరింగ్ విషయంలో బేసిక్ స్కిల్స్, మ్యాప్ రీడింగ్ వంటి అంశాలను... ట్రైనింగ్‌లో నేర్పిస్తున్నారు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇందులో భాగమే. స్పోకెన్ ఇంగ్లీష్, టెక్నాలజీ, మర్యాద పూర్వక ప్రవర్తన, రూట్ రీడింగ్ వంటి అంశాలను కూడా నేర్పిస్తున్నారు.

ఇలా మహిళా డ్రైవర్లను ఎంపిక చేసేందుకు ప్రాథమిక అర్హతలున్నాయి. చెల్లుబాటులో ఉన్న లైసెన్స్, కమర్షియల్ బ్యాడ్స్ కనీస అర్హతలు. “మౌలిక వసతులు, ఫైనాన్స్ పొందడం, తగినంతగా ఆదాయం పొందేలా చూడడం, టెక్నాలజీ ప్లాట్‌ఫాం అంశాల్లో ఓలా సహకారం అందిస్తుంది. ట్రైనింగ్ పొందని స్త్రీలకు.. డ్రైవింగ్‌ ప్రారంభించేందుకు ముందుగా తర్ఫీదునిస్తాం” అన్నారు ఆనంద్. పురుషుల మాదిరిగానే... మహిళా డ్రైవర్లకూ ప్రొఫెషనల్, పర్సనల్ డాక్యమెంటేషన్, కేవైసీ(నో యువర్ కస్టమర్) తప్పనిసరి.

పూర్తిస్థాయి పారదర్శకత పాటించడం కోసం.. తమ సంస్థకు పని చేసే డ్రైవర్లకు సంబంధించిన క్రిమినల్ హిస్టరీ, పోలీస్ వెరిఫికేషన్ వంటి అంశాలపై పక్కాగా ఉంటోంది ఓలా. దీనికోసం బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో దేశంలోనే అత్యుత్తమ సంస్థ 'ఆథ్‌బ్రిడ్జ్'తో ఒప్పందం చేసుకుంది. ఇది ఐఎస్ఓ, ఐఎస్ఓ-ఐఎస్ఎంఎస్ సర్టిఫికేషన్స్ పొందిన అతి కొద్ది సంస్థల్లో ఒకటి.

విజయంపై ఓలా హామీ

నైపుణ్యం ఉన్న డ్రైవర్‌గా ట్రైనింగ్ ఇవ్వడంతోపాటే... రుణ చెల్లింపుల విషయంలోనూ ఓలా వీరికి సహకారం అందిస్తోంది. ఎస్‌బీఐ, శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్, మహీంద్రా ఫైనాన్స్ వంటి ఆర్థిక సంస్థలు అనుసరిస్తున్న నెలవారీ చెల్లింపుల(ఈఎంఐ) విధానంలో కాకుండా... రోజువారీగా రీపేమెంట్ చేసే అవకాశం అందిస్తోంది. డ్రైవర్లను ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దడం కోసం... ₹100 కోట్ల నిధులను ప్రత్యేకంగా కేటాయించింది ఓలా.

ఓలా ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించిన మహిళల్లో ఒకరు రేణుకా దేవి. తాను ఎవరిపై ఆధారపడకుండా ఉండేలా జీవించాలని అనుకున్నానని... అందుకు ఓలా సహకరించిందని చెబ్తున్నారు. సొంత కారుతో రెండేళ్ల క్రితం వ్యాపారం ప్రారంభించారామె. ఇప్పుడామె దగ్గర 7 కార్లు ఉండగా... అన్నీ ఓలాకు అనుబంధంగా నిర్వహిస్తున్నారు. అదనపు ఆదాయంగా ప్రారంభమైన ఈ వ్యాపకం... ఇప్పుడు వ్యాపారంగా మారిందని... ఆమె కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిందని అంటున్నారు రేణుక.

"ఓలాకు అనుబంధంగా పని చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ సంస్థ నుంచి లభించే మద్దతు అసామాన్యం. డ్రైవర్లు కస్టమర్లను పొందేందుకు టెక్నాలజీ సాయాన్ని అందిస్తోంది ఓలా" అంటున్నారు రేణుక.

భద్రతా ప్రమాణాలు

కస్టమర్లు, డ్రైవర్ల భద్రత కోసం... పలు లెవెల్స్‌లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు. కారులో ఉన్న ఎస్ఓఎస్ ఫీచర్‌తో... ఒక్క క్లిక్ చేస్తే చాలు... జీపీఎస్‌తో సహా... రియల్ టైంలో రైడ్‌కు సంబంధించిన అన్ని డీటైల్స్ ముందుగా సెట్ చేసిన, ఫ్రెండ్స్- ఫ్యామీలీ నెంబర్స్‌కు.. ఈమెయిల్, ఎస్ఎంఎస్ రూపంలో అందుతాయి.

“ఓలాకు 24/7 కాల్ సెంటర్ కూడా ఉంది. అవసరంలో ఉన్న కస్టమర్లు కాల్ చేసి సహాయం పొందచ్చు. ప్రతీ క్యాబ్‌ను... బ్యాక్ఎండ్‌లో ట్రాక్ చేస్తుంటూంది ఓలా. సర్వీసుల్లో మెరుగైన నాణ్యత కోసం... ఫీడ్‌బ్యాక్, రేటింగ్ విధానాలను కూడా అవలంబిస్తున్నాం”అన్నారు ఆనంద్.

మహిళా డ్రైవర్లు ఇబ్బందిగా ఫీలైతే... బుకింగ్‌ను రిజెక్ట్ చేసే స్వేచ్ఛ వారికి ఎప్పుడూ ఉంటుంది. “మహిళా డ్రైవర్స్ కూడా 24/7 సపోర్ట్ టీంను కాంటాక్ట్ చేసి సహాయం పొందచ్చు. ఇప్పుడున్నవాటితో పాటు మరిన్ని సెక్యూరిటీ ఫీచర్స్ కూడా త్వరలో ప్రారంభించనున్నా”మన్నారు ఆనంద్.
"ఇప్పటికి నేను ఓలాలో చేరి రెండు నెలలు గడించింది. నా క్యాబ్‌కు వస్తున్న బుకింగ్స్‌తో నేను హ్యాపీగా ఉన్నాను. ఓ డ్రైవర్‌లా కాకుండా... నన్ను చూస్తున్న తీరు మరింత సంతోషం ఇస్తోంది. పనివేళల్లోనూ తగినంత స్వేచ్ఛ ఉంది. దీంతో పని-కుటుంబాన్ని.. తగిన విధంగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను"అంటున్నారు మరో ఓలా మహిళా డ్రైవర్ ఎంటర్‌ప్రెన్యూర్ షీబా.

మూడేళ్లలో 50వేల విమెన్ డ్రైవర్ ఆంట్రప్రెన్యూర్స్

ఈ సంస్థకు డ్రైవర్లుగా ఉన్నవారిలో 70శాతం ఆంట్రప్రెన్యూర్లే. వీరిలో చాలామంది ఓలా సహాయంతో టాటా, నిస్సాన్, మారుతీ, ఫోర్డ్, మహీంద్రా వంటి కంపెనీల వద్ద కొనుగోలు చేశారు. డ్రైవర్లు మార్కెట్ రేట్ల కంటే సరసమైన ధరలకు, వడ్డీ రేట్లకు కొనుగోలు చేసేందుకు... కార్ల తయారీదారులు, ఫైనాన్స్ చేసే ఆర్థిక సంస్థలతో ఇప్పటికే ఓ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది ఓలా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15వేలమంది డ్రైవర్లు ఓలా ద్వారా లబ్ధి పొందారు.

మూడేళ్లలో 50వేల మంది మహిళలను డ్రైవర్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ఓలా. ఈ లక్ష్యాన్ని అందుకునేందుకు దేశవ్యాప్తంగాను, స్థానికంగానూ భాగస్వామ్యాలు కుదుర్చుకుంటోంది ఓలా. ఢిల్లీలోని ఆల్ ఇండియా విమెన్స్ ఎడ్యుకేషన్ ఫండ్ అసోసియేషన్(AIWEFA),చెన్నైలోని అసోసియేషన్ ఫర్ నాన్ ట్రెడిషనల్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ విమెన్(ANEW), బెంగళూరులోని ఎంజెల్ సిటీ క్యాబ్ సర్వీసులతో ఒప్పందాలున్నాయి.

“ఓలా, ఎంపవర్ ప్రగతి, ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్‌లు మహిళా ప్రగతికోసం సంయుక్తంగా పని చేస్తున్నాయి. కొత్త అవకాశాలు సృష్టించి, మహిళా డ్రైవర్లను ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నాయి. వారి కెరీర్, జీవితాల్లో కీలకమైన మార్పులు చోటుకునేందుకు కృషి చేస్తున్నాయంటూ” ముగించారు ఆనంద్.

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి

Our Partner Events

Hustle across India