సంకలనాలు
Telugu

స్కూళ్లను స్మార్ట్‌గా మారుస్తున్న ‘మైక్లాస్ బోర్డ్’

డిజిటలైజ్డ్ స్కూళ్ల కోసం మొదలైన స్టార్టప్.. స్కూల్ ఫీజు దగ్గర నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ దాకా వన్ స్టాప్ సొల్యూషన్..

ashok patnaik
11th Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


హోంవర్క్, స్కూల్ షెడ్యూల్, లంచ్ టైం, ఎగ్జామ్స్, టీచర్ రిపోర్ట్స్, పేరెంట్స్ రిపోర్ట్ చివరగా ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఇలా అన్ని పనులు చేయడానికి ఒకే వేదిక సిద్ధమైంది. చిన్నారులతోపాటు వారి తల్లిదండ్రుల అలసటను తగ్గించడమే కాదు టీచర్ల టైం సేవ్ చేయడానికి ఈ స్మార్ట్ యాప్ తయారు చేశామన్నారు ఫౌండర్ అజయ్. హైదరాబాద్ కేంద్రంగా 2009లో ప్రారంభమైన 'మై క్లాస్ బోర్డ్' ఇప్పుడు అన్ని మెట్రో నగరాలకూ విస్తరించింది. సౌతిండియాలో వేగంగా దూసుకుపోతోన్న ఈ స్టార్టప్ దేశవ్యాప్తంగా మరింత మంది చిన్నారులకు చేరువ కావడానికి రెడీ అవుతోంది.

అజయ్ శాఖమూరి, ఫౌండర్ సిఈఓ

అజయ్ శాఖమూరి, ఫౌండర్ సిఈఓ


మైక్లాస్ బోర్డ్ ఏం చేస్తుంది ?

మైక్లాస్ బోర్డ్ అనేది ప్రధానంగా స్కూళ్లకు సాఫ్ట్‌వేర్ అందిస్తుంది. స్కూల్లో అడ్మిషన్‌కు కావల్సిన అప్లికేషన్ దగ్గర నుంచి ఫీజు కట్టడం, రిపోర్టులు తయారు చేయడం, పిల్లల గురించి అన్ని విషయాలను పేరెంట్స్‌కు మెసేజీ ద్వారా అందించడం లాంటి ఎన్నో సేవలను ఒకే గొడుగు కిందకు తెస్తుంది. స్కూలు యాజమాన్యాలతో కలసి వారి స్కూల్ వివరాలను విద్యార్థులు తల్లిదండ్రులకు అందిస్తుంది. స్కూల్లో జరిగే కాంపిటీషన్స్ దగ్గర నుంచి ప్రతి విషయాన్నీ పేరెంట్స్‌కు చేరవేడయం ఈ యాప్ ప్రత్యేకత. స్కూల్‌కు సంబంధించిన సమగ్ర సమాచారంతోపాటు విద్యార్థుల దైనందిన కార్యక్రమాల వివరాలను దీనిలో పొందు పరచడం ఇంకో స్పెషాలిటీ. సాధారణ స్కూళ్లను స్మార్ట్ స్కూల్‌గా మార్చాలంటే మైక్లాస్ బోర్డ్ లో చేరిపోవాలంటున్నారు అజయ్.

విద్యార్థుల రిపోర్టు ఇలా కనిపిస్తుంది

విద్యార్థుల రిపోర్టు ఇలా కనిపిస్తుంది


క్లెయింట్స్ ఎవరెవరు

“ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1500మందికి పైగా క్లెయింట్స్ ఉన్నారు. స్కూళ్ల సంఖ్య దీనికి రెట్టింపు. రోజురోజుకీ ఈ సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గేది కాదు. దేశంలో సాధారణ బడిని స్మార్ట్ స్కూల్‌గా మార్చడమే మా లక్ష్యం” - అజయ్ 

స్కూళ్లతో కలిసి పనిచేయడం వల్ల తల్లిదండ్రులపై ఎలాంటి అదనపు భారం ఉండదు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఉచితంగానే లాగిన్ అవ్వొచ్చు. మొబైల్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చిటికెలో అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. గౌతం మోడల్ స్కూల్, రయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ తోపాటు శ్రీగాయత్రి లాంటి ఎన్నో స్కూళ్లు మై క్లాస్ బోర్డ్ క్లెయింట్ లిస్ట్‌లో ఉన్నారు. ఈ గ్రూపులకు సంబంధించిన స్కూళ్లలో ఉన్న లక్షల మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకూ సేవలను అందిస్తున్నారు.

మై క్లాస్ బోర్డు క్లెయింట్ లిస్ట్

మై క్లాస్ బోర్డు క్లెయింట్ లిస్ట్


మై క్లాస్ బోర్డ్ టీం

టీం విషయానికొస్తే అజయ్ కుమార్ ఫౌండర్ సిఈఓగా వ్యవహరిస్తున్నారు. వ్యాపార కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అజయ్ హైదరాబాద్‌లో బిటెక్ పూర్తి చేశారు. డెలాయిట్ ,క్యాంపస్ ఎక్స్‌ప్రెస్ లాంటి కంటెంట్ సైట్‌లో పనిచేశారు. తర్వాత బిజినెస్ వైపు అడుగులు వేశారు. సరికొత్తగా ఏదైనా చేయాలనే ఆశయంతో విద్యారంగాన్ని ఎంచుకున్నారు. స్కూళ్లను స్మార్ట్‌గా మార్చాలని అనుకున్నారు. అలా ప్రారంభించిన అజయ్ జర్నీ ఇప్పుడు లక్షల మంది విద్యార్థులకు ‘మైక్లాస్ బోర్డ్’ యాప్ ను చేరువ చేసింది. యూవర్డ్ డాట్ కామ్ ఫౌండర్ అయిన చంద్రశేఖర్ ఈ స్టార్టప్ కు మెంటార్‌గా ఉంటూ మద్దతుగా నిలిచారు. రవీంద్ర అడుసమిల్లి దీనికి సిటిఓగా పనిచేస్తున్నారు. బిటెక్ గ్రాడ్యుయేట్ అయిన రవీంద్రకు ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఫీల్డ్‌లో 15 ఏళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం మొత్తం 60మంది టీం సంస్థలో పనిచేస్తున్నారు.

భవిష్యత్ ప్రణాళికలు

ఇప్పటికే ఈ బుక్స్‌ను లాంచ్ చేసిన మైక్లాస్ బోర్డ్, విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం, వారి అలవాట్లతో పాటు నేర్చుకునే విధంగా సరికొత్త ఫీచర్లను డెవల్ చేస్తోంది. ప్రారంభమైంది 2009 లోనే అయనప్పటికీ 2011 నుంచి పూర్తి స్థాయిలో సైట్ అందుబాటులోకి వచ్చింది. ప్రధానంగా హైదరాబాద్‌తోపాటు దక్షిణాదిలో విస్తరించి ఉన్న సంస్థకు లక్నోలో క్లెయింట్స్ ఉన్నారు. ఉత్తర భారతంలో మరింతగా విస్తరించడానికి ప్రణాళికలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ నాలుగున్నర లక్షల మంది యూజర్లు యాప్‌ని డౌన్ లోడ్ చేసుకున్నారు. ట్యాబ్ జనరేషన్ లో ఉండే అన్ని అప్లికేషన్స్ ఇప్పటి కే తమ దగ్గర ఉన్నాయని అజయ్ అంటున్నారు. టీచర్లకు టైం సేవ్ చేయడంతో పాటు తల్లిదండ్రులకు టైమ్ మేనేజ్మెంట్ మై క్లాస్ బోర్డ్ తో సాధ్యం అవుతోంది. దీన్ని మరింత వినూత్నంగా చేయాలనేదే తమ లక్ష్యం అంటున్నారాయన.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags