సంకలనాలు
Telugu

ఢిల్లీలో తక్కువ ఖర్చులో కో-వర్కింగ్ స్పేస్

24th Dec 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

సార్థక్ ఛబ్ర, యోగేష్ అరోరా లు కాలేజీ రోజుల నుంచే సొంతంగా వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. పెడోఫిట్ పేరుతో వాళ్లు ప్రారంభించిన హెల్త్ ప్రాడక్టు స్టాన్ ఫార్డ్ గ్లోబల్ ఈ బూట్ క్యాంప్ టాప్ 100లో నిలిచింది. ఈ ప్రాడక్టు కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్యాన్ని మెంటార్ చేస్తూ అనాలసిస్ చేసి రిపోర్టులను పంపుతుంది. అయితే ఇంతకంటే మరింత గొప్ప ఐడియతో ముందుకు వెళ్లాలని ఈ ఆలోచన ఆచరణలోకి రాలేదు.

2014లో కాలేజి నుంచి బయటకు వచ్చిన తర్వాత సార్థక్,యోగేష్ లు ఇద్దరూ వేరు వేరు ఎమ్మెన్సీ కంపెనీల్లో పనిచేస్తూ ఉండేవారు. ఎక్కువ కాలం అది కొనసాగలేదు. కొత్త వెంచర్ ప్రారంభానికే మొగ్గు చూపారు. అయితే తక్కువ ఖర్చులో దొరికే కో వర్కింగ్ స్పేస్ కోసం వాళ్లు వెతుకులాడారు. వీరిలాగానే చాలా మంది ఈ సమస్యను ఎదుర్కోవడం చూశారు. దీంతో ఓ కోవర్కింగ్ స్పేస్ ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అలా తక్కువ ఖర్చుతో కో వర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేసి పరిష్కారం చూపించారు. ఈఏడాది సెప్టెంబర్ లో అల్ట్ కో వర్కింగ్ ను లాంచ్ చేశారు. ఇది స్టార్టప్ , ఫ్రీలాన్సర్స్ లు తక్కువ ఖర్చుతో వర్క్ ప్లేస్ ను షేరు చేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది. తక్కువ ఖర్చుతో రీసోర్సస్ ని ఉపయోగించుకుని పనిచేసుకునే వాతావరణాన్ని కల్పిస్తుంది.

“ ఓయో రూమ్స్ ని వర్కింగ్ స్పేస్ గా వాడటంలాంటి వాటి గురించి ఆలోచించాం. యుటిలైజింగ్ స్పేస్ లను వర్కింగ్ స్పేస్ లుగా మార్చేశాం. ఇప్పటికే గుర్గావ్ లో రెండింటిని ప్రారంభించాం. మనో నెలలో సెంట్రల్ ఢిల్లీలో మరొకటి ప్రారంభిచాలని అనుకుంటున్నాం” సార్థక్

పెట్టుబడి, ఆదాయ వనరు

మార్కెటింగ్ కు 10వేల రూపాయిలు ఖర్చు చేశారు. రియల్ ఎస్టేట్ పై ఎలాంటి పెట్టుబడి పెట్టలేదు. డెయిలీ, వీక్లీ, మంత్లీ పేమెంట్స్ ద్వారా ఆదాయం వస్తుంది. వీళ్ల సర్వీస్ టీం నుంచి కస్టమర్లకు కావల్సిన సేవలను అందించి వాటిద్వారా కూడా ఆదాయాన్ని సమకూరుస్తున్నారు.

“సాధారణ కో వర్కింగ్ స్పేస్ నెలకు 7 నుంచి 8 వేల మధ్యలో లేదా రోజుకి 6 నుంచి 8 వందల మధ్యలో వసూలు చేస్తుంటే మేం మాత్రం 5 వేలు నెలకు, 200రోజుకి వసూలు చేస్తున్నాం. ఢిల్లీలో ఎవరైనా ఈ ధర పెట్టగలరు,” సార్థక్

రెండు నెలల్లోనే నెలకు లక్షన్నర ఆదాయం వచ్చే స్థాయికి కంపెనీ ఎదిగింది. 30 శాతం పెరుగుదలను కనపరిచంది.

image


ఎదుగుదల, అధిగమించాల్సిన అంశాలు

సరైన కస్టమర్లను గుర్తించడం చాలా కష్టమైన పని. మా పోర్ట్ ఫోలియోతో ఆన్ లైన్ ప్లాట్ ఫాంలోనే క్లయింట్స్ ని సాధించుకున్నాం. కానీ వారిని ఆఫ్ లైన్ లోనే మేం ఒప్పించుకున్నాం. మాతో వ్యాపారం చేయడానికి సిద్ధపడిన సంస్థల ప్రాడక్టులకు ఆఫ్ లైన్ కస్టమర్లను వెతికి పెట్టే బాధ్యత మేం తీసుకున్నాం. అలా వారి ప్రాడక్టులు అమ్ముడు పోవడం వల్ల వారికి లాభదాయంకంగా ఉండటం వల్ల మాతో కలసి పనిచేయడానికి సిద్ధపడుతున్నారు.

మార్కెట్, పోటీదారులు

నాస్కామ్( NASSCOM) చెప్పే దాని ప్రకారం 3100 స్టార్టప్ లు భారత్ లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇది మూడో స్థానంలో ఉంది. ఏడాదికి 800 స్టార్టప్స్ ప్రారంభమవుతున్నాయి. 2020 నాటికి ఈ సంఖ్య 11,500 చేరుతుంది. 2 లక్షల 50వేల మందికి ఉద్యోగ భద్రత కల్పిస్తుంది.

మొబైల్ వర్కర్లు, స్టార్టప్ లను పక్కనపెడితే ఫ్రీలాన్సర్స్ సంఖ్య కూడా గణనీయంగానే పెరిగింది. వర్క్ ఎన్ హైర్, ఫ్రీలాన్సర్స్ డాట్ ఇన్, అప్ వర్క్ లో నమోదైన వారి సంఖ్య భారత్ లో లక్షకు పైమాటే. అప్ వర్క్ డేటా బేస్ ప్రకారం తొమ్మిది మిలియన్ల మంది ఫ్రీలాన్సర్స్ ఉన్నారు. వీరంతా తమ కో వర్కింగ్ స్పేస్ కు పొటెన్షియల్ కస్టమర్లని సార్థక్ అంటున్నారు.

కోవర్కింగ్ స్పేస్ లో 91 స్ప్రింగ్ బోర్డ్, స్టిర్రింగ్ మైండ్స్ ఇన్వెస్టోప్యాడ్ లు అతిపెద్ద పోటీదారులు. అయితే ఇవి అతిపెద్ద ప్లేయర్లు. బ్రీతింగ్ రూం, మై క్యూట్ ఆఫీస్ లాంటివి ఓ మోస్తరు పోటీదారులు. ఇవన్నీ వెల్ నోటెడ్ కో వర్కింగ్ స్పేస్ లు. ఈ సెగ్మెంట్ లో వీటి నుంచి పోటీ ఉంటుంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags