సంకలనాలు
Telugu

ఆ రెండు కంపెనీల ఎగ్జిట్ కథ..!

సిట్రస్ పే, సిక్వోయా బంధం కథా కమామీషు..

19th Nov 2016
Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share

పెట్టుబడులు, లెక్కల చుట్టే తిరుగుతున్న కాలమిది! ఇలాంటి పరిస్థితుల్లో సిక్వోయా కంపెనీ నుంచి సిట్రస్ పే నిష్క్రమించడం ఆషామాషీ కాదు. కానీ విడిపోవడం ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలోనే జరిగింది. పరస్పర అంగీకారం, అవగాహన ఆధారంగా జరిగిన ఆ రెండు కంపెనీల ఎగ్జిట్ స్టోరీ.. ఆంట్రప్రెన్యూర్లకు కచ్చితంగా ఒక కరదీపికే! మొబైల్ స్పార్క్స్- 2016 ఈవెంట్ లో సిట్రస్ పే సహ వ్యవస్థాపకుడు జితేంద్ర గుప్తా, సిక్వోయా క్యాపిటల్ అడ్వైజర్స్ ఇండియా ఎండీ మోహిత్ భట్నాగర్ పాల్గొన్నారు. ఫండింగ్, ఆంట్రప్రెన్యూర్-ఇన్వెస్టర్ రిలేషన్ షిప్ తోపాటు తమ రెండు కంపెనీల అనుబంధం గురించి కూడా ఎన్నో వివరాలు పంచుకున్నారు.

వెంచర్ క్యాపిటలిస్టుల పనే మేలంటారు మోహిత్. ఎందుకంటే, చేయాల్సిన కష్టమంతా ఆంట్రప్రెన్యూరే చేస్తాడు. కష్టకాలంలో ఆంట్రప్రెన్యూర్లకు చేదుడో వాదోడుగా నిలిచే వీసీ( వెంచర్ క్యాపిటలిస్ట్)లు కొందరే ఉంటారు.

కష్ట కాలంలో ఎలా కలిసి పనిచేశారు?

వీసీలు, ఆంట్రప్రెన్యూర్ల మధ్య మంచి రిలేషన్ ఉండాలంటారు జితేంద్ర. ఇందుకు సంబంధించి గత ఏడాది జరిగిన ఒక సంఘటనను ఉదహరించారు. 2015లో ప్రపంచమంతా కన్జ్యూమర్ బిజినెస్ వైపు పరుగులు పెడుతోంది. మేం కూడా మనసావాచా అదే నమ్మి వ్యాపారుల మీద ఫోకస్ పెట్టాం. అయితే 2015 సెప్టెంబర్ లో మా భాగస్వామి ఒకరు తప్పుకున్నారు. అప్పుడే మోహిత్ కు కాల్ చేశా. కనీసం కోటి డాలర్లు ఇన్వస్ట్ చేయగలవా అని అడిగా. అంతే! తెల్లారి కంపెనీ అకౌంట్ లోకి మనీ వచ్చింది.

దీనిపై మోహిత్ స్పందిస్తూ.. అదొక అందమైన బంధం. ఇండియాలో కొద్ది మంది ఇన్వెస్టర్లు, ఆంట్రప్రెన్యూర్ల మధ్య మాత్రమే అలాంటి రిలేషన్ షిప్ ఉంటుంది. ఒక వ్యాపారం పెట్టాలంటే ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. చాలా డబ్బు సంపాదించి పాపులర్ అవ్వాలా ? లేదా లైమ్ లైట్ లో లేకపోయినా కంపెనీ డీఎన్ఏకు కట్టుబడి పనిచేయాలా? మీకు మీరు ఎప్పుడు నిలదొక్కుకుంటారు? మీ కంపెనీని మరో సక్సెస్ఫుల్ కంపెనీలో ఎప్పుడు విలీనం చేస్తారు? కంపెనీ ప్రారంభించే ముందు ఫౌండర్లు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాలని తెలిపారు.

image


ఎగ్జిట్ కథాకమామీషు..

ఇవాళ్టి స్టార్టప్ ఈకో సిస్టమ్ ఒక ప్రశ్న చుట్టూ తిరుగుతోంది. అదేంటంటే- ఇండియాలో బిజినెస్ ఎగ్జిట్స్ ఎప్పుడు చూస్తాం? అది జరగాలంటే ఏదైనా రహస్యముందా? నిజానికి ఇండియన్ స్టార్టప్ ఈకో సిస్టమ్ చాలా ఎర్లీ స్టేజ్ లో ఉందన్న విషయం బహు కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఇప్పటిదాకా మనం ఒక రకమైన ఫండింగ్ సైకిల్ ను చూశాం. ఆదాయం కావాలంటే.. ఇంకా రకరకాల ఫండ్ సైకిల్స్ ను పరిశీలించాలి. గత పదేళ్లుగా నేను అదే పనిచేస్తున్నా. దానివల్లే ఎగ్జిట్ కు నాకో అవకాశం వచ్చింది. ప్రతిసారి ఏ కంపెనీ అయినా ఎగ్జిట్ కోరుకుంటుంది. ఆ ఫీలింగ్ తీపిచేదుల కలయిక! టైం, ఎఫర్ట్ పెట్టి భాగస్వాముల్ని కుదుర్చుకుంటాం. ప్రోడక్ట్, కంపెనీ కోసం అహర్నిశలు కృషి చేస్తాం. ఆ తర్వాత కంపెనీ నుంచి ఎగ్జిట్ అయిపోతాం. తప్పదు! అదొక సైకిల్- అని మోహిత్ వివరించారు.

జితేంద్ర మాట్లాడుతూ.. ఏదేమైనా మన ఈకో సిస్టమ్ మెచ్యూర్ అవుతోంది. కంపెనీలు అమ్ముడవుతున్నాయని అనడం కన్నా వాటిని కొంటున్నారని అనడం కరెక్టు. మా కంపెనీనే తీసుకుంటే- మేం చాలా సహజంగా అభివృద్ధి సాధించాం. నిజానికి మేం బిజినెస్ డెవలప్ చేసింది ఎగ్జిట్ కోసం కాదు. మా వరకు మేం ఎంతో మేథోమథనం, అంతర్గత చర్చల పరంపర తర్వాత ఎగ్జిట్ నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయంలో మోహిత్ సహకారం మరచిపోలేమని చెప్పారు.

దానికి మోహిత్ స్పందిస్తూ.. ఆంట్రప్రెన్యూర్ జర్నీలో ఎత్తుపళ్లాలు సహజం. శత్రువులెవరో మిత్రులెవరో తెలుసుకొని మసలుకోవాలి. ఏ కంపెనీ ఎప్పుడు ఎగ్జిట్ కావాలో, ఎప్పుడు కాకూడదో చెప్పడానికి ఒక టైమ్ ఫ్రేమ్ అంటూ ఉండదు. ఆంట్రప్రెన్యూర్ కు ఇదొక సవాలే కాబట్టి.. మీ కంపెనీ సామర్థ్యమేంటో ముందు అంచనా వేసుకోండి. ఒకవైపు వ్యాపారం మీద దృష్టి పెడుతూనే.. ఇంకోవైపు జాగ్రత్తగా, ఓర్పుతో ఎగ్జిట్ కోసం కసరత్తు చేయండి. అది కష్టం అంటే కుదరదు. ఆంట్రప్రెన్యూర్లు దాన్ని బాగా ప్రాక్టిస్ చేయాలని సలహా ఇచ్చారు.

image


ఫండింగ్ కథా కమామీషు:

ఫండింగ్, మదింపుల మీదనే ఫోకస్ పెరుగుతుండటం వల్ల చాలా మంది బిజినెస్ మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. గత ఏడాది ప్రపంచమంతా కంపెనీల పెట్టుబడులు, వాటి విలువల చుట్టే తిరిగింది. లక్కీగా ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. అతి మూలధనం అజీర్తికి కారణమని ఊరికే అనలేదు. మార్కెట్ అచ్చం సాకర్ గేమ్ లా ఉంటుంది. సాకర్లో బాల్ మధ్యలో కిక్ చేస్తే గోల్ కొట్టడానికి ఛాన్సుంది. కాకపోతే ప్లేయర్లు తెలివిగా బాల్ అంచులను కిక్ చేసి.. బ్లేమ్ కాకుండా జాగ్రతపడతారు. మనిషి మైండ్ సెట్టే అంత! కాబట్టి ఒకసారి గేమ్ లో తలదూర్చారంటే.. ఇక ఆలోచించకూడదు. పోరాడాలంతేనని మోహిత్ వివరించారు.

నేను ఎందుకు కాకూడదు?

ఇన్వె స్ట్ మెంట్ గేమ్ అనేది సంబంధాలను మెరుగుపరుచుకోవడం కోసమే. ఇన్వెస్టర్ తో ఎలా సాన్నిహిత్యం పెంచుకుంటారన్నదే ఇక్కడ పాయింట్. ఒక్కోసారి ఆ బంధం అలా కుదురుతుందంతే! కానీ కొన్నిసార్లి ఎంత ప్రయత్నించినా రిలేషన్ సెట్టవదు. సరైన కోఫౌండర్, వర్తీ ఇన్వెస్టర్ ను సంపాదించుకోవడం చాలా కీలకం. అది ఎలాంటి డీల్ అయినా సరే.. ఇన్వెస్టర్ తో కూర్చొని మాట్లాడుకోవాలి. ఇక్కడ లెక్కలు ముఖ్యం కాదు. బంధమే ప్రధానమని విశ్లేషించారు జితేంద్ర.

అలాగే మంచి టీంను ఏర్పాటు చేసుకోవడం కూడా ముఖ్యమేనని ఆయన అభిప్రాయపడ్డారు. నేను మొదటి రెండేళ్లు సరైన టీం మీద దృష్టి పెట్టి ఉంటే.. ఇప్పుడు పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేదని చెప్పారు. కాబట్టి మొదట్లోనే స్ట్రాంగ్ టీంను నియమించుకోవాలి. అది కూడా మీతో సమానంగా కంపెనీ కోసం చెమటోడ్చి పనిచేసే ఉద్యోగులై ఉండాలని ముక్తాయించారు జితేంద్ర.

Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share
Report an issue
Authors

Related Tags