సంకలనాలు
Telugu

ఇంటిమిద్దెలపైనే ఇంపైన వ్యవసాయం

‘గ్రీన్ లివింగ్’ సేంద్రియ వ్యవసాయంలో కొత్త పుంతలువాల్ మార్ట్ ఉద్యోగం వదిలి మరీ వ్యవసాయం వైపు అడుగులుజైపూర్‌లో అర్బన్ ఫార్మింగ్ సృష్టికర్త ప్రతీక్ తివారీ

ashok patnaik
26th Apr 2015
Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share

ప్రతి ఇంటి పైకప్పు మీద సేంద్రీయ కూరగాయలు పెంచడం..దాని ద్వారా పొల్యూషన్ ఫ్రీ ప్రాంతాలుగా మార్చడం...ప్రతి ఇంటినీ ఆకుపచ్చ భవనంగా మార్చేందుకు గ్రీన్స్ ఆర్గానిక్స్ ప్రెవేట్ లిమిటెడ్ సిద్ధమవుతోంది. భారతదేశంలో మొదటి అర్బన్ ఫార్మింగ్ కంపెనీలు సేంద్రీయ వ్యవసాయం కోసం కన్సల్టెన్సీ, మెడిసినల్ ప్లాంట్స్ తయారు చేస్తోంది. 

జైపూర్....! కొండలు, గుట్టలు, వీధులు గుండా ఎగురుతున్న పక్షులు.. చూడ్డానికి ఇది ఎంతో ఆహ్లాదరకంగా ఉంటుంది. సిటీలో మనోహరమైన రాజభవనాలు, అక్కడ అక్కడా పసుపు పచ్చని రంగులతో..ఉన్న ఇళ్లు దర్శనమిస్తుంటాయి. ఇంత అందమైన జైపూర్‌కు పచ్చదనం అద్దితే ఎలా ఉంటుందోనని ఊహించారు ప్రతీక్ తివారీ. ఆయనకు వచ్చిన ఆలోచనను కార్యరూపం పెట్టేశారు. 2013 లో ఇళ్లకు అవసరమైన గ్రీన్ ఫార్మింగ్‌కు శ్రీకారం చుట్టారు. ప్రతీక్ తివారీ ఇళ్ళ పైన కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, మూలికలు పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అక్కడ పోర్టబుల్ గ్రీన్ హౌసెస్‌ను స్థానికులకు అందించడం వల్ల పింక్ సిటీ... ఇప్పడు గ్రీన్ సిటీగా మారిపోయింది..

రాజసానికి ప్రతీక ఇప్పుడు పచ్చదనానికి ప్రతిరూపం

రాజసానికి ప్రతీక ఇప్పుడు పచ్చదనానికి ప్రతిరూపం


కాంక్రీట్ జంగిల్‌గా మారిన సీటీ లైఫ్‌లో లివింగ్ గ్రీన్స్‌ను స్థాపించి...ఎవరికి అవసరమైన కూరగాయలు వారు పండించుకొనే విధంగా సూచనలు ఇవ్వడం ప్రారంభించారు. ఇళ్లలో సేంద్రీయ సేద్యం, పైకప్పు సేద్యం, వాటికి అవసరమైన కిట్, సేంద్రీయ కిచెన్ గార్డెనింగ్ ఇస్తూ, నగరాల్లో పౌరులకు గ్రీనింగ్ పై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది లివింగ్ గ్రీన్స్. అయితే ఈ తరహా కంపెనీలు చాలా ఉన్నప్పటికి... దాన్ని ఆదాయ వనరులుగా మార్చడంతో, ఎక్కువ మంది లివింగ్ గ్రీన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. 2002 లో ప్రతీక్ రైతులతో కలిసి నేరుగా సేంద్రీయ వ్యవసాయ వెంచర్‌ను ప్రారంభించారు. అయితే పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ కాకపోవడంతో తరచుగా తెగుళ్లు బారిన పడడం, పంటలకు తీవ్ర హాని కలిగించడంతో రసాయన ఎరువులు విరివిగా వాడేందుకు ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే స్థానికుల మైండ్ సెట్‌లో మార్పు రావడంతో 100 శాతం సేంద్రీయ వ్యవసాయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే...నిర్మాణాత్మక వ్యవస్థ లో మార్కెట్ ఉత్పత్తులు పంపిణీ సరిగ్గా లేకపోవడంతో ఆ వెంచర్ మధ్యలోనే మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇళ్లు,అపార్ట్‌మెంట్ల పైకప్పులపై సేద్యం

ఇళ్లు,అపార్ట్‌మెంట్ల పైకప్పులపై సేద్యం


ఆర్గానిక్ ఫార్మింగ్‌లో చేసిన తప్పులు క్యాన్సర్ రావడానికి కారణాలయ్యాయి. దీంతో మొదటి నుంచి వెన్నుతట్టి ప్రోత్సహించిన స్నేహితులు, బంధువులను వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఈ పరిస్థితుల్లో రెండు అవకాశాలు ప్రతీక్ ముందు ఉన్నాయి. లక్ష్యాన్ని పక్కన పెట్టి.... వాల్ మార్ట్‌లో ఉద్యోగం కొనసాగించలా.. లేదా సేంద్రీయ వ్యవసాయ నాణ్యత పెంచాలా... అనేదానిపై తీవ్ర తర్జన భర్జనలు పడ్డారు. నా ఉద్యోగం సేఫ్‌గా చూసుకోవడం కంటే లక్ష్యం వైపే దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నానని చెబుతారు తివారీ.

విశాల ప్రాంతాల్లోనూ వినూత్న తరహా సేద్యం

విశాల ప్రాంతాల్లోనూ వినూత్న తరహా సేద్యం


ప్రపంచం సంరక్షణ తీసుకోవడానికేప్రాధాన్యత ఇచ్చాను. కొన్ని రిఫ్లెక్షన్స్ తరువాత, డాట్ కనెక్ట్ సేంద్రీయ వ్యవసాయ వ్యాపార శక్తిని ఆకర్షణీయంగా ఉంటుందని గ్రహించారు. అప్పటికే జైపూర్లో పరిస్థితులపై అవగాహన పెంచుకున్న తివారీ పండ్లు, కూరగాయలుకు నాణ్యత తక్కువగా ఉందని గ్రహించారు. ఖాళీగా ఉన్న ఇళ్ల పైకప్పును ఉపయోగించుకోవడం ద్వారా లివింగ్ గ్రీన్ కాన్సెప్ట్ డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే వాల్‌మార్ట్‌లో సౌకర్యవంతమైన ఉద్యోగానికి రిజైన్ చేసి చేతులకు మట్టి వాసన చూపించారు.

రూఫ్ టాప్‌పై పండిన లేలేత పొట్లకాయలు

రూఫ్ టాప్‌పై పండిన లేలేత పొట్లకాయలు


ది లివింగ్ గ్రీన్స్ ఇప్పుడు ఎక్కువ తేమ కలిగిన ప్రాంతాల్లో గ్రీన్ హౌస్ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తోంది. జైపూర్ నుంచి ప్రారంభమైన ప్రస్థానం ఢిల్లీ, ఇండోర్, జోధ్ పూర్‌లలో కూడా ఫ్రాంచైజీలు ప్రారంభమయ్యాయి. రూఫ్ టాప్స్‌పై నిలువు తోటలుకు శ్రీకారం చుట్టారు. గ్రీన్ హౌస్ ఏర్పాటు చేయడానికి అవసరమైన మట్టిని కూడా అందించే ప్రయత్నం ప్రారంభించారు. చవక ధరలకే గ్రీన్ హౌస్ కంపెనీ తడి తక్కువగా ఉన్న మట్టిని అందించే పని ప్రారంభించారు.

image


ఇళ్లలో వెర్టికల్ గార్డెన్స్‌కు మట్టి అవసరం లేకపోవడం.. నీరు రీసైకిల్ చేసే వ్యవస్థ కలిపి ప్రత్యేక కంటైనర్లు సృష్టించింది కంపెనీ టీమ్. “

మేము చేసిన పరిశోధనలు వల్ల మార్కెట్లో మా ఉత్పత్తులకు ఫలితం రావడం ప్రారంభించింది” అంటారు ప్రతీక్ "ఇప్పుడు మా ఉత్పత్తులు మార్కెట్ చేయడంతో పాటు ఎలాంటి సమస్యలకైనా తగిన పరిష్కారం ఇచ్చే స్థాయికి ఎదగడంతో ది లివింగ్ గ్రీన్స్ నిదానంగా అందరి అభిమానం సంపాదించుకుంది.." 

దీంతో వినియోగదారులకు తగిన సూచనలు, సలహాలు అందించే స్థాయికి ఎదగడంతో...నెలకు 1000-1500 సర్వీస్ చార్జ్ ఇవ్వడానికి వస్తున్నారు. తర్వాత ఉత్పత్తులు అమ్మకం, వాతావరణ అధ్యయనం కొనసాగిస్తూ, మేము మా వినియోగదారులకు సూచనలను ఇవ్వడం ప్రారంభించాము. అయితే, గ్రీన్ హౌస్ సంస్థ చాలా సందర్భాలలో, సొంత కూరగాయలను పండించుకొనే సామర్థ్యం ఉన్నట్లు గుర్తించారు. ది లివింగ్ గ్రీన్స్ ఇప్పుడు స్థానిక వ్యాపారులుతో కొత్త భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10 ఇతర నగరాల్లో ఫ్రాంచైజీలు తెరవడానికి ప్లాన్ చేస్తోంది.

గ్రీన్ హౌస్ విస్తరణకు నిర్ణయించడంతో... బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగకం కంటే... ఇంటి దగ్గర నుంచే ది లివింగ్ గ్రీన్స్‌కు సహకరిస్తామంటూ పెద్ద సంఖ్యలో యువకుల నుంచి మెయిల్స్ వచ్చాయి. సంస్థతో కలిసి పనిచేయడం ద్వారా పర్యావరణం పరిరక్షణకు ముందు ఉంటామని యువకులు చెప్పుకొస్తున్నారు. దీంతో కంపెనీ బోర్డు డైరక్టర్లు అవసరమైన నిధులు అందించడానికి సిద్ధమని ప్రకటించారు. పరిశోధనల కోసం 19 మంది సభ్యుల బృందం నిరంతరం పనిచేస్తూనే ఉంది. "మేము నివసిస్తున్న ఫ్లాట్స్ ప్రజలకు అవసరమైన కూరగాయలు అందుబాటులోకి రావడం, వారికి ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతూ ఉండడంతో... టెర్రస్ గార్డెన్స్ సృష్టించడానికి రెడీ అవుతున్నారు. దీని కోసం మా టెక్నికల్ టీమ్‌తో పాటు రూఫ్ టాప్ వ్యవసాయం చేసే ప్రజలు వారి సొంత వ్యర్థాలతో కంపోస్ట్ ఉత్పత్తి చేసి చూపించాము. దీనిపై ఓ నమూనాను అభివృద్ధి చేశాము. మేము చేస్తున్న ప్రయత్నంతో "అర్బన్ ఫార్మింగ్ కు చాలా మంది యువకుల ఉత్సాహాన్ని చూస్తే.. నిజంగా ఫిక్స్ డ్ ఇన్ కమ్ మాదిరిగా ఒక వినూత్న ప్రయోగమనిపిస్తొందంటారు ప్రతీక్.

Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share
Report an issue
Authors

Related Tags