సంకలనాలు
Telugu

ఆన్ లైన్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్ సెట్

vennela null
11th Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


అందరిలా ఆలోచిస్తే ప్రత్యేకత ఏముంటుంది. నలుగురిలో మనకంటూ ఓ గుర్తింపు ఉండాలి. నలుగురిలో ప్రత్యేకంగా నిలబడాలి. ఇలాంటి ఆలోచనలే ఓ యువతిని వ్యాపారంలో విజయం సాధించేలా చేశాయి. తనకు నచ్చిన పనినే తన ఉద్యోగంలా మలుచుకుంది. అదే లేటెస్ట్ స్టార్టప్ ఎక్స్ ప్లోరేట్ డాట్ ఇన్. 

మార్కెట్లోకి కుప్పలు తెప్పలుగా సైట్లు వస్తున్నాయి. అందులో ఏది సరైందో కాదో తేల్చుకోవాలంటే బుర్రబద్దలు కొట్టుకోవాల్సిందే. వారి సందేహాలను తీర్చేందుకు ముందుకు వచ్చింది ముంబాయికి చెందిన 22ఏళ్ల ఛాంటిల్లె మేనెజెస్. త‌న పోర్ట‌ల్ లో రివ్యూల‌ను, ఛాయిస్ ల‌ను ముందుంచుతోంది.

స‌రిగ్గా ఆరు నెల‌ల క్రితం ఛాంటిల్లే త‌న స్నేహితుల‌తో క‌లిసి ఎక్స్ ప్లోరెట్ ఇన్ వెబ్‌ సైట్‌ ను ప్రారంభించింది. స‌ముద్రంలా మారిన‌ ఆన్ లైన్ షాపింగ్‌లో ముఖ్యంగా ఫ్యాష‌న్ కు సంబంధించిన ప్రాడ‌క్ట్స్ ఎంపిక చాలా క‌ష్టం. క్వాలిటీ విష‌యంలోనూ ఇత‌ర‌త్రా అంశాల్లోనూ ప‌లు సందేహాలు వ‌స్తుంటాయి. అలాంటి వాళ్ల సందేహాల‌న్నీ తీర్చి, వారికి స‌ల‌హాల‌ను, రివ్యూల‌ను ముందుంచుతూ ఆన్‌లైన్ షాపింగ్‌లో స‌హ‌క‌రించ‌డమే ఈ పోర్ట‌ల్ ల‌క్ష్యం. 

image


ఛాంటిల్లే ముంబైలో సెయింట్ జేవియర్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. స్టడీ కంప్లీట్ కాగానే... తన ఫ్రెండ్స్ తో కలిసి ఎక్స్ ఫ్లోరెట్ పోర్టల్ లో ఒక టీమ్ రెడీ చేసింది. వారి సహాయంతో ఎన్ఆర్ఐల నుంచి నిధులు సేకరించారు. వెబ్ సైట్ ప్రమోషన్ కోసం సోషల్ మీడియాను ఆశ్రయించారు. వీలైనంత ఎక్కువ మందిని ఆకట్టుకునేందుకు ఈ టీమ్ ప్రయత్నించింది. ఈమధ్యే ట్విట్టర్ లో లేడీస్ ఫస్ట్ ఆన్ అనే కాంపెయిన్ నిర్వహించారు. దాంట్లో మహిళలకు సంబంధించిన పలు అంశాలన జోడించి....వారికి స్ఫూర్తినిచ్చే వ్యక్తిత్వాలను పరిచయం చేశారు. మహిళలకు వారి అభిరుచులను తెలిపే వేదిక కల్పించారు. ఈ కాంపెయిన్ గ్రాండ్ సక్సెస్ కావడంతోపాటు ఎక్స్ ఫ్లోరేట్ వెబ్ సైట్ కు ప్రచారం కూడా ఓ రేంజిలో దక్కింది.

ఫ్యాష‌న్ రంగంతో ప‌రిచ‌యం..

ఛాంటిల్లే మదర్ ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్. ఛాంటిల్లేకు కూడా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం. అంతేకాదు లేటెస్ట్ ట్రెండ్స్ ను తన ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటూ అప్ డేట్ అవ్వడంతో ఛాంటిల్లేకు ఫ్యాషన్ రంగంపై మరింత ఆసక్తి కలిగింది. తన ఆలోచనలను డైరీల్లో రాయడం అలవాటు చేసుకుంది. ఆ డైరీలను తన ఫ్రెండ్స్.. పుస్తకాలుగా చదివేవారంటే ఆమె ఆలోచనలు ఎంత వినూత్నంగా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. 

ఎక్స్ ప్లోరేట్ ప్రత్యేకత ఏంటి...

ఆన్ లైన్ షాపింగ్ కు సంబంధించి ఎక్స్ ప్లోరేట్ మనకు ఒక గైడ్ లాంటిది. ఇందులో క‌స్ట‌మ‌ర్లే త‌మ బెస్ట్ ఛాయిస్ ఫ్యాష‌న్ వేర్ల‌ను రిఫ‌ర్ చేస్తూ సైట్‌లో ఉంచుతారు. క‌స్ట‌మ‌ర్లు రిఫ‌ర్ చేసిన ఫ్యాష‌న్ వేర్ ను సైట్లో మ‌నకు అందుబాటులో ఉంటుంది. వాటిని కొనుగోలు చేయాల‌నుకునే వారివారి రిఫ‌రెన్స్ లింక్ ద్వారా ఆన్ లైన్ షాపింగ్ పోర్ట‌ల్ లోకి ప్ర‌వేశించి పేమెంట్ జ‌ర‌ప‌వ‌చ్చు. ఇది ఒక వినూత్న‌మైన ఆలోచ‌న. ఏ కస్ట‌మ‌ర్ రిఫ‌రెన్సయితే ఎక్కువ మంది కొంటారో, లేదంటే ఏ కస్టరమ్ సూచించిన‌ ప్రాడ‌క్టును ఎక్కువ మంది కొనుగోలు చేస్తారరో ఆ క‌స్ట‌మ‌ర్ కు రిఫ‌రెల్ బోన‌స్ కూడా ఉంది. అంటే మ‌న టేస్టును, సలహాను న‌లుగురికి పంచి డ‌బ్బు కూడా సంపాదించే అవ‌కాశం ఉందన్నమాట.

ఆరునెలల్లోనే 70 శాతం వరకు ఎక్స్ ప్లోరేట్ సైట్ ను విజిట్ చేశారు. అంతేకాదు కొంత‌ మంది నాలుగేసి గంట‌లు ఈ సైట్‌ను వీక్షించారు. ఈ సైట్ కు ఇప్ప‌టికే 20 వేల మంది యూజర్లు ఉన్నారు. ఇక పేజ్ రివ్యూల విష‌యానికి వ‌స్తే 1,80,000 వ‌ర‌కు ఉన్నారు. ఎక్స్ ప్లోరేట్ ద్వారా ఇప్ప‌టికి 50వేల ఫ్యాష‌న్ ప్రాడ‌క్టుల‌ను రిఫ‌ర్ చేశారు.

సాధార‌ణంగా మ‌నం ఆన్ లైన్ మార్కెటింగ్‌లో ఏదైనా ప్రాడ‌క్టు కొనాలంటే మాత్రం ఏది ఎలాంటి ఛాయిసో తెలియ‌క త‌ల ప‌ట్టుకుంటాం. అలాంటి వారికి ఎక్స్ ప్లోరేట్ కళ్లు మూసుకొని షాపింగ్ చేయిస్తుంది.

ఎక్స్ ప్లోరేట్‌కు మిగితా వెబ్ సైట్ల‌కు తేడా ఏంటి..

ఎక్స్ ప్లోరేట్ ప్ర‌స్తుతం బిగ్ ప్లేయ‌ర్లుగా ఉన్న ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌, కూవ్స్‌, జాబంగ్ ల క‌న్నా భిన్న‌మైన‌ది. అవ‌న్నీ ప్రాడెక్టు డెలివ‌రీ బాధ్య‌త‌ను తీసుకొని, వాటి ఎంపిక‌ను మాత్ర‌మే ముందు ఉంచుతాయి. కానీ ఎక్స్ ప్లోరేట్ మాత్రం క‌స్ట‌మ‌ర్లు మెచ్చిన ఫ్యాష‌న్ వేర్ల‌ను మాత్ర‌మే ముందు వుంచుతుంది. క‌స్ట‌మ‌ర్ల అభిరుచుల‌తో ఇత‌ర క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తుంది. ఆయా పెద్ద సైట్ల‌లోకి ఎంట‌ర్ అయ్యేందుకు ఎక్స్ ప్లోరేట్ ఒక గేట్ వే అని చెప్ప‌వ‌చ్చు. 

మార్కెట్లో ఎక్స్ ప్లోరేట్‌తో పాటు రోపోసో, వూప్ల‌ర్ లాంటి ఇత‌ర డిస్క‌వ‌రీ ఇంజ‌న్లు ఉన్న‌ప్ప‌టికీ ఎక్స్‌ప్లోరేట్ మాత్రం చాలా విభిన్న‌మైన‌ది. త్వ‌ర‌లోనే ఎక్స్‌ప్లోరేట్ మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి రానుంది.

ఎక్స్‌ప్లోరేట్ ద్వారా చాలా వ‌ర‌కూ ఫ్యాష‌న్ ప్రాడక్ట్ నే అందుబాటులో వుంచుతున్నారు. ముఖ్యంగా దుస్తులు, ఫ్యాష‌న్ యాక్సెస‌రీస్‌, జ్యువెల‌రీ, ఇత‌ర ఫ్యాష‌న్ వ‌స్తువులు ఎక్స్‌ప్లోరేట్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. 2017 నాటికి దేశంలో దుస్తుల మార్కెట్ 100 బిలియ‌న్ డాల‌ర్లకు విస్త‌రిస్తుంద‌ని ఎక్స్ ప్లోరేట్ అంచ‌నా వేస్తోంది. అయితే ఇందులో 18 బిలియ‌న్ డాల‌ర్ల మార్కెట్ మాత్రం ఆన్ లైన్ మార్కెట్ ఆక్ర‌మిస్తుంద‌ని అంచ‌నా. ఫ్యాష‌న్ సంబంధిత వ‌స్తువులు సైతం ఆన్ లైన్ మార్కెట్‌లో 2 బిలియ‌న్ డాల‌ర్ల‌కు విస్త‌రిస్తాయ‌ని మార్కెట్ వ‌ర్గాలు చెప్తున్నాయి .

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags