సంకలనాలు
Telugu

మీకు సోలో ట్రావెలింగ్ అంటే ఇష్టమా..? అయితే ఈ పది సలహాలు మీ కోసమే..!

HIMA JWALA
25th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

సోలో ట్రావెలింగ్. ఒంటరి ప్రయాణం. ఇప్పుడు ఇండియాలో నడుస్తున్న ట్రెండ్. అందులో దొరికే ఎగ్జయిట్మెంట్, థ్రిల్ కోసం ఎక్కడి వరకైనా వెళ్తున్నారు. జీవితకాలంలో ఒక్కసారైనా ఒంటరిగా దేశంచుట్టిరావాలని చాలామంది తహతహలాడుతున్నారు. దాన్ని జీవిత లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు. అయితే, ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఎటొచ్చీ మహిళలకే ఈ సోలో జర్నీ సవాల్ తో కూడుకున్నది. ఇవాళ రేపు బస్టాపులోనే కాసేపు ఒంటరిగా నిలబడలేని రోజులు. అలాంటిది ఒక సుదీర్ఘ ప్రయాణం- అందునా సోలోగా అంటే రిస్కే మరి. అందుకే ప్రాపర్ ప్రికాషన్స్, కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ పాటిస్తే మహిళల ఒంటరి ప్రయాణం వెలకట్టలేని అనుభవాల సారం అవుతుంది. అవేంటో ఓసారి చదివేయండి మరి..

సోలో ట్రిప్ సాఫీగా సాగేందుకు ఈ పది పాయింట్లు గుర్తుంచుకోండి.

మీ డబ్బు పదిలం

ట్రావెల్ చేస్తున్నామంటే కాస్త ఎక్కువ డబ్బే చేతులో ఉంచుకుంటాం. మంచిదే కానీ, మనీ అంతా బ్యాగులో ఒకేచోట పెట్టుకోవడం శ్రేయస్కరం కాదు. బ్యాగులోనే ఆ పాకెట్లో కొంత ఈ పాకెట్లో కొంత దాయాలి. వేసుకున్న కోటులో కొన్ని, పాకెట్లో, పర్సులో, చివరికి సాక్సులో కూడా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల, ఒకవేళ బ్యాగు పోగొట్టుకున్నా, ఎవరైనా ఎత్తుకెళ్లినా, కొంతడబ్బే పోయే ఆస్కారముంటుంది. ఎంతోకొంత సేఫ్ అవుతాం.

డప్పు చాటింపు అవసరం లేదు

ఇలాంటి సందర్భాల్లో డప్పు చాటింపు అవసరం లేదు. ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నామన్న విషయం నలుగురికీ తెలియాల్సిన అవసరం లేదు. అవతలివాళ్లు మిమ్మల్ని రహస్యంగా ఫాలో అయ్యే ప్రమాదం ఉంది. అది మీ ప్రయాణాన్ని కచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది. అన్ కంఫర్టబుల్ జోన్‌లోకి వెళ్లే ఆస్కారమూ లేకపోలేదు. ముఖ్యంగా మీరు ట్రావెల్ చేసే విషయాన్ని అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలియజేస్తే బెటర్. అందునా మహిళలకే అయితే ఇంకా బెటర్.

మాటిమాటికీ రూట్ మ్యాప్ తెరవకండి

ఊరుకాని ఊరు, ప్రాతం కాని ప్రాంతం. అలాంటి సమయంలో మ్యాపే మీకు ఆధారం. అలా అని, మాటిమాటికీ నలుగురి ముందు మ్యాప్ ఓపెన్ చేసి, రూట్ చూసుకోవడం అంత క్షేమకరం కాదు. ఈవెన్, రెంటల్ కారులో కూచున్నా సరే! వీలైనంతగా మ్యాప్ అవాయిడ్ చేసి, తెలుసుకోవాల్సిన డైరెక్షన్ ఏదో జీపీఎస్ ఆన్ చేసుకుని చూసుకుంటే అన్ని రకాలుగా మంచిది. ఈ ఏరియాకు ఈవిడ కొత్తలా ఉంది అని అవతలివారు మిస్ గైడ్ చేసే అవకాశమూ లేకపోలేదు. ఎవరికి తెలుసు.. ఎవరి మనసులో ఏ పాడు బుద్ధి ఉందో!

హోటల్ విషయం జాగర్త !

కొన్నికొన్ని సార్లు ఏమవుతుందంటే, ప్రయాణంలో ఎకానమీ అనే పదం మనల్ని ప్రతీచోట నియంత్రిస్తుంది. అలా ప్రతీ చోట లెక్కలు వేసుకుంటే కష్టం. ముఖ్యంగా స్టే చేయాల్సిన హోటల్ విషయంలో అస్సలు రాజీపడొద్దు. గుర్తింపు పొందిన హోటల్ లోనే బస చేయడం ఎంతో సేఫ్. ఏ హోటల్లో అయితే దిగుతున్నారో దాని పూర్తి డిటెయిల్స్ అమ్మానాన్నలకో, సొంతమనుషులకో పంపడం మంచిది.

పెళ్లి కాకపోయినా సరే, అయినట్టు నటించండి !

జన్రల్‌గా హోటల్ రూమ్స్ బుక్ చేసేటప్పుడు అడ్రస్, పర్సనల్ డిటెయిల్స్ ఫిల్ చేయాలి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే.. ఎట్టిపరిస్థితుల్లో పేరు దగ్గర దొరికిపోవద్దు. పెళ్లి అయినా కాకపోయినా, పేరుకు ముందు శ్రీమతి (Mrs.) అని మెన్షన్ చేయండి. అలా రాయడం వల్ల- ఓహో ఈవిడకి పెళ్లయింది..అని అవతలివారు అడ్వాంటేజ్ తీసుకోడానికి భయపడతాడు. పెళ్లి కాకపోయినా శ్రీమతి అని రాయడంలో కొంపమునిగేదేం లేదు. సేఫ్టీ ముఖ్యం.

ఎమర్జెన్సీ నెంబర్లు నోట్ చేసుకోండి !!

ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్‌. నివారణ కంటే నిరోధించడం ఉత్తమం. ఎమర్జెన్సీ సమయంలో ఈ సూత్రం బాగా వర్తిస్తుంది. సన్నిహితుల, కుటుంబ సభ్యలు మొబైల్ నంబర్లు డైరీలో కూడా రాసుకోవడం బెటర్. అలా చేస్తే ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా బయటపడే అవకాశం ఉంది.

బెదురు చూపులొద్దు.. కాన్ఫిడెంట్‌గా ఉండండి

కొత్త ప్రదేశమే కావొచ్చు. కానీ అది మన చూపుల్లో బయటపడొద్దు. బెరుకుబెరుకుగా చూస్తే ఇట్టే దొరికిపోతాం. ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చాను, ఇదంతా మనకు కొట్టిన పిండి అన్నంత బిల్డప్ ఇవ్వాలి. అలాంటి ఆత్మవిశ్వాసం మన కళ్లలో కనిపించాలి.

క్యాబ్ మాట్లాడేటప్పుడు బీ స్మార్ట్ !

జర్నీలో భాగంగా క్యాబ్ మాట్లాడుకోవాల్సి వస్తే, ఆ వెహికిల్ డిటెయిల్స్ అన్నీ క్లోజ్ రిలెటివ్స్ కో, పేరెంట్సుకో చెప్పండి. అలా చెప్పినప్పుడు క్యాబ్ డ్రైవర్ విన్నాడా లేదా అన్నది కూడా గమనించండి.

రాత్రిపూట డెస్టినేషన్ మంచిది కాదు

ఇది ఇంపార్టెంట్. ఎక్కడికి చేరుకోవాలన్నా, అదంతా డే టైంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటే మంచిది. అలా కుదరకుంటే మీరు దిగబోయే హోటల్‌ వాళ్లనే క్యాబ్ పంపమని అడగండి. అలా అయితే గమ్యం చేరుకోడానికి ఎంత రాత్రయినా ఫికర్ లేదు.

సేఫ్టీ కిట్ క్యారీ చేయండి

అంటే.. పెప్పర్ స్ప్రే, స్విస్ నైఫ్, విజిల్ లాంటివి ఎప్పుడూ క్యారీ చేయడం ఉత్తమం. అవి బ్యాగులో ఉంటే అదో ధైర్యం, కాన్ఫిడెంట్. పైగా ఉపయోగం కూడా.

రచయిత గురించి: 

షిఫాలి వాలియా. వీ ట్రావెల్ సోలో ఫౌండర్. ఎంబీయే మార్కెటింగ్ అండ్ సేల్స్ చేశారు. వీ ట్రావెల్ సోలో పెట్టడానికి ముందు బిజినెస్, మార్కెటింగ్ ఫీల్డులో పలు రకాల ఉద్యోగాలు చేశారు. ట్రావెలింగ్ ఆమె ప్యాషన్. సోలో ట్రావెల్ అంటే వల్లమాలిన అభిమానం. గత కొన్నేళ్లుగా పలు ప్రాంతాలు చుట్టొచ్చారు. ఆ అనుభవాలు, సూచనలు అందరికీ పంచుతుంటారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags