సంకలనాలు
Telugu

కుంచెచుట్టూ నాటుకున్న కంచెల్ని తెగనరికిన'ఈకోవా'

Sri
20th Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


వెరైటీ అంటే వెరైటీ... ఎక్స్ క్లూజీవ్ అంటే ఎక్స్ క్లూజీవ్... అస్సలు కాంప్రమైజ్ కాకూడదు. మన దగ్గరున్న పెయింటింగ్ ప్రపంచంలోనే ప్రత్యేకమైనదై ఉండాలి. వేరెవరిదగ్గరా అలాంటి కళాఖండం కనిపించొద్దు. ఇదీ చాలామంది ఆలోచన. అందుకే వేలంపాటలో ఎగబడి మరీ ఇలాంటి పెయింటింగ్స్ కొంటుంటారు. ఇలా ఎక్స్ క్లూజివ్ పెయింటింగ్స్ ని ఆన్ లైన్ లో అమ్ముతోంది ఓ వెబ్ సైట్. ప్రొఫెషనల్ ఆర్టిస్టుల కుంచె నుంచి జాలువారిన పెయింటింగ్స్ ని ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే జెన్యూన్ ఆర్ట్ ఆన్ లైన్ పోర్టల్ ఈకోవా.

ఈకోవా... ఇదో గ్రీకు పదం. 'చిత్రం' అని అర్థం. ఇన్నాళ్లూ కుంచెకు అడ్డుగా ఉన్న కంచెల్ని తెంచుకుంటూ డిసెంబర్ 2015లో ప్రారంభమైంది. అర్థంపర్థంలేని వాటి నుంచి అర్థవంతమైన కళాఖండాలను వేరు చేస్తూ ది బెస్ట్ అనిపించే పెయింటింగ్స్ మాత్రమే కస్టమర్లకు అందివ్వాలన్నది వీరి లక్ష్యం. భారతదేశంలోని ప్రముఖ కళాకారుల నుంచి ఇఫ్పుడిప్పుడే కాన్వాస్ పై కుంచెలతో నాట్యం చేస్తున్న ఆర్టిస్టుల వరకు అందరి పెయింటింగ్స్ ని అమ్మకానికి పెడుతున్నారు. వెరైటీ మాత్రమే కాదు... క్వాలికీ ప్రాధాన్యమిస్తోందీ స్టార్టప్. కళాభిమానుల ప్రతీ అవసరానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వీరి సైట్ లో క్యూబిస్ట్ కళాకారుడు పికాసో నుంచి డాలి కుంచె నుంచి జాలువారిన ఆకృతుల వరకు అన్ని కళాఖండాలు లభిస్తాయి. ఫౌండర్, సీఈఓగా వైష్ణవి మురళీ అంతకు ముందు రెండుసార్లు లగ్జరీ రీటైల్ బ్రాండ్స్ మధుర గార్మెంట్స్, ఇథోస్ లాంటివాటికి సేవలందించారు. తర్వాత కళలపట్ల ఉన్న ప్రేమ ఇటువైపు నడిపించింది. 

ఈ ఫీల్డ్ లో డిమాండ్ తో పాటు సప్లై వైపు సమస్యలున్నాయి. భావి కళాకారులకు తమ టాలెంట్ ను ప్రదర్శించేందుకు సరైన వేదికలు లేవు. పరిమితంగా ఉన్న అవకాశాలతో కొత్త టాలెంట్ పరిచయం కావట్లేదు. ఆర్ట్ గ్యాలరీలు కూడా అరుదుగా అవకాశాలిస్తున్నాయి. సరైన నెట్ వర్క్ లేకపోవడం, ఆర్టిస్టులను ప్రమోట్ చేయడంలో వనరుల కొరత, మంచి ఎగ్జిబిషన్లు కొన్నే ఉండడం, ఎవరైనా ధైర్యం చేసి ప్రదర్శన నిర్వహించాలన్నా భారీ ఖర్చు కావడం లాంటివి ఆర్టిస్టులను నిరుత్సాహ పరుస్తున్నాయి. సీరియస్ ఆర్టిస్టుకకూ సరైన ప్రాతినిధ్యం లభించట్లేదు. దీంతో వాళ్లంతా హాబీ ఆర్టిస్టులుగా మిగిలిపోతున్నారు" అంటారు వైష్ణవి.

అమ్మేవాళ్ల ఇబ్బందులు ఇలా ఉంటే కొనేవాళ్ల విషయంలోనూ సమస్యలే. కొందరికి మాత్రమే కళాఖండాలు అందుబాటులో ఉంటున్నాయి. ఏం కొనాలో, ఎక్కడ కొనాలో చాలామందికి తెలియదు. చాలావరకు గ్యాలరీలు కస్టమర్లు అడుగుపెట్టగానే భయపెట్టేస్తాయి. ఆన్ లైన్ గ్యాలరీల్లో సరైన పెయింటింగ్స్ ఉండట్లేదు. వాటి ధరలు హడలెత్తిస్తాయి. కొనాలని ఆసక్తిచూపేవారికి పెయింటింగ్స్ కు సంబంధించిన సమాచారం ఉండదు. ఇన్ని లోటుపాట్లతో కొనాలనుకునేవాళ్లు భయపడిపోతారు. కళాకారులను చేరుకోవడానికి పరిమితులు ఉంటాయి. దీంతో ఈ వ్యవస్థంతా అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. "మా స్టార్టప్ లో మేము ఆ పెయింటింగ్ సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మా బ్లాగ్ 'ది కాన్వాస్'లో అందిస్తాం. తద్వారా కళాప్రియులు పెయింటింగ్ గురించి అర్థం చేసుకుంటారు" అంటారు వైష్ణవి.

Fizdi లాంటి సైట్లల్లో హాబీ ఆర్టిస్టులు తమ కళాఖండాలను ప్రదర్శిస్తున్నారు. ఇక అమెజాన్, పెప్పర్ ఫ్రై లాంటివి కూడా పెయింటింగ్స్ అమ్ముతున్నాయి. అయితే వాళ్లకూ వీళ్లకూ ఉన్న తేడా ఏంటంటే... ఈకోవా కేవలం ప్రొఫెషనల్ ఆర్టిస్టులు వేసిన ఒరిజినల్ పెయింటింగ్స్ మాత్రమే అమ్ముతుంది. దశాబ్దాలుగా పెయింటింగ్స్ వేస్తున్న సీనియర్ల కళాఖండాలు వీరిదగ్గరుంటాయి. వాటితో పాటు ఇప్పుడిప్పుడే రాణిస్తున్న ఆర్టిస్టుల వర్క్ కూడా ఆశాజనకంగానే ఉంటుంటడంతో వారికీ అవకాశం కల్పిస్తున్నారు.

"ప్రస్తుతం హాబీ ఆర్టిస్టులు, ప్రొఫెషనల్ కళాకారుల పెయింటింగ్స్ ఒకే ధరలో కనిపిస్తున్నాయి. అయితే కస్టమర్లు ఖర్చుపెట్టే ప్రతీ రూపాయికీ న్యాయం జరిగేలా చూడటం మా బాధ్యత. పదేళ్లకు పైగా పెయింటింగ్ అనుభవం ఉన్నవారితో మేం పనిచేస్తున్నాం. వాళ్లంతా ప్రత్యేకమైన స్టైల్ ని అలవర్చుకున్నవారే. అప్ కమింగ్ ఆర్టిస్టుల పెయింటింగ్స్ బాగుంటే వారినీ ప్రోత్సహిస్తున్నాం" - వైష్ణవి.

మొత్తానికి ప్రతీ పెయింటింగ్ ను పరిశీలించి దాని విలువను నిర్థారించేందుకు కొందరు నిపుణులను నియమించుకున్నారు వైష్ణవి. థీమ్స్, ఐడియాస్, ప్రొఫెషనల్ స్ట్రోక్స్ లాంటివి పరిశీలించడంలో వీళ్లు ఎక్స్ పర్ట్స్. ఈకోవా ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలపై దృష్టిపెట్టింది. ధనవంతులు, పెయింటింగ్స్ కలెక్ట్ చేసేవాళ్లు, తొలిసారి కళాఖండాల్ని కొనే వాళ్లు వీరి టార్గెట్. ఆర్టిస్టులు వారి పెయింటింగ్స్ ని ప్రదర్శించేందుకు, మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు, తోటి కళాకారులతో కలిసి పనిచేసేందుకు అవకాశం కల్పిస్తోందీ ఈకోవా. సాధారణంగా ఇలాంటి సందర్భాలు తక్కువగా కనిపిస్తాయి.

"కళాకారులందర్నీ ఒకేచోటికి చేర్చడం, సొంతగా ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వడం, సరైన వ్యక్తుల్ని కలుసుకోవడం, సరైన ధర పొందేందుకు వేదిక కల్పించడం నాకు సంతోషంగా ఉంది. ఇది కాస్త ఇబ్బందికరమైన ప్రయాణమే అయినా నాకు చాలా సంతోషాన్నిస్తోంది" అని గర్వంగా చెబుతారు వైష్ణవి.

image


ఆర్టిస్టులు వీరి దగ్గర పేరు నమోదు చేసుకోవడానికి, పెయింటింగ్స్ ప్రదర్శించడానికి ఎలాంటి ఫీజులు అవసరం లేదు. పెయింటింగ్స్ అమ్మిన తర్వాత వచ్చే కమిషనే వీరి రెవెన్యూ మోడల్. ఇప్పటి వరకు 85 మంది ఆర్టిస్టులతో కలిసి పనిచేస్తోంది. వారిలో చాలామంది నిపుణులు, సీనియర్లు. లాంఛైన నెల రోజుల్లోనే మాస్టర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేస్తున్న తొలి స్టార్టప్ ఇదే. మాధురీ భాదురీ, బిప్లాబ్ బిస్వాస్, బీణా ప్రదాన్, దినకర్ జాదవ్, నీలాద్రి పాల్ లాంటి సీనియర్ల కుంచె నుంచి జాలువారిన అద్భుత కళాఖండాలు ఉంటాయి వీరి దగ్గర. వీళ్ల కస్టమర్ల సంఖ్య తక్కువే అయినా లావాదేవీలు చాలా ఎక్కువ. ప్రతీ రోజు 100 నుంచి 150 విజిట్స్ ఉంటాయి. రెండు నెలల తక్కువ కాలంలో ఏడు లక్షల రూపాయల లావాదేవీలు జరిగాయి. ఇప్పటికే పెట్టుబడి, నిర్వహణ ఖర్చులన్నీ వచ్చేశాయి. మార్చిలో 80 శాతం వృద్ధి కనిపిస్తోంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags