సంకలనాలు
Telugu

14 ఏళ్లకే సీఈవో అయ్యాడు ! అమెరికాలో సత్తా చూపిన ఇండియన్ పిల్లోడు !

HIMA JWALA
6th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

కళ్లలో చిమ్మచీకట్లు నింపుకున్న అంధుల జీవితాల్లో వెలుగు రేఖలు ప్రసరింపజేసిన మహానుభావుడు లూయీ బ్రెయిలీ! వారి కంటికి కనిపించని రంగుల ప్రపంచాన్ని అక్షరాల రూపంలో ప్రసాదించిన దేవుడాయన. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ పుస్తకాలు ఎంతమందికి అందుబాటులో ఉన్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం కొంచెం కష్టమే. ఎందుకంటే బ్రెయిలీ లిపితో కూడిన పుస్తకాల రేటును భరించలేం. అవి ముద్రించే ప్రింటర్ల ఖర్చునూ తట్టుకోలేం.

image


ఎందుకిలా జరుగుతోంది? అంధుల కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన పుస్తకాలు- వాళ్లకే అందుబాటులో లేనప్పుడు -వాటిని తయారుచేసి ప్రయోజనమేంటి? వాళ్లకు కాకుండా మరెవరికీ ఉపయోగపడని పుస్తకాల ధరలు అంతంత ఎందుకుండాలి?

శుభమ్ బెనర్జీ అనే 14 ఏళ్ల ఎన్నారై పిల్లోడు ఈ ప్రశ్నల దగ్గర ఆగిపోయాడు. వారికోసం పుస్తకాలైనా, ప్రింటర్లయినా తక్కువ ధరలో అందుబాటులో ఉంచొచ్చు కదా? మనసులో ఈ ఆలోచన బలంగా నాటుకుంది. ప్రశ్న ఒక్కటే కాదు- సమాధానం కూడా నేనే ఇవ్వాలి అనుకున్నాడు. అలా పురుడు పోసుకుంది బ్రెయిలీ ప్రింటర్ రూపకల్పన.

అసలు బ్రెయిలీ లిపి ఎలా వుంటుంది? దాని ప్రింటర్ ఎలా పనిచేస్తుంది? ముందు ఆ విషయం కనుక్కోవాలి! పరిశోధించాడు! రోజుల తరబడి. ఓ పక్కన స్కూలు అసైన్‌మెంట్లు. మరోపక్క ప్రింటర్ కోసం కుస్తీలు. ఒక్కోరోజు రాత్రి 2-3 అయ్యేది. చివరకు ఒక శాంపిల్ ఔట్ పుట్ వచ్చింది.

సాధారణంగా ఒక బ్రెయిలీ ప్రింటర్ ఖరీదు లక్షకు పైనే ఉంటుంది. శుభమ్ బెనర్జీ రూపొందించిన మోడల్ ప్రింటర్ ఖరీదు కేవలం 20 వేల రూపాయలే. దాని పేరు బ్రెయిగో. లూయీ బ్రెయిలీ పేరు, దాని ప్రింటర్ లెగో పేరు కలుపుతూ తన కొత్త ప్రింటర్‌కు ‘బెయిగో’ అని పేరు పెట్టాడు.

లో కాస్ట్ బ్రెయిలీ ప్రింటర్ సక్సెస్ అయ్యాక మనోడి దృష్టి లైట్ వెయిట్ డెస్క్ టాప్ ప్రింటర్ మీద పడింది. దాని స్పెషాలిటీ ఏంటంటే ఎలక్ట్రానిక్ టెక్స్ట్‌ ని బ్రెయిలీలోకి కన్వర్ట్ చేస్తుంది. ఖర్చు మొత్తం కలిపితే 350 డాలర్లు దాటదు. ఐదుగురు ఇంజినీర్లను అప్పాయింట్ చేసుకున్నాడు. డెస్క్ టాప్ నుంచే కాకుండా మొబైల్ నుంచి కూడా ప్రింటవుట్ తీసుకునేలా రూపొందించాలన్నది శుభమ్ ప్లాన్.

చదువు పక్కన పెట్టి ఏంట్రా ఇదంతా అని- అమ్మానాన్న ఏనాడూ అనలేదు. కొడుక్కి మంచి ఆలోచన వచ్చినందుకు వాళ్లు కూడా సంతోషించారు. అంధుల కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాను. అది విజయవంతం చేశాను. అంతకంటే ఆనందం ఇంకేముంటుంది అంటాడు శుభమ్‌.

కాకపోతే ఒక్క విషయం. ఈ ప్రింటర్ పెద్ద ఎత్తున పుస్తకాల తయారీకి ఉపయోగపడదు. ఎవరికి వారు కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. ఈ కిట్ గురించి పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయి. కావాలనుకొనేవాళ్లు ఆర్డర్ చేయవచ్చు.

ఆ మధ్య అమెరికాలోని ఓ సైన్స్ ఎగ్జిబిషన్‌లో శుభమ్ తన శాంపిల్ ను ప్రదర్శించినప్పుడు అందరూ ఆసక్తిగా గమనించారు. తక్కువ ధరలో బ్రెయిలీ ప్రింటర్ ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోయారు. శుభమ్ ఆవిష్కరణ ఒక సంచలన వార్తయింది. అమెరికన్ మీడియా ఆ పిల్లాడిని ఆకాశానికెత్తింది. చిన్న వయసులోనే పెద్ద మేథావి అని ప్రశంసల జల్లు కురిపించింది.

ఒక మంచి ఆశయం కోసం కనుగొన్న ప్రింటర్‌ అందరికీ అందుబాటులోకి రావాలి! అలా కావాలంటే కచ్చితంగా దాన్ని మార్కెట్లో పెట్టాలి. లేకుంటే కష్టం. గొప్ప ఆవిష్కరణకు అర్ధం లేకుండా పోతుంది. శుభమ్ తండ్రి అదే అంటాడు.

ప్రస్తుతానికైతే శుభమ్ బ్రెయిగో స్టార్టప్ ఫౌండర్ కమ్ సీఈవో. వెంచర్ కేపిటలిస్టులతో సమావేశాలు, ఇంజినీర్లతో మేథోమథనాలు. బ్రెయిగో కంపెనీకి సీఈవో అయ్యాక క్షణం తీరిక లేదు. అన్నట్టు శుభమ్ బ్రెయిన్ చైల్డ్ కంపెనీకి ఇంటెల్ కార్పొరేషన్ ఇన్వెస్ట్ చేసింది. అయితే తన లైఫ్ అజెండాలో మాత్రం బిలియనీర్ కావాలని లేదట. ఇంజినీర్ లేకుంటే సర్జన్ కావాలన్నది శుభమ్ మనసులో మాట.

టైం దొరికినప్పుడే స్కూల్‌కి వెళ్లే ఈ బుల్లి సీఈవోని చూసి తోటి విద్యార్ధులు గర్వంగా ఫీలవుతున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags