సంకలనాలు
Telugu

ఆఫ్‌లైన్ డీల్ కింగ్ 'నిఫ్లర్'

యూజర్లకు ఆఫర్లు.. బ్రాండ్ లకు కాసులు..ఈజీ నిఫ్లర్ యాప్ తో యూజర్లు ఫుల్ ఖుషినోటిఫికేషన్ తో ఎప్పటికప్పుడు అప్ టు డేట్ సమాచారం..ముగ్గురు ఐఐటి గ్రాడ్యుయేట్ల కొత్త అధ్యాయం.

ashok patnaik
30th Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

నెట్ ప్రపంచంలో ఈకామర్స్ ఎంత తొందరగా వ్యాపిస్తుందో మనకు తెలిసిందే. అయితే ఇదంతా ఆన్ లైన్ మార్కెట్‌తోనే సాధ్యం. మరి ఆఫ్‌లైన్ సంగతేంటి ? ఇదే వ్యాపార ఆలోచనతో ముగ్గురు ఐఐటి గ్రాడ్యుయేట్లు మొదలు పెట్టిన స్టార్టప్ నిఫ్లర్. ఇదుల్ పటేల్, ప్రిన్స్ అరోరా, విరాజ్ షా ప్రారంభించిన కంపెనీ ఆఫ్‌లైన్ డీల్స్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఫుడ్, డ్రింక్స్, స్పా, అపెరల్స్, హోమ్ డెకోర్ లాంటి ఎన్నో లైఫ్ స్టైల్ నీడ్స్ నిఫ్లర్‌లో కొలువుదీరాయి.

నిఫ్లర్ యాప్

నిఫ్లర్ యాప్


ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లను అనుసంధానం చేస్తూ నిఫ్లర్ బిజినెస్ ముందుకు పోతోంది. నిఫ్లర్ యాప్‌లో దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఉన్న 60వేల స్టోర్స్‌తో మూడువేల ఆఫర్లను ఇస్తూ యూజర్ల డబ్బులను ఆదా చేస్తోంది. ముంబైలోని వంద స్టోర్లతో నిఫ్లర్ టై అప్ చేసుకుంది. ఇందులో మెక్ డొనాల్డ్, అమ్మిస్ బిర్యానీ, బర్డీస్, కెఫే, మోషెస్‌తో పాటు ఫౌంటేయిన్స్ డీ స్ట్రెస్ స్పాలు ఉన్నాయి. నిఫ్లర్ యాప్ అనేది యూజర్లకు ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లను ఇస్తూ దూసుకు పోతోంది.

ఇదుల్ పటేల్, ప్రిన్స్ అరోరా, విరాజ్ షా

ఇదుల్ పటేల్, ప్రిన్స్ అరోరా, విరాజ్ షా


సెయిఫ్ పాట్నర్స్ నుంచి మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ-

ఇటీవల నిఫ్లర్ సెయిఫ్ పాట్నర్స్ నుంచి ఒక మిలియన్ డాలర్ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించగలిగింది. ఆండ్రాయిడ్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ యాప్ 40వేల యూజర్లను పొందడం విశేషం. భవిష్యత్‌లో యూజర్ బేస్‌ని పెంచుకోడానికి ఐఓఎస్ యాప్‌ని కూడా ప్రారంభించామని నిఫ్లర్ ప్రకటించింది.

ఐఓఎస్ కల్గిన యూజర్లు ఎక్కువగా బ్రిక్, మోర్టార్ స్టోర్స్ బెస్ట్ డీల్స్‌ని వెతుకుతున్నారు. ఆఫర్లు ఎవరు ఇచ్చినా దాన్ని విడిచిపెట్టడం లేదు. దీంతోపాటు తమ ఫేవరేట్ బ్రాండ్స్‌ దొరికే యాప్‌ని ఎక్కువగా ఉపయెగిస్తున్నారని విరాజ్ షా అంటున్నారు.

ఫీచర్స్ -

  • యూజర్లకు సౌకర్యవంతంగా ఉండటానికి నిఫ్లర్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్‌డేట్ చేస్తుంది. యూజర్ మాల్‌లోకి ఎంటర్ అయితే.. తన జియో లొకేషన్‌తో యాప్ పై నోటిఫికేషన్ వస్తుంది. ఆ మాల్‌లో ఉన్న లేటెస్ట్ ఆఫర్ల గురించి నోటిఫికేషన్ తెలియ జేస్తుంది.
  • యూజర్లకు డిసౌంట్ కూపన్లు అందుతాయి. ఇందులో నైకి,జారా, లివైస్, ఫరెవర్ 21 తో పాటు షాపర్స్ స్టాప్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్ల కూపన్లు ఉండటం విశేషం. నేరుగా మాల్‌లోకి వెళ్లి కూపన్లను ఉపయోగించుకొనే వెసులు బాటు ఉండటం నిఫ్లర్ లో చెప్పుకో దగిన ఫీచర్
  • రెస్టారెంట్, కెఫేల దగ్గర ఉన్నయూజర్ల కోసం ఎక్స్‌క్లూజివ్ డీల్స్ ఇస్తున్నారు. మాల్‌లోకి ఎంటర్ అవుతున్నప్పుడే అలర్ట్ చేయడంతో పాటు అవి వాడకపోతే ఎక్స్‌పైరీ అయిపోతాయనే విషయాన్ని వివరించే నోటిఫికేషన్ పంపుతుంది నిఫ్లర్.
  • డెబిట్, క్రెడిట్ కార్డుల విషయంలో కూడా నిఫ్లర్ అప్‌డేట్‌గా ఉంటోంది. కొటక్ మహీంద్ర, ఎస్.బి.ఐ, సిటి బ్యాంక్, ఐసిఐసిఐ, హెచ్.డి.ఎఫ్.సి లాంటి కార్డ్‌ హోల్డర్లకు ఎక్కడెక్కడ ఆఫర్లు ఉన్నాయో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది .
  • యూజరు గ్రేట్ డీల్ లేదా మంచి ప్రొడక్ట్ పొందితే నిఫ్లర్ ద్వారా ఆ విషయాన్ని మిగిలిన వారికి షేర్ చేసే అవకాశం ఉంది. తన స్నేహితులకు షేర్ చేయడం ద్వారా యూజర్ కి 200 నిఫ్లర్ పాయింట్లు వస్తాయి. ఈ పాయింట్ల విలువ 20 రూపాయిలు.

కీ లెర్నింగ్ & టీం బిల్డింగ్:

బీటా పరిక్ష సమయంలో నిఫ్లర్ ఓ కొత్త విషయాన్ని గ్రహించింది. యూజర్లు ఆఫర్లను చూస్తారు. అయితే అవి అప్పటికి కాకుండా భవిష్యత్‌లో ఉపయోగపడేలా ఉంటాయా లేదా అనే విషయంతో పాటు లాయల్టీ తీసుకోడానికి సిద్ధంగా ఉన్నారు.

డెవలపర్స్, ఫౌండర్లు ఆలోచించే లాగా యూజర్ ఎప్పుడూ ఆలోచించరనే విషయాన్ని నిఫ్లర్ టీం గ్రహించింది. ఎప్పటికప్పుడు డేటాని దగ్గరగా మానిటర్ చేస్తూ యూజర్‌కి తగినట్లు యాప్‌లో ఫీచర్లను అప్‌డేట్ చేయాలనే విషయాన్ని టీం గుర్తెరిగింది.

నిఫ్లర్ ప్రస్తుం 19 మందితో పనిచేస్తోంది. ఇందులో ఐఓఎస్ డెవలపర్, ఇద్దరు బిజినెస్ డెవలప్‌మెంట్‌లో ఉన్నారు. వీరితోపాటు చాలామంది డేటా కలెక్టర్లు ఉన్నారు.


Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags