సంకలనాలు
Telugu

సువిధా చేతికి హైదరాబాదీ సంస్థ 'ఆసాన్‌పే'

నలుగురు ఇంజనీరింగ్ డ్రాపౌట్స్ ప్రాజెక్ట్ 'ఆసాన్‌ పే'.. మొబైల్ పేమెంట్‌ రంగంలో వినూత్నత..పిఓఎస్ వ్యవస్థ సులభతరం ..పెద్ద పెద్ద మెషీన్ల స్థానంతో చిన్న స్మార్ట్ ఫోన్..చిన్న వ్యాపారస్థులకు ఎంతో ఉపయుక్తం..డీల్ విలువ వెల్లడించిన ఇరు కంపెనీలు..

Nagendra sai
16th Sep 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

హైదరాబాద్ స్టార్టప్స్‌ ఒకొక్కటిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. దేశీయ స్థాయిలో తమ సత్తాను చాటుకుంటూ కొందరు ఫండింగ్ తెచ్చుకుంటే మరికొన్ని సంస్థలు మాత్రం విలీనమవుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మొబైల్ పాయింట్ ఆఫ్ సేల్ కంపెనీ 'ఆసాన్‌పే'ను కొనుగోలు చేస్తున్నట్టు సువిధా ఇన్ఫోసర్వ్ ప్రకటించింది. మొబైల్ పాయింట్ ఆఫ్ సేల్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఆసాన్‌పే మొబైల్ పేమెంట్స్‌ను సులువు చేసింది. ఇప్పటికే ఏడాదికి రూ.8 వేల కోట్లకుపైగా లావాదేవీలు నిర్వహించే సువిధా ఇన్ఫోసర్వ్‌కు ఈ టెక్నాలజీ మరింత ఉపయోగకరంగా ఉండనుంది. బరువైన పాయింట్ సేల్ మెషీన్ల స్థానంలో స్మార్ట్‌ ఫోన్ ద్వారానే లావాదేవీలను నిర్వహించే వీలు కలుగుతుంది. అయితే సువిధ.. ఆసాన్‌పే మధ్య జరిగిన ఆర్థిక వ్యవహారాలపై మాత్రం ఇరు సంస్థలూ వెల్లడించేందుకు నిరాకరించాయి.

సాయినాధ్ గుప్తా, శశాంక్ సహానే, పృధ్వీ - ఆసాన్ పే టీం

సాయినాధ్ గుప్తా, శశాంక్ సహానే, పృధ్వీ - ఆసాన్ పే టీం


2007లో సువిధ సంస్థ ఏర్పాటైంది. రైల్, బస్, ఫ్లైట్ టికెట్లతో పాటు బీమా ప్రీమియం రెన్యువల్, యుటిలిటీ బిల్స్ చెల్లింపు, మొబైల్, డిటిహెచ్ రీఛార్జింగ్ వంటి బి2సి సేవలను అందిస్తూ వస్తోంది. యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో క్యాష్ టు బ్యాంక్ మోడల్‌ను 2007లో సువిధ ప్రాంభించింది. ఎన్‌విపి, షాపూర్‌జీ పల్లోంజీ మిస్త్రీ, అడాగ్ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ క్యాపిటల్, ఐఎఫ్‌సి, మిత్సూయ్ వంటి సంస్థల నుంచి ఫండింగ్ కూడా పొందింది.

అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సేవలను అందించేందుకు ఆసాన్‌పే రూపుదిద్దుకుంది. మొబైల్ ఆధారిత చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేయడం వీళ్ల ప్రత్యేకత. సాయినాధ్ గుప్తా, పృధ్వీ సబ్బు, శశాంక్, శ్రీకాంత్ చక్కిలం బృందం ఈ సంస్థను 2011లో ప్రారంభించారు. సాయినాధ్‌ది సిరిసిల్ల, పృధ్వీది సూర్యాపేట, శ్రీకాంత్‌ది హైదరాబాద్. వీళ్లంతా ట్రిపుల్ ఐటీ ఇంజనీరింగ్ చదువుతుండగా ఈ ఆలోచన తట్టింది. ముందు ప్రోటోటైప్ చేసిన తర్వాత ప్రోడక్ట్‌ను జనాల్లోకి తీసుకెళ్లారు. కిరాణాషాపుల యజమానుల నుంచి మంచి స్పందన రావడంతో ఇంజనీరింగ్‌ను మధ్యలోనే వదిలేసి ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఆసాన్ పే సంస్థకు గతంలో త్వరిత క్యాపిటల్ కూడా నుంచి ఫండింగ్ లభించింది.

సువిధ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 65 కోట్ల కార్డులు ఉన్నాయి, కానీ ఏటిఎంలు మాత్రం 2 లక్షలు, పాయింట్ ఆఫ్ సేల్ ఔట్‌లెట్లు మాత్రం 10 లక్షలే ఉన్నాయి.

''ఈ విలీనం తర్వాత చిన్న వ్యాపారులను చేరుకోవడానికి ఇప్పుడు తమకు మరింత సులభతరం అవుతుందనేది సువిధ విశ్లేషణ. జన్‌ధన్ యోజన కింద ఈ మధ్య విడుదలైన 15 కోట్ల కార్డులను చేరుకోవడానికి మేం వివిధ మార్గాలను అన్వేషిస్తున్నాము. ఇబ్బందులను తొలగించి .. చెల్లింపుల ప్రక్రియను అత్యంత సులువు చేసే ఏ ప్రక్రియ అయినా ఇప్పుడు చాలా ముఖ్యం. ఈ అక్విజిషన్ వల్ల మేం ఎక్కువ మందిని చేరుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని'' సువిధ ఫౌండర్ పరేష్ రాజ్దే వివరించారు.

పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ.2 వేల లోపు లావాదేవీలు సహా నగదు ఉపసంహరణ చేసేందుకు ఆర్బీఐ ఈ మధ్యే వీలుకల్పించింది. ఈ వ్యవస్థ మైక్రో ఏటిఎంలా పనిచేస్తుంది. ఎవరైనా కస్టమర్ షాపులోకి నేరుగా వెళ్లి పిన్ నెంబర్ ఎంటర్ చేసి నగదు తీసుకోవచ్చు. వాళ్ల విద్యను మధ్యో వదిలేసి సాయినాధ్ గుప్తా, పృధ్వీ సబ్బు, శశాంక్ ఈ ఆసాన్ పే ప్రాజెక్టుకు 2011లో శ్రీకారం చుట్టారు.

సాయినాధ్ గుప్తా, ఆసాన్ పే ఫౌండర్

సాయినాధ్ గుప్తా, ఆసాన్ పే ఫౌండర్


''రాబోయే రోజుల్లో మొబైల్ ఓ విప్లవానికి తెరలేపనుంది. మా టెక్నాలజీ వల్ల చిన్న వ్యాపారులు కూడా తమ పిఓఎస్ ద్వారా కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. ఓ స్మార్ట్ ఫోన్, ఓ కార్డ్ ద్వారా చాలా సులువుగా ప్రక్రియ పూర్తిచేయవచ్చని'' ఆసాన్ పే సిఈఓ సాయినాధ్ గుప్తా తెలిపారు.

ప్రస్తుతానికి కొద్ది రోజులు రిలాక్స్ అయిన తర్వాత మరో పెద్ద ప్రాజెక్టుపై దృష్టిసారిస్తామని సాయినాధ్ వివరించారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags