సంకలనాలు
Telugu

ఖాదీ వస్త్రాలు..ఫ్యాషన్ తళుకులు..!

ashok patnaik
17th Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


భారతదేశంలో ఎక్కువగా వ్యాపారం చేసే రంగాల్లో గార్మెంట్స్ ఇండస్ట్రీ గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా చేనేత రంగంపై ఆధారపడి లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రభుత్వం దగ్గరి నుంచి సాయం ఎలా ఉన్నప్పటికీ జనం మాత్రం ఫ్యాషన్ మానియాలో పడి ఖాదీ వస్త్రాలను దూరం పెట్టారు. అయితే ఇటీవల ఖాదీ వస్త్రాలకు ఊహించని డిమాండ్ వస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ వేసుకునే కుర్తాలు ఇప్పుడు యూత్ కి ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోతున్నాయి. ఈ మధ్య ఓ కార్పొరేట్ యాడ్ జైసా దేశ్, వైసా వేష్ అంటూ తెగ హల్చల్ చేస్తోంది. ఫ్యాషన్ రంగంలో అప్పుడప్పుడు తప్పితే, పెద్దగా ఫేమస్ కాని ఖాదీ వస్త్రాలపై హైదరాబాద్ లో జరిగిన ఓ ఫ్యాషన్ షో అదుర్స్ అనిపించింది.

image


నేత కార్మికులకు సాయం..!

ఎంఐ డిజైనర్స్ సంస్థ ఈ ఖాదీ ఫ్యాషన్ షోని ఆర్గనైజ్ చేసింది. ఈ కామర్స్ జెయింట్ అమెజాన్ లాంటి సంస్థలు దీనికి మద్దతివ్వగా. ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ కమిషన్ దీని ఆర్గనైజింగ్ లో కీరోల్ ప్లే చేసింది. కెవిఐసి అంటే ఓల్డ్ సిటీలో పాతకాలం దుకాణంపై కనిపించే ఓ పురాతన బ్రాండ్ గానే హైదరాబాద్ జనానికి తెలసు. ఇప్పుడు తాజ్ క్రిష్ణ లాంటి స్టార్ హోటల్ లో ఓ సూపర్ ఫ్యాషన్ షో బ్యాక్ గ్రౌండ్ లో కనిపించడం కొద్దిగా ఆశ్చర్యంతో పాటు ఆసక్తినీ రేకెత్తించింది.

“నేత కార్మికులను మద్దతివ్వడానికే మా సంస్థ పనిచేస్తుంది, మేం ఖాదీ వస్త్రాలనే బ్రాండింగ్ చేసి ప్రమోట్ చేస్తాం” ఇంద్రాణి

వేదిక పేరుతో జరిగిన ఈ ఫ్యాషన్ షో అండ్ ఎగ్జిబిషన్ ఫౌండర్ ఇంద్రాణి. ఎంఐ డిజైనర్ సంస్థను ఏర్పాటు చేసి ఈ తరహా ఫ్యాషన్ షో ని ఇంతకు ముందు కోల్ కతాలో కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో నిర్వహించారు. భాగ్యనగర జనానికి ఫ్యాషన్ తో పాటు కాటన్ పై ఉన్న మమకారమే ఇక్కడ షో ఏర్పాటు చేసేలా చేసిందని ఇంద్రాణి చెప్పుకొచ్చారు. స్థానికంగా పోచంపల్లి, సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో చేనేత వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్ లో జరిగే ఎగ్జిబిషన్ లకు తెలంగాణ ప్రాంతంలోని చేనేత వస్త్రాలకూ ప్రాధాన్యం ఇస్తామని అన్నారామె. దేశ వ్యాప్తంగా షో లను చేపట్టి చేనేత కార్మికులను ప్రమోట్ చేస్తామని అంటున్నారు.

ఖాదీ షో అదుర్స్

బంగ్లాదేశ్ తో పాటు మనదేశంలో వివిధ ప్రాంతాలను నుంచి వచ్చిన ఖాదీ ఫ్యాషన్లను ధరించి మోడల్స్ తళుక్కుమన్నారు. ఆద్యంతం ఖాదీకే ప్రాధాన్యం ఇచ్చిన ఫ్యాషన్ షో.. బహుశా హైదరాబాద్ లో ఇదే ప్రథమం కావొచ్చు. గతంలో చాలా షోల్లో ఖాదీ వస్త్రాల ప్రదర్శన జరిగినప్పటికీ, పూర్తి చేనేత వస్త్రాలతో తయారు చేసిన డిజైన్స్ షో ఇదే తొలిసారి. ఖాదీ బట్టలు, చెప్పులు , ఇతర ఫ్యాషన్ యాక్ససిరీస్ షో లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. మహాత్ముడు చూపిన బాటలో తాము ఖాదీని ప్రాధాన్యం ఇస్తున్నామని ఇంద్రాణి అంటున్నారు.

image


"సిటీఆఫ్ నవాబ్స్ గా పేరున్న హైదరాబాద్ లో ఖాదీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు" ఇంద్రాణి

ఒకప్పుడు హైదారబాద్ లో ఖాదీ వ్యాపారం ఎక్కువగా జరిగేది. మళ్లీ అదే ట్రెండ్ ప్రారంభమతుందని భావిస్తున్నాం. మొదటి ఎడిషన్ కోల్ కతాలో జరిగిన దానికంటే.. హైదరాబాద్ లో ఎక్కువ స్పందన వచ్చిందని అన్నారామె. హైదరాబాద్ ఒక ఫ్యాషన్ నగరమని, కొత్త వాటిని ప్రాధాన్యం ఇస్తూనే, మన సాంప్రదాయాలను మరచిపోరని చెప్పుకొచ్చారు.

కెవిఐసి మద్దతు

కెవిఐసి చేనేత కార్మికుల సంక్షేమం కోసం , ఖాదీని ప్రమోట్ చేసే పనిలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పుడు యూత్ కి దగ్గరవ్వడానికి ఇలాంటి ఈవెంట్స్ లో భాగస్వామి కావడం విశేషం. సాధారణ ఫ్యాషన్ షోలకు ఏమాత్రం తగ్గకుండా, ఒకరకంగా చెప్పాలంటే ఒక మెట్టు పైనే ఉన్న ఈ షో కోసం కలసి పనిచేసింది. యంగ్ జనరేషన్ ఎక్కువగా ఇలాంటి ఫ్యాషన్ షోలనే ఫాలో అవుతారు. మరిన్ని షోల్లో పాల్గొంటే ఖాదీ వస్త్రాలు ఇప్పటి తరానికి దగ్గర కావొచ్చు. వందల్లో నగరాల్లో వచ్చిపడిన విదేశీ బ్రాండ్లకు దీటుగా ఖాదీ కూడా ఓ సరికొత్త బ్రాండ్ గా మారడం ఇలాంటి షో లతోనే సాధ్యమవుతుందని ఇందులో పాల్గొన్న డిజైనర్లు చెప్పుకొచ్చారు.

“గతంలో సోషల్ కాజ్ కోసం జరిగే షోల్లో మాత్రమే కనిపించిన ఖాదీ, పూర్తి స్థాయి ఫ్యాషన్ షోలో తళుక్కుమనడం మారుతున్న ట్రెండ్ ను ఫాలో కావడమే”
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags