సంకలనాలు
Telugu

35 ఏళ్ల క్రితమే హైదరాబాదీలకు కాన్సెప్ట్ స్టోర్ పరిచయం చేసిన ‘శ్రద్ధ ఎక్స్ టెన్షన్’

ashok patnaik
28th Dec 2015
Add to
Shares
5
Comments
Share This
Add to
Shares
5
Comments
Share

శ్రద్ధ స్టోర్. సికింద్రాబాద్ లో తెలియని వారుండరు. ఎందుకంటే అక్కడి వారికి ఈ స్టోర్ తో మూడున్నర ఏళ్ల అనుబంధం ఉంది. ఓ తరహా గిఫ్ట్ లను ఇచ్చుకోవాలంటే ఈ స్టోర్ కు విజిట్ చేయాల్సిందే. శ్రద్ధ అనేది ఇక్కడొక బ్రాండ్. చాలా చవక ధరలో మంచి వస్తువులు దొరుకుతాయనేది స్థానికులు నమ్మకం.

image


బొమ్మలకు పెట్టింది పేరు

కాన్సెప్ట్ స్టోర్ అనే పదాన్ని మొదటగా మనకి తెలిసేలా చేసింది బహుశా ఈ శ్రద్ధా స్టోరే కావొచ్చు. ప్రధానంగా కొన్ని కాన్సెప్ట్ లను అందించడం ఈ స్టోర్ ప్రత్యేకత. ఇండియా ఈజ్ ది కంట్రీ ఆఫ్ ఫెస్టివల్స్. మన దేశంలో జరిగే పండగలు ప్రపంచంలో మరెక్కడా జరగవంటే అతిశయోక్తి కాదేమో. దీంతో అన్ని సీజన్లు ఎదో ఒక గిఫ్ట్ అవసరం ఉంటుంది. ఆ గిఫ్ట్ లను ఓ బొమ్మల రూపంలో ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి తయారైందే ఈ కాన్సెప్ట్. ప్రత్యేకంగా తయారు చేసిన బొమ్మలు ఈ స్టోర్ లో ఆకర్షిస్తాయి. ఆఫ్రికన్ బొమ్మల దగ్గరి నుంచి ఇటలీ, అమెరికా లాంటి పాశ్చాత్య బొమ్మలకు తోడుగా మన విఘ్నేశ్వరుడి విగ్రహాలు, సీతాదేవి, రాముని విగ్రహాలు కట్టి పడేస్తాయి. పంజాగుట్టలో ఇటీవల ప్రారంభించిన ఈ స్టోర్ బ్రాంచిలో వేల సంఖ్యలో బొమ్మలను మనం చూడొచ్చు.

“దేశంలో నలుమూల నుంచి విగ్రహాలను, వస్తువులను సేకరిస్తాం,” శ్రద్ధ

శ్రద్ధ పంజగుట్ట స్టోర్ వ్యవహారాల్ని చూస్తున్నారు. ఆమె చెప్పిన ప్రకారం మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో వస్తకళాకారుల దగ్గరి నుంచి వీటని కొనుగోలు చేస్తారట. అందకే మార్కెట్ లో కాంపిటీటివ్ ప్రైస్ కు అమ్ముతున్నామని చెప్పుకొచ్చారామె.

image


బుక్ స్టోర్ నుంచి కాన్సెప్ట్ స్టోర్ దాకా

శ్రద్ధ కాన్సెప్ట్ స్టోర్ గా మారక ముందు ఓ బుక్ స్టోర్ గా ఉండేది. సికింద్రాబాద్ లో ఎక్కడా దొరకని పుస్తకమైనా ఇక్కడ మాత్రం దొరకాల్సిందే. అయితే అది కాన్సెప్ట్ స్టోర్ గా రూపాంతరం చెందిందని శ్రద్ధ చెప్పుకొచ్చారు. తన పేరుమీదనే ఈ స్టోర్ ని లాంచ్ చేశారని అంటున్నారామె. శ్రద్ధ వాళ్ల నాన్నప్రారంభించిన బుక్ స్టోర్ అనంతరం కాన్సెప్ట్ స్టోర్ గా మరి తన అన్నయ్య చేతికొచ్చేసరికి ఓ బ్రాండెడ్ స్టోర్ అయిపోయిందని అంటున్నారామె.

“90శాతం వస్తువులు 500నుంచి1000 లోపే,” శ్రద్ధ

తమ కాన్సెప్ట్ స్టోర్ లో దాదాపు అన్ని వస్తువులూ 500 నుంచి వేయి రూపాయిల మధ్యలోనే దొరుకుతాయంటున్నారు. ఇంత తక్కవ ధరలో ఈ క్వాలిటీ వస్తువులు ఇవ్వడం తమకే సాధ్యమైందని ఆమె క్లెయిమ్ చేసుకుంటున్నారు.

image


తెలుగు పుస్తకాలు లభించే స్టోర్

తెలుగు నవళ్లు, ఇతర పుస్తకాలు ఈరోజుల్లో సాధారణ బుక్స్ హౌస్ లలో దొరకడం కష్టం. కానీ సినారె పుస్తకాల దగ్గరి నుంచి శ్రీశ్రీ మరో ప్రపంచం దాకా ప్రతి పుస్తకం ఇక్కడ లభిస్తుంది. తెలుగు పుస్తకాలపై ప్రత్యేక డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. సీజన్ లతో మారుతున్న ట్రెండ్ లాగానే కొత్త తరహా పుస్తకాలను కూడా అందిస్తున్నారు. ఇంగ్లీష్ నవలల తెలుగు వర్షన్ పుస్తకాలు కూడా లభిస్తాయి. పూర్తి స్థాయి హైదరాబాదీ స్టోర్ కు ఇదే ఉదాహరణగా చెప్పొచ్చు.

శ్రద్ధా స్టోర్ టీం

ఉమాకాంత్ శ్రద్ధా కో ఫౌండర్ , ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు శ్రద్ధ మరో కో ఫౌండర్. హైదరాబాద్ లో మూడు స్టోర్లున్నాయి. మొత్తం 100మంది కి పైగా ఉద్యోగులున్నారు. మరిన్ని స్టోర్ లకోసం కొత్తగా రిక్రూట్మెంట్ ప్రక్రియను కూడా మొదలు పెట్టారు.

image


పోటీదారులు, సవాళ్లు

ఆన్ లైన్లో శ్రద్ధ స్టోర్ కు ప్రధానంగా పోటీ ఉంది. ఎందుకంటే ఆఫ్ లైన్ బిజినెస్ తో పోలిస్తే శ్రద్ధ స్టోర్ చేసే ఆన్ లైన్ బిజినెస్ పదిశాతం మాత్రమే. అయితే ఆఫ్ లైన్ స్టోర్ పోటీ అసలు తము పోటీయే కాదంటున్నారు శ్రద్ధ. మారుతున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయి ఈకామర్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టాల్సి ఉంది. ఆఫ్ లైన్ లో వ్యాపారం ఎలా ఉన్నప్పటికీ ఆన్ లైన్ సేల్స్ ఇప్పుడు ప్రధాన ఆదాయవనరుగా మారుతన్నాయి. దీన్ని అధిగ మించాల్సి ఉంది.

భవిష్యత్ ప్రణాళికలు

శ్రద్ధా ఎక్స్ టెన్సన్ పేరుతో ఓ చెయిన్ స్టోర్ ను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. హైదరాబాద్ అవతల ఆంధ్రా, తెలంగాణ జిల్లాల్లో కూడా స్టోర్ లను ప్రారంభిచాలని చూస్తున్నారు. వచ్చే ఏడాది సరికి పూర్తి స్థాయి ఆన్ లైన్ వ్యాపారంలోకి వస్తామని శ్రద్ధ చెప్పుకొచ్చారు.

Add to
Shares
5
Comments
Share This
Add to
Shares
5
Comments
Share
Report an issue
Authors

Related Tags