సంకలనాలు
Telugu

వారెవ్వా.. అనేలా యాడ్స్ తయారు చేస్తున్న 'వావ్‌సమ్'

manjeetha bandela
25th Sep 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఆ రోజుల్లో .... ఏదైనా కొత్త షాపు లేదా కంపెనీ ప్రారంభ‌మైన‌ప్పుడు .. ఒక‌రి నుంచి మ‌రొక‌రికి నోటిమాట‌ ద్వారా ఆ విష‌యం తెలిసేది. ఆ త‌ర్వాత ప్రొడ‌క్ట్ స‌ర్వీసెస్‌ను ప్ర‌మోట్ చేసేందుకు ప్రింట్ అడ్వ‌ర్టైజింగ్, టివి క‌మ‌ర్షియ‌ల్స్ రంగంలోకి వ‌చ్చాయి. ఆ స్టేజ్ నుంచి, 1990ల‌లో ఇంట‌ర్నెట్ పుణ్య‌మాని ఎటువంటి భౌగోళిక అవ‌రోధాలు లేకుండా ఎవ్వ‌రైనా ప్రకటనలను ఆన్‌లైన్‌లో చూసే అవ‌కాశం ద‌క్కింది.

అయితే ఆగ్మెంటెడ్ రియాలిటి (AR) విష‌యానికి వ‌స్తే ... ప్ర‌మోష‌న్స్ ఇంటరాక్టివ్‌గా ఉండ‌వ‌న్న విష‌యం జ‌నాల‌కు అర్థ‌మైంది. రియ‌ల్, వ‌ర్చువ‌ల్ వ‌ర‌ల్డ్ మ‌ధ్య‌లోని తేడాల‌ను ప‌సిగ‌ట్టే విష‌యంలో పరిణతి ఉంటుంద‌న్న సంగ‌తి బ‌హుశా అప్ప‌ట్లో ఎవ్వ‌రూ ఊహించి ఉండరు.

ప్ర‌స్తుతం గేమింగ్ సెక్టార్లో AR టెక్నాల‌జీ.. విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ మ‌ధ్య కాలంలో మ‌రింత అభివృద్ది చెంది, దూసుకుపోతోంది. భ‌విష్య‌త్తులో ఇంకెంతో ఎదుగుతుంద‌ి అనడంలో డౌటే లేదు.

స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలోనే సీన్‌లోకి వ‌చ్చింది వావ్‌స‌మ్ ... అంచెలంచెలుగా ఎదుగుతున్న ఓ ఇండియన్ స్టార్ట‌ప్. ఇది మొబైల్‌లోని AR సాయంతో త‌న వినియోగ‌దారుల‌ను ఎంగేజ్ చేస్తుంది. వారికి రియ‌ల్ టైమ్, ఇంట‌రాక్టివ్ విజువ‌ల్ కంటెంట్‌ను మొబైల్ డివైజ్‌లో అందిస్తుంది.

ఆండ్రాయిడ్, ఐఓస్‌ల‌కు ఇదో మంచి మొబైల్ AR యాప్. ప్ర‌స్తుతం ఈ యాప్ ఫోటోగ్రాఫ్స్‌కు స్టిక్క‌ర్స్‌ను యాడ్ చేసే వీలును క‌ల్పించింది. త‌ద్వారా పాపుల‌ర్ సెలెబ్రిటి ఇమేజీల‌ను కూడా యాడ్ చేసుకోవ‌చ్చు. దీనితోపాటు బ్రాండ్స్ సొంతంగా AR సెక్టార్ అడ్వ‌ర్టైజ్ మెంట్స్‌ను త‌యారుచేసుకోవ‌చ్చు.

image


కంపెనీ ఒమెగా క్యాంపైన్

ఈ AR అడ్వ‌ర్ టైజింగ్‌లో, వినియోగ‌దారుల‌ను స‌ర్ ప్రైజ్ చేసేలా ... కంటెంట్ ఎప్పుడూ ఎంట‌ర్‌టైనింగ్, ఇన్ఫ‌ర్‌మేటివ్‌గా పాప్ అప్ అవుతుంది. ఇదంతా కేవ‌లం నిమిషాల్లోనే wowsomeapp.com.ద్వారా ఆన్ లైన్లో చేయొచ్చు. వినియోగ‌దారుల ప‌నుల‌కు భంగం క‌ల‌గ‌కుండా, వారికి అవ‌స‌ర‌మైన సంద‌ర్భాన్ని బ‌ట్టి కంటెంట్‌ను ప్రెజెంట్ చేస్తుంది. ఒక‌వేళ యాప్ ప‌నితీరు న‌చ్చితే ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఆ విష‌యాన్ని షేర్ చేసుకునే వీలుంది.

“క‌న్సూమ‌ర్స్‌కు రియ‌ల్ టైమ్ ఇన్ఫర్మేష‌న్ ల‌భిస్తుంది. వావ్ స‌మ్‌తో వారు త‌మ ఎక్స్‌పీరియ‌న్స్‌ను పెంచుకోవ‌చ్చు. మేము అందించే అగ్యుమెంటెడ్ రియాలిటి టెక్నాల‌జీ , ఒక రెవ‌ల్యూష‌న‌రీ అడ్వ‌ర్టైజింగ్ మీడియమ్,” అంటారు వ్య‌వ‌స్థాప‌కులు విశాల్ రెడ్డి, స‌హ వ్యవస్థాపకులు క‌ర‌ణ్ భాంగే. 

image


ప్ర‌స్తుతం వావ్‌స‌మ్ ... లారియ‌ల్ ప్యారిస్ ఇండియా, ఒమెగా వాచెస్, అపోలో హాస్పిట‌ల్స్, ది క‌లెక్ట‌వి, బాలంటైన్స్, జాగ్వ‌ర్, బుద్వేస‌ర్ వంటి 50 బ్రాండ్స్‌తో అసోసియేట్ అయ్యింది. ఆస‌క్తి క‌లిగించే విష‌య‌మేంటంటే .. ఈ బిగ్ బ్రాండ్స్, త‌మ ఫ్యాన్స్‌ను ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొమ్మ‌ని .. దాని ద్వారా త‌మ డైన‌మిక్ ప్రొడ‌క్ట్స్‌ను స్టాటిక్ ఇమేజెస్‌గా మార‌డాన్ని చూసి ఎంజాయ్ చేయ‌మ‌ని స్వ‌యంగా చెప్ప‌డం.


ఈ యాప్ ఎలా ప‌నిచేస్తుందంటే ...

AR మోనాట‌నీని బ్రేక్ చేస్తుంది. ఒక బ్రాండ్‌ను రియ‌ల్ వ‌ర‌ల్డ్ వాతావ‌ర‌ణానికి స‌రిప‌డే కోణంలో చూపిస్తూ ... ఒక హ్యూమ‌న్ - బ్రాండ్ - ఇంట‌ర్‌ఫేస్‌ను క్రియేట్ చేస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కి, ఒక ప్రింట్ యాడ్ తీసుకుందాం ... వాటిలో టివిసి, షార్ట్ వీడియో, సోష‌ల్ మీడియా వెబ్ సైట్స్‌కు క్విక్ లింక్స్, కాల్ టు యాక్ష‌న్ (ఎంక్వైరీ, షేర్, కొన‌డం), డీల్స్ (కూప‌న్ కోడ్స్, డిస్కౌంట్స్) ఇవి ఉంటాయి. వీటితో ఇంటరాక్ట్ అయ్యే అవ‌కాశం, రియ‌ల్ టైమ్, వ‌ర్చువ‌ల్లీ అన్ లిమిటెడ్ రియ‌ల్ ఎస్టేట్ ఇవ‌న్నీ క్ష‌ణాల్లో స్మార్ట్ ఫోన్స్ స్క్రీన్స్ పై ప్ర‌త్య‌క్ష‌మైతే ఎలా ఉంటుంది. ఈ విధంగా ఒక బ్రాండ్, హైప‌ర్ టార్గెటెడ్ ఎక్స్‌పీరియెన్స్‌తో త‌మ ఆడియ‌న్స్‌ను ఆఫ్ లైన్ నుంచి ఆన్ లైన్ మోడ్ లోకి తీసుకెళుతుంది.

వావ్‌స‌మ్ లారియ‌ల్ క్యాంపైన్

వివిధ సెక్టార్స్ లోని బ్రాండ్స్ ను ప్ర‌మోట్ చేసే మాస్ మీడియా అడ్వ‌ర్ టైజింగ్‌లోనే త‌మ యాప్ ఒక ప్ర‌భంజ‌నం అని వ్య‌వ‌స్థాప‌కులు గ‌ర్వంగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం మీడియా హౌజెస్, రియ‌ల్ ఎస్టేట్, ల‌గ్జ‌రీ, రీటైల్, FMCG త‌దిత‌ర చాలా సెక్టార్స్‌కు వీరు స‌ర్వ్ చేస్తున్నారు. క్లైంట్ బేస్ పెంచుకుని, బ్రాండ్స్ AR మీడియం ఫ‌లితాలు అందుకోవ‌ల‌న్న‌దే వీరి ప్ర‌ధాన ఉద్దేశం.

image


ఛాలెంజెస్ - భ‌విష్య‌త్తు

భార‌త్‌లోని బ్రాండ్, మార్కెటింగ్ మేనేజ‌ర్స్‌లో చాలామంది కొత్త మీడియాకు అంత సుముఖంగా ఉండ‌రు. వారికి అఘ‌మేఘాల‌ మీద ఫ‌లితాలు క‌ల్పించాలి అంటారు ఈ యాప్ వ్య‌వస్థాప‌కులు. అయితే ఇండియా నుంచి ఆప‌రేట్ చేయ‌డంలో గ‌ణ‌నీయ‌మైన ప్ర‌యోజ‌నాలు ఉన్నాయని అన్నారు. ప్ర‌స్తుతానికి 160 మిలియ‌న్ స్మార్ట్ ఫోన్ యూజ‌ర్ బేస్ ఉండ‌గా, ఈ ఏడాది చివ‌రినాటికి మ‌రో 220 మిలియ‌న్ల స్మార్ట్ ఫోన్స్ యాడ్ కాబోతున్నాయి.

“టెక్నాల‌జీ వాడ‌కం విశ్వ‌వ్యాప్త‌మైంది. కంప్యూట‌ర్ విజ‌న్‌లో ఇండియాలో టాలెంట్‌కు కొద‌వే లేదు. చాలా బ్రాండ్స్‌కు AR అంటే తెలుసు, కానీ ఇండ‌స్ట్రీకి అనుగుణంగా వాడుకోలేక‌ పోతున్నాయి ” అంటారు విశాల్.

AR అడ్వ‌ర్టైజింగ్ క్యాంపైన్స్ చేసినందుకుగానూ టాప్ బ్రాండ్స్ ఇచ్చే పేమెంట్స్ తోనే వావ్‌స‌మ్‌కు ఆదాయం. ఈ ఏడాది చివ‌రినాటికి సుమారు 200 బ్రాండ్స్ తో వావ్ స‌మ్ AR క్యాంపైన్స్ లోనే అల్టిమేట్ స‌ర్వీస్ పార్ట‌న‌ర్ కావాల‌నుకుంటోంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags