సంకలనాలు
Telugu

హెల్త్ కేర్ రంగంలో సరికొత్త కాన్సెప్ట్‌ !

హెల్త్ ఈజ్ వెల్త్ ! నిజమే. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఎక్కువ సంపాదించగలం. కానీ.. హెల్త్ ఈజ్ ఆల్సో ఎ బిజినెస్ ఐడియా అని నిరూపిస్తున్నాయి కొన్ని కంపెనీలు. షాపుకు వెళ్లి మందులు కొనుక్కోలేని వారి కోసం.. ఆన్‌లైన్‌లోమెడిసిన్ సేల్స్ చేసి కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నాయి. అలాంటి కొన్ని కంపెనీల కథలు చదవండి!

Karthik Pavan
23rd Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

హెల్త్ ఈజ్ ఆల్సో ఎ బిజినెస్ ఐడియా!

image


మామూలుగా డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్‌ని తీసుకుని మెడికల్ షాపుకు వెళతాం. ఇచ్చిన మందులు తెచ్చుకుని వాడుకుంటాం. కానీ..దాని వెనుక ఏం జరుగుతోందో.. అసలు మెడికల్ షాపులో ఏ బ్రాండ్ డ్రగ్ ఇస్తున్నారో కూడా చాలామంది చూసుకోరు. ఎందుకంటే.. ముందు మందు వేయాలి. జబ్బు నయం కావాలి. ఇదొక్కటే ఆలొచన! సరిగ్గా ఇదే సమయంలో చాలామంది దాదాపు 40శాతం ఎక్కువ డబ్బు అసలు చెల్లించాల్సినదానికంటే ఎక్కువ చెల్లిస్తున్నారన్న సంగతి పట్టించుకోవడంలేదు. ఎలాంటి మందులు, ఏ కంపెనీ మందులు వాడాలన్నదానిపై అవగాహన లేకపోవం, ముఖ్యంగా దాని గురించి రీసెర్చ్ చేసే సమయం ఎవరికీ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ఒక మందుకు బదులు మరొకటి ఏది వాడచ్చో కూడా చాలామందికి తెలియదు.

నెట్మెడ్స్- 1941లో మొదలయిన NetMeds Dadha & Co కంపెనీ నెలకొల్పిన ఆన్‌లైన్ మెడికల్ సేల్స్ సైట్ ఇది.దాదాపు వందేళ్ల బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ కంపెనీ..ప్రిస్క్రిప్షన్, నాన్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్‌ను డెలివరీ చేస్తున్నారు. దేశం మొత్తంమీద 5వేల స్టాక్ కీపింగ్ యూనిట్స్ ఉన్నాయి. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ కావాలంటే యూజర్ సైట్లోకి లాగిన్ అయి.. తన ప్రిస్క్రిప్షన్ ని అప్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. నిర్ణీత సమయాల్లో మళ్లీ అదే డ్రగ్ కావాలా వద్దా అనే రిమైండర్ ఆప్షన్ని కూడా సైట్లో అందుబాటులో ఉంది. బ్రాండ్ పేరుతో కానీ.. మెడిసిన్ పేరుతో కానీ సెర్చ్ చేయడం ద్వారా యూజర్‌కి కావాల్సిన ప్రొడక్ట్‌ను అందించే సెర్చ్ ఆప్షన్, సైట్ యూజబులిటీని పెంచుతుంది. కంపెనీలో ఉండే ఫార్మసిస్ట్.. కస్టమర్లు అప్‌లోడ్ చేసిన ప్రిస్క్రిప్షన్‌ను జాగ్రత్తగా పరిశీలించడంతో పాటు భద్రపరుస్తారు. ఈ మధ్యనే హెల్త్‌కేర్‌లో ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఆర్బి మెడ్ సంస్థ.. నెట్‌మెడ్స్‌లో అమెరికన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది.

1Mg - Homeojoy.Com అనే కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా ఇంటర్నెట్ మెడిసిన్ Spaceలోకి ఎంటరయిన ఢిల్లీ బేస్డ్ కంపెనీ ఇది. ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి.. ఇలా ఏ రకమైన మందు అయినా దొరకడం ఈ సైట్ స్పెషాలిటీ. కేవలం ఒక్క బ్రాండ్ కాకుండా.. అన్నిటినీ ఒకే చోట చేర్చి సర్వీసులు అందిస్తోంది. 2013లో లాంచ్ అయిన ఈ సైట్ అప్లికేషన్‌ని ఇప్పటికే 25 లక్షలమంది డౌన్‌లోడ్‌ చేసుకోగా... నెలకు కనీసం 30లక్షలమంది ఈ సైట్ సేవలను వినియోగించుకుంటున్నారు.

mChemist - ప్రముఖ మందుల తయారీ సంస్థ రాన్‌బాక్సీలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన రాజీవ్‌ గులాటీ స్థాపించిన సంస్థ. ఫార్మా ఇండస్ట్రీలో అత్యద్భుతమైన నాలెడ్జ్, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్న గులాటీ.. ఈ సైట్‌ను తనదైన స్టయిల్లో విభిన్నంగా నడిపిస్తున్నారు. ఏడాది క్రితం మొదలయిన ఈ కంపెనీ.. ప్రిస్క్రిప్షన్, నాన్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్‌ను డెలివరీ చేస్తోంది.

Medd - ఆన్‌లైన్‌ ఫార్మా కంపెనీ కాకపోయినా.. హెల్త్ కేర్ రంగంలో సరికొత్త కాన్సెప్ట్‌తో Medd విజయం సాధించింది. డాక్టర్లు రాసిన మెడికల్ టెస్ట్‌ల వివరాలు తెలియజేస్తే.. ఏ టెస్ట్‌కు ఏ ల్యాబ్‌లో ఎంత ఖర్చవుతుందనే వివరాలను అందిస్తోంది. ఈ మధ్యనే ఏంజిల్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో 15 వేల అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది.

DeliMedi కొన్ని కంపెనీలు స్వచ్చందంగా స్టోర్లు ఏర్పాటు చే్సుకుంటే, అందుకు భిన్నంగా డెలీమెడి ఆన్‌లైన్‌లో తమకు వచ్చిన ఆర్డర్లను లోకల్ ఫార్మసీలతో టైఅప్ అయి డెలివరీ చేస్తోంది. బుక్ చేసుకున్న కేవలం గంటలోపే మందులు ఇంటికి చేరిపోయేలా ఏర్పాట్లు చేసుకుంది. కుల్దీప్ పటేల్ అనే వ్యాపారవేత్త ఘజియాబాదులో మొదలుపెట్టిన ఈ కంపెనీ.. భవిష్యత్తులో అతిపెద్ద కంపెనీగా ఎదగడానికి ప్లాన్ రెడీ చేసుకుంటోంది.

ఈ రంగంలో ఉండే సవాళ్లు

ఫార్మారంగంలో వ్యాపారం మొదలుపెట్టాలంటే అవగాహన చాలా ముఖ్యం. ఇప్పటిదాకా ఉన్న కంపెనీలన్నీ ఎక్కువగా ఢిల్లీ బేస్‌డ్‌గా నడుస్తున్నా కూడా.. కొన్ని మాత్రం పెద్దపెద్ద పట్టణాలకు విస్తరించాయి. ఈ రంగంలో కొత్తగా అడుగుపెట్టాలనుకుంటున్నవాళ్లు ముందుగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవేంటో ఓ సారి చూద్దాం.

1. కస్టమర్ల దగ్గర్నుంచి వచ్చే ప్రిస్క్రిప్షన్ల ప్రామాణికతను గుర్తించగలగాలి. నకిలీ ప్రిస్క్రిప్షన్‌ను తయారుచేయడం పెద్ద కష్టం కాదు కాబట్టి.. ఏ ప్రిస్క్రిప్షన్‌ను వాస్తవంగా డాక్టర్ ఇచ్చారో తెలుసుకోగలగాలి.

2. మార్జిన్ తక్కువ ఉంటుందన్న కారణంతో Offline ఫార్మసీల్లో సాధారణంగా Generic డ్రగ్స్ అందుబాటులో ఉండవు. కాబట్టి అక్కడి ఫార్మసిస్ట్ ఏ డ్రగ్ ఇస్తే అది తీసుకోవాలి. అయితే, Online ఫార్మసీల్లో ఈ జనరిక్ డ్రగ్ ఈజీగా దొరుకుతుంది.

3. Transportation లేదా లాజిస్టిక్స్. ఆర్డర్ చేసిన అతి తక్కువ సమయంలో మందులను పేషెంట్ దగ్గరికి చేర్చాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సరఫరా చేసే వ్యవస్థను అత్యంత పఠిష్టంగా, వేగంగా ఉండేలా చూసుకోవాలి.

4. ఈ మధ్యకాలంలో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం విరివిగా పెరిగిపోయింది. పైగా.. Online మెడిసిన్లు ఆర్డర్ చేసే వాళ్లు ఎక్కువగా 40 ఏళ్లకు పైబడినవారే ఉంటారు. ఆ సెక్షన్ ఆఫ్ ఏజ్ వాళ్లూ స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నారు. కాబట్టి ఆన్ లైన్ ఫార్మసీ రంగానికి రాబోయే కాలంలో మహర్దశ పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

5. కొన్నేళ్లుగా ఈ రంగంపై ఆసక్తి చూపిస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో.. పెట్టుబడిదారులూ ముందుకువస్తున్నారు. అయితే, ఇందులో ఉండే నిబంధనలు, నియంత్రణ, సవాళ్లను ఎదుర్కొగలిగితే.. మార్కెట్ లీడర్‌గా నిలవడం పెద్ద కష్టమేమీ కాదు.

ఏ రంగమయినా.. వృద్ధి చెందుతున్న కొద్దీ.. దాని చుట్టూ వివాదాలు మొదలవుతాయి. Online Pharma రంగంలో కూడా అదే జరుగుతోంది. గత నెలలో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్.. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకంపై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎనిమిదన్నర లక్షలమంది కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ ఉన్నారు. వారందరి వ్యాపారం దెబ్బతింటుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నా కూడా ఆన్‌లైన్‌ ఫార్మసీలు ప్రస్తుత పరిస్థతుల్లో ఆ స్థాయిలో దెబ్బతీసే అవకాశాలైతే లేవని నిపుణులు చెబుతున్నారు. మొత్తమ్మీద రాబోయే కాలంలో మరిన్ని ఆన్‌లైన్‌ఫార్మా కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశిస్తాయన్నది మాత్రం వాస్తవం.!

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags