సంకలనాలు
Telugu

ఈమెతో పాములు ఫ్రెండ్ షిప్ చేస్తాయి..! మూగజీవాలు మురిపెంగా ముచ్చటిస్తాయి..!!

19th Jan 2016
Add to
Shares
8
Comments
Share This
Add to
Shares
8
Comments
Share

సాధారణంగా పాముల్ని చూస్తే ఎవరికైనా భయమే. వాటి కదలికలు దగ్గర్నుంచి చూస్తే వళ్లు గగుర్పొడుస్తుంది. బుసలు దగ్గర్నుంచి వింటే దూరంగా పారిపోతాం. పడగలు చూసి హడలెత్తుతాం. కానీ ఆమె మాత్రం పాములను చూస్తే ఎగిరి గంతేస్తుంది. అపురూపంగా వాటిని చేతుల్లోకి తీసుకుని లాలిస్తుంది. ముద్దు చేస్తుంది. మురిపెంగా వాటితో మాట్లాడుతుంది. ఒక్క పాములనే కాదు. సర్పాలు, పశుపక్ష్యాదులన్నీ ఆమె చుట్టాలు.

image


చూడ్డానికి అందరిలాగానే ఉంటుంది. చాలా సామాన్యంగా కనిపిస్తుంది. కానీ ఆమె ప్రతిభే అసామాన్యం. చెట్లూ పుట్టలు, పశుపక్ష్యాదులను అమితంగా ప్రేమించే ఆమె.. అక్కడితో ఆగిపోలేదు. వాటితో కలిసి బతకటమే జీవితంగా మార్చుకుంది. మరీ ముఖ్యంగా పాములంటే ఆమెకు ప్రత్యేకమైన అభిమానం. ఆ ఎలిమెంట్ ని ఆమె తన ప్రత్యేకతగా మలుచుకుంది.

ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్ అని చదవాల్సిన వయస్సులో లో ఏ ఫర్ యానిమల్స్ బీ ఫర్ బర్డ్స్ అని నేర్పించాడామె తండ్రి. మరి అలాంటి జంతు ప్రేమికుడి కూతురు ఇలా ఉండటంలో ఆశ్చర్యపడాల్సిందేముంది. ఆమె చిన్నప్పుడు గదిలోకి ఓ పాము వచ్చింది. గార్గి తండ్రి దాన్ని మెల్లగా బయటకు నెట్టేశాడు. కానీ, ఈ లోగా చిన్నారి గార్గి ఏడ్పు మొదలు పెట్టింది. భయం వేసిందనుకుని ఆమె తండ్రి ఓదారుస్తున్నాడు. కానీ, అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. తన గదిలోకి వచ్చిన పాముతో ఆడుకునే అవకాశం ఇవ్వలేదని, బయటకు పంపేశారని అలిగి ఏడ్చింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు గార్గి గురించి చెప్పడానికి. ఆ రోజే ఆమెకు పామును పెంచుకోవాలనిపించిందట. 

గార్గి విజయ రాఘవన్ పెరిగింది ముంబయి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కాలనీలో. అది ముంబయి శివార్లలో ఉంటుంది. సిటీకి భిన్నంగా అంటే, కాంక్రీట్ జంగిల్ లా కాకుండా చెట్లు, పుట్టలు, పక్షులతో చిన్నపాటి అడవిలా ఉండే ప్రాంతం అన్నమాట. అలాంటి చోట అడపాదడపా పాములూ కనిపిస్తూనే ఉంటాయి. వాటిని చూడగానే అంందరూ భయపడి దూరంగా పోతుంటే.., మూడేళ్లకే గార్గి వాటి దగ్గరగా వెళ్లి పట్టుకోవటం మొదలు పెట్టింది.

మనసు పెట్టి ప్రయత్నించాలి కానీ, ప్రకృతికి మన మాటలు అర్ధమవుతాయి. ప్రకృతి గుసగుసలు మనం అర్ధం చేసుకోగలం. పాములు కూడా అంతే. 

“ నేను పాములతో మాట్లాడే ప్రయత్నం చాలా సార్లు చేశాను. అవి మన వైబ్రేషన్స్ అర్ధం చేసుకోగలవని సైంటిఫిక్ గా రుజువయింది కూడా. మనం నిశ్శబ్దంగా ఉంటే అవి కూడా మనల్ని గమనిస్తుంటాయి. దాడి చేస్తామని భావిస్తే అవి రియాక్ట్ అవటానికి రెడీ గా ఉంటాయి.''-గార్గి.

""ముంబయి బార్క్ కాలనీలో పాములు చాలా ఎక్కువగా ఉండేవి. అక్కడ ఇళ్లలో, షాపుల్లో దూరటం చాలా కామన్. ఓ రోజు నేను మా నాన్నతో కలిసి కాలనీలో వెళ్తూ ఉన్నాం. సడన్ గా ఓ దగ్గర అరుపులు, గోల వినిపించాయి. ఏం జరిగిందా అని వెళ్లి చూశాం.. ఏముంది ఓ పాము షాప్ లో దూరింది. మేం ఇద్దరం కలిసి ఆ దాన్ని మెల్లగా తీసి బయట వదిలేశాం. పాములంటే నాకున్న ఇష్టం తెలిసిన మా నాన్న నన్నూ ఓ చేత్తో పట్టుకోనిచ్చాడు. అదిగో అప్పటినుంచి పాము కనిపిస్తే చాలు మాకు పిలుపొచ్చేది. చివరికి ఎలా అయిందంటే, మా కాలనీ వాళ్ల దగ్గర్నుంచి- ఏరియాలోని పైర్ డిపార్ట్ మెంట్ వరకు -పాము కనిపిస్తే చాలు మమ్మల్నే పిలుస్తారు" అని తన సర్పాలతో తన తొలి ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటుంది గార్గి.

సర్పాలే కాదు....జంతుజాలమంతా నా కుటుంబమే..

సర్పాలే కాదు....జంతుజాలమంతా నా కుటుంబమే..


అలా గార్గి చిన్నతనం నుంచి పాములంటే ప్రేమ చూపేది. ఉత్సాహంగా పట్టుకునేది. కానీ, పాములతో ఉన్న ప్రమాదం ఆమె తండ్రికి తెలియంది కాదు. అందుకే తన కూతురు పాములకు దగ్గరగా వెళ్లటంపై కొంత జంకేవాడు. ఆమెకంత శక్తి ఉందా అనే సందేహం వ్యక్తం చేసేవాడు. ఆ రోజు కాలనీలో పామును పట్టే దగ్గర హెల్ప్ చేసినప్పటికీ, అన్ని రకాల పాముల గురించి తెలిసే వరకు వాటికి దగ్గరగా వెళ్లటానికి వీల్లేదు అని ఆమె తండ్రి తేల్చి చెప్పాడు. అప్పటికామె వయస్సు 13 ఏళ్లు. 

పాములపై ఉన్న ఆసక్తితో ఒక్క ఎండా కాలంలోనే ఆమె వివిధ రకాల సర్పజాతులు, వాటి లక్షణాలు, ఇతర గుణగణాలు అన్నీ అధ్యయనం చేసేసింది. వాటి పట్ల ఆమెకున్న ఇష్టంతో తండ్రిని కన్విన్స్ చేసింది. మొదట విషరహిత పాములతో మొదలైన ఆ పయనం.. మెల్లగా విషపూరిత పాముల వరకు చేరింది.

అంతరించి పోతున్న జీవుల్లో చాలా రకాల సర్ప జాతులున్నాయి. పాములకు మనిషే పెద్ద శత్రువు అంటుందామె. వాటి పట్ల మనం చూపే నిర్లక్ష్యం వాటిని అంతం చేస్తోందని చెప్తోంది. అందుకే పాములను గురించిన ఎవేర్ నెస్ ప్రజల్లో కల్పించే ప్రయత్నం చేస్తోంది. నిజానికి భారతదేశంలో విషపూరిత సర్పాలు కేవలం నాలుగు రకాలు మాత్రమే. మిగిలినవన్నీ ఏ రకమైన హానీ చేయనివే. 

ఈ క్రమంలో కేవలం ఇళ్లలో దూరిన పాములను మాత్రమే ఆమె జాగ్రత్తగా పట్టి దూరంగా వదలటం మొదలు పెట్టింది. బయట కనిపించే పాముల జోలికి పోకుండా అక్కడి వారిని ఒప్పిస్తోంది. పాము దాని పుట్టలో అది ఉంటే మనకొచ్చిన నష్టం ఏంటి? దాని ఇంటినుంచి దాన్ని బయటికి వెళ్లగొట్టే పని నేను మాత్రం చేయనని ఖరాఖండిగా చెప్తోందిపుడు.

ఎంతటి సర్పరాజమైనా చేతుల్లో ఒదిగి పోవలసిందేమరి..

ఎంతటి సర్పరాజమైనా చేతుల్లో ఒదిగి పోవలసిందేమరి..


ఈ ప్రయత్నంలో కొన్ని సార్లు ఆమె సక్సెస్ అయింది. అలా ఓ కాలనీలో వారిని కష్టపడి ఒప్పించిన తర్వాత అక్కడి వారి ఆలోచనా ధోరణే మారిపోయింది. వారం తిరిగే సరికి, ఆ పాముతో స్థానికులు ఫోటోలు తీసుకునేంత మార్పు వచ్చింది. ఓ మహిళయితే ఆ పాముకి రెగ్యులర్ గా తిండి సంగతి కూడా చూడ్డం మొదలు పెట్టింది.

పాములతో పయనంలో ఇప్పటికి ఆమెకు దాదాపు పదేళ్ల అనుభవం వచ్చేసింది. నేటివరకు ఆమె తన తండ్రితో కలిసి 2వేల పాముల్ని కాపాడి ఉంటుంది. ఇన్ని సందర్భాల్లో ఎక్కడా ఏ ప్రమాదం జరగలేదు. అంత కేర్ ఫుల్ గా వ్యవహరించటం ఆమెకు అలవాటయింది. కానీ, ఇంత ప్రతిభ చూపుతున్నా ఆమెను విచిత్రంగా చూసేవాళ్లో లేక, ఒక అమ్మాయేంటి పాములు పట్టడమేంటి అని తేలిగ్గా మాట్లాడే వాళ్లో తారసపడుతుంటారు. నిజానికి స్కూల్ డేస్ లో కూడా క్లాస్ మేట్స్ టీజ్ చేయటం, ఆమె ముందు పాములాగా బుస్ మని శబ్దాలు చేస్తూ వెక్కిరించటం జరుగుతూ ఉండేది. కానీ, ఇలాంటివి జరిగిన ప్రతిసారి ఆమెకు వాళ్లమ్మ చాలా ధైర్యం చెప్పేది. మంచి పని చేస్తున్నామని తెలిసినపుడు ఇలా అజ్ఞానంతో చేసే కామెంట్స్ పట్టించుకోవద్దని ప్రోత్సహించేది..

కానీ ఇప్పటికీ ఆమె పాములను రెస్క్యూ చేయటానికి వెళ్లినపుడు పెద్ద పుడింగిల్లా కొందరు తయారౌతారు. ఓ అమ్మాయి పాముతో ధైర్యంగా ఆటలాడుతుంటే, తాము చూడ్డమేంటన్నట్టు ఫీలై, వాళ్ల మేల్ ఇగో హర్టవుతుంది. వాళ్లూ ఓ చేయి వేయబోతారు.. "కానీ నాకీ పనిలో పదేళ్లకు పైన అనుభవం ఉందనే సంగతి వాళ్లు మర్చిపోతారు. అందుకే నేనొకటే చెప్తాను. మొదట వాళ్ల సేఫ్టీ గురించి, రెండవది పాముని కాపాడటం గురించి చివరగా నా గురించి ఆలోచిస్తాను.. నేను ఓ అమ్మాయినైనంత మాత్రాన నేను చేయగలిగే పని వాళ్లు కూడా అలవోకగా చేయగలరనుకుంటే పొరపాటే కదా. ఎంతో శ్రమకోర్చి రీసెర్చ్ చేసి, చదివి, అనుభవంతో పాముల కదలికలను, వాటి మూవ్ మెంట్స్ ని అంచనా వేయగలుగుతున్నాను ఇదేమంత తేలిగ్గా చేసే పని కాదు... ఏదో తమాషా కోసం చేసే పని అసలే కాదు." అంటుంది గార్గి.

మనం వినాలి కానీ, ఉడుతలు కూడా ఊసులాడతాయి..

మనం వినాలి కానీ, ఉడుతలు కూడా ఊసులాడతాయి..


ఇప్పుడు గార్గి పాఠశాలల్లో, విద్యా సంస్థల్లో పాములు,ఇతర జంతువులతో కలసి బతకటం ఎలా అనే అంశంపై అవేర్ నెస్ కల్పించేలా గెస్ట్ స్పీచ్ లు ఇస్తోంది. అంతేకాదు. ఆమె ప్రయత్నాలను మెచ్చి, 2010 ఎన్విరాన్ మెంట్ డే రోజు ముంబయి మేయర్ శ్రద్ధా జాదవ్ చేతుల మీదుగా అవార్డును కూడా తీసుకుంది. యూనివర్సిటీ ఆఫ్ ముంబయి నుంచి ఎన్విరాన్ మెంటల్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ తీసుకున్న గార్గిని, ఓ వైల్డ్ లైఫ్ ఛారిటబుల్ ఫౌండేషన్ జాబ్ ఆఫర్ చేసింది. ఇప్పుడు ముంబయి రాజ్ భవన్ లో అరుదైన 17 నెమళ్లను సంరక్షిస్తూ కనిపిస్తుంది. ప్రకృతితో, సమస్త జంతువులతో కలసి బతకటంలో ఉన్నఆనందం ఏంటో గార్గిని చూస్తే అర్ధమవుతుంది.

Add to
Shares
8
Comments
Share This
Add to
Shares
8
Comments
Share
Report an issue
Authors

Related Tags