సంకలనాలు
Telugu

బిడ్డింగ్‌తో హోటల్ రూం బుకింగ్..'ఫైండ్ మే స్టే' ప్రత్యేకత

తక్కువ ధరకే హోటల్ రూమ్స్..మీ రూమ్ ధరను మీరే నిర్ణయించుకునే అవకాశం.. ఫైండ్ మై స్టే తో మీ బడ్జెట్ 30 శాతం ఆదా..

CLN RAJU
30th Aug 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

పర్యాటకులకోసం దేశవ్యాప్తంగానే కాక.. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో హోటళ్లు తమ ఆతిధ్యాన్ని అందిస్తున్నాయి. అయితే.. కొంతమంది పర్యాటకులు మాత్రం తమ బడ్జెట్‌లో ఉండే హోటళ్ల కోసం వెతుకుతూ ఉంటారు. ఇలాంటివాళ్ల కోసం కొన్ని హోటళ్లు యావరేజ్ ప్రైస్‌తో రూమ్స్ అందిస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఫైండ్ మై స్టే (Findmystay.com) యాత్రికులకు సౌకర్యవంతమైన బడ్జెట్లో హోటల్ రూమ్స్‌ను అందిస్తోంది. హోటళ్ల యాజమాన్యాలకు, వినియోగదారులకు మధ్య ఓ వారధిలా ఉంటోంది ఫైండ్ మై స్టే.

image


ఐడియా ఎలా వచ్చింది..?

ఫైండ్ మై స్టే (Findmystay.com) 2013 అక్టోబర్‌లో ప్రారంభమైంది. అయితే సుమారు 18 నెలల నుంచి హోటళ్ల యాజమాన్యాలతో వ్యవస్థాపకులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. “ దేశంలో నిత్యం ఎంతో మంది పర్యాటకులు వివిధ ప్రాంతాలకు పర్యటిస్తూ ఉంటారు. వీళ్లకు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉండడం లేదు. పైగా వాళ్లు కోరుకున్న బడ్జెట్లో హోటళ్లు దొరకడం లేదు. వినియోగదారులు కోరుకునే బడ్జెట్‌లో హోటళ్లు అందించాలనే ఆలోచనే ఫైండ్ మై స్టే డాట్ కామ్‌కు నాంది” అంటారు సహ వ్యవస్థాపకులు సిమ్రన్ సియాల్. ఈ స్టార్టప్‌ను సిమ్రన్ సియాల్, రోహిత్ ఖేత్రపాలు సంయుక్తంగా ప్రారంభించారు. ప్రారంభించిన మూడు నెలలకే వినియోగదారులకు లక్ష రూపాయల వరకూ ఆదా చేశారు.

వీళ్లద్దరికీ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడింది. “ మొదట్ సిమ్రన్‌కు ఈ ఐడియా వచ్చింది. దీన్ని ప్రారంభించాక ఎలా మార్కెట్ చేయాలి అనే దానిపై నాతో మాట్లాడాడు. అలా నేను కూడా ఇందులో భాగస్వామినయ్యాను. ప్రారంభించాలి అనుకున్న చాలా కాలానికి ఇది పట్టాలెక్కింది ” అంటారు రోహిత్. సుమారు సంవత్సరకాలం పాటు వీళ్లిద్దరూ దీనిపై విస్తృతంగా చర్చించుకున్నారు. తర్వాతే ప్రారంభించారు.

రోహిత్ ఖేత్రపా, ఫైండ్ మై స్టే సహ వ్యవస్థాపకుడు

రోహిత్ ఖేత్రపా, ఫైండ్ మై స్టే సహ వ్యవస్థాపకుడు


ఫైండ్ మై స్టే టీం

రోహిత్ మేనేజ్‌మెంట్‌లో పీజీ పుచ్చుకున్నాడు. పైగా మంచి పర్యాటకుడు కూడా.. ఇక సిమ్రన్‌కు పర్యాటకమంటే ప్రాణం. వృత్తిరీత్యా నిత్యం ఎన్నో ప్రాంతాలకు తిరుగుతూ ఉండేవారు. ఎన్నో హోటళ్లలో స్టే చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవమే ఇప్పుడు వ్యాపారాభివృద్ధికి దోహదపడుతోంది. “ సిమ్రన్‌కు హోటల్ బిజినెస్ పై అపార అవగాహన ఉంది. ఇష్టమైన హోటల్‌ను ఎంచుకునేందుకు, కార్పొరేట్ క్లయింట్స్‌ను ఆకట్టుకునేందుకు సిమ్రన్ దగ్గర ఎన్నో ప్రణాళికలున్నాయి ” అంటారు రోహిత్. ఇంతకుముందు సిమ్రన్ ఇంటి నుంచే బడ్జెట్ హోటల్ బిజినెస్ FFOURను నడిపించారు.


ఫైండ్ మై స్టే ప్రత్యేకత

ఫైండ్ మై స్టే ఎట్ మై ప్రైస్ (‘Find My Stay @ My Price’) అనేది ఈ స్టార్టప్ ప్రత్యేకత. వినియోగదారుడు తనకు ఎంతలో రూమ్ కావాలో బిడ్ వేసుకుంటారు. అతను ఏ ప్రాంతంలో రూమ్ కావాలనుకుంటున్నారో పేర్కొంటారు. అతను వేసిన బిడ్‌ను హోటల్ యజమానులు అంగీకరించవచ్చు.. లేదా వ్యతిరేకించవచ్చు. “ వినియోగదారుడు అడిగిన రేటుకు రూమ్ ఇచ్చేందుకు అంగీకరించిన హోటళ్లు మాతో సంప్రదిస్తాయి. అప్పుడు రూమ్ బుక్ అవుతుంది. చాలాసార్లు వినియోగదారుడు కోరుకున్న రేటుకు, వాళ్లు కోరుకున్న రూమ్‌లను అందించగలుగుతున్నాం” అంటారు సిమ్రన్. ఫైండ్ మై స్టే (Findmystay) ద్వారా బుక్ చేసుకున్నవాళ్లకు 20-30% తక్కువ రేటుకే రూమ్స్ అందుతున్నాయి. ప్రస్తుతం హోటళ్లు ఆన్ లైన్లో అందిస్తున్న రేటు కంటే ఇది చాలా తక్కువ. ప్రతి బుకింగ్‌కు కమిషన్ విషయంలో కూడా ఆదర్శంగా నిలుస్తోంది ఫైండ్ మై స్టే.

సిమ్రన్ సియాల్, ఫైండ్ మై స్టే సహ వ్యవస్థాపకుడు

సిమ్రన్ సియాల్, ఫైండ్ మై స్టే సహ వ్యవస్థాపకుడు


ఎదురైన సవాళ్లు

“ సాధారణంగా హోటల్ యజమానులు గదుల రేటును నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ మాత్రం వినియోగదారులే తమకు కావాల్సిన రేటును నిర్దేశిస్తారు. దీన్ని హోటల్ యజమానులకు వివరించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పటికే చాలా ఆన్‌లైన్ హోటళ్లు తక్కువ రేట్లకే రూమ్స్‌ను అందిస్తున్నాయి. అయితే ఫైండ్ మై స్టే ద్వారా కోరుకున్న ధరకు రూమ్స్ లభిస్తాయి అనే విషయాన్ని చెప్పడం పెద్ద సవాల్ ” అంటారు సిమ్రన్. దానికితోడు స్టార్టప్ కంపెనీకి నిబద్దతతో పనిచేసే మనుషులను నియమించుకోవడం కూడా పెద్ద ఛాలెంజే.. అయితే ఇద్దరికీ ఓ నమ్మకం కలిగింది. ఒకసారి ఫైండ్ మై స్టే ద్వారా రూమ్ బుక్ చేసుకున్న వినియోగదారుడు సంస్థకు మళ్లీ మళ్లీ తిరిగివస్తాడని..!


ముందుంది మంచికాలం

ఇద్దరూ తాము కూడబెట్టుకున్న డబ్బుతో ఫైండ్ మై స్టే ను ప్రారంభించారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనేది వారి ఆలోచన. భవిష్యత్తులో వ్యాపారరీత్యా ప్రయాణించేవారితోపాటు పర్యాటకులను కూడా పెద్ద ఎత్తున్న ఆకర్షించాలనేది వ్యవస్థాపకుల లక్ష్యం. “ త్వరలో విదేశాల్లోనూ ప్రారంభించాలనుకుంటున్నాం. మొబైల్ ద్వారా బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తాం. అంతేకాక.. రూమ్స్ బుకింగ్ మాత్రమే కాకుండా మరిన్ని సదుపాయాలను కూడా కల్పిస్తాం. అయితే ఆ సదుపాయాలేంటో ఇప్పుడు చెప్పలేం” అన్నారు రోహిత్. వినియోగదారుడికి సేవలందించడమే కాకుకండా.. కార్పొరేట్లకు బిజినెస్ సొల్యూషన్స్ కూడా అందించాలనుకుంటున్నారు. ప్రతి కస్టమర్ కు వీళ్లే ఏకైక మార్గం అనిపించుకోవాలనేది వీళ్ల లక్ష్యం.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags