సంకలనాలు
Telugu

పైసా ఖర్చు తీసుకోని మీ పర్సనల్ సెక్రటరీ 'రెలాటస్'

పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు, స్టార్టప్ నిర్వాహకులు క్షణం తీరిక లేని షెడ్యూళ్ళతో సతమతమవుతూ ఉంటారు. వివిధ సంస్థలతో మీటింగులకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాటి గురించిన వివరాలుతెలియక సమావేశాల్లో ఏంమాట్లాడాలో వారికి అర్థంకాదు. ఆయా సంస్థల వివరాలు, వ్యక్తుల ప్రొఫైల్స్ తెలియక ఇబ్బందిపడతారు,ఇలాంటి సందర్భంలో అనర్ఘళంగా మాట్లాడే అవకాశం ఉన్నా... నోరు పెగలక మౌనంగా ఉండిపోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులను మేము దూరం చేస్తామంటున్నారు Relatas.com వారు.

ABDUL SAMAD
18th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

Relatas.com అంటే ఏంటి?

image


రెలాటాస్ అనేది లింక్డ్‌ఇన్, గూగుల్ ప్లస్ లాంటి ఒక యాప్. డాక్యుమెంట్ షేరింగ్ దీని ప్రత్యేకత. మనం ఏ సంస్థతో మాట్లాడాలనుకుంటున్నామో దాని గురించి తెలియచేస్తే ఆ వివరాలన్నింటినీ చిటికెలో మీ ముందుంచుతుంది. డాక్యుమెంట్ ట్రాకింగ్ దీని ప్రత్యేకత. మన షెడ్యూల్‌కు అనుగుణంగా ఆయా వివరాలను మన దరికి చేరుస్తుంది.

కంపెనీ సమావేశాల షెడ్యూల్, కేలండర్, డాక్యుమెంట్‌లను రెలాటస్ అందిస్తుంది.

‘‘మీరు లంచ్ తర్వాత రెండుగంటలకు ఎవరిని కలవ దలుచుకున్నారో మీ వర్క్ షెడ్యూల్‌ను, ఆ సమావేశానికి సంబంధించిన వివరాలను ఈ మెయిల్ రూంలో అలర్ట్ చేస్తుంది. ఆ మెయిల్‌లో వచ్చిన వివరాల ఆధారంగా సమావేశాన్ని పూర్తిచేయవచ్చు’’అంటున్నారు రెలాటస్ డాట్ కాం సంస్థ నిర్వాహకులు సుదీప్.

పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, స్టార్టప్ నిర్వాహకులు ఇలాంటి తమ పర్సనల్ కార్యకలాపాలకోసం సెక్రటరీని నియమించుకుంటారు. అయితే ఇప్పుడు ఆ అవసరం లేకుండా... సెక్రటరీ చేసే పనులనే Relatas.com మనకు చేసి పెట్టేస్తుంది.

ప్రస్తుతం ఉన్న స్టార్టప్ కంపెనీలు, ఇతర పారిశ్రామికవేత్తలకు అవసరమయిన సమాచారం క్రోడీకరించి తన దగ్గర ఉంచుకుంది Relatas.com. ఆయా అవసరాలను Relatas.comకి తెలియచేస్తే తమ అవసరాలను గుర్తిస్తూ....తగిన సమాచారం మనకు చేరుస్తుంది.


సుదీప్, రెలాటాస్ డాట్ కామ్ వ్యవస్థాపకులు

సుదీప్, రెలాటాస్ డాట్ కామ్ వ్యవస్థాపకులు


Relatas.com టీం

Aporv.com పేరు విన్నారా. భారతీయ హేండీ క్రాఫ్ట్స్‌ని ఆన్‌లైన్ ద్వారా విదేశాల్లో విక్రయిస్తున్న ఏకైక ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ. ఈ సంస్థను సుదీప్‌దత్తా, సుమీత్ రాంపాల్‌లు Relatas.comకి రూపకల్పన చేశారు.

సుదీప్‌కి ఈ రంగంలో విశేషమయిన అనుభవం ఉంది. ఎల్అండ్‌టీ, ఇన్ఫోసిస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, సోర్స్‌బిట్స్, అపూర్వ వంటి సంస్థలో సుధీప్ కలిసి పనిచేశారు. యుఎస్, యుకె, చైనా, తైవాన్, ఇండియా దేశాల్లో సుధీప్ తన సేవలు అందిస్తున్నారు. అంతేకాదు ఐదేళ్ళ పాటు సిలికాన్ వ్యాలీలో సుదీప్ పనిచేశారు. వివిధ ఐటీ, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ సేల్స్ టీంలకు వివిధ హోదాల్లో పనిచేశారు. బిలియన్ డాలర్ కంపెనీలుగా వాటిని తీర్చిదిద్దారు.

2009లో ఇండియాకి తిరిగి వచ్చాక Aporv.com ద్వారా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు సుధీప్. ఆ తర్వాత వచ్చిన ఆలోచన Relatas.com.

సుధీప్ మరో ఫ్రెండ్ సుమీత్ రాంపాల్ డిజైనర్‌గా 15 ఏళ్ళ అనుభవం ఉంది. డిజిటల్ మీడియా, మార్కెటింగ్ డిజైన్ అంశాల్లో ఆయన దిట్ట. ఏ సంస్థకు ఎలాంటి డాక్యుమెంట్లు డిజైన్ చేయాలో సుమీత్‌కి బాగా తెలుసంటాడు సుదీప్.

సుమీత్, రెలాటాస్ డాట్ కామ్

సుమీత్, రెలాటాస్ డాట్ కామ్


లింకెడిన్, గూగుల్ మాత్రమే క్లౌడ్ షెడ్యూలింగ్ సేవలు అందిస్తున్నాయి. ముందుగా క్లయింట్లు తమకున్న లింకెడిన్, గూగుల్ అకౌంట్ల ద్వారా లాగిన్ కావాలి. ఆ తర్వాత Relatas ID క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

image


అనంతరం డాష్‌బోర్డు ద్వారా మన ఈమెయిల్‌ఐడీ, కాంటాక్ట్స్ లిస్ట్స్‌ని Relatas.com కి పంపించాలి. ఇంతకుముందు ఆయా కంపెనీలతో మాట్లాడిన విషయాలు తెలియచేయాలి. వారి ఫోన్ నెంబర్లు, ఇతర సాంకేతిక సమాచారం అందించాలి. మనం కొత్త సిటీకి వెళుతుంటే...అక్కడ ఏదైనా సాయం కావాలంటే మన కంపెనీ తరహా ఇతర కంపెనీల వివరాలు Relatas డాట్ కాం వారు అందిస్తారు.

రెలాటస్ సంస్థ తమ ఖాతాదారులకు సంబంధించి కాంటాక్ట్ సమాచారం, ఫేస్‌బుక్, ట్విట్టర్, జీమెయిల్ సమాచారాన్ని సేకరిస్తుంది. వారు ఎప్పుడైనా అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయ సాధనాల ద్వారా సమాచారాన్ని చేరవేస్తుంది.

ఏరోజు ఎవరితో సమావేశం కావాలి, సమావేశం ఎజెండా వంటి అంశాలను కేలండర్ రూపంలో అందిస్తుంది Relatas.com. ఖాతాదారులు తమకు ఇష్టమయితే తమ షెడ్యూల్‌ను కొలిగ్స్, ఫ్రెండ్స్‌తో పంచుకోవచ్చు.

అప్‌లోడ్ చేసి షేర్ చేసుకున్న వివిధ డాక్యుమెంట్లను అవసరమయినప్పుడు తీసి ఓపెన్ చేసుకోవచ్చు. మనం అప్ లోడ్ చేసిన వాటిని Relatas.com కి వెళ్ళి కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మన దగ్గరున్న సమాచారాన్ని ఇతరులు చూడకుండా Relatas.com యూజర్ ఐడీ ద్వారా చూసుకోవచ్చు.


30 మంది టెక్నికల్ టీం సహాయంతో Relatas.comని ముందుకు తీసుకెళుతున్నారు సుధీప్, సుమంత్. Relatas.comకి ఇటీవల హాట్ 100 అవార్డుని కూడా సొంతం చేసుకుంది . పారిశ్రామిక వేత్తలు, అనలిస్టులు, పెట్టుబడి దారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ అవార్డు కమిటీలో ఉన్నారు. Relatas తన పరిధిని విస్తరించుకోవాలని ఆలోచిస్తోంది. మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులకు మరింత దగ్గర కావాలని అనుకుంటోంది. వివిధ సమావేశాలు, ఇంపార్టెంట్ ఈవెంట్స్‌ని రీమైంట్ చేయాలని భావిస్తోంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags