సంకలనాలు
Telugu

మహిళా భద్రతే మా ధ్యేయం

సరికొత్త టెక్నాలజీతో సెక్యూరిటీ డివైజ్ -అంతర్జాతీయ గుర్తింపు పొందిన సేఫర్-

uday kiran
1st Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


పొద్దున లేచి ఏ పేపర్ తిరగేసినా.. ఏ న్యూస్ ఛానల్ పెట్టినా మహిళలపై జరిగిన ఆకృత్యాలు, దాడులకు సంబంధించిన వార్తలే. ఒక్క మహిళలు అనే కాదు పిల్లలు, వృద్ధులు ఇలా ప్రతి ఒక్కరికీ భద్రతన్నదే లేకుండా పోయింది. ఇలాంటి వాటిని అరికట్టేందుకు ఏం చేయలేమా? ఏం చేస్తే దాడులు, ఆకృత్యాలను అరికట్టవచ్చన్న ప్రశ్నలు ఆ ఐదుగురిని ఓ లక్ష్యం వైపు నడిపాయి. సెక్యూరిటీకి సంబంధించిన ఓ స్టార్టప్ కు ప్రాణం పోశాయి.

మానిక్ మెహతా, చిరాగ్ కపిల్, ఆయుష్ బంకా, పారస్ బత్రా, అవినాష్ బన్సల్

మానిక్ మెహతా, చిరాగ్ కపిల్, ఆయుష్ బంకా, పారస్ బత్రా, అవినాష్ బన్సల్


మానిక్ మెహతా, చిరాగ్ కపిల్, ఆయుష్ బంకా, పారస్ బత్రా, అవినాష్ బన్సల్ వీరంతా ఇంజనీరింగ్ పూర్తి చేశారు. వయసు పాతికేళ్లు కూడా లేవు. చదివిన చదువుకు ఆరంకెల జీతమిచ్చే ఉద్యోగం సంపాదించి, దర్జాగా కాలుమీద కాలేసుకు బతికొచ్చు. కానీ వాళ్లలా ఆలోచించలేదు. సమాజంలో ప్రశ్నార్థకంగా మారిన మహిళల భద్రత వారిని ఆలోచనలో పడేశాయి. తమకున్న నైపుణ్యాలను ఉపయోగించి సురక్షితమైన ప్రపంచాన్ని నిర్మించేందుకు అవసరమైన పరికరాన్ని తయారు చేేశారు. 2015 ఫిబ్రవరిలో లీఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించారు. తాము చేపట్టిన గార్డినర్ ప్రాజెక్టులో భాగంగా మహిళల రక్షణ కోసం స్మార్ట్ సేఫ్టీ డివైజ్ ను తయారు చేశారు. వీరు రూపొందించిన డివైజ్ కున్న విశిష్టతలు ఈ స్టార్టప్ కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాయి.

భారత్ లో డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంపిక చేసిన టాప్ 10 ఇన్నోవేటివ్ స్టార్టప్స్ లో ఒకటిగా నిలిచింది లీఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్. 2015 సెప్టెంబర్ లో ప్రధాన నరేంద్రమోడీ పాల్గొన్న ఫస్ట్ ఇండియా - యూఎస్ స్టార్టప్ కనెక్ట్ లోనూ ఈ స్టార్టప్ పాలు పంచుకుంది. ఈ సంస్థ రూపొందించిన స్మార్ట్ సేఫ్టీ డివైజ్ సేఫర్ దుబాయ్ లో జరిగిన గిటెక్స్ టెక్నాలజీ వీక్ లో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. అంతేకాదు. 2015 ఎరిక్సన్ ఇన్నోవేషన్ అవార్డును సొంతం చేసుకుంది. లీఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సేఫర్ డిజైన్ చూడటానికి పెండెంట్ లా ఉంటుంది. అయితే ఆపదలో ఉన్న వారికి మాత్రం ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీన్ని నెక్లెస్ లా మెడలో ధరించవచ్చు స్మార్ట్ ఫోన్ లో సేఫర్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని డివైజ్ తో అనుసంధానించాలి. అత్యవసర సమయంలో పెండెంట్ వెనక ఉన్న చిన్న బటన్ నొక్కితే చాలు అలారం మోగడంతో పాటు... స్మార్ట్ ఫోన్ లో ముందుగా నిర్దేశించిన ఐదు మొబైల్ నెంబర్లకు మేసేజ్ వెళుతుంది.

సేఫర్ యాప్ లో సేఫర్ వాక్, నోటిఫికేషన్స్, సెల్ఫీస్ ఫీచర్లున్నాయి. సేఫర్ వాక్ ఫీచర్ వ్యక్తులు ఆపదలో ఉన్నప్పుడు గూగుల్ మ్యాప్ లొకేషన్ ను ఫొటో తీసి ముందుగా నిర్దేశించిన ఐదు నెంబర్లకు పంపుతుంది. ఒకవేళ మొబైల్ ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి లేకుంటే ఆ ప్రాంతం చిరునామాను మెసేజ్ రూపంలో పంపుతుంది. ఇక నోటిఫికేషన్స్ ఫీచర్ సాయంతో సేఫర్ బీప్స్ రూపంలో నోటిఫికేషన్లను చూసుకోవచ్చు. ఫోన్ లో ఈ యాప్ ఉంటే ముఖ్యమైన నోటిఫికేషన్స్ ఎన్నడూ మిస్సయ్యే ఛాన్సుండదు. ఇక లీఫ్ వేరబుల్స్ రూపొందించిన ఈ పెండెంట్ డివైజ్ తో సెల్ఫీ కూడా తీసుకోవచ్చు.

“ ప్రతి ఒక్కరూ సురక్షితమైన ప్రపంచంలో బతికేందుకు అనువైన వాతావరణం సృష్టించడమే మా లక్ష్యం. భారత్ లో సెక్యూరిటీ డివైజ్ ను నగలా ధరించేలా రూపొందించిన మొట్ట మొదటి కంపెనీ మాదే. 2017 నాటికి లీఫ్ వేరబుల్స్ సాయంతో పది లక్షల కుటుంబాలకు మా సేవలందించేందుకు కృషి చేస్తున్నాం” - మానిక్ మెహతా

లీఫ్ వేరబుల్స్ ను ప్రారంభించినప్పటి నుంచి కొన్ని నెలల వరకు ఐదుగురు ఫౌండర్లే అవసరమైన నిధుల్ని సమకూర్చుకున్నారు. డిసెంబర్ నుంచి ఫండ్ రైజింగ్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముంబై ఏంజిల్స్ సీరియల్ ఎంట్రప్రెన్యూర్ అజిత్ ఖురానా, ఓమ్నివోర్ వెంచర్స్ ఫౌండింగ్ పార్ట్ నర్ జినేష్ షా, ఎయిట్ క్యాపిటల్ కో ఫౌండర్ విక్రమ్ చాచ్రా, సోలిడేటరీ ఇన్వెస్ట్ మెంట్ అడ్వైజర్, డైరెక్టర్ డాక్టర్. అనిరుథ్ మాల్పాని, ఏంజిల్ ఇన్వెస్టర్, అడాప్టీ ఇన్ కార్పొరేషన్ కో ఫౌండర్ అండ్ డైరక్టర్ విజయ్ తల్రేజాతో పాటు పలువురి నుంచి ఇప్పటికే సీడ్ ఫండింగ్ రూపంలో 2లక్షల 50వేల డాలర్ల పెట్టుబడులు సమీకరించారు.

“రోజు రోజుకు బిజినెస్ డెవలప్ అవుతోంది. ప్రస్తుతానికి ప్రీ ఆర్డర్లు తీసుకుని డివైజ్ ను అందజేస్తున్నాం. మేం సమీకరించిన సీడ్ ఫండింగ్ మరిన్ని రకాల పరికరాల తయారీకి ఉపయోగపడుతుంది. సేఫర్ ను కేవలం మహిళలే కాదు ప్రతి ఒక్కరు ఉపయోగించేలా రూపొందించి తక్కువ ధరకే అందించి జనానికి దగ్గరవ్వాలనేదే మా ధ్యేయం” -మానిక్.

ప్రస్తుతం లీఫ్ వేరబుల్స్ దృష్టి భారత్ మార్కెట్ పైనే ఉంది. అయితే భవిష్యత్తులో ప్రపంచ మార్కెట్ లోనూ స్థానం సంపాదించుకునేందుకు పక్కా ప్లాన్ తో ముందుకెళ్తోంది. సేఫర్ డివైజ్ ధర 3వేల 500 రూపాయలు. ఇప్పటి వరకు 1500 డివైజ్ లను అమ్మారు. సేఫర్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

భవిష్యత్తులో మరింత పెరగనున్న డిమాండ్

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2013 లో మహిళలపై 3,09,546 దాడులు జరిగాయి. 2009లో 9.2శాతంగా ఉన్న ఈ ఆకృత్యాలు, 2013 నాటికి 11.2 శాతానికి పెరిగాయి. మహిళలపై నేరాలు నానాటికీ పెరుగుతుండటంతో చాలా స్టార్టప్స్ భద్రతకు సంబంధించి రకరకాల యాప్స్ ను అందుబాటులోకి తెచ్చాయి. విత్ యూ, రక్ష, బీ సేఫ్, పుకార్, సేఫ్టీ పిన్ ఇవన్నీ అలాంటివే. జీపీఆర్ ఎస్ ట్రాకింగ్, గూగుల్ మ్యాప్స్, ఎమర్జెన్సీ కాంట్రాక్ట్ కు అలర్ట్స్ పంపడం, అలారం మోగించడం లాంటి ఫీచర్లు ఈ యాప్ లలో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ సైతం మహిళల రక్షణ కోసం 2015లో ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ మొబైల్ అప్లికేషన్ ”హిమ్మత్” అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ బేస్డ్ అప్లికేషన్ లో చాలా ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ ను షేక్ చేసినా, పవర్ బటన్ ను రెండుసార్లు ప్రెస్ చేసినా వెంటనే పోలీసులకు అలర్ట్ అందుతుంది.

సెక్యూరిటీ యాప్స్ విభాగంలో ఎంతో పోటీ ఉన్నా.. తమ ప్రొడక్ట్ కున్న విశిష్టత వాటిని జనానికి దగ్గర చేస్తుందన్నది మానిక్ ధీమా. ప్రస్తుతం పెండెంట్ రూపంలో హార్ట్ వేర్ డివైజ్ ను రూపొందిస్తున్న కంపెనీ లీఫ్ వేరబుల్స్ ఒక్కటే. అంతేకాదు రియల్ టైం రెస్పాన్స్, ఎమర్జెన్సీ సమయంలో పనితీరు విషయంలో మిగతా యాప్స్ తో పోలిస్తే సేఫర్ ఎంతో బెటర్. అందుకే మా ప్రొడక్ట్ సూపర్ హిట్ అంటున్నారు మానిక్. ప్రజల భద్రత కోసం కృషి చేస్తున్న ఈ స్టార్టప్ భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుందాం.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags