సంకలనాలు
Telugu

ఇదీ ఫ్లిప్ కార్ట్ విజయ రహస్యం !

బిజినెస్ చేయాల‌నుకునే వారి మొద‌టి క్వాలిఫికేష‌న్ అంచ‌నా. ఈ దారిలో వెళ్తే ఫ్యూచ‌రుంటుంద‌ని ఎవ‌రైతే అంద‌రిక‌న్నా ముందు ప‌సిగ‌ట్ట‌గ‌ల‌రో వారికి తిరుగుండ‌దు. ఏడేళ్ల క్రితం ఆన్ లైన్ బిజినెస్ వంద‌ల కోట్ల వ్యాపారం అవుతుంద‌ని ఎవ‌రు మాత్రం ఊహించారు? అది ముందే అంచ‌నా వేయ‌డ‌మే అస‌లైన బిజినెస్ మైండ్‌. అలాంటి అద్భుతమైన బిజినెస్ మైండెడ్ స‌చిన్ బ‌న్సాల్‌.

25th Mar 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

చండీఘ‌డ్‌కి చెందిన స‌చిన్ బ‌న్సాల్ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్. ఉన్న ఉద్యోగంలో వ‌చ్చే జీతంతో అంద‌రిలాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ బ‌న్సాల్ అలా అనుకోలేదు. మ‌నిష‌న్నాక కాస్త డిఫ‌రెంట్‌గా థింక్ చేయాల‌న్న‌ట్టు ఆన్‌లైన్ ఆలోచ‌న‌లు చేశారు. ఎక్కడో దూరంగా మీకు కావాల్సిన వస్తువు.. మీ ముంగిటికే వచ్చి వాలేలా చేసే బిజినెస్‌కి తెర‌లేపారు. అదే ఇప్పుడు కోట్ల వ‌ర్షం కురిపిస్తోంది.

సచిన్ బన్సల్, ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్

సచిన్ బన్సల్, ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్


అలాగని అదేం కొత్త ఐడియా కాదు. పాత‌దేగానీ, తాము ఎంట‌ర‌య్యే స‌మ‌యానికి అదంత అభివృద్ధి సాధించ‌లేదు. మ‌రీ ముఖ్యంగా క‌స్ట‌మ‌ర్ స‌ర్వీసులు అధ్వాన్నంగా ఉన్నాయి. స‌రైన స‌ర్వీసులు అందిస్తే లాభాలుంటాయ‌ని అనిపించింది. అటు వైపు ఓ ప్ర‌య‌త్నం చేయాల‌నుకున్నారు బ‌న్సల్. బిన్ని బ‌న్సల్‌తో క‌లిసి ఫ్లిప్‌కార్ట్‌కి ప్రాణం పోశారు. మొద‌ట ఏదైతే సుల‌భంగా ఉంటుందో.. ఆ వ‌స్తువుల‌ను స‌ప్లై చేయ‌డానికి రంగంలోకి దిగారు. అందుకు పుస్త‌కాలు అనువుగా భావించారు. చ‌ర్చి రోడ్డులోని గంగారామ్ బుక్ షాప్ ముందుకెళ్లి వ‌చ్చి పోయే క‌స్ట‌మ‌ర్ల‌కు త‌మ బుక్ మార్క్స్ ఇచ్చారు. మీరు ఇంత దూరం రాన‌క్క‌ర్లేదు ఫ్లిప్ కార్ట్‌కి క్లిక్ చేస్తే మీ పుస్త‌కం మీ చేతిలో ఉంటుంద‌న్న స‌మాచారం అందించారు.

అలా బ‌న్సల్ ఫ్లిప్‌కార్ట్... ఆన్‌లైన్ బుక్ సెల్లింగ్ ప్లాట్ ఫాంగా అడుగు పెట్టింది. పుస్త‌కాల నుంచి మొదలైన ఆన్ లైన్ బిజినెస్ అంత‌కంత‌కూ విస్త‌రించింది. ర‌క‌ర‌కాల వ‌స్తువుల‌ను క‌స్ట‌మ‌ర్ల‌కు అందించ‌డానికి తీవ్రంగా శ్ర‌మించారు. ఈ ఏడేళ్ల‌లో ఫ్లిప్‌కార్ట్ విప‌రీత‌మైన గ్రోత్ సాధించింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ను ప‌ట్టుకుంటే మ‌ట్టినైనా అమ్మి పెడుతుంద‌న్న గ‌ట్టి న‌మ్మ‌కం మార్కెట్ వ‌ర్గాల్లోనే కాదు.. జనాల్లోనూ ఏర్ప‌డింది.

మొదటి కస్టమర్ గోల్డెన్ హ్యాండ్

మోట‌రోలా G ఇండియాలో ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. త‌మ ప్రొడ‌క్ట్ అమ్మి పెట్టే పూచీ మీదేనంటూ భ‌రోసా ఇచ్చింది. అంత పెద్ద కంపెనీ ఎక్స్‌క్లూజివ్‌గా త‌మ ప్రొడ‌క్టును మా చేతుల్లో పెట్ట‌డ‌మే ఇన్నాళ్ల పాటూ మేం సాధించిన విజ‌యంగా చెప్పుకొస్తారు బ‌న్సల్‌. ఇలా ఆన్‌లైన్లో మోట‌రోలా స‌మాచారం అందిందో లేదో వేల సంఖ్య‌లో ఆఫ‌ర్లొచ్చాయి. ద‌టీజ్ ప‌వ‌రాఫ్ ఈ కామ‌ర్స్ అంటారు బ‌న్సల్. ఇవాళ ఫ్లిప్‌కార్ట్‌ డెలివ‌రీ బాయ్స్ క‌స్ట‌మ‌ర్ల పాలిట శాంటా క్లాజ్‌ల్లా మారిపోయార‌ని అంటారాయ‌న‌.

ఫ్లిప్ కార్ట్ ఈ రోజు ఇంతటి ఘ‌న విజ‌యం సాధించ‌డానికి కార‌ణం వీవీకే చంద్ర అనే క‌స్ట‌మ‌ర్. ఇత‌నే ఫ్లిప్ కార్ట్‌కి మొద‌టి ఆర్డ‌ర్ ఇచ్చింది. చంద్ర‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో మ‌రిచిపోలేమంటారు బ‌న్సల్‌. అత‌నిది గోల్డెన్ హ్యాండ్ అన్న కితాబునిస్తారు. అలాగ‌ని త‌మ బిజినెస్ న‌ల్లేరు మీద న‌డ‌క‌లా సాగిందనడానికి వీలు లేదు. ఇప్ప‌టికీ స‌వాళ్లు వెంటాడుతూనే ఉన్నాయి. కొన్ని కంపెనీల‌తో టైఅప్స్, క్రెడిట్ కార్డ్ పేమెంట్లూ త‌ల‌నొప్పులు సృష్టిస్తూనే ఉన్నాయ‌ని వివరిస్తారు.

ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ చేతిలో దాదాపు అన్ని పుస్త‌క ప్ర‌చుర‌ణ క‌ర్త‌లూ ఉన్నారు. అస‌లు త‌మ ప్ర‌యాణం మొద‌లైందే పుస్త‌కాల‌తో క‌దా ? దీంతో త‌మ‌ను వెతుక్కుంటూ వ‌స్తున్నారు పుస్త‌క విక్రేత‌లు. పే-జిప్పీ ద్వారా పేమెంట్స్ కూడా బాగానే ఉంటున్నాయి. స‌రైన స‌మ‌యానికి స‌రైన ప్లేస్ లో స‌ప్లై చేయ‌డం.. టాలెంట్ మేనేజ్మెంట్ తాము ఎప్ప‌టిక‌ప్పుడు స‌రిచూసుకోవ‌ల్సిన అంశాలుగా మారాయని అంటారు బ‌న్సాల్‌.

ఇండియన్ అమెజాన్ అనిపించుకోవాలి

త‌ర్వాతి త‌మ దృష్టి ఇనిషియ‌ల్ ప‌బ్లిక్ ఆఫ‌రింగ్ (ఐపీఓ) మీదేనంటారు స‌చిన్ బ‌న్సల్‌. ఫ్లిప్‌కార్ట్.. ఇండియ‌న్ అలీబాబా, ఇండియ‌న్ అమెజాన్ అనే పేరు సాధించాల‌ని కోరుకుంటారు. భార‌త‌దేశంలో ఆన్ లైన్ బిజినెస్‌కి ఢోకా లేదు. ఇక్క‌డి క‌స్ట‌మ‌ర్లకు ఎన్నో అవ‌స‌రాలున్నాయి. త‌మ‌కు కావ‌ల్సిన దాని కోసం ఓపిక‌తో ఎదురు చూసే త‌త్వాన్ని కూడా క‌లిగి ఉంటారు. కాబ‌ట్టి వాళ్లే త‌మ పెట్ట‌బ‌డి.. వాళ్ల‌కు సేవ‌చేయ‌డంలోనే త‌మ‌కు లాభం అంటారాయ‌న‌.

ఏదీ లేద‌న‌కూడ‌దు. అన్నీ ఉన్నాయ‌నిపించ‌డ‌మే అస‌లైన వ్యాపార సూత్రంగా చెబుతారు బ‌న్సాల్‌. ఆ మాట‌కొస్తే స‌వాల్లోనే అవ‌కాశం దాగి ఉంది చూసుకోమంటారు. ఇది త‌న‌కొక్క‌డికే కాదు.. ప్ర‌తి ఒక్క‌రికీ వ‌ర్తించే వ్యాపార సూత్రం. ప్ర‌స్తుతం దేశ యువ‌త ఇంట‌ర్నెట్‌లోనే ప‌ని.. ఇంట‌ర్నెట్‌లో తిని.. ఇంట‌ర్నెట్‌లో ప‌డుకుంటోంది. కాబ‌ట్టి వందమిలియ‌న్ డాల‌ర్ల ఆన్ లైన్ కంపెనీని పుట్టించే కెపాసిటీ ఇండియ‌న్ మార్కెట్ సొంత‌మ‌ని భావిస్తారు బ‌న్సాల్‌. వ‌చ్చే 5ఏళ్ల‌లో ఫ్లిప్ కార్ట్ టార్గెట్ అదేన‌ని ప్ర‌క‌టించారాయ‌న‌.

ఫ్లిప్ కార్ట్ భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని.. టెక్నాల‌జీలో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటోంది. స‌రుకులు స‌ర‌ఫ‌రా చేయ‌డంలో ఇంకా మంచి అభివృద్ధి సాధించాలి. వ‌చ్చే రోజుల్లో ఫ్లిప్ కార్ట్ అందించే వ‌స్తువులు చిన్న చిన్న టౌన్లు, గ్రామాల‌కు కూడా విస్త‌రించాలి. అదే స‌మ‌యంలో క‌స్ట‌మ‌ర్ల నుంచి సుల‌భ‌త‌ర‌మైన‌ పేమెంట్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఫ్లిప్ కార్ట్ త‌న బిజినెస్‌లో 50శాతం మొబైల్ ఫోన్ల ద్వారానే సాధిస్తోంది. మొద‌టి నుంచీ మొబైల్స్ బేస్ చేసుకునే త‌మ బిజినెస్ సాగింది. ఇప్పుడంతా ప్ర‌పంచం మొబైల్ ఫోన్‌లో దాగి ఉంది. కంప్యూట‌ర్ క‌న్నా ప‌దిరెట్టు ఎక్కువ సేవ‌లు మొబైల్స్ ద్వారానే ల‌భిస్తున్నాయి. కాబ‌ట్టి మొబైల్స్ మీద ఇంకా ఎక్కువ దృష్టి నిల‌పాల్సిన అవ‌స‌ర‌ముందని అంటారు బ‌న్సాల్‌.

ఈ -కామర్స్ స్టార్టప్స్‌కు సలహా

ఇలాంటి బిజినెస్‌లో ఎంట‌ర‌వ్వాల‌నుకునేవాళ్ల‌కు మీరిచ్చే స‌ల‌హా ఏంటంటే.. ఇలాంటి వ్యాపారాల్లో ఒంట‌రిగా క‌ంటే ఎవ‌రితోనైనా క‌లిసి దిగ‌డం బెట‌ర్. మార్కెట్ ప‌రిధి విస్తృతమైన‌ప్పుడు ఒక్క బ్రైన్ స‌పోర్ట్ స‌రిపోద‌ని సూచిస్తారు. అవ‌కాశాలు ఎద‌రు చూస్తున్నాయి. భార‌తీయ మార్కెట్‌కి మిలియ‌నీర్ల‌ను అందించే స‌త్తా ఒకింత ఎక్కువే ఉంది. కాబ‌ట్టి థింక్ బ్రాడ్ అనేది బ‌న్సల్ సూచ‌న.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags