సంకలనాలు
Telugu

ఫారిన్ కంపెనీలకు గట్టిపోటీ... డాలీ కుమార్ స్టార్టప్

హెల్తీ ఫుడ్ అవసరాన్ని చాటిచెబుతున్న మహిళగాయా పేరుతో హెల్త్ అండ్ వెల్నెస్ ఫుడ్ బ్రాండ్కెలాగ్స్, నెస్లెతో పోటీపడుతున్న ఇండియా బ్రాండ్

Sri
4th Sep 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

అందం అనగానే బాహ్యసౌందర్యం అనుకుంటారు. కానీ అందం అంటే అంతర్లీనంగా ఉండేది అనేది డాలీ కుమార్ విశ్వాసం. మనిషి ఆరోగ్యంగా లేనప్పుడు ఎంత అందంగా ఉంటే ఏం లాభమనేది ఆమె మాట. అందుకే అందం పేరుతో కట్టిపడేసుకున్న బంధాలన్నీ తెంచుకొని.. వాస్తవాన్ని గ్రహించాలి అంటూ సూచిస్తారు. నిజమే. అందుకే ఆమె బ్యూటీ సెక్టార్‌కి గుడ్ బై చెప్పి... హెల్త్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఫీల్ యంగర్... లీవ్ యంగర్ అంటున్నారు.

ప్రపంచస్థాయి బ్రాండ్లతో పోటీ

డాలీ కుమార్... మధ్యవయస్కురాలు. అందం కోసం పాకులాడుతూ సౌందర్య సాధనాలపై ఎక్కువ ఖర్చు చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఆ డబ్బేదో ఆరోగ్యం కోసం ఖర్చు పెడితే అందం కూడా వస్తుందన్నది ఆమె చెప్పే మాట. అందం అంటే కేవలం బాహ్యమైనది కాదని చెప్పే ప్రయత్నం చేస్తారు. డాలీ గతంలో బ్యూటీ సెక్టార్‌లో పనిచేసేవారు. కానీ అందులో ఏమీ లేదని గుర్తించి ఆ ఫీల్డ్ కు గుడ్ బై చెప్పారు. అప్పట్నుంచీ తన కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. గాయా(GAIA) పేరుతో సొంత వెంచర్ ప్రారంభించారు. గాయా గ్రీకు పదం. భూమాత, భూదేవి అని అర్థం.

"భూమికి పునరుత్పత్తి శక్తి ఉంటుంది. అలాగే మానవ శరీరానికీ పునరుత్పత్తి శక్తి ఉంది. ఆ శక్తిని సమర్థంగా వాడుకోగలిగితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆ విధంగా మా ఉత్పత్తులన్నీ నిత్యయవ్వనంగా ఉండేందుకు తోడ్పడుతుంటాయి" అంటారు డాలీ.

2009లో వీళ్లది మామూలు వెంచర్. కానీ ప్రపంచస్థాయి బ్రాండ్‌లు అయిన కెలాగ్స్, నెస్లె కంపెనీలను ఢీకొడుతున్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. వాటితో సమానంగా మార్కెట్లో స్థానం సంపాదించుకుంది గాయా. ఇండియన్ మార్కెట్లో ఈస్థాయిలో గుర్తింపు రావడం వెనుక ఎంతో కృషి ఉంది. సరికొత్త ఆవిష్కరణలు, నాణ్యత, పనిపై ఆసక్తి, కష్టపడటం ద్వారా బ్రాండ్ కి వ్యాల్యూ తీసుకురాగలిగారు. సరిగ్గా తన వ్యక్తిత్వం, ఆలోచనలు, ఆశయాలకు తగ్గట్టుగా బ్రాండ్ ను తీర్చిదిద్దారు డాలీ కుమార్.

డాలి కుమార్, గాయా వ్యవస్థాపకురాలు

డాలి కుమార్, గాయా వ్యవస్థాపకురాలు


ట్రైనీ నుంచి ఫౌండర్ వరకు...

మేనేజ్మెంట్ ట్రైనీగా కెరీర్ ప్రారంభించిన డాలీ... గాయా ఫౌండర్‌గా సక్సెస్ అయ్యారు. 1972లో ఢిల్లీలో జన్మించిన డాలీ.. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి కాస్మెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. మేనేజ్‌మెంట్ ట్రైనీగా కెరీర్ ప్రారంభించారు. కొన్నాళ్లకు కలర్ బార్ కాస్మెటిక్స్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా జాయిన్ అయ్యారు. ఈ తరం కోసం కాస్మెటిక్స్ తయారు చేయడంలో ముఖ్యపాత్ర పోషించారామె. కొన్నాళ్లకు కలర్ బార్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. 

2008లో కంపెనీకి గుడ్ బై చెప్పి గాయాను ప్రారంభించారు. హెల్త్ అండ్ వెల్నెస్ రీటైల్ బ్రాండ్‌ను ప్రారంభించడమే కాదు... మాతృసంస్థ అయిన కాస్మిక్ న్యూట్రాకోస్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కాస్మిక్ న్యూట్రాకోస్ ప్యాకేజ్ ఫుడ్, హెల్త్ సప్లిమెంట్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అందిస్తోంది. దేశంలో మరిన్ని బ్రాండ్లకు సేవలందిస్తోంది.

"నా కెరీర్ ని నేనెప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. బ్యూటీ బిజినెస్ లో చేసిన పనే చేస్తుండటం బోర్ కొట్టేది. అప్పుడే నాకు ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే సరైన బ్రాండ్ ఏదీ లేదనిపించింది. చికిత్స కన్నా నివారణే మార్గం అన్న సూత్రాన్ని నేను నమ్ముతాను. అందుకే ప్రివెంటీవ్ హెల్త్ కేర్ కోసం సప్లిమెంట్స్ ని, వాటికి ప్రత్యామ్నాయాలను రూపొందిస్తున్నాను. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఖర్చుపెట్టడం కన్నా ప్రివెంటీవ్ హెల్త్ ఫుడ్ పై అవగాహన పెంచుకోవడం మేలు" అంటారు డాలీ.
image


సవాళ్లతో ప్రయాణం

డాలీ కుమార్... తొలి తరం ఆంట్రప్రెన్యూర్. సరికొత్త బ్రాండ్‌ను రూపొందించడం, పరిచయం చెయ్యడం, మార్కెట్ లో స్థానం సంపాదించడంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. సరైన సిబ్బందిని ఎంచుకొని సహోద్యోగుల సాయంతో ముందుకెళ్లారు. తొలి రోజుల్లో తమ ఉత్పత్తుల గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు గాయా సిబ్బంది రిటైల్ స్టోర్లకు వెళ్లేవాళ్లు. అక్కడ కస్టమర్లు, స్టోర్ యజమానుల ఫీడ్ బ్యాక్ తీసుకునేవాళ్లు. రిటైలర్ల నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. కస్టమర్లు కూడా వీరి ఉత్పత్తులను కొనడం మొదలుపెట్టారు. అదే ఉత్సాహంతో వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నారు. డయాబెటిక్స్ ఉన్నవారి కోసం ఉత్పత్తులు తయారు చేయాలని భావిస్తున్నారు. క్రీడా ప్రేమికుల కోసం ప్రత్యేక ఉత్పత్తుల్ని తయారుచేయాలనుకుంటున్నారు.

జీవితంపై అభిరుచి, రాణించాలన్న తపన డాలీలో కనిపిస్తుంది. "అభిరుచి, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే మనస్తత్వం... ఈ మూడు లక్షణాలు ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి" అని చెబుతారామె. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలో డాలీని చూసి నేర్చుకోవచ్చు. ఓవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు కెరీర్‌లో సక్సెస్ అయిన తల్లి, అత్తగారు స్ఫూర్తిగా నిలుస్తారంటారు ఆమె. డాలీకి మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేసే భర్త, బిజినెస్ స్కూల్‌లో చదువుకునేందుకు విదేశాలకు వెళ్లిన కొడుకు ఉన్నారు. సంగీతం వినడమంటే ఆమెకు ఇష్టం. వ్యాయామం, యోగా ప్రేరణగా నిలుస్తున్నాయి. వీటితో పాటు కొత్త ప్రదేశాలకు వెళ్లడం... కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం... సంస్కృతి గురించి తెలుసుకోవడమంటే ఇష్టం. ఫీల్ యంగర్... లీవ్ యంగర్... ఇదీ ఆమె స్లోగన్.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags