సంకలనాలు
Telugu

'బోనిటో'తో ఆన్‌లైన్‌లోనూ బేరమాడి కొనండి

ABDUL SAMAD
31st May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఆన్‌లైన్ షాపింగ్ ఇప్పుడు అందరికీ తెలుసు. వందల కొద్దీ వెబ్‌సైట్లు, వేల కొద్దీ సెల్లర్లు, లక్షల కొద్దీ ప్రోడక్టులు... నచ్చిన రంగులు, భారీ డిస్కౌంట్లు, ఆకట్టుకునే ఆఫర్లు, ఇంటి దగ్గర నుంచే ఆర్డర్ చేసే సౌకర్యం, డోర్ డెలివరీ ఫెసిలిటీ. కాఫీ తాగినంత ఈజీగా అన్నిటినీ ఇంటికి తెప్పించుకునే అవకాశం కల్పించింది ఆన్‌లైన్ షాపింగ్. కానీ ఇందులో కూడా లేనిది ఒకటి ఉంది. దాన్ని అందిపుచ్చుకుంటోంది బోనిటో.ఇన్.

image


ఏదైనా వస్తువు కొనేప్పుడు రేట్ అడిగి.. ఇంతకి ఇస్తావా, ఎక్కువగా కొంటే తగ్గిస్తావా అంటూ.. బేరలాడడం మనలో చాలా మందికి అలవాటు. అలా కొనడం.. ఎంతోమందికి సరదా కూడా. మరికొంతమందైతే గీచిగీచి బేరమాడకపోతే అసలు కొన్నట్లుగానే ఫీల్ అవరు కూడా. బోనిటో.ఇన్ ప్రారంభించిన హార్దిక్, రితేష్‌లు... భారతీయుల అభిరుచికి అనుగుణంగా బార్గెయిన్ చేసుకునేలా మార్కెట్ ప్లేస్‌కు రూపకల్పన చేశారు.

హార్దిక్, రితేష్‌లు ఇద్దరూ మార్వాడి వ్యాపార కుటుంబాల నుంచి వచ్చిన వారే. బోనిటో ప్రారంభానికి ముందు ఐదేళ్లపాటు ఇద్దరికీ స్నేహం ఉంది. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక కుటుంబం నిర్వహించే టెక్స్‌టైల్ వ్యాపారంలోకి వచ్చారు రితేష్. బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు హార్దిక్. ఓ స్టార్టప్‌లో చేరి 4 ఏళ్లు పని చేశాక.. కొన్నివారాల పాటు తండ్రి నిర్వహిస్తున్న టెక్స్‌టైల్ రంగంలోకి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత బోనిటోకు రూపకల్పన చేశారు ఈ ఇద్దరు ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు. పేరెంట్స్ స్వయంగా ఎదిగినవారే కావడం, ఒకే తరహా వ్యాపారాలు నిర్విహించడంతో ఈ ఇద్దరి ఆలోచనలు కలిశాయి. లక్ష్యాలు కూడా ఒకటిగానే ఉండడంతో తమ అనుభవాలను పంచుకుని... సొంత స్టార్టప్‌కు రూపకల్పన చేశారు.

కొన్నివారాలపాటు చర్చలు నిర్వహించాక వస్త్ర వ్యాపారానికి సంబంధించి ఈ-కామర్స్ పోర్టల్ ప్రారంభించాలని భావించారు. వారి దగ్గర అప్పటికే కొన్ని నిధులు ఉండడంతో.. వాటి ఆధారంగానే కంపెనీ ప్రారంభించాలని అనుకున్నారు. ఇద్దరి దగ్గరా ల్యాప్‌టాప్స్ ఉన్నాయి. అలాగే అందుబాటులో ఉన్న బేస్‌మెంట్‌లోనే పెద్ద ప్రాజెక్ట్ డీల్ చేయాలని భావించారు. 3 నెలలపాటు దీన్ని నడిపారు కూడా.

image


మహిళలకు సాంప్రదాయ దుస్తులను అందించే ఆన్‌లైన్ పోర్టల్ బోనిటో.ఇన్. అప్పటికే ఇలాంటి వెబ్‌సైట్లు ఉన్నా... ఈ మార్కెట్ చాలా పరిమితమైనది. నాణ్యత విషయంలో గ్యారంటీ ఇవ్వడం కష్టం. అలాగే దుస్తుల సైజుల విషయంలో కూడా స్పష్టత ఇవ్వడం అంతగా కుదరని విషయం. అయితే బోనిటో.ఇన్ మాత్రం అత్యుత్తమ తయారీదారులతో ఒప్పందాలు చేసుకుని, క్వాలిటీ టీం ద్వారా ప్రతీ ఆర్టికల్‌ను చెక్ చేస్తుంది. షిప్పింగ్‌కు ముందే అన్ని అంశాలను పరిశీలిస్తారు. కస్టమర్‌కు పాడైన వస్తువు అందకుండా జాగ్రత్త పడతారు. తమ శరీరపు కొలతలు ఆన్‌లైన్‌లో ఇస్తే... కుట్టించిన దుస్తులు ఇంటికి చేరే సర్వీసును కూడా ప్రారంభించింది బోనిటో.ఇన్. ఒకవేళ ఇలా పంపినవి సరిపోకపోతే.. రిటర్న్ చేసే సౌలభ్యం కూడా అందుబాటులోకి రానుంది. బొనిటో అంటే క్వాలిటీ అని కస్టమర్లు చెప్పుకునేలా ప్రణాళికలున్నాయంటారు యువ పారిశ్రామికవేత్తలు హార్దిక్, రితేష్‌లు.

మహిళల దుస్తులకు మార్కెట్ ఎక్కువే

మహిళల సాంప్రదాయ దుస్తుల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ మార్కెట్ విలువ 25 బిలియన్ డాలర్లు. మరో ఐదేళ్లలో ఇది 30 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం మనదేశంలో ఆన్‌లైన్ మార్కెట్ విలువ 3.2 బిలియన్ డాలర్లు. ఇందులో 2 బిలియన్ డాలర్లు ఎక్స్‌పోర్ట్స్. అంటే... దేశీయంగా ఎదగడానికి చాలా అవకాశముందని.... ఈ గణాంకాలు చూస్తే అర్ధమవుతుంది. కేవలం నాణ్యత, వినూత్నమైన డిజైన్లను అందించగలిగితే... ఈ మార్కెట్‌ను అందుకోవడం అంత కష్టమేం కాదని చెప్పాలి.

image


కస్టమర్ల నుంచి వస్తున్న సానుకూలమైన ఫీడ్‌బ్యాక్ తమకు మరింత ఉత్సాహాన్నిస్తోందంటున్న బోనిటో టీం. త్వరలో విదేశాలకు షిప్పింగ్ చేసే సౌకర్యాన్ని కూడా ప్రారంభించే యోచనలో ఉన్నారు. వెబ్‌సైట్‌ను మరింతగా పర్సనలైజ్ చేసి... వినియోగదారులకు మరిన్ని సేవలు అందించాలని భావిస్తోంది బోనిటో.

బోనిటో స్పెషాలిటీ ఇంతటితో అయిపోలేదు. ఈ-షాపింగ్ ప్లాట్‌ఫాంలలో తమకో ప్రత్యేకత ఉండాలని భావించారు. “మన దేశంలో చాలా మంది చిన్నచిన్నవాటికి పట్టుబడుతుంటారు. కొన్నిసార్లు పైసల్లో తేడా కూడా లావాదేవీ స్తంభించిపోడానికి కారణమవుతోంది. అందుకో ఈ తరహా బేరమాడే అవకాశం కల్పించాలని భావించాం. ఇంకా చెప్పాలంటే బార్గెయినింగ్ ప్రతీ భారతీయుడి డీఎన్ఏలోనూ ఉంటుంది. ఇది మనందరికీ నచ్చిన విధానం. అందుకే దీన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చాం”- బోనిటో.ఇన్ టీం

ఈ బేరమాడే అవకాశం మరింతమంది కస్టమర్లను దగ్గర చేసింది బోనిటోకి. సాధారణంగా వెబ్‌సైట్‌పై వెచ్చించే సమయంతో పోల్చితే.. బోనిటోలో 120శాతం ఎక్కువ. బౌన్స్ రేట్ 30శాతం పడిపోగా... ఈ సదుపాయం కల్పించాక ఒక్కో పేజ్‌పై రెట్టింపు సమయం వెచ్చిస్తున్నారు కస్టమర్లు. ఈ ఫీచర్ ఏర్పాటు చేసిన మొదటి వారంలోనే 2వేల ఆఫర్లు వచ్చాయంటే... బేరానికి ఎంత శక్తి ఉందో అర్ధమవుతుంది. ఇందులో పదిశాతం ఆర్డర్లుగా మారాయి.

image


“మేం వినూత్నమైన సర్వీస్ ప్రారంభించామని మాకు తెలుసు. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నా... ఆఫ్‌లైన్‌లో చేసే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఈ సర్వీస్‌ను పరిచయం చేశాం. కొనుగోళ్ల విషయంలో మరిన్ని సౌకర్యాలు కల్పించదలచాం. అదే సమయంలో ఆర్డర్ల విషయంలోనూ మరింత కస్టమైజేషన్ చేయబోతున్నాం”- బోనిటో

హార్దిక్, రితేష్‌లు మొత్తం నలుగురు కోర్ టీంతో ఈ కంపెనీ నిర్వహిస్తున్నారు. గతంలో సూరత్ సెంట్రల్ మాల్‌లో డిస్పాచ్ ఆఫీసర్‌గా పని చేసిన క్రిషన్... ప్రస్తుతం బోనిటోలో క్వాలిటీ, డిస్పాచింగ్ కార్యకలాపాలు చూసుకుంటున్నారు. అలాగే బన్సారి.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం సంబధిత వ్యవహారాలను పర్యవేక్షిస్తారు.

ఈ మొత్తం టీం అందరూ 22 నుంచి 26 ఏళ్లలోపు వారే కావడం విశేషం. అయినా సరే ఎక్కడా అనిశ్చితి లేకుండా... ఒకరిపై ఒకరు ఆధారపడుతూ కంపెనీని నడుపుతున్నారు. “పదేళ్ల తర్వాత మేం ఎక్కడుండాలో మాకు తెలుసు. రిస్క్ చేయాలి, సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా వ్యవహరించగలగాలి, ఎవరి నుంచి ఏదైనా నేర్చుకోగలగాలి. ఓ చాయ్‌వాలా 3 గంటల్లో 100 ఆఫీసులకు టీ సప్లై చేస్తాడు. దాని నుంచి కూడా స్ఫూర్తి పొందగలగాలి. అప్పుడు విజయం తప్పని సరిగా మాదే.” అంటున్నారు బోనిటో.ఇన్ టీం.

website

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags