యుక్త వయసు బాలికల దిక్సూచి 'వాయిస్ 4 గర్ల్స్'

కౌమార బాలికలకి ఒక అడ్వైజర్‌గా వాయిస్ 4 గర్ల్స్ఆర్ధిక లాభాన్ని పక్కనపెట్టి సామాజిక సేవకి పెద్ద పీట వేసిన స్టార్టప్ప్రైవేట్ స్కూల్స్‌తో కలిసి క్యాంపులు నిర్వహిస్తున్న సంస్థ
0 CLAPS
0

20 దేశాల్లో 370 జెండర్ స్పెషలిస్ట్స్ నిర్వహించిన సర్వేలో, మహిళల ప్రాధాన్యత అంశంలో భారతదేశం అట్టడుగు స్థాయిలో ఉంది. 2011 నుంచీ, దేశవ్యాప్తంగా 1500 మంది కౌమార బాలికల్ని శక్తిమంతం చెయ్యడం ద్వారా మహిళల స్థాయిని మెరుగుపరచడానికి వాయిస్ 4 గర్ల్స్ పనిచేస్తోంది.


వాయిస్ 4 గర్ల్స్ కథ 2010 ఆగష్టులో మొదలైంది, ముగ్గురు అమెరికా యువతలు సోషల్ ఎంటర్‌ప్రైజ్ వారి ఐడెక్స్ ఫెలోషిప్ ద్వారా భారతదేశంలోని హైదరాబాద్‌లో అల్పాదాయ వర్గాల వారికి ప్రైవేటు స్కూళ్లని అందుబాటులోకి తేవడానికి కన్సల్టంట్లుగా పనిచేస్తున్న సమయం అది. 2011 జనవరిలో, భారతదేశంలోని అల్పాదాయ వర్గాల అమ్మాయిలకి ఇంగ్లీష్ సమ్మర్ క్యాంపులు నిర్వహించడానికి ఐడెక్స్ ఫెలోషిప్ ని స్పాన్సర్ చేసే గ్రే మ్యాటర్స్ క్యాపిటల్‌ని సంప్రదించింది నైకి సంస్థ. సహచరులైన అవెరిల్ స్పెన్సర్, అల్లిసన్ గ్రాస్, ఇలానా సుషాంకి సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి చొరవ చూపించారు.


“మార్కెట్ పరిశోధన చేస్తూ మేము ఇందులో దిగాం, కానీ కొంతమంది అమ్మాయిలతో మాట్లాడాకే నిజానికి కౌమార బాలికలు సంతోషంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండేందుకు అవసరమైన అంశాలపై వారికి అవగాహన లేదని మేము తెలుసుకున్నాం”, అంటూ వివరిస్తారు వాయిస్ 4 గర్ల్స్ అధినేత స్పెన్సర్. 

పీరియడ్స్‌నూ క్యాన్సర్ అని భయపడే అమ్మాయిలూ ఉన్నారు

ఒక కౌమార బాలిక తనకి మొదటి సారి పీరియడ్స్ వచ్చినప్పుడు రక్తస్రావం అవుతుండటం వల్ల చాలా భయపడ్డానని, తనకు క్యాన్సర్ సోకిందేమో అనుకున్నానని చెప్పడం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. పాపం ఆమె రోజూ ఏడుస్తూ ఉండేదంట, తను చనిపోతుందేమో అని నిత్యం భయపడుతూ తల్లిదండ్రులకి కూడా చెప్పలేదంట. “అప్పుడు మేం సరే భయపడకు, అమ్మాయిలెవరికైనా ఇదంతా చాలా సహజం. యుక్తవయసు దశ అనేది కొంచెం కష్టమే, కానీ మీ శరీరంలో జరిగే మార్పులను అర్ధం చేసుకోవడమనే ప్రక్రియ మిమ్మల్ని ప్రమాదంలోకి నెడుతుంది, అంతే” అని చెప్పామంటున్నారు స్పెన్సర్.

భారతదేశంలోని మహిళల్లో ప్రముఖంగా ఆరోగ్యం మరియు విద్య విషయాల్లో వివక్ష కనిపిస్తోంది, కానీ పేదరిక నిర్మూలనలో వారికి కూడా శక్తిమంతమైన పాత్ర ఉంది. వాయిస్ 4 గర్ల్స్ ని స్పాన్సర్ చేస్తున్న నైకీ వారి గర్ల్ ఎఫెక్ట్ క్యాంపైన్, ఎప్పటికీ అంతంకాని పేదరికాన్ని పోగొట్టడానికి అమ్మాయిలతో కలసి పనిచేస్తోంది. వారికి ఇంగ్లీష్ లో చదువు, ఆర్ధిక పాఠాలు, మహిళా హక్కుల గురించి అవగాహన కల్పిస్తే, తమ పుట్టిల్లు, అత్తిల్లు, పిల్లలు, ఇలా మూడు తరాలను ప్రభావితం చేస్తూ సమాజంలోని మహిళల స్థితిగతుల్లో ఈ అమ్మాయిలు మార్పు తీసుకురాగలరు.

అవాగాహన పెంపే అసలు ఆయుధం

నాలుగు వారాల వేసవి క్యాంప్ వలే 2011 మేలో మొదలైన క్యాంప్ వాయిస్...ఆరోగ్యం, విద్య, పోషణ, శుభ్రత, పునరుత్పత్తి, మహిళల హక్కులు, శరీర వ్యక్తీకరణ వంటి అంశాల మీద అవగాహన కల్పిస్తూ ఇంగ్లీష్ లో పాఠాలు నేర్పిస్తోంది. అందుబాటులో ఉండే ప్రైవేట్ స్కూల్స్ తమ విద్యార్ధినులకి వాయిస్ క్యాంప్స్ ని నిర్వహిస్తున్నాయి. నాయకత్వం, శిక్షణలో వారి సామర్ధ్యాన్ని నిర్మించేందుకు యువ మహిళా కౌన్సెలర్లు, టీచర్లు కలిసి క్యాంపులను నడుపుతారు. క్యాంప్ మరియు భాగస్వామ్య లైసెన్సింగ్ రుసుము తీసుకునే వాయిస్ 4 గర్ల్స్, ఒక్కో స్కూల్ తో వారి అవసరాలకు తగినట్లుగా కలిసి పనిచెయ్యడానికి వీలున్న వ్యాపార మోడల్ ఇది.

2013 వేసవి మొదటలో హైదరాబాద్, ఉత్తరాఖండ్, ముంబయి వ్యాప్తంగా స్కూళ్లలో వాయిస్ 4 గర్ల్స్ క్యాంపులను నిర్వహించింది. తొలుత ముగ్గురు సహవ్యవస్థాపకులున్న బృందం ఇప్పుడు పదికి చేరుకుంది. ఒక చిన్న స్టార్టప్ గా ఉన్న తాము, అభిరుచి, స్వీయ ప్రేరణ, సృజనాత్మకత కలిగిన వ్యక్తులనే నియమించుకుంటామని స్పెన్సర్ చెప్తున్నారు.


వాయిస్ 4 గర్ల్స్ ఇప్పుడు కొత్తగా ఏడాది పొడవునా ఉండే కో-ఎడ్ స్కూల్ ప్రోగ్రామ్ ని కూడా ప్రారంభిస్తోంది. “అమ్మాయిలు తమని తాము ఆవిష్కరించుకోవడానికి, సౌకర్యవంతంగా, ఆత్మవిశ్వాసంగా ఉండటానికి మొత్తం ఆడవాళ్లే ఉండే ఒక వాతావరణాన్ని కల్పించడం ముఖ్యమని తెలుసు కానీ అదే సమయంలో అబ్బాయిలు ఉన్నప్పుడు కూడా వాళ్లు అదే విధంగా ఉండాలి”, అనేదే మా అభిమతం అంటారు స్పెన్సర్. “లింగ వివక్షతకి రెండు పార్శ్వాలు ఉన్నాయి. అమ్మాయిలతో కలిసి మేము ఎంత పనిచేస్తున్నా కానీ, వీళ్లకి సహకరించేందుకు వాళ్ల సోదరులు, తండ్రులు, ఇతర సాంఘిక పురుష సభ్యులకు కూడా మేము అవగాహన కల్పించాలి. వాళ్ల ఏడాది పొడవునా ఉండే మరియు వేసవి ప్రోగ్రామ్స్ మధ్యలో, 2013 వేసవి చివరికల్లా భారతదేశంలో మూడు వేల పిల్లలకంటే ఎక్కువమందికి శిక్షణ ఇచ్చి శక్తిమంతులుగా తీర్చిదిద్దింది వాయిస్ 4 గర్ల్స్. ఇప్పటివరకూ వీరు 14,281 క్యాంపులను నిర్వహించారు అలాగే 526 స్కూళ్లు ఇందులో పాల్గొన్నాయి. 

అంతిమంగా దీని ద్వారా భారతదేశంలోని లక్షల కొద్దీ పిల్లలను చేరుకోవడమే వీరి ప్రణాళిక. ఈ ప్రణాళికలో మీరు కూడా మీ వంతుగా డొనేషన్ అందించి పాలుపంచుకోవచ్చు.

image credit - voice4girls

Latest

Updates from around the world