సంకలనాలు
Telugu

ఆర్డరివ్వండి.. ఆర‌గించండి! క‌మ్మ‌టి భోజ‌నం వ‌డ్డిస్తున్న గ్రాబ్ యువ‌ర్ ఫుడ్ !!

7th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఆఫీసు లంచ్ అవర్ లో కుటుంబరావులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. హాయిగా ఇంటి భోజనం కానిచ్చేస్తారు. మరి తాడూ ఉంగరం లేని బ్రహ్మచారుల పరిస్థితి ఏంటి? అందునా ఐటీ సెక్టార్‌లో పనిచేసే బ్యాచిలర్లు లంచ్ కోసం జేబులు ఖాళీ చేసుకోవాల్సిందేనా? అలాంటి వారి కోసమే వచ్చాయి ఫుడ్ టెక్ లు! అందులో ఒకటే గ్రాబ్ యువర్ ఫుడ్! దాని సృష్టిక‌ర్త‌లే ఈ న‌లుగురు!

imageఫుడ్ టెక్ స్టార్టప్స్! ఈ మ‌ధ్య కొత్తగా వినిపిస్తున్న ప‌దం. మ‌సాలా బాక్స్, ఫ్రెష్ మెనూ, స్విగ్గీ, హోలా చెఫ్.. తాజాగా గ్రాబ్ యువర్ ఫుడ్! ఇవ‌న్నీ ఫుడ్ టెక్ స్టార్టప్ లే! ‌కోరుకున్న డిషెస్ ను కోరుకున్న రెస్టారెంట్ నుంచి తెచ్చిపెట్టడమే వీటి స్పెషాలిటీ. స్వయంగా వండి ప్లేట్ లో స‌ర్వ్ చేసేవి కూడా ఉన్నాయి. 

గ్రాబ్ యువర్ ఫుడ్ గురించి

ఇది న‌లుగురు కేర‌ళ‌ యువకుల క‌ల‌. కొచ్చి కుర్రోళ్లు రౌష‌న్ కేపీ, అశ్విన్ రాజ్, రిజిత్ రామ్ దాస్, ఆనంద్ రాజ్. ఈ నలుగురూ క‌లిసి 2014 డిసెంబ‌ర్ లో గ్రాబ్ యువర్ ఫుడ్ ను స్టార్ట్ చేశారు. అసలే స్టార్టప్ కంపెనీ. అందునా మార్కెట్లో విప‌రీత‌మైన పోటీ. అవ‌న్నీ త‌ట్టుకొని నిల‌బ‌డాలంటే కంపెనీని డిఫ‌రెంట్ గా రన్ చేయాలి. అందుకోసం ఏం చేయాలని ఆలోచించారు. గ్రాబ్ యువర్ ఫుడ్ ను మిగ‌తా వాటికి భిన్నంగా మెయింటెయిన్ చేయాల‌ని డిసైడ‌య్యారు.

క్ష‌ణాల్లో కోరిన రుచులు..

ప్యాకింగ్ నుంచి డెలివ‌రీ దాకా గ్రాబ్ యువర్ ఫుడ్ ది ప్రత్యేక విధానం. చెప్పిన‌ టైమ్ కి కోరిన ఫుడ్ తెచ్చిపెడ‌తారు. చికెన్ వంట‌కాలు, ద‌క్షిణాది డిషెస్, బర్గర్లు, వెజ్ వెరైటీస్- ఇలా చెప్పుకుంటూ పోతే మెనూ పెద్దదే. కస్టమర్ల నుంచి వ‌చ్చిన ఆర్డర్స్ ను రెస్టారెంట్లకు ఫార్వర్డ్ చేస్తారు. ఫుడ్ డెలివరీకి రెస్టారెంట్ బాయ్స్ ని కూడా వినియోగించుకోవడం వీరి ప్రత్యేకత. మనీకి మనీ, టైంకి టైం రెండూ కలిసి వస్తాయన్నదే ఈ కుర్రోళ్ల ఆలోచన.

సవాళ్ల స్వాగతం..

ఇప్పుడున్న దిగ్గజ కంపెనీల్లాగే గ్రాబ్ యువ‌ర్ ఫుడ్ కూడా మొదట్లో స‌వాళ్లు ఎదుర్కొంది. కొత్తలో రోజుకు ఐదూ పదీ కంటే ఎక్కువ ఆర్డర్లు వచ్చేవి కాదు. మంచి క్వాలిటీ మెయింటెయిన్ చేయ‌డంతో మూడు నెల‌ల్లోనే బిజినెస్ పుంజుకుంది. మొద‌ట్లో నలుగురు కుర్రోళ్లే బిజినెస్ అంతా చూసుకునే వారు. ఫోన్ లో ఆర్డర్ తీసుకోవడం, డెలివ‌రీ చేయ‌డం వగైరా వగైరా పనులన్నీ చేసేవారు. 2015 మార్చిలో తొలి ఉద్యోగిని నియ‌మించుకున్నారు. మెల్లగా స్టాఫ్ పెరిగింది. చూస్తుండ‌గానే గ్రాబ్ యువ‌ర్ ఫుడ్ 20 రెస్టారెంట్లతో టై అప్ అయింది. ఇప్పుడు కొచ్చిలో రోజూ 100 నుంచి 130 ఆర్డర్లు వ‌స్తుంటాయి. 15 మంది దాకా డెలివ‌రీ స్టాఫ్ ఉన్నారు. గ్రాబ్ యువ‌ర్ ఫుడ్ ప్రతి నెలా 20 నుంచి 25 శాతం బిజినెస్ వృద్ధి సాధిస్తోంది.

మొదట్లో క‌ష్టంగానే ఉండేది. స్టాఫ్ ఉండేవాళ్లు కాదు. న‌లుగుర‌మూ ప‌నిని పంచుకునేవాళ్లం. మెల్లగా బిజినెస్ మెరుగుప‌డింది. ఫుడ్, రెస్టారెంట్ల ఎంపిక‌ విష‌యంలో కస్టమర్లకు స‌ల‌హాలిచ్చే ఎక్స్ ప‌ర్ట్స్ ఇప్పుడు మా దగ్గర ఉన్నారు. ఆర్డర్ అందిన 45 నిమిషాల్లోగా డెలివ‌రీ ఇచ్చేస్తాం. మిడ్ నైట్ బ‌ర్త్ డే కేక్స్ డెలివ‌రీ ఫెసిలిటీ కూడా మా ద‌గ్గరుంది- రౌష‌న్

ముందు పట్టణాలు, ఆపై మెట్రోలు...

ప్రస్తుతం కొచ్చిలో రెండు చోట్ల గ్రాబ్ యువర్ ఫుడ్ పాయింట్లు ఉన్నాయి. వ్యాపార విస్తరణకు కంపెనీ స‌న్నాహాలు చేస్తోంది. మార్కెట్లో పోటీ దృష్ట్యా ముందుగా చిన్న పట్టణాల్లో సేల్స్ పాయింట్లు తెర‌వాల‌ని నిర్ణయించింది. కేర‌ళ అంతా సర్వీస్ అందుబాటులోకి తీసుకొచ్చి, అన్నీ కలిసొస్తే కోయంబ‌త్తూరు, మంగ‌ళూరుకు వ్యాపారాన్ని విస్తరించాలన్నది ప్లాన్. 2016 చివ‌రిక‌ల్లా మెట్రో న‌గ‌రాల‌కు రీచ్ కావాల‌న్నదే గ్రాబ్ యువ‌ర్ ఫుడ్ టార్గెట్!

వ‌చ్చిన ప్రతీ ఆర్డర్ మీద 10 నుంచి 12 శాతం క‌మీష‌న్ ఇవ్వాల‌ని మొద‌ట్లో ప్రపోజల్ పెట్టాం. ఎందుకో క‌స్టమర్ల నుంచి పెద్దగా స్పంద‌న రాలేదు. దాంతో కొన్ని రెస్టారెంట్ల నుంచి మాత్రమే ఫుడ్ ఐట‌మ్స్ డెలివ‌రీ ఇవ్వాల్సి వ‌చ్చేది- రౌష‌న్

ఆర్డర్లు ఇలా..

కస్టమర్లు గ్రాబ్ యువ‌ర్ ఫుడ్ వెబ్ సైట్ లో లేదా ఫోన్ కాల్ ద్వారా అయినా ఆర్డర్ ఇవ్వొచ్చు. లేదంటే నేరుగా రెస్టారెంట్ ను కాంటాక్ట్ చేసినా స‌రిపోతుంది. ప్రస్తుతం గ్రాబ్ యువ‌ర్ ఫుడ్ మొబైల్ యాప్ తీసుకొచ్చే ప‌నిలో ఉంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ లో యాప్ అందుబాటులోకి రానుంది.

యువ‌ర్ స్టోరీ టేక్..

స్పూన్ జాయ్, డాజా కంపెనీలు మూతపడటంతో ఫుడ్ టెక్ రంగంలో కాస్త నిరాశ కమ్ముకున్న మాట వాస్తవమే. ఫుడ్ పాండా, టైనీఓవెల్ ప‌డ్డ క‌ష్టాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రోజుకు 300 ఆర్డర్లు వస్తే ఫరవా లేదు గానీ ఆ సంఖ్య దాటితేనే అసలైన సవాలు. టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తున్న ఫుడ్ బిజినెస్ లకు దూకుడు అవ‌స‌ర‌మంటారు సీడ్ ఫండ్ వెంచ‌ర్ పార్ట్ న‌ర్, ప్ర‌ఖ్యాత మెంటార్ సంజ‌య్ ఆనంద్ రామ్. 

మామూలుగా చాలా స్టార్ట‌ప్ లు ఒకేసారి దేశమంత‌టినీ కాకుండా కొద్దిపాటి జ‌నాభాను ల‌క్ష్యంగా పెట్టుకొని మొద‌లవుతుంటాయి. ఫుడ్ స్టార్ట‌ప్ ల‌ను జ‌నానికి అల‌వాటు చేయాలంటే క‌నీసం ఒక త‌ర‌మైనా మారాలి, లేదా ఆ కంపెనీ ప‌దేళ్లు ఫీల్డ్ లో అయినా ఉండాలి అన్న‌ది సంజ‌య్ అభిప్రాయం. మంచి డిమాండ్ ఉంది కాబ‌ట్టి, ఫుడ్ టెక్ రంగాన్ని బాగా ఆక‌ళింపు చేసుకున్న త‌ర్వాతే రంగంలోకి దిగాలి. కానీ జ‌నం వెర్రిగా ఫుడ్ టెక్ ల‌కు అల‌వాటైపోతార‌ని చాలా మంది ఇన్వెస్ట‌ర్ల భావన. అటు పెద్ద‌గా అడ్డంకులు లేని రంగం కాబ‌ట్టి ఫుడ్ టెక్ లోకి ఈజీగా ఎంట‌ర్ కావొచ్చ‌ని ఇన్వెస్ట‌ర్లు కూడా అనుకుంటారు. కానీ ఏ ఫుడ్ బిజినెస్ అయినా క‌నీసం ద‌శాబ్దం పాటు నిల‌దొక్కుకోవాలని, అందుకు ఒక పాష‌న్ ఉండాల‌ని ఇండియా కోషెంట్ ఫౌండ‌ర్ ఆనంద్ లూనియా విశ్లేషిస్తారు.

కేర‌ళకే చెందిన మ‌రో ఫుడ్ టెక్ కంపెనీ మ‌సాలా బాక్స్ అంచ‌లంచెలుగా ఎదిగి బెంగ‌ళూరుకు వ్యాపారాన్ని విస్త‌రించింది. గ్రాబ్ యువ‌ర్ ఫుడ్ కూడా అదే బాట‌లో ప‌య‌నిస్తుందా, లేదా త‌న‌కంటూ ఇంకా ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకుంటుందా చూడాలి!

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags