కిరాణా వ్యాపారాన్ని సామాజిక బాధ్యతగా మార్చిన నుక్కడ్ షాప్స్

13th Jan 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

ఆన్ లైన్ గ్రాసరీ, కిరాణా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ విషయంపైనే పెద్ద ఎత్తున హోర్డింగ్ కనిపించడం, జనంలో కూడా ఆన్ లైన్ గ్రాసరీ మోస్తరుగా చర్చ జరుగుండం మనకి తెలిసిందే. దీని తర్వాత పెద్ద పెద్ద మాల్స్ లో ఇచ్చే ఆఫర్లతో జనం వాటికే తమ మొదటి ఓటంటున్నారు. సూపర్, హైపర్ మార్కెట్ లతో చిన్నా చితకా కిరాణా దుకాణాలు మరుగున పడిపోతున్నాయనేది వాస్తవం. ఈ కిరాణా దుకాణాలను ఆన్ లైన్ బాట పట్టించి వాటికి పునర్ వైభవం తీసుకు రావడమే లక్ష్యం పనిచేస్తోంది హైదరాబాద్ కు చెందిన నుక్కడ్ షాప్స్ అనే స్టార్టప్.

“మన భాగ్యనగరంలో దాదాపు అంతా సూపర్ మార్కెట్ లోనే కిరాణా తీసుకోవాలనుకుంటున్నారు. ఏదైనా వస్తువు మరచిపోతే వీధి చివరున్న కిరాణా షాప్ కి వెళ్లాలనుకుంటున్నారు,” రవికోరుకొండ

నుక్కడ్ షాప్స్ పర్పుల్ టాక్స్ ప్రాడక్టు. దీని ఫౌండర్ అయిన రవి చెప్పిన ప్రకారం దేశంలో వచ్చే మూడేళ్లలో రిటేల్ మార్కెట్ గణనీయంగా పెరగనుంది.

image


నుక్కడ్ షాప్స్ కాన్సెప్ట్ ..

వీధిచివర ఉండే దుకాణాలని నుక్కడ్ షాప్స్ అని పేరు పెట్టారు. పర్పుల్ టాక్స్ లో కొత్త ఆవిష్కరణపై పెట్టిన చాలెంజిలో నుక్కడ్ కాన్సప్ట్ ది బెస్ట్ గా నిలిచింది. దీని కర్త వివేక్ శుక్ల.

“మరుగున పడుతున్న మాన వీధి చివరి కిరణా దుకాణాల్ని ఆన్ లైన్ బాట పట్టిద్దామనుకున్నాం,” వివేక్

ఆన్ లైన్ గ్రాసరీలో రాణిస్తోన్న జెయింట్స్ వల్ల కిరణా దుకాణాలకు నష్టమే తప్పితే, లాభం లేదు. దీనికి ఆన్ లైన్, టెక్నాలజీ తో పరిష్కారం చూపించాలనుకన్నాం. అదే మా ఈ కాన్సెప్ట్ బయటకి రావడానికి కారణమని చెప్పుకొచ్చారాయన.

కిరాణా దుకాణాల వ్యవస్థీకరణ

కిరణా షాప్ అంటే మన జీవితంలో భాగంగా ఉన్నాయి. మన ప్రతి అవసరంలో అవి ఉన్నాయి. మన జీవితంలోని ప్రతి దశలో మనకి వాటితో అవసరం ఉండింది. కానీ కొన్నాళ్లకు ఆ వ్యవస్థ పూర్తిగా మరుగున పడుతుందంటే పెద్ద నమ్మలేని విషయమైతే కాదు. దేశ వ్యాప్తంగా అన్ ఆర్గనైజ్డ్ వ్యవస్థగా ఉన్న ఆఫ్ లైన్ కిరణాను ఇప్పుడు మేం ఆన్ లైన్ లోకి తీసుకొచ్చి వ్యవస్థీకరించాలనుకుంటున్నాం. అది కూడా కిరణా షాపులకు లాభం చేకూర్చేలా. వాటికెలాంటి నష్టం చేకూర్చకుండా చేయడమే మా కన్సప్ట్ అని వివేక్ అంటున్నారు.

“కొన్ని కిరణా షాపులు హోం డెలివరీ చేస్తున్నాయి, కానీ అవి వ్యవస్థీకరించి లేవు,” రవి

రవి చెప్పిన ప్రకారం చాలా కిరణా షాపులు ఆర్డర్లు తీసుకొని హోం డెలివరీ చేస్తున్నాయి. కస్టమర్ల ట్రస్ట్ ఆ షాపులపై ఉంది. కానీ షాప్ లో ఉన్న వస్తువులన్నింటినీ ఆన్ లైన్ లో చూపిస్తే, వాటినుంచి కావల్సినవి తీసుకునే అవకాశం ఉంటే బాగుంటందని అనిపించింది. అదే కోణంలో మేం వర్కవుట్ చేసుకుంటూ వచ్చాం. మరో వైపు అటు షాప్ కీపర్స్ కు కూడా కస్టమర్లకు సౌకర్యవంతంగా సేవలందించే అవకాశం ఇస్తున్నాం.

image


సామాజిక కోణం

కిరాణా దుకాణాలను నమ్ముకొని కొన్ని కోట్ల కుటుంబాలు జీవిస్తున్నాయి. రోజు రోజుకీ ఈ షాపులు కస్టమర్లను కోల్పోతున్నాయి. జనం టెక్నాలజీ వాడకానికి అప్ గ్రేడ్ అయ్యారు. కిరణా షాపుల్లో కొన్ని మాత్రమే ఆన్ లైన్ సేవలను అందించే స్థాయికి ఎగబాకాయి. కానీ తొంబై శాతం కిరాణా దుకాణాలు టెక్నాలజీకి ఆమడ దూరంలో ఉన్నాయి. చిన్న చిన్న కిరణా షాపుల సంఖ్య ఇందులో ఎక్కువ. ఓ కిరాణా షాపు అంటే ఒకటి నుంచి రెండు కుటుంబాల పోషణ. వారి లైవ్లీ ఉడ్ దీనిపైనే ఆధరపడి ఉంది. ఆన్ లైన్ గ్రాసరీ మార్కెట్ పూర్తిగా వీరి జీవితాలపై ప్రభావితం చేసే స్థాయికి చేరే ప్రమాదం లేకపోలేదు.

“చిన్న, చితకా కిరణా షాపులకు టెక్నాలజీ సాయం అందించడం ద్వారా వాటి మనుగడ కాపాడటమే మా అంతిమ లక్ష్యం,” రవి

కిరాణా వ్యవస్థ అంతా అన్ ఆర్గనైజ్డ్ గా ఉంది. టెక్నాలజీతో దాన్నివ్యవస్థీకరించడమే కాదు తద్వారా కిరణా వ్యాపారులకు సాయం అందించడం నుక్కుట్ షాప్స్ లక్ష్యమని అంటున్నారాయన.

image


నుక్కడ్ షాప్స్ పనితీరు

అపార్ట్ మెంట్స్, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలతోపాటు హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో ఉన్న చిన్ని చిన్న కిరణా దుకాణాలను నుక్కూట్ షాప్స్ సాఫ్ట్ వేర్ సపోర్ట్ అందిస్తుంది. నుక్కడ్ షాప్స్ యాప్ లో ఈ చిన్న దుకాణాలు అందుబాటులో ఉంటాయి. ఆ షాప్ లో ఉన్న వస్తువుల వివరాలు కస్టమర్లు చూడొచ్చు. వారికి కావల్సిన వాటిని ఆర్డర్ చేయొచ్చు. ప్రస్తుతం సిటీలో 200లకు దుకాణాలను ఈ ప్లాట్ ఫాం కిందకు తీసుకొచ్చారు. రోజుకి మూడు వందల ఆర్డర్లు జరుగుతున్నాయి. వీకెండ్స్ లో 500 దాకా జరుగుతున్నాయని వివేక్ చెబుతున్నారు. ప్రారంభించి మూడునెలల్లో ఉన్న నంబర్స్ ఇవి. మరో మూడు నెలల్లో మనం ఊహించిన దానికంటే ఎక్కువ పెరుగుదల నమోదు చేయొచ్చని ఆయన దీమా వ్యక్తం చేస్తన్నారు. గ్రోత్ రేట్ కూడా 60శాతం ఉందంటున్నారు. రోజుకి యాక్టివ్ యూజర్లు 2వేలు దాకా ఉన్నారు.

నుక్కడ్ షాప్స్ టీం

పర్పుల్ టాక్స్ బ్రెయిన్ చెయిల్డ్ అయిన నుక్కడ్ కి ఆ సంస్థనుంచే ముగ్గురు వ్యక్తులు కీ రోల్స్ లో పని చేస్తున్నారు. వివేక్ శుక్ల అప్లికేషన్ డెవలప్ మెంట్ నుంచి పూర్తి స్థాయిలో దీనిపై పనిచేస్తున్నారు. లీపోక్ ఇమ్ సొంగ్, కులశేఖర్ రెడ్డిలు ప్రధానంగా మార్కెటింగ్ స్ట్రాటజీ, ఇతర వ్యవహారాలు చూసుకుంటున్నారు. 25మంది ఆన్ రోల్ ఉద్యోగులు దీనిలో పనిచేస్తున్నారు.

ఫండింగ్

నుక్కడ్ షాప్స్ ప్రారంభం నుంచే సీడ్ ఫండింగ్ గా ఒక మిలియన్ డాలర్లను పర్పుల్ టాక్స్ నుంచి పొందింది. దీన్ని అంచెలంచెలుగా పెంచుతామని రవి కోరుకొండ చెబుతున్నారు. వచ్చే ఆరునెలల్లో ఈ మొత్తం ఫండింగ్ ఖర్చు చేస్తామంటున్నారు.

సవాళ్లు, పోటీదారులు

బిగ్ బాస్కెట్ లాంటి పెద్ద ప్లేయర్లు ఈ సెక్టార్ లో పోటీ దారునిగా ఉన్నారు. కాన్సప్ట్ పరంగా చూస్తే తమది యునిక్ కాన్సెప్ట్ అంటున్నారు రవి కోరుకొండ. తమ సంస్థతో అటు వినియోగదారులకు, ఇటు కస్టమర్లకు ఇద్దరీ ప్రయోజనం ఉండం విశేషం అంటున్నారాయన. ప్రస్తుతం బిటుబి సెక్టారుపై తాము పూర్తి స్థాయిలో పనిచేస్తున్నామన్నారు. షాప్ లను వెతకడం, వారిని ఒప్పించడమే నుక్కూట్ షాప్ కు పెద్ద సవాలంటున్నారు. అయితే వారికి ఇతర పోటీ దారుల కంటే తమ దగ్గరే ప్రయోజనాలుండటంతో ఇది పెద్ద సవాలు కాదంటున్నారు వివేక్.

image


భవిష్యత్ ప్రణాళికలు

దేశ వ్యాప్తంగా 8లక్షల కిరణా షాపులున్నాయి. దాదాపు 300బిలియన్ల రిటేల్ మార్కెట్ ఉంది. భవిష్యత్ లో ఇది ఆన్ లైన్ బాట పట్టనుంది. దీనిలో మేజర్ షేర్ తీసుకోవడమే తమ లక్ష్యం అంటున్నారు రవి. యాప్ ను ఇప్పటికే తెలుగులో అందుబాటులోకి తెచ్చామని, మరిన్ని భాషల్లో తీసుకు రావాలని చూస్తున్నామంటున్నారు. వచ్చే రెండేళ్లలో దేశ వ్యాప్తంగా నుక్కడ్ షాప్స్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

“ఆఫ్ లైన్ కిరాణా షాపుల కోసం ఓ ఈకో సిస్టమ్ ను తయారు చేయడమే తమ లక్ష్యమని ముగిచారు రవి”

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India