సంకలనాలు
Telugu

4 నగరాల పిచ్ లపై బౌన్సర్లకు రెడీ అయిన ‘స్టార్టప్ క్రికెట్ లీగ్’

9th May 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


4 నగరాలు, 44 రోజులు, 444 స్టార్టప్ లు, 4,444 మంది పార్టిసిపెంట్స్. ఓ మెగా స్టార్టప్ ఈవెంట్. గతేడాది హైదరాబాద్ లో మొదలైన ఈ స్టార్టప్ క్రికెట్ లీగ్ ఇప్పుడు ఢిల్లీ, బెంగళూరు, జైపూర్ నగరాల్లో కూడా జరగనుంది. స్టార్టప్ చర్చలు, ఎక్స్ పో, రివర్స్ పిచింగ్ లాంటి అన్ని హంగులు ఇక సరేసరి. క్రికెట్ మ్యాచ్ లు దీనికి అదనపు ఆకర్షణ కాగా. స్టార్టప్ ఫండింగ్ లాంటివి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి.

సీడ్ రౌండ్ నుంచి వెంచర్ రౌండ్ దాకా

క్రికెట్ లీగ్ కదా అని నాకౌట్, సెమీ ఫైనల్ లాంటి రౌండ్ లు ఉంటాయనుకుంటే పొరపాటే. స్టార్టప్ ఫండింగ్ రౌండ్లను ఇక్కడ రెప్లికా పేర్లున్నాయి. సీడ్ రౌండ్ తో ఈవెంట్ మ్యాచ్ లు ప్రారంభమవుతాయి. అందులో గెలిచిన స్టార్టప్ టీంలు ఏంజిల్ రౌండ్ కు చేరుకుంటాయి. మొదటి రౌండ్ లో 16 టీంలు తలపడతాయి. అక్కడి నుంచి 8 టీంలు ఏంజిల్ రౌండ్ లోకి ప్రవేశిస్తాయి. ఇందునుంచి నాలుగు టీంలు వెంచర్ రౌండ్ లోకి వస్తాయి. దీని నుంచి రెండు టీంలు బయటకు వస్తాయి. వీరికి ఫైనల్ జరుగుతుంది. అయితే అన్ని టీంలోని కొంతమంది ప్లేయర్లు కలసి ఇన్వెస్టర్స్ టీంతో మరో మ్యాచ్ జరగనుంది.

image


‘స్టార్టప్ లకు ఈ ఈవెంట్ ఒక అద్భుత మైన అవకాశం, అంతా వినియోగించుకోవాలి’- సాయి

ఎస్ సి ఎల్ ఫౌండర్ అయిన సాయి గతేడాది హైదరాబాద్ లో ఈవెంట్ ని సక్సెస్ ఫుల్ గా చేపట్టారు. ఇదే స్పూర్తితో మరో మూడు నగరాలకు విస్తరించారు. భవిష్యత్ లో మరిన్ని నగరాలకు వ్యాపిస్తామని అంటున్నారు.

స్టార్టప్ టాక్స్

స్టార్టప్ టాక్స్ లో ప్రతి స్టార్టప్ కు అవకాశం కల్పిస్తున్నారు. సీడ్ రౌండ్ మ్యాచ్ లు ముగిసిన తర్వాత ఈ టాక్స్ ప్రారంభమవుతాయి. తర్వాత తిరిగి మళ్లీ మ్యాచ్ లు ఆ తర్వాత టాక్స్ కొనసాగనున్నాయి. చివరి మ్యాచ్ స్టార్టప్ పవర్ ప్లే మ్యాచ్ వరకూ ఇవి జరగుతాయి. విద్యార్థులు ఇతర స్టార్టప్ తొలిదశలో ఉన్న ఔత్సాహికులకు ఇది గొప్ప అవకాశం. ఇప్పటి వరకూ 60 స్టార్టప్ లనుంచి అప్లికేషన్స్ వచ్చాయి. ఈవెంట్ జరగడానికి మరో మూడు నెలల టైం ఉంది. మా అనౌన్స్ మెంట్ తోనే రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉందని సాయి చెప్పుకొచ్చారు. ఫ్రీచార్జ్ లాంటి బడా సంస్థలు మాతో కలవడం, మ్యాచ్ ఆడటానికి సిద్ధపడటం ఎస్ సి ఎల్ కు మరింత గుర్తింపు తెస్తుందని అన్నారు.

రివర్స్ పిచింగ్ మరో కీ ఈవెంట్

ఈవెంట్ లో రివర్స్ పిచింగ్ ఓ సూపర్ అపార్చునిటీ అని సాయి అంటున్నారు. అయితే దీని పేరు ఇంకా ఆలోచిస్తున్నాం. ఇందులో ఇన్వెస్టర్ లు తమ కంపెనీ గురించి స్టార్టప్ ల ముందు ప్రజెంట్ చేస్తారు. వారు చెప్పే క్వాలిఫికేషన్స్ స్టార్టప్ లకు ఉంటే అక్కడే అప్లై చేసుకోచ్చని చెప్పారు.

‘అన్ని కలసి వస్తే ఫండింగ్ వస్తుంది, ట్రై యువర్ లక్’- సాయి
image


రివర్స్ పిచింగ్ తో ఫండింగ్ వస్తుందని చెప్పలేం. కానీ రాడానికి అవకాశం లేదని మాత్రం కూడా చెప్పలేమని అన్నారు సాయి. ఇన్వెస్టర్లు గురించి తెలుసుకొని స్టార్టప్ లు అప్రోచ్ కావొచ్చు. ఈ ప్లాట్ ఫాం మా ఈవెంట్ లో కల్పిస్తున్నమని అంటున్నారు.

ఫౌండర్స్ పెవిలియన్

ఐపిఎల్ సెలబ్రిటీలు కూర్చోడానికి ప్రత్యేక పెవీలియన్లు ఉన్నట్లు ఎస్ సిఎల్ లో ఫౌండర్స్ పెవీలియన్ ఉంటుంది. విద్యార్థులు, ఇతర అటెండీస్ ఫౌండర్లను కలిసే అవకాశం ఉంటుంది. మార్కెట్ లో ఉన్న బిగ్ బ్రాండ్స్ కి సంబంధించిన ఫౌండర్లు ఇక్కడ కొంత సమయం కేటాయిస్తారు. వాళ్లొచ్చినప్పుడు పేర్ల అనౌన్స్ మెంట్ ఉంటుంది. దాని ప్రకారం వారిని కలవొచ్చని సాయి చెప్పారు. బెంగళూరులో ఆగస్టు 6న సార్టప్ క్రికెట్ లీగ్ మొదలువుతుంది. అదే నెల 20న ఢిల్లీలో ఈవెంట్ జరుగుతుంది. సెప్టెంబర్ 3న జైపూర్ లో మ్యాచ్ లు జరుగుతాయి. అనంతరం హైదరాబాద్ లో 17న జరుగుంది. ఆ తర్వాత రోజు గ్రాండ్ ఫినాలే జరుగుంది. ఒక్కో సిటీలో 100 స్టార్టప్ లు, 16 టీంలు, విద్యార్థులు, ఇతర అటెండీస్ కలిపి దాదాపు 1000నుంచి 1500మంది దాకా వస్తారని అంచనా.

స్టార్టప్ ఎక్స్ పో, ప్రజెంటేషన్

అన్ని నగరాల్లో స్టార్టప్ ఎక్స్ పో ఉండబోతోంది. 30 నుంచి 40 స్టాల్స్ ఈ ఎక్స్ పోలోకి రానున్నాయి. దీంతో పాటు నెట్ వర్కింగ్ కోసం ప్రతి సిటీలో ఓ సక్సెస్ ఫుల్ స్టార్టప్ కు ఎంట్రీ ఇస్తున్నాం. దీంతో మార్కెట్ లోకి అప్పుడే ఎంట్రీ ఇచ్చిన స్టార్టప్ లకు నెట్ వర్కింగ్ ఏర్పడుతుంది. ఓయో రూమ్స్, గ్రోఫర్స్, సిట్రస్ లాంటి నేమ్స్ మనకు బెంగళూరులో పాల్గొనే స్టార్టప్ లని సాయి అంటున్నారు. అన్ని టీంల నుంచి కొంతమందితో ఒక టీం ఏర్పాటు చేస్తాం. వీరితో ఇన్వెస్టర్ టీం మ్యాచ్ ఆడుతుంది. ఇది చివరి మ్యాచ్. దీన్ని స్టార్టప్ పవర్ ప్లేగా నామకరణం చేస్తామని సాయి అంటున్నారు. ఈ మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ క్లోజింగ్ సెర్మనీ ఉంటుందని అన్నారు.

image


“క్రికెట్ ఒక మతంగా భావించే భారత దేశంలో స్టార్టప్ ఈవెంట్ కూడా క్రికెట్ తో మిళితమై ఉండటం కొత్త విషయం కాకపోవచ్చు. కాని నెట్ వర్కింగ్ ను ప్రొత్సహించే ఇలాంటి ఈవెంట్ ను ఆర్గనైజ్ చేయడం మాకు దొరికిన అవకాశంగా భావిస్తున్నామని ముగించారు సాయి”
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags