సంకలనాలు
Telugu

కస్టమర్ నుంచి బ్రాండ్ క్రియేటర్ అయిన ఇషితా శర్మ

పిచ్చిపిచ్చిగా షాపింగ్ చేసే అలవాటుబ్రాండ్లంటే మోజు, డిజైన్స్ అంటే ప్యాషన్సొంత బ్రాండ్ కోసం పాకులాటబాలీవుడ్ తారలకు డ్రస్సెస్ అందించే స్థాయికి ఎదిగిన ఇషిత

26th Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఇషితా శర్మకి విపరీతంగా షాపింగ్ చేయడమంటే హాబీ. తాను షాపోహాలిక్‌ని అని చెప్పుకోడానికి ఏ మాత్రం సిగ్గుపడని వ్యక్తి. ఇప్పటి ప్రొఫెషన్ ప్రకారం... గతంలో ఆమె ఖచ్చితంగా అలా ఉండాల్సిందే. అయితే ఇలాంటి హాబీ ఉన్న మిగతావారంతా విపరీతంగా ఖర్చు చేయడంలో ఉండిపోయినా.. ఇషిత మాత్రం దీన్నుంచి బయటపడ్డానికో మార్గం అన్వేషించారు. ఓ స్టార్టప్ కంపెనీతో తానే విక్రయించడం మొదలుపెట్టారు. 

కాండిడ్టీ కుటూర్ ఉత్పత్తులు

కాండిడ్టీ కుటూర్ ఉత్పత్తులు


"నేనిప్పటికీ షాపోహాలిక్‌నే, అనేక వెబ్‌సైట్లలో గంటలకొద్దీ, స్టోర్ల చుట్టూ రోజుల పాటు తిరుగుతాను. ఏదైనా ఫంక్షన్‌కో, పండక్కో తగిన డ్రస్ దొరక్కపోతే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే నాకు నచ్చిన డ్రస్సులకు సంబంధించిన వివరాలుండేలా ఓ ఫేస్‌బుక్ పేజ్ ప్రారంభించా. దీనికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నా టేస్ట్‌కు మ్యాచ్ అయ్యేవారు చాలామందే ఉన్నారని నాకప్పుడే అర్ధమైంది. అంతే... నెక్స్ట్ ఇంకేముంది నాకు తగినట్లుగా షాపింగ్ చేసుకునే అలవాటున్నవారి కోసం ఓ పోర్టల్ ప్రారంభించా"- ఇషితా శర్మ
ఇషితా శర్మ, కాండిడ్లీ కౌటూర్

ఇషితా శర్మ, కాండిడ్లీ కౌటూర్


ఇప్పుడు ఇషితా శర్మ కాండిడ్లీ కూటూర్ వ్యవస్థాపకురాలు, సీఈఓ కూడా. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యాషన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఇది కూడా ఒకటి. కొద్దికాలంలో జీవితం తిరిగిన మలుపులు ఆమె గుర్తు చేసుకోవాడనికి సంకోచించలేదు. " యూనివర్సిటీ ఆఫ్ డెన్వర్‌లో గ్రాడ్యుయేషన్ చదివాక కొన్ని ఉద్యోగాలు చేశాను. నా ఐడియా అప్పుడు ఎంబీయే చేయడమే. జీవితంలో ఇలా చేయాలని, ఫలానా సాధించలనే లక్ష్యాలేవీ లేవప్పుడు. ఓ మీడియా సంస్థలో ఎంట్రీ లెవెల్ ఉద్యోగంలో ఉన్నపుడు ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకునేందుకు చాలా టైం ఉండేది. ఆ సమయంలోనే ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, ఫ్యాషన్ బ్లాగ్‌లు సందర్శించేదాన్ని. ఆ సమయంలో దేవి పరిచయమయ్యారు. అతను వాల్‌స్ట్రీల్‌లో పనిచేస్తున్నా.. దాన్ని వదిలేసి కాండిడ్లీ కూటూర్ కోసం వచ్చేయడంవిశేషం"-ఇషితా

దేవి, కాండిడ్లీ కూటూర్ సహ వ్యవస్థాపకుడు

దేవి, కాండిడ్లీ కూటూర్ సహ వ్యవస్థాపకుడు


లేబర్ ఆఫ్ లవ్

కాండిడ్లీ కూటూర్ అంటే ఇషితాకు విపరీతమైన ఇష్టం. నిజానికి మన దేశంలో యువతులను టెంప్ట్ చేసే ఫ్యాషన్ పోర్టల్స్‌కు కొరతేం లేదు. కానీ ఈ రేస్‌లో తన మార్క్ కోసం తాపత్రయపడ్డారామె. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యాషన్ ప్రపంచంలో కొత్తదనం పరిచయం చేసి నిలబడేందుకు చాలా శ్రమించారు ఇషిత. 

“ఒక డ్రస్ డిజైన్ చేసేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. సాధారణమైన డ్రస్ వేసుకున్నా! అనే ఆలోచన రాకుండా ఉండేలా చూస్తాం. ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపించేలా, పదిమందీ ఆమె టేస్ట్‌ను అభినందించేలా ఉండాలని భావిస్తానం”టారు ఇషిత.

కాండిడ్లీ కూటూర్ క్రియేటివ్ టీంకి బాలీవుడ్, హాలీవుడ్‌లే ఇన్‌స్పిరేషన్. ఆ రెండింటికీ మధ్య స్థాయిలో తమ డ్రస్సుల డిజైన్లు ఉండేలా చాలా అప్రమత్తంగా ఉంటారు. ట్రెండ్‌కి తగినట్లుగా హైఎండ్ సొసైటీకి వీలుగా సొంత డిజైన్లు ఉండేందుకు వాళ్ల శ్రమ పడ్డారు. ఈ క్రియేటివ్ టీంలో ఇషితా శర్మదే మేజర్ రోల్. “ఎప్పటికప్పుడు ట్రెండ్‌ను క్యాచ్ చేయాలి. కస్టమర్ల అభిరుచులు దృష్టిలో పెట్టుకోవాలి. వారి ఊహలకు, కోరికలకు తగినట్లుగా డిజైనింగ్ చేయగలగాలి. కొన్నిసార్లు ఏంచేసినా ఫలితం దక్కకపోవచ్చు. అలాగని నన్ను, నా ఆలోచనను తప్పు పట్టలేను. ఒకటి ఫెయిలైతే దాన్ని వదిలేస్తా. ఫెయిల్యూర్‌ని మర్చిపోతా. పదడుగుల స్తంభం ఎక్కాలంటే కొన్నిసార్లు జారక తప్పదు కదా” అని వివరిస్తారు ఇషితా

డీల్స్, డిస్కౌంట్లు కాదు... డ్రస్సులు, డిజైన్లే ముఖ్యం

సరైన భాగస్వామి ఎంపికకోసం దాదాపు ఏడాదిన్నర పట్టింది. హై క్వాలిటీ ఫ్యాబ్రిక్, గొప్ప డిజైన్ల కోసం మంచి డీల్స్ కోసం విపరీతంగా అన్వేషించాల్సి వచ్చింది. డైరెక్టుగా స్టోర్ల ద్వారా అమ్మేందుకు వీళ్ల వ్యతిరేకం. సొంత బ్రాండ్ ద్వారానే విక్రయించాలనే లక్ష్యంతో కాస్త టైం తీసుకున్నా.. చివరకు సంస్థను ఏర్పాటు చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే డీల్స్, డిస్కౌంట్లను బేస్ చేసుకుని కాండిడ్లీ కోచర్ పోర్టల్‌ని నడపకపోవడం. మొత్తం అమ్మకాల్లో దాదాపు 95శాతం పూర్తి రేట్లకే విక్రయించిందీ కంపెనీ. కస్టమర్లకు వీలైనంతగా ప్రయోజనాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామంటారు ఈ టీం. మా డ్రస్సులు, డిజైన్లతోనే మమ్మల్ని గుర్తించాలి. అంతే తప్ప డిస్కౌంట్లని చూసి కాదంటారామె.

అప్పుడు - ఇప్పుడు

"2013లో మేం సంస్థను ప్రారంభించినపుడు చాలా విషయాలు ప్రతిబంధకంగానే కనిపించాయి. రవాణా, ఆన్‌లైన్ పేమెంట్ వంటివన్నీ మన దేశంలో ఇంకా ప్రారంభస్థాయిలోనే ఉన్నాయి. సరైన లాజిస్టిక్స్, పేమెంట్ గేట్‌వే సంస్థలు మన దగ్గర కరవే. ఇప్పుడు అంతో ఇంతో ఈకామర్స్ అభివృద్ధి చెందింది. కస్టమర్లనుంచి కొంత సపోర్ట్ ఉన్నా.. ఇప్పటికీ ప్రజల్లో దీనిపై చాలా అనుమానాలున్నాయి. నా చాలా అలోచనలు అమల్లో పెట్టడానికి సమయం చిక్కింది అపుడే" అంటారీ యువ మహిళా పారిశ్రామికవేత్త.

“ తర్వాత ఎదురైన మరో సవాల్... ఇప్పుడిప్పుడే మొబైల్ కామర్స్‌కి కస్టమర్ల దృష్టి మారడం. వెబ్‌సైట్ల కంటే మొబైల్‌లోకి చేరగలిగితే... కస్టమర్లకు మరింత చేరువవుతామని మాకు తెలుసు. అందుకే మొబైల్ సైట్ తయారీని ఎంతో ఉత్సాహంగా, వేగంగా పూర్తి చేసి లాంఛ్ చేశాం."-ఇషితా శర్మ

ఇండియన్ ఈకామర్స్‌లోకి ప్రవేశించేందుకు ఇది సరైన సమయమని ఇషిత భావించారు. “అంతర్జాతీయంగా ఈకామర్స్ అభివృద్ధి చెందుతోంది. ఇండియాలో ఇది మరింత వేగంగా జరిగే అవకాశముందని భావించా. చిన్నస్థాయి పట్టణాల వరకూ ఫ్యాషన్ అంటే పడిచచ్చే దేశం మనది. అలాగే భారతీయ సామాజిక, మౌలిక వసతులు కూడా వేగం పుంజుకున్నాయి. ఈదశలో ఈ-కామర్స్ మరింతగా రాటుదేలుతుందని నాకు ముందే తెలుసం'టారు ఇషిత.

ఫ్యాషన్ అంటే ఒక్క రోజులో మొహం మొత్తేది కాదు. రోజుకొకటి మోడల్, డిజైన్ చొప్పున కాలానుగుణంగా మారిపోతోంది. అయినా సరే భారతీయ మహిళల ఫ్యాషన్ కల్చర్‌ని అందుకోవాలనుకున్నాం. అందుకు వీలుగా ప్రణాళికలు రచించాం"

ప్రారంభమైన అనతి కాలంలోనే కాండిడ్లీ కోచర్ బాగా అభివృద్ధి చెందింది. “కంపెనీ పనితీరు, అభివృద్ధిని రోజూ పరిశీలించుకునేవాళ్లం, మేం ఆశించిన స్థాయికంటే ఎక్కువగా కస్టమర్లు మాకు దగ్గరయ్యారు. ఇందులో హైలైట్ ఏంటంటే.. మేమెవరో తెలీకపోయినా.. మమ్మల్ని నమ్మారు వాళ్లు. అయినా సరే మా శక్తివంచన లేకుండా కృషిచేయాలని భావించాం. దానికి ప్రతిఫలం మా డిజైన్లను కొనుగోలుదారులు ఇష్టపడ్డారు, మా బ్రాండ్‌ని ప్రేమించారు. మా కస్టమర్లలో 30శాతం మళ్లీ మళ్లీ కొనుగోలు చేసేవారే" అంటారు ఇషితా.

2014 నవంబర్ నాటికి లాభాల స్థాయిని అందుకుంది కాండిడ్లీ కోచర్. అప్పటి నుంచి ఇప్పటికి అమ్మకాల స్థాయి రెట్టింపైంది. దీంతో లాభాల మార్జిన్లు కూడా బాగా పెరిగాయి. 2014 డిసెంబర్‌లో మొదటిసారిగా ₹10 లక్షలకు మించి విక్రయాలు సాధించిందీ ఈ సంస్థ. ఇంకా సాధించాల్సింది చాలా ఉందంటున్నారు కాండిడ్లీ కోచర్ టీం.

ప్రస్తుత సాధారణ మార్కెటింగ్ విధానాలు ఎక్కువ కాలం మార్కెట్‌లో నిలబెట్టగలిగేలా లేవంటారు ఇషిత, దేవి. అందుకే కొత్త తరహా ఆలోచనలకు ప్రాణం పోశారు. “ గతేడాది దేవీ ప్రసాద్ బిస్వాల్ మాతో కలిశాక.. మాకు అనేక కొత్త ఆలోచనలు అందించారు.

మార్కెటింగ్‌కోసం చాలా చిన్నమొత్తమే మేం ఖర్చుపెట్టాం. అది కూడా ఫేస్‌బుక్‌ ప్రమోషన్ కోసమే."-ఇషితా

ప్రస్తుతం సాధించినదానిపై సంతృప్తిగానే ఉన్నా.. మరిన్ని విభాగాల్లోకి ప్రవేశించేందుకు ఈ సంస్థ ఉవ్విళ్లూరుతోంది. బ్యాగులు, షూస్, ఫ్యాన్సీ జ్యూవెల్రీ, సొంత బ్రాండ్‌పై మేకప్ సామాగ్రిని పరిచయం చేయాలని భావిస్తోంది కంపెనీ. అలాగే మార్కెటింగ్‌పై పెట్టే ఖర్చును ఈ ఏడాది 50 రెట్లు పెంచాలని భావిస్తున్నారంటే.. వ్యూహాలు ఎలా ఉన్నాయో అర్ధమవుతుంది.

పెట్టుబడి కోసం పట్టుదలగా

“ డబ్బులు పొదుపు చేయడంపై కొంతకాలం క్రితం వరకూ నాకు నమ్మకం లేదు. నేనీ కంపెనీని చాలా చిన్న మొత్తం పెట్టుబడితో ప్రారంభించా. వచ్చిన లాభాలతోనే నడిపాను. అయితే దేవి కంపెనీలో అడుగు పెట్టాక మా వ్యూహాలు మారిపోయాయి. తన టైంనే కాక నిధులను కూడా కంపెనీకోసం వెచ్చించారు. ఇప్పుడు మా సంస్థకి నిధులందించే వెంచర్ కాపిటలిస్ట్‌ల అన్వేషిస్తున్నా"నంటారు ఇషిత.

ఇషిత దృష్టిలో దేవితో భాగస్వామ్యమే కాండిడ్లీ కూటూర్ అభివృద్ధిలో మూలస్తంభం."జనవరి వరకూ వేర్‌హౌస్ నిర్వహణ నుంచి కస్టమర్ సర్వీస్ వరకూ అంతా మేమిద్దరమే చూసుకునేవాళ్లం. 2015 ఫిబ్రవరి నుంచే క్రియేటివ్ టీంను అపాయింట్ చేసుకున్నాం. ప్రస్తుతం మేం ఐదుగురం ఉన్నామం"టుున్నారు ఇషిత.

రెగ్యులర్ క్లయింట్స్ పట్ల ఇషిత చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందులోనూ సెలబ్రిటీల విషయంలో ఇది మరింత ఎక్కువ. తాము రూపొందించిన డిజైన్లను వాళ్లు ప్రదర్శించిన సందర్భాలను గుర్తుంచుకోవడం, వాటిని పబ్లిసిటీలో వాడుకోవడం వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉంటారని చెప్పాలి. “ తాజాగా అక్షయ్ కుమార్‌తో మధురిమ తులి నటించిన మూవీ బేబీ ప్రమోషన్‌లో... ఆమె ధరించిన ఔట్‌ఫిట్స్ కాండిడ్లీ కోచర్ రూపొందించినవే. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అంతకు కొన్ని రోజుల క్రితమే ఆమెను కలిశాన్నేను. దుస్తుల ఎంపికలో కొన్ని సలహాలిచ్చాను. అంతలోనే నా డిజైన్లు బాలీవుడ్ స్థాయికి ఎదగడంతో చాలా సంతోషించాను. కొన్ని రోజుల క్రితం ఎంటీవీ వీజే, బాలీవుడ్ నటి గాలిన్ మెండోన్కా కాంటాక్ట్ చేశారు. తనకోసం కొన్ని డిజైన్స్ కావాలని, బెంగుళూరు ఆఫీస్‌కి స్వయంగా వస్తానని చెప్పారు. నేనిప్పుడు ఆమె కోసం ఎదురుచూస్తున్నా".- ఇషితా

కంపెనీ ఔట్‌ఫిట్స్‌తో బాలీవుడ్ నటి మధురిమ తులి

కంపెనీ ఔట్‌ఫిట్స్‌తో బాలీవుడ్ నటి మధురిమ తులి


బెస్ట్ ఫ్రం బ్యాడ్

ఈ స్టార్టప్ సంస్థ అనేక అసమగ్రతలు, ప్రతిబంధకాలతోనే మొదలైంది. వెబ్ పేజ్ నిర్వహణ కోసం కనీసం ఓ పర్సనల్ కంప్యూటర్ కూడా లేదు. సైబర్ కేఫ్‌లు, స్నేహితుల ల్యాప్‌టాప్‌లను ఉపయోగించి కస్టమర్లను నిర్వహించేవారు ఇషిత. దీంతో కొంత ఆలస్యం జరిగేది. కొంతమంది అసంతృప్తి చెందేవారు. ఈ వెబ్‌సైట్ పూర్తి రూపాన్ని సంతరించుకోడానికి దాదాపు 2 నెలలు పట్టింది. ఈ ప్రాజెక్ట్ కోసం తల్లిదండ్రుల నుంచి పెట్టుబడి ఆశించలేదు ఇషితాశర్మ. పెద్ద అలలను దాటకుండా మంచి నావికులం కాలేం కదా అంటారు ఇషిత. 

టుడే టూ టుమారో

కాండిడ్లీ కౌటూర్ ఇప్పుడు కొత్త ఆఫీస్‌కు చేరుతోంది. “ బెంగుళూర్, ఇందిరానగర్‌లో కొత్త ఆఫీస్ ప్రారంభించాం. ఇంటీరియర్ డెకరేషన్‌పై దృష్టి పెట్టా. నా బిడ్డలాంటి ఈ ఆఫీస్‌ను తీర్చిదిద్దడమే నా ఎజెండాలో ప్రధాన అంశమంటారు ఇషిత. త్వరలో మొబైల్ యాప్‌ను కూడా లాంఛ్ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. ఫ్యూచర్ గేమ్ మేమిద్దరం(ఇషిత, దేవి) కలిసే ఆడతామంటున్నారు. 

నాకు నచ్చిన సలహా

"ముందు నుంచీ లోప్రొఫైల్ మెయింటెయిన్ చేసిన నాకు... దేవి తోడయ్యాక విజయం వైపు అడుగులేశాం. ఈ సక్సెస్‌లో అతని పాత్ర చాలా కీలకం. అతను కాక నాకు మార్గదర్శకులు నా టేబుల్‌పై ఉన్న పుస్తకాలే. టోనీ హీహ్, సోఫియా అమోరుసో పుస్తకాలను చాలా సార్లే చదివా. వీటిలో గర్ల్‌బాస్‌లో సోఫియా చెప్పిన, నాకు నచ్చిన గొప్ప సలహా ఇదే. ' జీవితంలో నవ్వు ఏ స్థాయిలో ఉన్నాసరే, నీ గురించి అవతలి వాళ్లు అనకునే విషయాల బాధపడ్డం మానేస్తే చాలా సమయం ఆదా అవుతుంది. ఆ టైం నీకు ఉపయోగపడుతుంది. తర్వాత జీవితంలో ఈ విషయం అర్ధమవుతుంది'."-ఇషిత

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags