సంకలనాలు
Telugu

స్టార్టప్ విజయానికి ఐదు మెట్లు... మహిళా అంట్రప్రెన్యూర్లకు ప్రత్యేకం

SOWJANYA RAJ
23rd Mar 2016
2+ Shares
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on


"టెక్నాలజీ రంగంలో మహిళలకు అవకాశాలు పెరగాలి. ఇందుకు మహిళలు మరింత ఎడ్యుకేట్ అయ్యేలా చేయడమే పరిష్కారం కాదు. దీనికి బదులుగా పురుష సహోద్యోగులను, ఫౌండర్స్ ను, ఇన్వెస్టర్లను చైతన్యవంతం చేయాలి. టెక్ స్టార్టప్ కమ్యూనిటీలో లింగ వివక్షను పోవడానికి మరింత ఎవేర్ నెస్ కావాలి. టెక్ రంగంలో మహిళల పాత్ర చాలా అవసరం. విభిన్న సమస్యల పరిష్కారానికి అంత విశాలంగా ఆలోచించే మహిళల నాయకత్వం అవసరం"

స్టార్టప్ ప్రపంచంలో సక్సెస్ ఫుల్ అంట్రప్రెన్యూర్ గా , రచయితగా పేరు తెచ్చుకున్న సారా నాదవ్... మార్చి 8 మహిళా దినోత్సవం రోజు చేసిన స్పీచ్ లోని ముఖ్యాంశాలు. టెక్నాలజీ రంగంలో ప్రతి ఒక్కరిని ఇవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మహిళల పాత్ర పెరగాలంటే వారు మరింత నాలెడ్జ్ పెంచుకోవాలని పెంచుకోవాలని పదే పదే సూచించే వక్తలకు భిన్నంగా సారా.. తన వాణి వినిపించారు. నిజమే కదా...! పెరగలాల్సింది మహిళల నాలెడ్జ్ కాదు ... అంతకు మించి ఆ రంగంలో ఉన్న వ్యక్తుల మైండ్ సెట్ లో మార్పు కూడా. సారా చెప్పిన మాటలు అక్షర సత్యమంటున్నారు మహిళా అంట్రపెన్యూర్ చంద్రికా పస్రిచా.

టెక్నాలజీ రంగంలో ఉద్యోగినుల విషయంలోనే వివక్ష చూపుతున్నప్పుడు... మరి అంట్రపెన్యూర్ గా ఎదగాలంటే ఇంకెన్ని సవాళ్లు అధిగమించాలి. ఉద్యోగాన్ని వదిలి స్టార్టప్ ప్రారంభించాలనుకున్నప్పుడు చంద్రికా లెక్కలేనన్ని సవాళ్లు ఎదుర్కొన్నారు. అందులో మొదటిది లింగవివక్షే. ప్రస్తుతం ఇతర రంగాలతో పోలిస్తే మహిళలకు చాలా ఉత్తమమమైనది టెక్నాలజీ రంగమే. సంప్రదాయ పద్దతులకు భిన్నంగా వ్యాపారాన్ని కొత్తపుంతలు తొక్కించే అవకాశం ఇక్కడ ఉంది. అధిక పోటీ, మోసకారి వాతావరణం ఉన్నప్పటికీ.. విభిన్నంగా ఆలోచిస్తే విజయానికి ఎప్పటికీ దగ్గరే.

2012లో అంట్రప్రెన్యూర్ గా మారాలని నిర్ణయించుకుని సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన మెనేజ్ మెంట్ కన్సల్టెన్సీ కంపెనీ నుంచి వైదొలిగారు చంద్రికా. తర్వాత స్టార్టప్ కంపెనీ "ఫ్లెక్సింగ్ ఇట్" పని ప్రారంభించారు. సంస్థలను, నిపుణులను, సలహాదారులను కన్సల్టింగ్ ఎక్స్ పర్ట్స్ ను ప్రాజెక్ట్స్ కోసం కలిపే ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ సృష్టించడం ఫ్లెక్సింగ్ ఇట్ లక్ష్యం. హైక్వాలిఫైడ్ నిపుణులు పదహారువేల మందితో మేం కమ్యూనిటీని క్రియేట్ చేశారు. వీరిలో అరవై ఐదు శాతానికిపైగా ఏ గ్రేడ్ ఇనిస్టిట్యూట్స్ నుంచి వచ్చినవాళ్లే. ఐఐటీ, ఐఐఎం, ఐఎస్బీ, హార్వార్డ్ లాంటి ప్రఖ్యాత విద్యాసంస్థల నుంచి వారే. యాభై శాతం మంది దశాబ్దానికి మించి అనుభవం ఉన్నవారే. ఇందులో మరో విశేషం ఏమిటంటే... పదహారు వేల మంది నిపుణుల్లో సగానికి సగం మంది మహిళలే. బీటా వెర్షన్ లాంచ్ చేసిన రెండేళ్ల తర్వాత మేం స్ట్రాంగ్ ప్రొడక్ట్ ఫౌండేషన్, హై క్యాలిబర్ యూజర్స్ ను ఆకట్టుకోగలిగారు. అప్పుడే ఎంజెల్ ఇన్వెస్టర్లు సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత ఫ్లెక్సింగ్ ఇట్ కు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరంరాలేదు. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందుకు సాగారు.

image


స్టార్టప్ ఫౌండర్ గా చంద్రికా ప్రతి దశలోనూ సవాళ్లను ఎదుర్కొన్నారు. వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. కొత్తగా అంట్రపెన్యూర్లుగా మారిన, మారుదామనుకుంటున్న మహిళల కోసం వాటి నుంచి ఓ ఐదు ఆణిముత్యాల్లాంటి సలహాలను ఇస్తున్నారు.

ముఖ్యమైన అంశాలు, సమస్యలు గుర్తించండి

స్టార్టప్ పెట్టాలనుకున్నప్పుడు ముందుగా... ఆ స్టార్టప్ కు సంబందించిన ఎదుర్కోవాల్సిన సమస్యలు, పరిష్కరించాల్సిన అంశాలను ముందుగా అంచనా వేసుకోండి. వాటిని బాగా ఆర్థం చేసుకుంటే పరిష్కరించడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఫ్లెక్సింగ్ ఇట్ టెక్నాలజీ డ్రివెన్ కంపెనీ. కానీ ఫ్లెక్సింగ్ ఇట్ టెక్నాలజీ కాదు. అవసరమైన, ప్రాజెక్ట్ కు అవసరమైన నిపుణులను డిమాండ్ కు తగినట్లుగా సరఫరా చేయగలిగాలి. అయితే ఒక టెక్ స్టార్టప్ లో అనేక సార్లు సర్దుబాట్లు చేయడానికి, ఉత్పత్తిని మార్చడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించి సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉంటే ...చాలా ఈజీగా పరిష్కారాలు లభిస్తాయి.

ప్రొడక్ట్ సులువుగా ఉపయోగించేలా ఉండాలి..!

స్టార్టప్ ప్రొడక్ట్ వినియోగదారులకు అత్యంత సులభంగా అర్థమయ్యేలా ఉండాలి. కొత్త ఫీచర్లను కస్టమర్లు ఎప్పుడూ ఆహ్వానిస్తారు. అపరిమితమైన అవకాశాల్ని అందిపుచ్చుకోడానికి, సరికొత్త ట్రెండ్ నెలకొల్పడానికి ఫౌండర్లు కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రొడక్ట్ ని అంత బాగా చేయడానికి ఎంత కష్టపడ్డారనేది వినియోగదారులు పట్టించుకోరు. వారు అత్యంత సింపుల్ గా దాన్ని యూజ్ చేయాలనుకుంటారు. ప్రొడక్ట్ తయారు చేయడంలో కొన్ని సార్లు వైఫల్యాలూ ఎదురుకావచ్చు. ముందస్తు ప్రణాళికతో కస్టమర్ ఫ్రెండ్లీగా ప్రొడక్ట్ ను తయారు చేస్తే అది ఎప్పటికి వృధా ప్రయత్నం కాబోదు.

ముందే సమస్యను ఊహించండి.. పరిష్కారాన్ని కనుగొనండి..

ఏ సంస్థఅయినా .. ఉత్పత్తి అయినా కస్టమర్ ఫీడ్ బ్యాక్ లేకుండా మనగలగడం కష్టం. అయితే అన్నిసార్లు మీరు దీని కోసం వేచి చూస్తూ ఉండలేరు. ప్రతీసారి కస్టమర్లు వారి భవిష్యత్ అవసరాలను మీకు ముందుగా చెప్పే అవకాశం రాకపోవచ్చు. అందుకే స్టార్టప్ ఫౌండర్ గా మీకు మీ బృందానికి ముందుగా వచ్చే సమస్యలు, వాటి పరిష్కాలను అంచనా వేసి పెట్టుకోవాలి. కొన్ని సార్లు కస్టమర్ల అంచనాలను అందుకోవడం చాలెంజ్ గా మారొచ్చు. ఒక్కోసారి తమ సమస్యలేమిటో కస్టమర్లు కూడా గుర్తించలేరు. కానీ వాటిని అంచనా వేసి దానికి తగ్గట్లుగా ప్రొడక్ట్ డిజైన్ చేయడం వల్లే దీర్ఘ కాలంలో విజయాలు నమోదు చేయవచ్చు. ఇలాంటి సమయాల్లో కస్టమర్లను కన్విన్స్ చేయడం చాలా క్లిష్టమైన సమస్యే. ఎందుకంటే వారికేమి కావాలో వారికే తెలియదు. అందుకే ప్రతి అంశంపై అవగాహన... ముందు చూపుతో రెడీగాఉండాలి. లేకపోతే మరొక పోటీదారు సిద్దంగా ఉంటారు. .

కనిపించని అడ్డంకులు... రిజల్ట్స్ తోనే సమాధానాలు

టెక్ ఇండస్ట్రీలో మహిళలకు కనిపించని అడ్డంకులున్నాయి. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. నేను టెక్ స్టార్టప్ ప్రారంభిస్తున్నడు మేల్ డామినేటెడెడ్ వ్యవస్థలో ఉన్న వివక్షను అడ్డంకులను ఎదుర్కొన్నాను. అయితే మీ ఉత్పత్తి గొప్పది అయితే ఇతర రంగాలు, పరిశ్రమలతో పోలిస్తే విజయం చాలా సులభంగా లభిస్తుంది. ఇక్కడ మహిళా అంట్రపెన్యూర్లు తమ బారియర్లను అధిగమించడానికి ఫలితాలపైనే ఆధారపడాలి.

మీకు అండా.. దండా మీ బ్యాచ్

మహిళా స్టార్టప్ ఫౌండర్ కు ఒంటరితనం పెద్ద బరువు. భర్త, కుటుంబం, స్నేహితుల ప్రొత్సాహం అన్ని వేళలా ఊరటనివ్వదు. అందుకే మీదైన గ్రూప్ ను తయారు చేసుకోండి. సహ స్టార్టప్ ఫౌండర్లతో తరచూ సమావేశం అవుతూ ఉండండి. సహ అంట్రప్రెన్యూర్లతో ఓ నెట్ వర్క్ లా ఏర్పాటు చేసుకోండి. వారితో కష్టసుఖాలు పంచుకోండి. నేనైతే ఇలా ఓ ఐదారుగురితో ఓ క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ మెయిన్ టైమ్ చేయగలుగుతన్నాను. వీరిలో ఐఐఎమ్ బ్యాచ్ మేట్స్, పాత సంస్థలోని సహ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా స్టార్టప్స్ ను ప్రారంభించినవారే. మేము తరచూ సమావేశమవుతాం. స్టార్టప్స్ వృద్ధిని చర్చించుకుంటాం. వాట్సాప్ గ్రూపుల్లో నిరంతరం అభిప్రాయాలు పంచుకుంటాం. ఫండింగ్ నుంచి హైరింగ్ వరకూ అన్నింటిలోనూ ఒకరికొకరం సలహాలు తీసుకుంటాం. కొన్నిసార్లు చాలా చిన్న సమస్యలు చాలా సమయాన్ని తీసుకుంటూ ఉంటాయి.. అలాంటప్పుడు మిత్రుల సలహాలు పెద్ద ఊరటనిస్తాయి.

తన స్టార్టప్ జర్నీ నుంచి నేర్చుకున్న అనుభవాల నుంచి చంద్రికా పస్రిచా... చూపించిన ఈ ఐదు సూచనలు మహిళా అంట్రప్రెన్యూర్లకు కచ్చితంగా స్ఫూర్తినిస్తాయనడంలో సందేహం లేదు.

2+ Shares
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags