ప్రపంచ మార్కెట్ పైకి దండయాత్ర చేస్తున్న మన చిట్టి!

రోబోల ఉపయోగాన్ని స్మార్ట్ ఫోన్ అంత సులువు చేసే ప్రయత్నంలో ఇండియన్ స్టార్టప్

29th Apr 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close


రోబో ప్రపంచ టెక్నాలజీ రంగానికి హాట్ ఫేవరేట్ లాంటి ప్రొడక్ట్. మానవునికి ప్రత్యామ్నాయంలా ఉండే ఈ ఉత్పత్తిని నిరంతరం మెరుగుపర్చేందుకు దిగ్గజ కంపెనీలు కొన్ని కోట్ల డాలర్లు కుమ్మరిస్తూ ఉంటాయి. కొత్త కొత్త ఆవిష్కణలు చేస్తూంటాయి. రాబోయే రోజుల్లో మనుషులు చేసే ప్రతీపనిని రోబోలు చేసేలా పరిశోధనలు సాగుతున్నాయి. ఏ కొత్త ఉత్పత్తి బయటకొచ్చినా మార్కెట్లో సంచనలం సృష్టిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్- రోబోలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వస్తువులదే.

రోబో టెక్నాలజీలో భారతీయ కంపెనీ సిరెనా టెక్నాలజీస్ మైల్ స్టోన్ అనదగ్గ ప్రొడక్ట్ ని సృష్టించింది. పూర్తిగా ఇండియాలో తయారైన రోబోను ఆవిష్కరించింది. రీసెర్చ్, డిజైన్, డెవలప్ మెంట్ మొత్తం భారత్ లోనే సాగడం ఈ రోబో ప్రత్యేకత. దీనికి నినో అని పెరు పెట్టారు. దీని ధర ప్రపంచంలోనే మరే ఇతర సంస్థ ఇవ్వలేనంత చౌకగా నిర్ణయించారు. కేవలం ఆరు వందల డాలర్లకు అంటే.. రూ40 వేలకు అటూఇటూగా మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. అదే సమయంలో సెరెనాకు చెందిన లిబెర్ వైర్ లెస్ స్టార్టప్ ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్ మార్కెట్ లో సరికొత్త ఆవిష్కరణతో ముందుకెళ్తోంది. వైరలెస్ టెక్నాలజీతో ఈ కంపెనీ అడ్వాన్సుడ్ ప్రొడక్టులను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. వైర్ లెస్ ఎల్ఈడీ ల్యాంపులు,వైర్ లెస్ పవర్ వై-ఫై స్పీకర్స్ లిబెర్ ప్రత్యేకత. ఈ రెండు టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణలతో ప్రపంచ విద్యా, పరిశోధన రంగాల్లో రోబోటిక్స్ ను మరింత ప్రధానమైన అంశంగా మార్చే ప్రయత్నంలో ఉన్నాయి.

నినో రోబోతో హరిహరన్ బోజన్, సిరెనా టెక్నాలజీస్ ఫౌండర్ <br>

నినో రోబోతో హరిహరన్ బోజన్, సిరెనా టెక్నాలజీస్ ఫౌండర్


హరిహరన్ చిట్టి... నినో

లిబెర్ వైర్ లెస్ ను హరిహరన్ భోజన్ 2013లో ప్రారంభించారు. హరిహరన్ అంతకు ముందు బ్రిడ్జ్ కో ఇండియాలో పనిచేస్తూ ఓ స్ట్రీమింగ్ ఆడియో ప్రొడక్ట్ ను డెవలప్ చేశారు. ఇది ప్రపంచం దృష్టిని ఆకర్షించడంతో ఆ కంపెనీని ఓ మల్టీ నేషనల్ కంపెనీ కొనేసింది. అయితే అప్పుడే హరిహరన్ ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చారు. మిత్రలతో కలిసి లిబెర్ వైర్ లెస్ ను స్థాపించారు. ప్రస్తుత హరిహరన్ లిబెర్ వైర్ లెస్ ఇంజినీరింగ్, ఇండియా ఆపరేషన్స్ కు వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. సీఈవోగా హుమూన్ కసెఫ్, జోర్డాన్ వాటర్స్ సీవోవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేకంగా రోబోటిక్ టెక్నాలజీ డెవలప్ మెంట్ కోసమే లిబెర్ వైర్ లెస్ నుంచి విడిగా సిరెనా టెక్నాలజీస్ ను ప్రారంభించారు. మనుషులు చేసే ప్రతీపనిని చేసే రోబోలను అత్యాధునిక టెక్నాలజీద్వారా రూపొందించడమే సిరెనా టెక్నాలజీస్ లక్ష్యం. ప్రస్తుతం బెంగళూరులో రీసెర్చ్ అండ్ డిజైన్ సెంటర్ నడుస్తోంది.

" రోబోటిక్స్ ద్వారా ఇండియా విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలనే లక్ష్యంతో నేను సిరెనా టెక్నాలజీస్, లిబెర్ వైర్ లెస్ ను ప్రారంభించాను. భారతీయ మార్కెట్లకు తగినట్లు ఉండే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉత్పత్తులను కూడా సిద్ధం చేశాం. వైఫై స్పీకర్స్, పవర్ ప్లగ్స్, ఎల్ఈడీ ల్యాంప్స్ విత్ స్పీకర్స్ లాంటి ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చాం"- హరిహరన్

హ్యుమనాయిడ్ రోబో నినోను రేపోమాపో భారతీయ మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. అత్యుత్తమ రోబోను అతి తక్కువ ధరలో ప్రపంచానికి అందించాలనే లక్ష్యాన్ని హరిహరన్ పెట్టుకున్నారు. నినోను ప్రధానంగా స్కూళ్లు, కాలేజీల్లో టీచింగ్ టూల్ గా ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. టెక్నికల్ కాలేజీలు, యూనివర్శిటీల్లో నినో స్టూడెంట్స్ కు సబ్జెక్ట్ విషయాల్లో సహాయకారిగా ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులు కొత్త అంశాల్ని తెలుసుకోవడంతో పాటు ప్రయోగాలు చేయడానికి , మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని హరిహరన్ భావిస్తున్నారు. స్కూళ్లలో విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి , రైమ్స్ పాడటం, లెక్కలు విశ్లేషించడం వంటి వాటిలో నినో సాయపడగలదు. ఓ రకంగా ఇది టీచింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తుంది. పబ్లిషింగ్ రంగంలో కూడా సిరెనా ఇప్పటికే కొంత టెక్నాలజీని కంపెనీలకు అందించింది.


మేక్ అండ్ మేడ్ ఇన్ ఇండియా

సెర్వో మోటార్ టెక్నాలజీతో రోబోను సిద్ధం చేసిన మొట్టమొదటి భారతీయ కంపెనీ సిరెనా టెక్నాలజీస్. సిరెఫ్ 1.0టెక్నాలజీని పర్సనల్ రోబోటిక్స్ కి అనుగణంగా తీర్చిద్దారు. సెర్వోని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు వచ్చే ఏడాది అక్టోబర్ వరకు ఈ బృందం స్పష్టమైన రోడ్ మ్యాప్ పెట్టుకుని ముందుకు వెళ్తోంది. పూర్తిగా మానవుడిలా ప్రవర్తించే రోబోను సృష్టించేందుకు ఈ సెర్వో టెక్నాలజీ సరిగ్గా ఉపయోగపడుతుందని సిరెనా బృందం గట్టినమ్మకంతో ఉంది.

లిబెర్ వైర్ లెస్ కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మార్కెట్ లో టోటల్ ఇండియా బ్రాండ్ ను ఫాలో అవుతోంది. భారత్ లో మొట్టమొదటగా కంప్లీట్ మల్టీరూం వై-ఫై ఆడియో సొల్యూషన్ ప్రొడక్ట్ ఉత్పత్తి చేసిన కంపెనీ లిబెర్ నే. దీన్ని ఐఓఎస్, ఆండ్రాయిడ్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఎల్ఈడీ బల్బులు, స్పీకర్స్ లోనూ అద్భుతమైన విజయాల్ని లిబెర్ నమోదు చేసింది. ఆడియో ఉత్పత్తులకు గూగుల్ కేస్ట్ ను ఆవిష్కరించడంతో లిబెర్ ను ఆఫిషియల్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ గా గుర్తించడం ప్రారంభించారు. గత ఏడాది సెప్టెంబర్ లో ప్రపంచంలోనే సెమీకండక్టర్ పరిశ్రమ దిగ్గజం మార్వెల్ .. లిబెర్ తో చేతుతులు కలిపింది. వై-ఫై, బ్లూటూత్ ఐఓటీ టెక్నాలజీల్లో రెండు సంస్థలు కలిసి పరిశోధనలు చేయాలని నిర్ణయించుకున్నాయి.

" మేం చైనాలో ఉన్న కొన్ని మంచి కంపెనీలతో టై అప్ అయ్యాము. చాలా పెద్ద బ్రాండ్స్, పార్ట్ నర్స్ తో కలసి పనిచేస్తున్నాము. గూగుల్, ఆపిల్ కూడా ఆ జాబితాలో ఉన్నాయి" హరిహరన్


ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు

లిబెర్ వైర్ లెస్, సిరెనా టెక్నాలజీస్ కు బెంగళూరుతో పాటు అమెరికా, చైనా, జపాన్ లలో కూడా కార్యాలయాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ వెంచర్ క్యాపిటల్ ఫండ్ కంపెనీలు పెట్టుబడులు అందించాయి. లిబెర్ వైర్ లెస్ ఈ ఏడాది బ్రేక్ ఈవెన్ సాధిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం వీటిలో వంద మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. హ్యూమనాయిడ్ డివిజన్ లో ఇరవై మంది పనిచేస్తున్నారు. విభిన్నరంగాల్లో నిపుణులైన వీరు ప్యాషన్ తో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూంటారు.

"గత ఏడాది కాలంలో మేం మైలురాయి అనదగ్గ విజయాలను సాధించింది. మా ఉత్పత్తి స్కూళ్లు, కాలేజీలకు సరఫరా చేయాడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచంలో ఏ ఇతర కంపెనీ కూడా ఇలాంటి రోబోను ఆరు వందల డాలర్లకు ఇవ్వలేదు. కానీ మేం అమ్మకానికి సిద్ధం చేశాం"- హరిహరన్ 

రోబోటిక్స్ తోపాటు ఐఓటీ ఉత్పత్తులతో మార్కెట్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న లిబెస్, సిరెనా కంపెనీలకు వచ్చే కొన్ని నెలలు కీలకమైనవి. అందుకే వీరు ఇప్పుడు వారంలో ఏడు రోజులు పనిదినాలుగా పెట్టుకున్నారు. ప్రత్యేకమైన హెచ్ ఆర్ పద్దతులేమీ లేకుండా ఉద్యోగులు తమ ఆలోచనలు, మైండ్ కి తగినట్లుగా ఎప్పుడైనా వచ్చి పనిచేకునేలా ఆఫీస్ ఎట్మాస్పియర్ ను తీర్చి దిద్దారు.

image


భవిష్యత్ రోబోటిక్స్ దే

రానున్న రోజుల్లో పారిశ్రామిక రంగంతో పాటు మానవుడు తీవ్రంగా శ్రమించాల్సిన ప్రతి దాంట్లోనూ రోబోలు కీలక పాత్ర పోషించనున్నాయి. 2014లో గ్లోబల్ రోబోటిక్స్ మార్కెట్ 28.22బిలియన్ డాలర్లుగా ఉంది. 2020 కల్లా ఇది 41.18 బిలియన్లకు చేరుతుందని రీసెర్చ్ అండ్ మార్కెట్స్ అంచనాలు వెల్లడించాయి. అల్ఫాబెట్, శ్యామ్ సంగ్, రెత్నిక్ రోబోటిక్స్, సాఫ్ట్ బ్యాంక్ రోబోటిక్స్, టోయోటా లాంటి జెయింట్స్ ఇప్పటికే ఈ రంగంలో తమదైన ముద్ర వేసేందుకు భారీగా ఖర్చుతో పరిశోధనలు చేస్తున్నాయి.

అలాగే ఐఓటీ ఉత్పత్తుల మార్కెట్ కూడా అనూహ్యంగా పెరగనుంది. మెకిన్సే అంచనా ప్రకారం 2015 కల్లా ఐఓటీ ఉత్పత్తుల మార్కెట్ పదకొండు ట్రిలియన్ డాలర్లకు చేరుకోనుంది. ఖర్చులు తగ్గించుకుంటూ టెక్నాలజీని మెరుగుపర్చుకుంటే లిబెల్, సిరెనా లాంటి కంపెనీలకు స్వర్ణయుగమే. ఐఓటీ ఉత్పత్తుల్లో లిబెర్ వై-ఫై అడాఫ్టర్, వై-ఫై పవర్ ప్లగ్స్ లాంటి కొత్తతరం ఉత్పత్తుల్ని డిజైన్ చేస్తోంది. రాబోయే రోజుల్లో ఇంట్లో కూడా అన్ని పనులు చేసే రోబోను సిద్ధం చేసి ప్రపంచం ముందుకు తెస్తామని కంపెనీ ఎకో సిస్టమ్ మేనేజ్ మెంట్ వైస్ ప్రెడిసెంట్ గుర్మీత్ సింగ్ చెబుతున్నారు.

" రోబోలను అందరికీ అందుబాటులోకి తేవడమే మా లక్ష్యం. ఇప్పుడు స్మార్ట్ పోన్ ను ఎలా కొంటున్నారో.. అలా రోబోట్లను కొనేలా చేయాలి. లక్ష , యాభై వేలు కు కూడా ఈ రోబోలు అందుబాటులో ఉంటాయి"- గుర్మిత్ సింగ్

ప్రస్తుతం కాలేజీలు, స్కూళ్లతో సిరెనా బృందం ఒప్పందాలు చేసుకుంటోంది. జైన్ యూనివర్శిటీలో రోబో టెక్నాలజీకి సంబంధించిన ల్యాబ్ ను ఏర్పాటు చేయడంతో పాటు పర్యవేక్షించేలా ఒప్పందం చేసకుంది. హ్యూమనాయిడ్ రోబో నినో కోసం ఇప్పుడిప్పుడే ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. బెంగళూరుకు చెందిన సురభి పబ్లిక్ స్కూల్ టీచింగ్ అసిస్టెంట్ గా నినోను వాడే మొట్టమొదటి స్కూల్ గా రికార్డు సృష్టించనుంది.

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India