సంకలనాలు
Telugu

చిన్నారికి చక్కటి ఇంగ్లీష్ నేర్పే చిప్పర్ సేజ్

చిన్నారులకు తేలికగా అర్దమయ్యేలా ఇంగ్లీష్ 18ఏళ్ల ఐటీ ఎక్స్ పీరియెన్స్ తో చిప్పర్ సేజ్ కరికులమ్

27th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఇప్పుడంతా ఇంగ్లీష్ మీడియం చదువులు. నర్సరీ నుంచే పదాల్ని నరాల్లోకి ఎక్కిస్తున్నారు. మరి అంతంత పెద్ద వర్డ్స్ చిట్టి బుర్రలోకి ఎక్కాలంటే కొంచెం కష్టమే. స్కూల్లో టీచర్ల సంగతి సరే. ఇంటికొచ్చాక వాళ్లచేత హోం వర్క్ చేయించాలంటే పేరెంట్స్ శీర్షాసనం వేయాల్సిందే. బండెడు హోం వర్క్ చేయించాలంటే ఊపిరి ఆగినంత పనవుతుంది. దీనికి సొల్యూషన్ ఏమీ లేదా? పిల్లలు షార్పుగా పదాలు క్యాచ్ చేయడానికి షార్ట్ కట్ ఏమైనా ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే చిప్పెర్ సేజ్ ఎడ్యుకేషన్

బేస్ బ్రహ్మాండంగా ఉంటేనే ఫ్యూచర్ బ్రైట్

కాంపిటీటివ్ వరల్డ్. ఏమాత్రం వెనకడుగు వేసినా ఎక్కడో అట్టడుగుకు పడిపోతారు. నర్సరీ నుంచే పునాది గట్టిగా ఉండాలి. బేస్ బ్రహ్మాండంగా ఉంటేనే ఫ్యూచర్ బ్రైట్‌గా ఉంటుంది. మరి అంత లేత వయసులో పెద్దపెద్ద ఇంగ్లీష్ పదాలు చదవాలన్నా, వాటిని అర్ధం చేసుకోవాలన్నా కొంచెం కష్టమే. స్కూల్లో టీచర్లయినా, ఇంట్లో పేరెంట్స్ అయినా వాళ్లచేత చదివించాలంటే డక్కామొక్కీలు తినాలి. మరి దీనికి ఎవరో ఒకరు సొల్యూషన్ చెప్పాలి. అలాంటి ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే చిప్పెర్ సేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్.

ఎవరీ లతా శ్రీనివాసన్?

image


లతా శ్రీనివాసన్ హెచ్‌సీఎల్ టెక్ లో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. 18 ఇయర్స్ ఇండస్ట్రీ. 2012లో ఓ వర్టికల్ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నప్పుడు చిప్పర్ సేజ్ ఆలోచనకు బీజం పడింది. చేయగలనన్న నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే తన లాస్ట్ ప్రాజెక్టు చేసేటప్పుడు అందులో నలుగురు మెంబర్లుండేవారు. రెండేళ్లలో ఆ సంఖ్య 250కి పెరిగింది. అంటే ఆ ప్రాజెక్టు ఎంత సక్సెస్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. ఆ ఆత్మవిశ్వాసంతోనే ఓ సొంత స్టార్ట్ అప్ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. అలా 2012 లో చిప్పర్ సేజ్ మొదలు పెట్టారామె.

అలా తయారైంది ప్రోగ్రాం

ఐదేళ్ల క్రితం లతా శ్రీనివాసన్ చిన్న పిల్లల్లో చదివే అలవాటు పెంచేలా చేయాలనే థీమ్ తో ఓ లైబ్రరీ మొదలుపెట్టారు. అది చూసిన తర్వాత చాలామంది పేరెంట్స్ వచ్చారు. తమ పిల్లలకూ అక్షరాలు, పదాలు ఎలా చదవాలో నేర్పాలని కోరారు. ఆ టైంలో కిండర్ గార్టెన్ కి ఫస్ట్ క్లాస్ కీ వెళ్లే పిల్లల్లో ఎంత గ్యాప్ ఉందో గమనించారు. వాస్తవానికి కేజీ స్కూల్స్ ఎన్ని ఉన్నా అవి ఫస్ట్ క్లాసు లోకి వెళ్లబోయే చిన్నారులను అందుకు సంసిధ్దంగా తయారు చేయలేకపోతున్నాయి. ఫస్ట్ క్లాస్‌లో ఒకేసారి ఆరు సబ్జెక్టులు టీచరు గడగడా ఇంగ్లీషులో చెప్పేస్తుంటే చిట్టి బుర్రలకు అర్ధం కాక తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. దాంతోనే చదువుపై ఇంట్రస్ట్ సంగత పక్కన పెట్టండి.. ఎక్కడ లేని భయం ఏర్పడుతుంది. అలా కాకుండా ఏదైనా పదమో, వాక్యమో కరెక్టుగా చెప్పగలిగితే వారిలో ఇంకా నేర్చుకోవాలనే తపన, ఉత్సాహం కనిపిస్తాయి. సరిగ్గా ఈ పాయింట్ మీదే చిప్పర్ సేజ్ ప్రోగ్రామ్ రూపుదిద్దుకుంది.

ఎలాంటి మెటీరియల్ ఉంటుంది?

బ్రహ్మపదార్ధం కాదు. కన్‌ఫ్యూజన్ అసలే లేదు. చిప్పర్ సేజ్ లో తయారైన ప్రాడక్ట్స్ అన్నీ ఆట వస్తువుల్లాగే ఉంటాయి. చదవడం.. పలకడం.. తప్పుల్లేకుండా రాయడం అనేవి బేసిక్‌ అంశాలు. మెటీరియల్ మూడేళ్ల నుంచి 12 ఏళ్ల వయస్సున్న పిల్లలకు ఉపయోగ పడుతుంది. ఇంగ్లీష్ ఎవర్ ఆఫ్టర్ (EEA) పేరుతో ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్. ఇందులో వాడే పదాలన్నీ ఇండియన్ నేటివిటీతో ఉంటాయి. థీమ్స్ కూడా మన దేశానికి చెందనవి కావడంతో పాటుగా వినిపించే గొంతు కూడా అన్ని ప్రాంతాల వారికీ అర్దమయ్యే యాక్సెంట్ తో ఉంటుంది. డీవీడీ ప్లే చేయడం వచ్చిన ఏ చిన్నారి అయినా వీటిని ఈజీగా వాడుతుంది. అలా దాని కంటెంట్ డిజైన్ చేశారు. ఇంగ్లీష్ ఆల్భాబెట్స్ , ఏ అక్షరం ఎలా పలకాలి, పదాల నిర్మాణం, మధ్యమధ్యలో చిన్నచిన్న కథలు, అవిచెప్పే విధానం, ఇవన్నీ ఒక్కసారి గమనిస్తే చాలు- పిల్లలు ఆటోమేటిగ్గా నేర్చుకుంటారు. ఇప్పటికే 60 స్కూళ్లు చిప్పర్ సేజ్ బిగినర్(2-7 ఏళ్ల వయస్సు గల వారికి) కిట్లను కొనుగోలు చేసి, కేజీ, లోయర్ ప్రైమరీ క్లాసుల విద్యార్దులకు బోధిస్తున్నాయి. 2014 జనవరిలో చిప్పర్ సేజ్ ఇంకో కొత్త లెర్నర్ సిరీస్ విడుదల చేసింది. ఇందులో మాగ్నెట్ తో చేసిన 250 టైల్స్ ఉంటాయి. వాటిని మ్యాగ్నెట్ బోర్డు పై అమర్చడం ద్వారా స్పెల్లింగ్, వాటిని పలికే విధానం అర్ధమవుతుంది. అలాగే ఇందులో ఉండే యాక్టివిటీ మాన్యువల్స్ క్లాస్ రూమ్ లో ఓ ఎస్సైన్ మెంట్ లా ఉపయోగపడుతుంది. ఇవన్నీ చేస్తుంటే ఆటోమేటిగ్గా పిల్లల్లో నేర్చుకోవాలనే తపన కనిపిస్తుంది. రైమింగ్, సౌండ్‌తో కూడిన పదాలు ఉండటంతో పిల్లలు ఇంగ్లీష్ ను చక్కని యాక్సెంట్ లో పలుకగలుగుతారు..

ఇంగ్లీష్ ఎవర్ ఆఫ్టర్ ప్రోగ్రామ్ లో ఒక ఏడాదికి సరిపడా కరికులమ్ ఉంది. అందులో లెసన్ ప్లాన్స్, పిల్లలు చేయాల్సిన యాక్టివిటీస్ గట్రా ఉంటాయి. అందులో పొందుపరిచిన ట్రైనింగ్ పద్దతులు ఇంగ్లీష్ నేర్పే టీచర్లకు బాగా ఉపయోగపడతాయి. క్లాస్ రూమ్ లో వాడే టెక్నిక్ లతోపాటుగా.. హోమ్ వర్క్ ఇవ్వదగిన ప్రోగ్రామ్స్ కూడా కరికులమ్ లో ఉన్నాయి. టీచర్లతో ఎప్పుడూ టచ్ లో ఉండటానికి ఆన్ కాల్ మెంటర్ అనే టెలిఫోన్ సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే టీచర్లకు ఈ ఆన్ కాల్ మెంటార్ ప్రోగ్రామ్ బాగా ఉపయోగపడుతుంది. స్కూళ్ల నుంచి, పేరెంట్స్ నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ప్రొడక్టులో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటారు.

"నాలుగో తరగతి పిల్లలు కూడా టెక్ట్స్ బుక్ లో ఇంగ్లీష్ తప్ప బయట కన్పించే పదాలను చదవలేకపోవడం గమనించాం. అందుకే లెర్నర్ సిరీస్ ను డెవలప్ చేశాం. కేవలం టెక్ట్ బుక్ లో మాత్రమే పదాలు చదివితే, పిల్లలకు మిగిలిన పదాలు ఎలా తెలుస్తాయి"లతా శ్రీనివాస్

image


ఫ్యూచర్ ప్లాన్స్

చిప్పర్ సేజ్ భవిష్యత్తులో స్కూల్ పిల్లల కోసం మరిన్ని ఆవిష్కరణలుచేసే ఆలోచనలో ఉంది. వాటిలో కార్డ్స్ ఉపయోగించి లెక్కలు చేయడమనే కాన్సెప్ట్ కూడా ఉంది. బెంగళూరు NSRCEL IIM ఇంక్యుబేషన్ నుంచి బయటకు వచ్చిన వారితో కలిపి చిప్పర్ సేజ్ లో ప్రస్తుతం 12 మంది పని చేస్తున్నారు. విద్యావేత్తలు, బిట్స్ పిలానీ, రూర్కీ ఐఐటీ నుంచి వచ్చిన వారు కూడా ఈ టీంలో సభ్యులుగా ఉన్నారు. మొదట్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, వాటిని ఛాలెంజింగ్‌గా స్వీకరించి సవాళ్లను అధిగమించారు. బాలారిష్టాలను ఎప్పుడో దాటేసిన చిప్పర్ సేజ్ ఇప్పుడు దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం చిప్పర్ సేజ్ ను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. అందుకోసం త్వరలోనే ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags