స్టార్టప్‌ల సక్సెస్‌కు షార్ట్ కట్ డిజిటల్ మార్కెటింగ్

స్టార్టప్‌ల సక్సెస్‌కు షార్ట్ కట్ డిజిటల్ మార్కెటింగ్

Thursday February 04, 2016,

3 min Read

సొంత వ్యాపారాన్ని ప్రారంభించడం ఎవరికైనా ఆనందించే విషయమే. అయితే దాన్ని కస్టమర్లకు దగ్గరికి తీసుకెళ్లడం ఎలా? వ్యాపారం గురించి అందరికీ ఎలా తెలియజేయాలి? విజయవంతంగా బిజినెస్‌ను ఎలా నడిపించాలి? మన దగ్గరున్న మూలధనంతోనే మన కలలను ఎలా సాకారం చేసుకోవాలి ? వీటన్నింటికీ జవాబు ఒక్కటే. అదే డిజిటల్ మార్కెటింగ్.

అసలు స్టార్టప్స్‌కు మార్కెటింగ్ అవసరమా? అంటే కచ్చితంగా అవసరమే అని చెప్పాలి. సరైన మార్కెటింగ్ ఉంటేనే స్టార్టప్స్‌ కస్టమర్లకు కనెక్ట్ అవుతాయి. ప్రతి సంస్థకు తమదంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ఉండాలి. అప్పుడే స్టార్టప్స్ లాభాల బాటలో పయనిస్తాయి.

image


డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు?

మార్కెటింగ్ రెండు రకాలు. ఒకటి సంప్రదాయ మార్కెటింగ్. రెండు డిజిటల్ మార్కెటింగ్. సంప్రదాయ మార్కెటింగ్ పక్కన పెడితే.. డిజిటల్ మార్కెటింగ్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్. ఎందుకు? ఎందుకంటే అంటే దానికో లెక్కుంది. ఖర్చు పెద్దగా ఉండదు. టైం వేస్ట్ అవదు. కస్టమర్లు కావల్సినంత. అదే డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్.

స్టార్టప్స్‌కు డిజిటల్ మార్కెటింగ్ లంకె ఎలా కుదురుతుంది?

సంస్థ బ్రాండ్‌, పొజిషన్‌ గురించి డిజిటల్ మార్కెటింగ్ కస్టమర్లకు ఒక అవగాహన ఏర్పరుస్తుంది. తొలి నాళ్లలో యూజర్లు అట్రాక్ట్ అయ్యేందుకు అవకాశం కల్పిస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ కారణంగా ఆన్‌లైన్ సేల్స్‌ సంఖ్య కూడా పెరుగుతుంది. 

ఈ స్టోరీని కూడా చదవండి

బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని స్టార్టప్స్ తక్కువ ఖర్చుతో కొన్ని టెక్నిక్స్/టూల్స్‌ను ఉపయోగించాలి. అలాంటి టూల్స్‌ను ఒక్కసారి పరిశీలిద్దాం.

ఎస్‌ఈఓ: 

ఇది అతి తక్కువ ఖర్చుతో, ఎక్కువ లబ్ధి చేకూర్చే టూల్. దీంతో వెబ్‌సైట్‌లో అందరికీ కనిపించడంతోపాటు, ఎక్కువమంది వినియోగదారులు వచ్చే అవకాశముంటుంది. దీని కారణంగా ఫ్రీ బ్రాండింగ్‌ లభించడంతోపాటు, సంస్థ పట్ల నమ్మకం, విశ్వాసం కలుగుతాయి. అన్నిటి కంటే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వ్యాపారం 24/7 అందరికీ అందుబాటులో ఉంటుంది.

ఎస్‌ఈఓ ఫ్రెండ్లీగా మారాలంటే ఏం చేయాలి? 

వ్యాపారం ఈ-కామర్స్ బిజినెస్ అయితే, దాన్ని మొబైల్ ఫ్రెండ్లీగా, సెక్యూర్డ్‌గా ఉండేలా మార్చాలి. అలాగే వెబ్‌సైట్‌లో అన్ని పేజీలు సక్రమంగా పనిచేస్తున్నాయా, సరైన ట్యాగ్స్, హెడర్స్, డిస్క్రిప్షన్స్ ఉన్నాయా చూసుకోవాలి. పేజీలను తొందరగా లోడ్ అయ్యేలా చూడాలి. అలాగే సైట్‌లో మంచి కంటెంట్‌ను క్రియేట్ చేయాలి. ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ గురించి అందరూ చర్చించుకునే వాతావరణం కల్పించాలి.

కంటెంట్ మార్కెటింగ్

కంటెంట్ మార్కెటింగ్ కారణంగా వెబ్‌సైట్‌కు ట్రాఫిక్ పెరుగుతుంది. మరింత సంఖ్యలో యూజర్లు లభిస్తారు. అలాగే బ్రాండ్‌కు మంచి ప్రచారం లభిస్తుంది. అంతేకాదు క్లయింట్లతో మంచి రిలేషన్ ఏర్పడుతుంది.

కంటెంట్ మార్కెటింగ్‌లో ఏది ముఖ్యం?

వ్యాపారానికి ఉపయోగపడే కంటెంట్‌ను రెగ్యులర్‌గా పబ్లిష్ చేస్తుండాలి. ప్రాడక్ట్ అమ్మకాల కోసం ప్రత్యేకమైన ప్రతిపాదనలను రూపొందించాలి. అలాగే బ్లాగ్‌ను ఏర్పాటు చేసి కథనాలు రాస్తుండాలి. కంటెంట్‌ను పోస్ట్ చేసేందుకు ఇతర పబ్లిషర్లతో కలిసి పనిచేయాలి. కంటెంట్‌ను చదివేలా యూజర్లను ప్రోత్సహించాలి.

సోషల్ మీడియా మార్కెటింగ్

సంస్థ గురించి అందరికీ తెలియాలంటే అన్నిటికంటే సోషల్ మీడియా మార్కెటింగే చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల ప్రస్తుత కస్టమర్లతోపాటు భవిష్యత్ కస్టమర్లకు కూడా దగ్గరవుతారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, లింక్డిన్, గూగుల్ ప్లస్, తుంబ్లర్, పింట్రెస్ట్, ఇన్‌స్టాగ్రామ్.. ఇలా వ్యాపారానికి ఉపయోగపడే సరైన ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోవాలి.

సోషల్ మీడియాలో ప్రచారం ఎలా ?

కస్టమర్ మన కమ్యునిటీలో భాగం ఎందుకు కావాలో, ఎందుకు ఫాలో కావాలో ఆలోచించాలి. కంటెంట్‌కు సంబంధించి కొంత సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలి. దాన్ని యూజర్లు చూసేలా పర్యవేక్షించాలి. గ్రూప్స్/క్వచ్చన్ అండ్ ఆన్సర్స్/చాట్‌ సరైన దిశగా నడిచేలా ప్లాన్ చేసుకోవాలి.

ఈమెయిల్ మార్కెటింగ్

ఇది అన్నిటికంటే చాలా సులభం. తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అలాగే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌ వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఎంతమందితోనైనా సులభంగా కమ్యూనికేట్ కావొచ్చు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు రెండింటినీ కలిపినా -ఆ రెండింటికంటే ఈ-మెయిల్ యూజర్ల సంఖ్య మూడింతలు ఉంటుంది.

ఈ-మెయిల్ మార్కెటింగ్ ఎలా?

మంచి సర్వీస్ ప్రొవైడర్‌ను గుర్తించాలి. కాన్‌స్టంట్ కాంటాక్ట్, మెయిల్ చింప్, ఏవెబర్, అమెజాన్ ఎస్ఈఎస్ వంటి కొన్ని ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రచారం కోసం ఓ క్యాలండర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. అయితే అన్నిటికంటే ముఖ్యమైందేంటంటే.. ‘ప్రతీసారి అమ్మకాలే లక్ష్యంగా పెట్టుకోకూడదు’. ఎక్కువ సంఖ్యలో ఈ మెయిల్స్ ఉచిత సర్వీసులనే అందించాలి.

గ్రోత్ హ్యాకింగ్

సంప్రదాయ పద్ధతికి తక్కువ ఖర్చుతో కూడుకున్న, అత్యంత ప్రభావవంతమైన, కొత్త తరహా ప్రత్యామ్నాయమిది. ఏదైనా ఒకదాన్ని ఫ్రీగా ఆఫర్ చేయాలి. అందుకోసం రిఫరల్ ప్రొగ్రామ్‌ను రూపొందించాలి. దాన్ని ప్రత్యేకంగా తీసుకెళ్లాలి. అది ఎలా ఉండాలంటే.. ఆన్‌లైన్‌లో అందరూ మన ప్రొడక్ట్‌ గురించే మాట్లాడుకునేలా ఉండాలి.

ఈ టెక్నిక్స్‌ను ఇప్పుడే ప్రయత్నించండి.. విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.

ఈ స్టోరీని కూడా చదవండి

ఈ స్టోరీని కూడా చదవండి

ఈ స్టోరీని కూడా చదవండి