సంకలనాలు
Telugu

పాత రుచులను గుర్తు చేస్తున్న 'పేపర్ బోట్' పానీయాలు

బాల్యానికి మించిన పాఠం లేదుకుతూహలానికి మించిన గురువు లేడు సంప్రదాయ రుచులకు సరికొత్త బ్రాండ్ పేపర్ బోట్ఆర్డర్ చేస్తే వాకిట్లోకి వచ్చి వాలే మీ ఊరి డ్రింక్ .. మీ కిష్టమయిన డ్రింక్ శరవేగంగా దూసుకెళుతున్న పానీయాల కంపెనీ పేపర్ బోట్

25th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఠారెత్తించే ఎండలోకి అలావెళ్ళి వస్తే చల్లని డ్రింక్ ఏదైనా తాగితే బాగుండును అనిపిస్తుంది. ప్రయాణంలో ఉన్నప్పుడయితే పిల్లలు ఏదో ఒక డ్రింక్ కొనివ్వమని మారాం చేస్తుంటారు. ఏదో ఒకటి ఎలా కొనిస్తాం. వాళ్ళ ఆరోగ్యం కూడా మనకు ముఖ్యమే కదా. బాల్యం గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి. అలాంటివే ఇప్పుడు దొరికితే ఎంత బాగుంటుంది. మంచి ఎండలో ఆడుకుని వచ్చాక అమ్మ చేత్తో కలిపి ఇచ్చిన నిమ్మరసం, మామిడి పండు జ్యూస్, జల్‌జీర రసం, నిమ్మకాయ పుదీనా వాటర్..

image


మీ ఊరి జాతరకి వెళ్ళినప్పుడు... ఎర్రటి ఎండలో తిరిగీ తిరిగీ, అలసిపోయి దాహం వేసినప్పుడు... పుదీన డ్రింక్స్ దగ్గరికో, నిమ్మకాయ షర్బత్ బండి దగ్గరికో పరుగెత్తుకు వెళ్లి హాయి హాయిగా, తీయతీయగా దాహం తీర్చుకున్న జ్ఞాపకం. ఇప్పటికీ మీతో భద్రంగా ఉండే ఉంటుంది. ఊళ్లో ఉన్నా సరే... ఏ దేశానికో వెడుతూ విమాన ప్రయాణంలో ఉన్నాసరే... ఇలాంటివి ఈ తరం చిన్నారులకు కూడా పరిచయం చేయాలని సంకల్పించారు నారాయణమూర్తి.

ఇలాంటి పానీయాలన్నీ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని పేపర్‌‍బోట్‌కి శ్రీకారం చుట్టారు నారాయణమూర్తి . బెంగళూరుకి చెందిన ఫుట్ ప్రింట్ వెంచర్స్ కేపిటల్ ఫర్మ్ కేటమారన్, సెకోయా కేపిటల్ సహకారంతో 2013 లో పేపర్ బోట్ అనే బ్రాండ్‌కు శ్రీకారం చుట్టారు. హెక్టార్ బెవరేజెస్ సంస్థ వీటిని తయారుచేసి మార్కెటింగ్ చేస్తోంది. ఢిల్లీకి చెందిన డెల్హివరీ సంస్థ సహకారంతో ఆన్‌లైన్‌లో పేపర్‌‍బోట్‌ అందుబాటులోకి తెచ్చారు. మనం కోరుకున్న డ్రింక్ ఏదైనా ఈ సంస్థ ద్వారా డెలివరీ చేస్తున్నారు. ఆన్‌లైన్ చెల్లింపులతో పాటు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కూడా అందిస్తున్నారు. రూ.150 మించిన ఆర్డర్లకు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం ఉంది.

ఆరోగ్యానికి హాని చేయని సహజసిద్ధమయిన పండ్ల రసాలు మా పానీయాల్లో ఉన్నాయంటున్నారు హెక్టార్ బేవరేజెస్ సంస్థ సీవోవో నీరజ్ బియానీ. "www.shoppaperboat.com" ఆన్‌లైన్‌ని బ్రౌజ్ చేసేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మా పానీయాలన్నీ ఎవరికి వారు తమ ప్రాంతానికి చెందిన బ్రాండ్‌గా గుర్తిస్తున్నారు. తాము ఎక్కడికెళ్ళినా పేపర్ బోట్ పానీయం చేతిలో ఉంచుకుంటున్నారు. కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన 48 గంటల్లో వారు కోరుకున్న ప్రోడక్ట్‌ని వారి దగ్గరకు చేరుస్తున్నాం.

‘‘ఒకే ప్రాంతానికి పరిమితమై పానీయాలను జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయాలనే ఆలోచనలో భాగంగానే పేపర్‌బోట్‌ను ప్రారంభించాం. పేపర్‌బోట్ అనేది భౌగోళిక, చరిత్ర జ్ఞాపకాలతో మిళితమైన పానీయం’’ అంటున్నారు నీరజ్. 

బాల్య జ్ఞాపకాలకు బలమైన ప్రతీకగా నిలుస్తుందనే కారణంతో తమ పానీయాల ఉత్పత్తికి ‘పేపర్‌బోట్’ అని నామకరణం చేశాం అన్నారు నీరజ్. బాల్యంలో ప్రధానంగా ఉండే ద్వేషం మా పేపర్ బోట్ పానీయం తాగితే దగ్గరికే రాదంటున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఉత్పత్తి అవుతున్న ‘పేపర్ బోట్’ పానీయాలు కేవలం మన దేశంలోనే కాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, మలేషియా... దేశాల్లో విరివిగా అమ్ముడవుతున్నాయి.

పేపర్ బోట్ ప్రస్తుతం అనేక ఫ్లేవర్స్‌లో లభ్యమవుతోంది. ఆమ్‌రస్, జల్జీర, తులసి, అల్లం రసం, జామున్ కాలా కట్టా, పచ్చి మామిడి రసం, కోకుం, ఇమ్లీ కా ఆమ్లానా, గోల్ గప్పీకా పానీ. వినియోగదారులకు ఇష్టమయిన రీతిలో అందుబాటులోకి తేవడం వల్ల మా బ్రాండ్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోందన్నారు నీరజ్.

ఇక పేపర్ బోట్‌ని డెలివరీ చేస్తున్న ఢిల్లీవరీ సంస్థ కో ఫౌండర్, చీఫ్ సేల్స్ ఆఫీసర్ మోహిత్ టాండన్ అయితే ‘‘ఈ కామర్స్ మార్కెట్ లో పేపర్ బోట్.కాం శరవేగంగా దూసుకుపోతోంది. ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 48 గంటల్లోపే ఆర్డర్లను డెలివరీ చేసేందుకు మా నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నాం” అంటున్నారు.

  • చిన్నచిన్న పేపర్ పడవలు తయారుచేసుకుని నీటిలోకి వదిలిన రోజులు
  • మొదటిసారి వానలో తడిచిన సందర్భం...
  • చిన్నప్పుడు చదువుకున్న చమత్కార కథలు...

ప్రముఖ సోషల్ వెబ్ సైట్స్ లో పేపర్ బోట్ కి సంబంధించిన స్లోగన్స్ ఇవి.

image


మరచిపోయిన సంప్రదాయ పానీయాలను పేపర్ బోట్ గుర్తుకుతెస్తుండడంతో ఈ బ్రాండ్ ఆన్ లైన్ లోనే కాదు.. ఇప్పుడు ప్రతి సూపర్ మార్కెట్ లోనూ, కిరాణా షాపుల్లోనూ కనిపిస్తోంది. పేపర్ బోట్ కంపెనీ చెప్పినట్టు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్... నిజమే జీవితం ఎప్పుడూ అందంగానే ఉంటుంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags