సంకలనాలు
Telugu

ఇంటర్నెట్ అవసరం లేకుండానే మీ కారు ఎక్కడుందో చెప్పేసే ట్రాక్ కింగ్

 

11th Dec 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


సాధారణంగా క్యాబ్ సర్వీసు తీసుకుంటే క్యాబ్ ఎక్కడుందో ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. అదే మన కారు ఎక్కడుందో ఇంట్లో వాళ్లకు తెలియాలంటే ఎలా? ఫోన్ చేసి కనుక్కోవడమొక్కటే మార్గం. కొన్నిసార్లు కాల్ అటెండ్ చేయకపోతే టెన్షన్ తప్పదు. అలాంటి టెన్షన్ ఇకపై ఉండదంటోంది హైదరాబాదీ స్టార్టప్ ట్రాక్ కింగ్.

“మా ట్రాక్ కింగ్, ట్రాకింగ్ లో కింగ్ లాంటింది.” జయ్ తపాడియా

జయ్ తపాడియా, ట్రాక్ కింగ్ కో ఫౌండర్. ఒక ముఖ్యమైన పనిమీద పంపిస్తే కారు డ్రైవర్ అరగంట లేట్ గా రీచ్ అయ్యాడు. అప్పుడు తట్టిందీ ఐడియా.

image


‘ట్రాక్ కింగ్’ ఫీచర్స్

ట్రాక్ కింగ్. వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థ. ప్రపంచంలో ఎక్కడైన ఉండనీయండి. అది ఎక్కడుందో చెప్పే వ్యవస్థ . ట్రాక్ కింగ్ కు మాత్రమే సాధ్యమైన కొన్ని గొప్ప ఫీచర్లు ఈ స్టార్టప్ ను ముందుకు తీసుకు పోతున్నాయి.

ఇంటర్నెట్ లేకుండానే మెసేజ్‌ అందిస్తుంది. ట్రాక్ కింగ్ లో ఒకసారి వెహికల్ రిజిస్ట్రర్ చేసుకుంటే చాలు ఆ కారు ఎక్కడున్నదనే దాన్ని మెసేజ్‌ ద్వారా అందిస్తుంది.

  1. కారు ఇంజన్ కింద డివైజ్ పెడతారు. ఈ డివైజ్ క్లౌడ్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ప్రస్తుతం కారు ఇంజన్ ఎక్కడుందనే విషయాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంది. ఈ డివైజ్ ద్వారానే మొత్తం సమాచారం లభిస్తుంది. ఎమర్జెన్సీలో ఈ ఫీచర్ ఎంతగానో సాయపడుతుంది. స్పెషల్ సేఫ్టీ ఫీచర్. ఇదొక ప్రత్యేకమైన సేఫ్టీ ఫీచర్. అమ్మాయిలు ఒంటరిగా డ్రైవ్ చేస్తుంటే సాయపడుతుంది. వారి వెహికల్ ఎక్కడుందనే విషయాన్ని తెలియడమే కాకుండా , వన్ బటన్ తో వారి క్షేమ సమాచారం మనకు అందిస్తుంది.
  2. ట్రాక్ కింగ్ లో జియో ఫెన్సింగ్ ను ఏర్పాటు చేస్తారు. ఈ ఫెన్సింగ్ అత్యంత తక్కువ దూరాన్నిచూపిస్తుంది. సమయ భారాన్నికూడా తగ్గిస్తుంది. వీటితో పాటు ట్రాకింగ్ లో ఉండే చాలా ఫీచర్సు ఉన్నాయి.

ట్రాక్ కింగ్ పనితీరు

ట్రాకింగ్ వ్యవస్థ అందరికీ తెలిసిందే అయినప్పటికీ, దీన్ని యుటిలైజ్ చేసుకోడానికి జనం ఇంకా సిద్ధంగా లేరనే చెప్పాలి. దానికి కారణం బాగా ఖర్చుతో కూడుకున్నది కావడం. దాంతోపాటు ఇంటర్నెట్ తో ఎప్పుడూ కనెక్ట్ అయివుండాలి.

“క్లౌడ్ తో కనెక్ట్ కావడం వల్ల ఎల్లప్పుడూ ఇంటర్నెట్ లో ఉండాల్సిన అవసరం లేదు.” విజయ్ తపాడియా

ట్రాక్ కింగ్ అప్లికేషన్ అనేది ఇంటర్నెట్ లో పనిచేసే వ్యవస్థ ఇది. కానీ ఇంటర్నెట్ లేకుండానే దీనితో పనిచేయొచ్చు. నెట్ కనెక్ట్ అయిన వెంటనే డేటా అప్ డేట్ అవుతుంది. ప్రారంభించిన ఐదు నెలల్లోనే ఐదువేల మంది యూజర్లు వచ్చారు. భారత్ తో పాటు కువైట్ లోకూడా ఈ సంస్థకు క్లెయింట్స్ ఉన్నారు. మరిన్ని దేశాల్లో విస్తరించడానికి ప్రణాళిక చేస్తున్నారు. సేఫ్టీ విషయంలో మెట్రో నగరాల్లోని పోలీస్ వ్యవస్థతో టై అప్ చేసుకోడానికి సిద్ధంగా ఉన్నారు.

image


ట్రాక్ కింగ్ టీం

ట్రాక్ కింగ్ లో జయ్ తపాడియా, విజయ్ తపాడియా కో ఫౌండర్లుగా ఉన్నారు. కవలలు అయిన వీళ్లిద్దరి క్వాలిఫికేషన్ బీకాం. ఎంబీయేలో జాయిన్ అయిన మొదటి నెలలోనే ముంబై కేంద్రంగా ఓ కాల్ సెంటర్ నడిపే సంస్థతో టై అప్ అయి హైదరాబాద్ లో కాల్ సెంటర్ ప్రారంభించారు. ఆ తర్వాత చదువు కొనసాగించలేకపోయారు. అనంతరం వెబ్ సైట్ డెవలప్ మెంట్ , యాప్ డెవలప్ మెంట్ ,సాస్ లాంటి సేవలందించే ఓ సంస్థను ఏర్పాటు చేశారు. దీనినుంచి వచ్చిన ప్రాడక్టే ట్రాక్ కింగ్. వీరితో పాటు ట్రాక్ కింగ్ లో కాల్ సెంటర్ వ్యవస్థ, మార్కెటింగ్ చూసుకోడానికి మరో నలుగురు ఉద్యోగులున్నారు. మొత్తం 6మంది టీంతో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది ట్రాక్ కింగ్.

image


పోటీదారులు, లక్ష్యాలు

ట్రాకింగ్ లో బెంగళూరు, ఢిల్లీలో కొన్న స్టార్టప్స్‌ ఉన్నాయి. కానీ హైదరాబాద్ ట్రాక్ కింగ్ ప్రత్యేకం. ట్రాక్ కింగ్ లో ఉండే ఫీచర్స్ దీన్ని యునిక్ గా నిలబడేలా చేస్తున్నాయి. సబ్ స్క్రిప్షన్ మోడ్ లో ఉన్న ఈ స్టార్టప్ రెవెన్యూ మోడ్ మరిన్ని ఆదాయ వనరులను అన్వేషించాల్సి ఉంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags