సంకలనాలు
Telugu

స్టార్టప్స్ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా ఉండాలంటున్న బిజినెస్ టైకూన్స్ !!

ఇన్వెస్ట్ కర్నాటకతో స్టార్టప్ లకు ప్రోత్సాహం -అన్ని నగరాలకు కంపెనీ లు విస్తరిస్తేనే కర్నాటక సమగ్రాభివృద్ధి సాధ్యం-

uday kiran
5th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

స్టార్టప్ లను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఇన్వెస్ట్ కర్నాటక సదస్సుపై పారిశ్రామిక రంగం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎంట్రప్రెన్యూర్స్, ఇన్వెస్టర్లను ఒకే వేదికపైకి చేర్చిన కర్నాటక ప్రభుత్వం కృషి ఎంతో అభినందనీయమన్నది పారిశ్రామిక దిగ్గజాలు అభిప్రాయం. ఇన్వెస్ట్ కర్నాటక, స్టార్టప్ ఇండియా లాంటి కార్యక్రమాలు వ్యాపార రంగంలో కొత్తగా అడుగుపెట్టేవారికి ఎంతో మేలుచేస్తుందని బిజినెస్ టైకూన్స్ అసలు స్టార్టప్స్ గురించి ఇన్వెస్ట్ కర్నాటక గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం.

పాలసీల పరిధిని దాటి స్టార్టప్ లు, పరిశ్రమలకు సాయం చేయాల్సిన అవసరం ఉందన్నది టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా అభిప్రాయం. కేవలం విధాన ప్రకటనతో సరిపెట్టుకోకుండా వాటి అమలు తీరును పర్యవేక్షించాలన్నది ఆయన మాట.

ఇన్వెస్ట్ కర్నాటక ద్వారా 1,00,000కోట్ల రూపాయల పెట్టుబడులు సమీకరించాలన్నది కర్నాటక ప్లాన్. ఏరో స్పేస్, డిఫెన్స్, హెల్త్ కేర్, బయో టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ తదితర రంగాల నుంచి ప్రాతినిధ్యంవహిస్తున్న స్టార్టప్ లు ఈవెంట్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి.

వాస్తవానికి చాలా రాష్ట్రాల్లో గతంలోనూ చిన్న కంపెనీలు కార్యకలాపాలు కొనసాగించేవి. ఈ మధ్యకాలంలోనే స్టార్టప్ అనే పదనం దేశంలో పాపులర్ అయింది అంటున్నారు రతన్ టాటా. ఆయన ఇప్పటి వరకు దాదాపు 25 స్టార్టప్ లలో ఇన్వెస్ట్ చేశారు.

image


“హెల్త్ కేర్, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే కంపెనీలపై కర్నాటక దృష్టి కేంద్రీకరించాలి. కేవలం బెంగళూరు వరకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా స్టార్టప్ లు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలి.”- రతన్ టాటా

రతన్ టాటా అభిఫ్రాయంతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు కూడా ఏకీభవించారు. కేవలం కొన్ని ప్రధాన నగరాలకే అభివృద్ధి పరిమితం కావడం సరికాదని ఆయన అంటున్నారు.

“ఆంట్రప్రెన్యూర్ కు సంబంధించి రతన్ టాటా కొన్ని ప్రమాణాలు నిర్ణయించారు. ఇన్వెస్ట్ కర్నాటక, స్టార్టప్ ఇండియా పరస్పరం కలిసి పనిచేయాలని ఆశిస్తున్నా.” -రతన్ టాటా

కర్నాటకలో నైపుణ్యం కల మానవ వనరుల కారణంగానే పెట్టుబడులు తరలివస్తున్నాయన్నది ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ క్రిస్ గోపాల కృష్ణన్ అభిప్రాయం.

“నాతో పరిచయమున్న అంతర్జాతీయ స్థాయి కంపెనీల ప్రముఖులందరూ కర్నాటకలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు.” -క్రిస్ గోపాల కృష్ణన్.

ఐటీ స్టార్టప్ లు మాత్రమే కాకుండా ఇంకా అవకాశాలున్నాయన్నది మరికొందరి అభిప్రాయం . కర్నాటకలో రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్, సిమెంట్ రంగాలతో పాటు స్టార్టప్ లపైనా దృష్టి పెట్టినట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా యువర్ స్టోరీతో చెప్పారు.

“గత 50ఏళ్లుగా మాకు కర్నాటకకు సహకరిస్తున్నాం. కర్నాటకలో మరిన్ని పెట్టుబడులు పెట్టే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా చర్చలు జరుగుతున్నాయి. కర్నాటకలో డిజిటల్ టెక్నాలజీ స్టార్టప్ లతో కలిసి పని చేయాలనుకుంటున్నాను. బెంగళూరులో ఇప్పటికే ఈ కామర్స్, డిజిటల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాం. రాష్ట్రంలో స్టార్టప్ లు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని ఆశిస్తున్నా.” -కుమార మంగళం బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్

ఏదో ఒకట్రెండు నగరాలకు పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తంపై దృష్టి కేంద్రీకరించడమన్నది వాస్తవానికి మంచి నిర్ణయం. ప్రస్తుతం కర్నాటక సరైన దిశలో ముందుకు సాగుతోందన్నది బిర్లా మాట. కేంద్రం చేపట్టిన మేకిన్ ఇండియాతో భారత్ లో ఉత్పాదకరంగం మరింత అభివృద్ధి చెందుతుందని.. దేశ ఆర్థికాభివృద్ధి వేగవంతం కావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పై దృష్టి పెట్టడం సరైన నిర్ణయమని ఆయన అంటున్నారు. ఈ విషయం ఇప్పుడిప్పుకే ప్రజా ప్రతినిధులకు సైతం అర్థమవుతోందని కుమార మంగళం బిర్లా చెబుతున్నారు.

ఈ ఏడాది ఇన్వెస్ట్ కర్నాటకపై చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య ఎంతో ఆశతో ఉన్నారు. ఈ ఈవెంట్ ద్వారా భారీగా పెట్టుబడులు తరలివస్తాయని ఆశిస్తున్నారు.

“కర్నాటక వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఏడాది ఇన్వెస్ట్ కర్నాటకకు హాజరయ్యే పెట్టుబడిదారులు కేవలం బెంగళూరుకు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రమంతటిపై దృష్టి పెడతారని ఆశిస్తున్నా.” -సిద్ధరామయ్య, కర్నాటక సీఎం.
“భారత్ లో అన్ని రాష్ట్రాల కన్నా కర్నాటక ఆర్థిక వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. స్టార్టప్స్, ఇన్నోవేషన్స్ కు గ్లోబల్ క్యాపిటల్ గా మారుతోంది.” ఆర్.వి. దేశ్ పాండే, కర్నాటక భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి

కర్నాటక జనాభాలో 13లక్షల మంది ఐటీ సర్వీసుల రంగంలో ప్రత్యక్షంగా... దాదాపు 20లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఉత్పాదక రంగంలో దాదాపు 5లక్షల మంది పనిచేస్తున్నారు.

“కాంపిటీటివ్ ఫెడరలిజం దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసింది. పారదర్శకత పాటించిన రాష్ట్రాలు మాత్రమే పోటీలో విజయం సాధిస్తాయి.”-కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ

ఐటీ రంగంలో దేశంలోనే కర్నాటక ఎప్పుడూ ముందు వరుసలో ఉంది. కానీ గత మూడేళ్లుగా బెంగళూరు నీటి కొరత, విద్యుత్ కోతలు, ట్రాఫిక్ చిక్కులతో సతమతమవుతోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ రోజు మూడు కొత్త స్టార్టప్ లు పుట్టుకొస్తున్నాయి. కర్నాటకలోని టైర్ 2 సిటీల్లో దాదాపు 500 స్టార్టప్ లు ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం కేవలం బెంగళూరుపై మాత్రమే శ్రద్ధ పెట్టకుండా ఇతర నగరాల్లో పెట్టుబడులు పెట్టేదిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కంపెనీలను యూనివర్సిటీలతో అనుసంధానం చేసినప్పుడే కర్నాటక సమగ్రాభివృద్ధి సాధ్యం అవుతుంది.

గమనిక : యువర్ స్టోరీ ఇన్వెస్టర్లలో రతన్ టాటా ఒకరు

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags