సంకలనాలు
Telugu

కేన్సర్ కి చెక్ పెట్టబోతున్న ఆస్పిరిన్ టాబ్లెట్

11th Apr 2017
Add to
Shares
5
Comments
Share This
Add to
Shares
5
Comments
Share

ఆస్పిరిన్ డ్రగ్ కేన్సర్ ని అరికడుతుందని గత కొద్ది సంవత్సరాలుగా డాక్టర్లు చెప్తూ వస్తున్నారు. కానీ అది ఎంతవరకు నిజమన్నది స్పష్టం చేయలేదు. ఆ ప్రశ్నకు సమధానం చెప్తున్నారు మద్రాసు ఐఐటీకి చెందిన బయోటెక్నాలజీ ప్రొఫెసర్ అమల్ కాంతి బేరా. సింపుల్ పెయిన్ కిల్లర్ భయంకరమైన కేన్సర్ కణాలను నాశనం చేస్తుందని ఆయన ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తున్నారు.

ఆస్పిరిన్ అనే నాన్ స్టెరాయిడల్, యాంటీ ఇన్ ఫ్లిమేటరీ డ్రగ్ ప్రాణాంతక కేన్సర్ కణాలపై దాడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందనే పాజిటివ్ సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ డ్రగ్ కేన్సర్ కణాల్లోని మైటోకాండ్రియాలో ఉన్న అధిక స్థాయి కాల్షియం అయాన్లను ప్రేరేపిస్తుంది. ఫలితంగా ఆహారాన్ని శక్తిగా మార్చకుండా మైటోకాండ్రియాను నిరోధిస్తుంది. ఇలా ఎనర్జీ ప్రొడక్షన్ ఆగిపోవడంతో కేన్సర్ కణాలు క్రమంగా చనిపోతాయి.

image


ఈ డ్రగ్ ని మరింత శక్తివంతంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి.. ప్రతీ రోజు తక్కువ మోతాదు ఆస్పిరిన్ తీసుకుంటే హై రిస్క్ కార్డియాక్ డిసీజ్ ఉన్న వ్యక్తుల్లో ఎలాంటి పాజిటివ్ రియాక్షన్ వస్తుందో, కేన్సర్ విషయంలో కూడా అదే ఎఫెక్ట్ వస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావంతో ఉన్నారు.

అయితే, ఆస్పిరిన్ డ్రగ్ కేన్సర్ ని పూర్తిగా నయం చేస్తుందని ఇప్పటికప్పుడు భరోసా ఇవ్వలేం అంటున్నారు. ఇంకా క్లినికల్ స్టడీస్ జరగాలనేది వారి అభిప్రాయం. ఏది ఏమైనా చివరికి విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం 2016 నాటికి దేశంలో 14.5 లక్షల మంది కేన్సర్ రోగులున్నారు. 2020కల్లా వారి సంఖ్య 17.3 లక్షలు పెరగొచ్చని అంచనా. కేన్సర్ ప్రారంభ దశలో ఉండగా చికిత్స పొందుతున్న వారు 12.5 శాతం మంది ఉన్నారు.

ఏది ఏమైనా కేన్సర్ అనే ప్రాణాంతక వ్యాధి, ఖరీదైన దాని చికిత్సకు ఒక చిన్న మాత్ర ద్వారా చెక్ చెప్పడానికి దారులు పరుచుకున్నాయి. చేస్తున్న పరిశోధనలను, వస్తున్న రిపోర్టులను బట్టి భవిష్యత్ లో దానిపై వందశాతం నమ్మకం కలుగుతోంది. నిజంగా ఆస్పిరిన్ ద్వారా కేన్సర్ ని అరికట్టగలిగితే వైద్య చరిత్రలోనే అదొక సంచనల విజయం అవుతుంది. 

Add to
Shares
5
Comments
Share This
Add to
Shares
5
Comments
Share
Report an issue
Authors

Related Tags