సంకలనాలు
Telugu

అమ్మా,నాన్న, ఓ అవినాష్..ఇదే 'వ్యాగ్ మోబ్' కథ

ఇండోర్ కేందరంగా గ్లోబల్ టెక్ కంపెనీకుటుంబ సభ్యులే ఫౌండర్లు, ఉద్యోగులుస్టార్టప్ కంపెనీలకు సరికొత్త భాష్యం చెప్పిన వ్యాగ్ మోబ్గూగుల్ లాంటి వినియోగదారులను సంపాదించి సత్తా చాటారు

21st May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఇండోర్ కేంద్రంగా దూసుకుపోతున్న వ్యాగ్ మోబ్ కంపెనీ గురించి తెలియాలంటే... ఆ కంపెనీ ఫౌండర్ల గురించి ముందుగా తెలుసుకోవాలి. భార్య,భర్తలిద్దరూ కలిసి దీన్ని ప్రారంభించారు. కవితజైన్, కల్పిత్ జైన్ లు మధ్యప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో తమ బల్యాన్ని గడిపారు. భూపాల్ కెవి స్కూల్లో కవిత, నీముచ్ కెవి స్కూల్లో కల్పిత్ తమ విద్యాభాసాలను పూర్తి చేశారు. ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన పరిస్థితి. కానీ ఇద్దరిలో ఉన్న ఒకే ఒక కామన్ పాయింట్ వాళ్లిద్దరూ వేరు వేరు స్కూళ్లైన కేంద్రీయ విద్యాలయంలో చదువుకోవడమే. కవిత నాన్న కెవి స్కూలు ప్రిన్సిపాల్. అమ్మ బోటనీ లెక్చరర్ గా రిటైర్డ్ అయ్యారు. ఇంట్లో చదువు తప్పితే వేరే ధ్యాస లేదు. దీంతో కవిత కూడా బాగా చదుకుంది. ఇప్పుడు కవిత, కల్పిత్ జీవితాలు సాఫీగా సాగిపోవడానికి కారణం ఇదే. కల్పిత్ వాళ్ల నాన్న కూడా ప్రభుత్వ ఉద్యోగి కావడం తనకు ఏరకమైన లోటు తెలియకుండా పెరిగారు. 1997లో కవిత ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అప్పుడే కల్పిత్ తన ఎంబియేను ఆరిజోన్ యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు. వాళ్లిద్దరి కెరియర్లు ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రులు సంబంధాలు కుదర్చడంతో వీళ్లిద్దరికీ పెళ్లైంది. కవిత అమెరికా కూడా వెళ్లి వచ్చారు. కల్పిత్ ఓ రెండేళ్ల పాటు స్టార్టప్ రన్ చేసి కార్పోరేట్ లోకి అడుగు పెట్టారు. ఇద్దరూ మైక్రోసాఫ్ట్ లో పనిచేయడానికి అమెరికా పయనమయ్యారు. 2010 కి వాళ్లకు పుట్టిన చిన్నారి అవినాష్ కూడా పెద్దవాడయ్యాడు. ఇక భారత దేశంలో ఏదైనా వ్యాపారం చేయాలని ఇద్దరూ అనుకున్నారు. వెంటనే సీన్ ఇందోర్ కు మారింది.


కవితజైన్, కల్పిత్ జైన్ - వ్యాగ్ మోబ్ వ్యవస్థాపకులు

కవితజైన్, కల్పిత్ జైన్ - వ్యాగ్ మోబ్ వ్యవస్థాపకులు


స్వదేశానికి తిరిగి రావడం ఓ సాహసోపేతమైన నిర్ణయమే. ఇండియా తిరిగి రావడాన్ని ఎంతో మంది వారించారు. కానీ స్టార్టప్ ప్రారంభించాలనే ఉద్దేశంలో ఎలాంటి మార్పు రాలేదు. అప్పుడు ప్రారంభమైనదే వ్యాగ్ మోబ్. బిటుబి ప్లాట్ ఫాంలోని ఈ యాప్ విద్యారంగంలో విజయవంతమైంది. కంపెనీలు తమ టీంలకు ట్రెయినింగ్ ఇవ్వడానికి వ్యాగ్ మోబ్ సహాయపడుతుంది. ఇండియాలో పరిస్థితులు మారుతున్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెడుతున్న వారికి ప్రభుత్వం సైతం ఊతం ఇస్తోందన్నారు కల్పిత్. పనిచేసుకోడానికి ఇప్పుడిక్కడ హైస్పీడ్ ఇంటర్నెట్ లభిస్తోంది.

వ్యాగ్ మోబ్ ప్రత్యేకత

భారత్ నుంచి ఎన్నో కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాయి. అది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ ఇండోర్ నుంచి ఓ కంపెనీ గ్లోబల్ గా క్రెడిట్స్ సంపాదించడమంటే మాటలు కాదు. వ్యాగ్ మోబ్ కస్టమర్‌గా గూగుల్ ఉందంటే అంత ఆషామాషీ వ్యవహారమైదే కాదు కదా. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆరు నెలలు ట్రెయినింగ్ కంపల్సరీ. వారిని సర్, మేడమ్ అని సంభోదించకూడదు. ఏకవచనంతో పిలవక పోయినా అందరితో గౌరవంగా మసులు కోవాలి. టీం వర్క్ చేసేటప్పుడు బాస్ అనే పదం ఉండకూడదు. ఇదే గొప్ప గొప్ప కంపెనీల సక్సస్ మంత్రం.

వ్యాగ్ మోబ్ టీం

వ్యాగ్ మోబ్ టీం


image


భారతీయ స్కూళ్లనుంచి టాపర్లు వస్తున్నారు కానీ టీం ప్లేయర్లు రావట్లేదు

నువ్వు బాస్ అన్న సంగతి మర్చిపోయి, నువ్వు కూడా ఓ సహోద్యోగిలాగా మారిపోయి నప్పుడే పనిని ఎంజాయ్ చేయగలవు. అప్పుడు మాత్రమే ఆ కంపెనీ ఫలితాలను సాధిస్తుంది. ఆఫీసు మొత్తం ఒకే ఫ్లోర్‌లో ఉండాలి. మీటింగ్ రూం అంటే.. ఉద్యోగులంతా కలవాలి. సాయంకాల పిచ్చాపాటి, వారానికో పార్టీ లాంటివి మరింత మెరుగైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. ఇదే తమ కంపెనీలో ట్రెయింగ్ విశేషాలని కల్పిత్ చెప్పుకొచ్చారు.

14 ఏళ్లకే అవినాష్ జైన్ ఆరంగేట్రం

కవిత, కల్పిత్ ల చిన్నారి అవినాష్ పెద్దవాడయ్యాడు. అవినాష్ లోని చొచ్చుకు పోయే తత్వం కల్పిత్‌ను కట్టిపడేసింది. చిన్నపిల్లల ఎంత తొందరగా విషయాలను నేర్చుకుంటారనే విషయం అవినాష్‌ను చూశాకనే అర్థం చేసుకున్నారాయన. దీంతో అవినాష్ తమ టీంలో మెంబరైపోయాడు. వ్యాగ్ మోబ్ టీం కోడింగ్‌తో పనిచేస్తుంది. కంటెంట్‌ని డెవలప్ చేయడం, దాన్ని అమ్మడం ఈ టీం ముఖ్య ఉద్దేశం. అవినాష్ కూడా కాన్ఫిరెన్స్ ల ద్వారా కస్టమర్లకు అమ్మకాలు చేసే టీంలో భాగంగా ఉన్నారని కల్పిత్ చెప్పుకొచ్చారు.

అవినాష్ జైన్

అవినాష్ జైన్


ముందు ముందు మరిన్ని సవాళ్లు

వ్యాగ్ మోబ్ లో ప్రస్తుతం 60మంది సభ్యులున్నారు. మొదటి రోజుతో పోలిస్తే ఎంతో ఎదిగింది. ఇప్పటి దాకా బాగానే ఉంది కానీ భవిష్యత్ లో ఈ బిజినెస్ ను ఇంతే స్థాయిలో మేనేజ్ చేయగలమనే దీమా మాత్రం ఇప్పట్లో లేదు. ఇప్పుడున్న టీం కూడా దీన్ని ఇంతకంటే ఎఫిషియెంట్‌గా హ్యాండిల్ చేసినప్పుడే అది సాధ్యపడుతుంది. అయితే టీంలోని మెంబర్లు అలా చేస్తారా అనే ప్రశ్నకు ప్రస్తుతానికి నాదగ్గర సమాధానం లేదు. అయితే భవిష్యత్ లో అలాంటి వారిని తయారు చేయగలమనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. వారిని తయారు చేసే క్రమంలో ఎదుర్కోవాల్సిన సవాళ్లు కూడా చాలానే ఉన్నాయి. ఇండోర్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ కోసం వాడే వైరు ఫైబర్‌ది. అదే అమెరికాలో అయితే కాపర్ వైరే. దీంతో ఇండోర్‌లో ఇంటర్నెట్ కంపెనీ పెడితే కచ్చితంగా సక్సెస్ అవుతుందనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అక్కర్లేదు. మా భవిష్యత్ ప్రణాళిక కూడా అదే. ఢిల్లీ, బాంబేల్లో తమ వ్యాపారాన్ని విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారు కల్పిత్. అయితే అది ఇప్పటికిప్పుడు జరుగుందన పోయినా.. సమీప భవిష్యత్ లో జరుగుతుందని చెప్పగలను అంటున్నారాయన. ప్రస్తుతం మా కస్టమర్లకు మరింత చేరువ అవ్వడానికి ప్రయత్నిస్తున్నామని కల్పిత్ ముగించారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags