సంకలనాలు
Telugu

12 హిమనీనదాలు సృష్టించిన సివిల్ ఇంజినీర్

team ys telugu
28th Oct 2016
Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share

బుర్రలో తెలివి ఉండాలేగానీ మంచిపని చేయడానికి వయసు అడ్డంకి కాదు. హాయిగా రిటైరయ్యి కాలుమీద కాలేసుకుని కూర్చునే వయసులో ఒక పెద్దాయన అపర భగీరథుడి అవతారమెత్తాడు. కరిగిపోతున్న హిమనీనదాలను ఒడిసిపట్టి బంజరు భూముల్ని సస్యశ్యామలం చేశాడు. తాగడానికి చుక్కనీరు లేని పరిస్థితి నుంచి పూర్తిగా విముక్తి కల్పించాడు. 

చ్యూవాంగ్ నోర్ఫెల్ ది మధ్యతరగతి కుటుంబం. లడఖ్ లోని లేహ్ లో నివాసం. లక్నోలో సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా చదివాడు. జమ్మూ కాశ్మీర్ గ్రామీణాభివృద్ధి శాఖలో 35 ఏళ్లపాటు పనిచేశాడు. 1995లో రిటైర్ అయ్యాడు. అయినా తను చేస్తున్న పని ఆపలేదు. అప్పుడు గవర్నమెంటు ఉద్యోగిగా.. ఇప్పుడు ప్రజలకోసం స్వచ్ఛందంగా..!! ఇంతకూ నోర్ఫెల్ ఏం చేస్తున్నాడు? 

 లడఖ్ లో కనీసం ఒక రోడ్డు వేయలేదు. కల్వర్టు నిర్మించలేదు. బ్రడ్జి వేయలేదు. అందుకే వాటన్నిటికి పరిహారంగా నీటి సమస్య తీర్చాలని భావించాడు. పైగా అక్కడి ప్రజలకు అన్నిటికంటే నీరే ప్రధాన సమస్య. ఏ కాలమైనా అదే పరిస్థితి. అందుకే ఆ దిశగా నడుంకట్టాడు. హిమనీనదాలు కరుగుతాయన్న మాటగానీ.. ఆ నీళ్లు అక్కడికి చేరుకోలేవు.

image


అంతకంతకూ పెరుగుతున్న కాలుష్య గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతోంది. గ్రామాల్లో నీటి కొరత ఏర్పడి జనం పట్టణాల బాట పడుతున్నారు. ఫలితంగా రూరల్ ఎకానమీ పడిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నోర్ఫెల్ ఒక సత్కార్యానికి నడుం బిగించాడు. ఆర్టిఫీషియల్ హిమనీనదాలు క్రియేట్ చేయాలని భావించాడు. చిన్న చిన్న ఆనకట్టల ద్వారా నీరు నిల్వ ఉండేలా చేశాడు. అలా ఇప్పటిదాకా 12 హిమనీనదాలను సృష్టించాడు. ఫలితంగా కొంత భూమి సాగులోకి వచ్చింది. ఆటోమేటిగ్గా భూగర్భ జలాలూ పెరిగాయి. సుమారు వంద గ్రామాలకు నీటి కరువు లేకుండా చేశాడు.

నోర్ఫెల్ చేసిన కృషికి గానూ 2015లో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇప్పుడదంరూ అతడిని మంచు మనిషి, లేదంటే హిమనీదనాల మనిషి అని పిలుస్తుంటారు. అవార్డులు రివార్డులు వచ్చాయని తన పని ఆపలేదు. ఎక్కడ నీటి సమస్య ఉందో తెలుసుకుని అక్కడ ఒక కాలువ క్రియేట్ చేస్తాడు. భవిష్యత్ తరాలు నీటి కోసం ఇబ్బంది పడొద్దనేదే నోర్ఫెల్ నమ్మిన సిద్ధాంతం.

Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share
Report an issue
Authors

Related Tags