సంకలనాలు
Telugu

కేక్స్, డెజర్ట్స్, కుకీస్‌ తయారుచేసే హోం చెఫ్స్‌కు ఆన్‌లైన్ వేదిక 'విస్క్‌ఇట్'

23rd Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

బేకరీ, డెజర్ట్ కళాకారులు.. తాము తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించే ఒక మార్కెట్ ప్లేస్. ఇండియాలో ఆంట్రప్రెన్యూర్ కావాలని బలంగా కోరుకునే చాలా మంది సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌లో అమన్వీర్ మండ్రా కూడా ఒకరు. అందుకే ఐటి ఉద్యోగం చేస్తునప్పటికీ, స్టార్టప్‌ని ప్రారంభించి తన కల నెరవేర్చుకున్నారు. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ సమయంలో, ప్రముఖ ఇండియన్ ఐటి కంపెనీలో ఉద్యోగం లభించింది. అక్కడే కొన్ని సంవత్సరాలు పనిచేసారు. తర్వాత పూణె వెళ్లి మరో ఐదేళ్లు సింటెల్, ఫిన సెర్వ్ లలో పనిచేసారు. ఆ సమయంలోనే యు.కె., నెదర్లాండ్స్ లలో ఒక అసైన్మెంట్ మీద పనిచేస్తున్నప్పుడు అంతర్జాతీయంగా అవగాహన లభించింది.

image


ఇంతలో… స్థానిక పర్యాటకం, హస్తకళలల్ని ప్రచారం చేసే లక్ష్యంతో సామాజిక వేదిక అయిన ట్రావెల్ హాలికా ప్రాజెక్ట్‌ని ఒక అభిరుచితో మొదలుపెట్టారు. “నేను ఫిన్‌సెర్వ్‌లో ఉండగా.. ఒక వ్యవస్థాపక శిబిరానికి ఎంపికయినప్పుడు ఎంతో అవగాహన ఏర్పడింది. అదే సమయంలో నేను విస్కిట్ మీద కూడా పనిచేస్తుండటంతో, ఇందులో మంచి అవకాశం కనిపించింది” అంటున్ అమన్వీర్.

“ 2012-2015 సంవత్సరాలలో… భారతదేశంలో బేకరీ, డిజర్ట్ ల మార్కెట్ రూ.1,50,000 కోట్లని ఓ అంచనా. కనీస వార్షిక వృద్ధి రేటుగా 12-15 శాతం ఉంది. కానీ ఆశ్చర్యకరంగా, మొత్తం భాగంలో 90 శాతాన్ని కేవలం అవ్యవస్థీకృత వ్యాపారులే శాసిస్తున్నారు. ఈ అభివృద్ధిలో ముఖ్యంగా ఇంటి వద్ద బేకరీ ఉత్పత్తులు, చాకొలెట్ల తయారీదారులు, కేక్ ఆర్టిస్టులు, చిన్న తరహా బేకరీలే ముఖ్య పాత్ర వహిస్తున్నాయి ”, అంటూ విశ్లేషిస్తున్నారు అమన్వీర్.

విస్క్‌ఇట్.. వారధి

విస్క్‌ఇట్(WhiskIt) అనేది ఒక ప్రత్యేకమైన, కమ్యునిటీ నిర్వహించే మార్కెట్ ప్లేస్. పూర్తిగా చేత్తో చేసే డిజర్ట్స్, బేకరీ పదార్ధాల కోసమే ఉద్దేశించింది. బేకరీ షెల్ఫ్‌లో కనిపించే అద్భుతమైన డెజర్ట్‌లను కొనేందుకు, అమ్మేందుకు ప్రజలను కలిపే ఒక పర్యావరణ వ్యవస్థ. స్వీట్ లవర్స్‌కి ఇదొక కమ్యూనిటీ. టాలెంట్ ఉన్న డిజెర్ట్ కళాకారులు తమ నైపుణ్యంతో చేసిన ఉత్పత్తులని అమ్ముతారు, స్వీట్ లవర్స్ ఇక్కడకొచ్చి చక్కగా అమర్చిన తీరుని చూసి, మరెక్కడా దొరకనటువంటి నోరూరించే డిజర్ట్ లు, కేకులను కొనుక్కుంటారు.

ఈ సారి మీకు ఎప్పుడైనా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే చీజ్ కేకులు లేదా మెత్తని డోనట్లు తినాలనిపిస్తే, కేవలం రెండు క్లిక్కుల దూరంలోనే ఉంది విస్క్‌ఇట్.

షాపులు: మీ స్వంత పేస్ట్రీ షెఫ్‌ని నియమించుకోవాలని అనుకుంటున్నారా?... విస్క్‌ఇట్ ఆ పని చేసిపెడుతుంది. పెద్ద బేకరీల నుంచి వృత్తిపరమైన హోమ్ బేకర్స్, క్రియేటివ్‌గా చాకొలెట్ తయారు చేసే వాళ్ల వరకూ ఎవరైనా సరే ఇందులో షాప్ పెట్టుకోవచ్చు. స్వీట్ తయారు చేయడం వస్తే చాలు.

కమ్యూనిటీ: డిజర్ట్ ప్రేమికులకి, తయారీదారులకి కూడా విస్క్‌ఇట్ ఒక వేదికలాంటిది. మీ ఫేవరెట్ షాపులు లేదా కళాకారులను అనుసరించండి. ఒకేలాంటి అభిరుచులు ఉన్న వ్యక్తులతో అనుసంధానమవ్వండి. మీ అభిప్రాయాలు, వంటలు మరియు మెళకువలను తోటి స్వీట్ లవర్స్ మరియు బేకర్స్ తో పంచుకోండి!

సబ్‌స్క్రిప్షన్ బాక్స్: ప్రతీ నెలా అందంగా డిజైన్లతో ముస్తాబైన స్వీట్ సర్‌ప్రైజులతో కూడిన బాక్స్‌ని అందిస్తుంది విస్క్‌ఇట్. ప్రతీనెలా ఒక ప్రత్యేకమైన నేపథ్యంతో, వినియోగదారులు కోరుకునే విధంగా డిజర్ట్స్ మరియు ఇతర పదార్ధాలను అందిస్తోంది. ప్రతీ బాక్స్ కూడా అందుకున్న వారి అంచనాలకు తగ్గట్లుగా ఉంటోంది. “ అవి గిఫ్ట్ బాక్సులైనా, కుకీ బాక్సులైనా లేదా బ్రెడ్ బాస్కెట్స్ అయినా మా వద్ద చాలా రకాలు ఉన్నాయి ”, అంటూ చెప్తారు అమన్వీర్.

ఈవెంట్స్: డిజర్ట్స్ మరియు బేక్స్ కి సంబంధించి వీళ్లు అన్ని రకాల బేక్ ఆఫ్స్, బేకింగ్ క్లాసెస్, కార్నివాల్స్ ని నిర్వహిస్తారు.

image


విస్క్‌ఇట్ నేపధ్యం

“నా స్నేహితురాలు ఒకరు ఇంట్లో తయారుచేసే పుడ్డింగ్స్‌ని అమ్మడం మొదలుపెడదామని భావించినప్పుడు ఈ ప్రస్థానం మొదలైంది. ఎన్నో చిన్న వ్యాపారాలు మొదలైనట్లే మేము కూడా మంచి పేరుతో ఫేస్‌బుక్ లో ఒక పేజీ తయారుచేసి ప్రారంభించాం. ఆమె ఉత్పత్తులకి సంబంధించిన ఎన్నో ఫ్యాన్సీ ఫోటోలను పెట్టాం. ఫేస్ బుక్‌లో డబ్బు చెల్లించి ప్రచారం కూడా నిర్వహించాం. కానీ వ్యాపారం అంతగా సాగలేదు. విస్తృత అవకాశమున్న ఈ రంగంలో, ఫేస్‌బుక్‌లో చూసి డిజర్ట్స్ కొనడానికి చాలా తక్కువమంది వస్తారు.

రెండోసారి ఎప్పుడనిపించిందంటే, విదేశాల్లో ఉండే నా స్నేహితురాలు ఒకరు ఇండియాకి ప్రత్యేకంగా డిజైన్ చేసిన కేక్‌ని పంపించాలని భావించినప్పుడు. కోరుకున్నవిధంగా కేక్‌ని చేసిచ్చే మంచి బేకరీ కనిపించలేదు. అదే సమయంలో చెల్లింపు, డెలివరీ టైంలలో కూడా ఆమె ఇబ్బంది ఎదుర్కొంది.” అంటూ చెప్తారు అమన్వీర్.

ఈ మార్కెట్ చాలా పెద్దదే కానీ ఇప్పటికీ అంత నిర్మాణాత్మకంగా లేదు. మార్కెటింగ్ అంతా ఎక్కువగా మౌత్ పబ్లిసిటీ, సోషల్ మీడియా ద్వారానే జరుగుతోంది. చెల్లింపులన్నీ ఎక్కువగా క్యాష్ రూపంలోనే అవుతున్నాయి. పరిధి కేవలం మన ఇరుగుపొరుగు వరకూ, నగరంలో కొంత మేరకు ఉంటోంది. ముఖ్యమైన వేడుకలకి ఇప్పటికీ భారతదేశంలో సాధారణంగా కేకులు, బొకేలు, చాక్లెట్లనే బహుమతిగా ఇస్తుంటారు. ఇంత డిమాండ్ ఉన్న ఈ రోజుల్లో కూడా, ఈ సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. కాబట్టి వీటిని సులువుగా పరిష్కరించాలి. “ఈ బేకర్స్ అందరికీ ముందు ఒక బిజినెస్ లిస్టింగ్ ప్లాట్‌ఫామ్‌ని మొదలుపెట్టాలని భావించాను. సోషల్ మీడియాలో ప్రచారం చెయ్యడం ద్వారా పదకొండు నగరాల నుంచి సుమారు 50 బేకర్లను రిజిష్టర్ చేసాము,” అంటూ వివరిస్తారు అమన్వీర్. ప్రస్తుతానికి విస్క్‌ఇట్ చంఢీగఢ్, పూణెలకు మాత్రమే పరిమితమైంది. ఇటీవలే విస్క్‌ఇట్ మార్కెట్ ప్లేస్‌గా మారాక, బేకర్స్ తమ ఉత్పత్తులను ఇందులో అమ్మడం మొదలుపెట్టారు.


సాఫ్ట్‌వేర్ టు స్టార్టప్ జర్నీ 

మంచి జీతాన్ని ఇచ్చే ఉద్యోగాన్ని వదులుకుని అకస్మాత్తుగా డబ్బుల కోసం ఇబ్బందిపడటం ఎవరికైనా కష్టమే. స్టార్టప్‌తో పోల్చుకుంటే ఉద్యోగానికి ఉండే సౌకర్యమే వేరు. సెక్యూరిటీ, జీతం అన్నీ సానుకూల అంశాలే. అందుకే చాలా మంది వెనక్కి లాగుతూఉంటారు. కానీ అమన్వీర్ విషయంలో అలా జరగలేదు. సహకరించే స్నేహితులు, కుటుంబసభ్యులు ఉండటం ఆయన అదృష్టం. “సాధారణంగా అందరికీ ఉండే ప్రతిబంధకాలైన సామాజిక-ఆర్ధిక సవాళ్లు నాకు లేవు”, అంటారు ఆయన.

సాంకేతిక నేపథ్యం నుంచి వచ్చినందువల్ల... మార్కెటింగ్ అతిపెద్ద సవాలు, కష్టమైన పనిగా భావించారు. కో-ఫౌండర్ లేకుండా స్టార్టప్ ప్రారంభించడం వల్ల అన్నీ తానై చూసుకోవాల్సి వచ్చింది అమన్వీర్‌కి. “కానీ స్టార్టప్ ఇలా మొదలు పెట్టడమే సరదాగా ఉంటుంది. పాఠాలు నేర్చుకోవచ్చు, మెరుగుపడొచ్చు, వివిధ పాత్రల్లో ఒదిగిపోవచ్చు,” అంటూ ఆయన వివరిస్తారు.

తనకి తానుగా ఒక బ్రిడ్జికి మధ్యలో ఉండి, బ్రిడ్జికి ఒకవైపు నిప్పు పెడితే ముందుకి సాగడమే తప్ప ఇక వెనక్కి తిరిగి చూసే అవకాశం ఉండదని ఆయన నమ్ముతారు. రోజువారీ ఎదురయ్యే ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి స్వీయ-ప్రేరణే మన ముందున్న దారి అంటూ చెప్తారు.

ఒక సెక్యూర్డ్ జాబ్‌ని వదులుకుని విస్క్‌ఇట్‌ని ప్రారంభించడం అనేది తప్పుడు నిర్ణయం కాదని ఆయన నిరూపించారు. నిజానికి సమయం గడుస్తున్నకొద్దీ స్టార్టప్ నెమ్మది నెమ్మదిగా ఎదిగింది. తన సొంత వెంచర్ ప్రారంభించడానికి ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిన తల్లిదండ్రులే తనకి దన్ను అని ఆయన బలంగా నమ్ముతారు.

website

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags