విద్యార్ధులకు వాయిదా పద్ధతిలో రుణాలిచ్చే స్టార్టప్

విద్యార్ధులకు వాయిదా పద్ధతిలో రుణాలిచ్చే స్టార్టప్

Saturday July 29, 2017,

3 min Read

ఒకసారి ఎన్ఐటీ స్టూడెంటుకి పెద్ద చిక్కొచ్చి పడింది. అర్జెంటుగా లాప్ టాప్ కొనాలి. డబ్బుల్లేవ్. నెలమధ్యలో అంత మొత్తం సర్దాలంటే తల్లిదండ్రులకు కూడా కష్టమైంది. ఎందుకంటే వాళ్లు కూడా నెలసరి జీతగాళ్లే. ఇలాంటి సమస్య ఏ ఒక్కరిదో కాదు. విద్యార్ధి దశలో ప్రతీ ఒక్కరూ ఎదుర్కొన్నదే. సరిగ్గా ఈ ప్రాబ్లం బేస్ చేసుకుని పుట్టిందే క్రేజీ బీ స్టార్టప్. విద్యార్ధులకు వాయిదాల పద్ధతి మీద పర్సనల్ లోన్స్ అందించే స్టార్టప్.

image


ఇవాళరేపు ఉద్యోగం చేసి, నెలకు ఠంచనుగా జీతం బ్యాంకులో పడ్డా, కనీసం పర్సనల్ లోన్ ఇవ్వడానికి కూడా సవాలక్ష ఆంక్షలు పెట్టే రోజులివి. అలాంటిది ఏ సంపాదనా లేకుండా కేవలం చదువుకునే కుర్రాళ్లకు లోన్లు ఇచ్చే సంస్థలు చాలా తక్కువ. అలాంటి వాటిలో ఒకటి క్రేజీబీ.

క్రేజీబీ ఇండియాలోనే మొట్టమొదటి సారిగా విద్యార్ధుల కోసమే పెట్టిన ఆన్ లైన్ ఇన్ స్టాల్ మెంట్ స్టోర్. చైనాలో ఇలాంటిదే యూనికార్న్ ఫెన్కైల్ అనే ఒక సంస్థ ఉంది. అది విద్యార్ధులకు వాయిదాల రూపంలో పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తుంది. దాన్ని ఆదర్శంగా తీసుకుని మధుసూదన్ క్రేజీ బీని స్టార్ట్ చేశాడు. విచిత్రం ఏంటంటే ఫెన్కైల్ సంస్థ సీఈవో క్రేజీ బీ లో రెండు మిలియన్ డాలర్ల సీడ్ క్యాపిటల్ సమకూర్చాడు. అదే కాకుండా క్రేజీబీతో రుణాలిచ్చే ఆరు సంస్థలు టై అప్ అయ్యాయి. అందులో ఐఐఎప్ఎల్ ప్రముఖమైంది.

ఎలాంటి లోన్లు అందిస్తారంటే..??

#1 ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు రుణాలు. అందుకోసం ఫ్లిప్ కార్ట్, అమేజాన్ లాంటి ఈ కామర్స్ సంస్థలతో టై అప్ అయ్యారు. సగటున ఏఢు నెలల వాయిదా ఉంటంది. ప్రాడక్ట్ అమ్మిపెట్టినందుకు క్రేజీ బీ ఈ కామర్స్ సంస్థల నుంచి మూడు శాతం మార్జిన్ తీసుకుంటుంది.

#2 స్టూడెంట్ పేకార్డ్ ప్రాడక్ట్ విత్ వాలెట్ లైసెన్స్. దీనికోసం మాస్టర్ కార్డ్, ఎస్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎంత లోన్ ఇవ్వాలనుకుంటారో అంత అమౌంట్ కార్డు విద్యార్ధికి ఇస్తారు. అంటే క్రెడిట్ కార్డు మాదిరి. ఇది ఒకరంగా సెమీ క్లోజ్డ్ వాలెట్. ఎలా పడితే అలా ఖర్చు చేస్తామంటే కుదరదు. దానికీ ఓ లెక్కుంటుంది. లిమిట్ ఉంటుంది. దుర్వినియోగం కాకుండా ఉండటానికే ఇదంతా. ఫౌండర్లు దీన్నుంచి ఒకటి నంచి 2.5 శాతం మార్జిన్ తీసుకుంటారు.

#3 సెమిస్టర్ లోన్ ప్రాడక్ట్. విద్యార్ధులు సెమిస్టర్ ఫీజుల కట్టేందుకు ఉపయోగపడే రుణ సదుపాయం. కొన్ని కాలేజీ యాజమాన్యాల పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసి ఇస్తే సరి. ఫీజు కట్టినట్టే లెక్క. ఇందుకోసం కాలేజీ వాళ్లు ఒప్పుకుంటే రుణంపై ఐదుశాతం కమిషన్ తీసుకుంటారు.

#4 టూ వీలర్ ఫైనాన్స్. దీనికోసం పుణె, బెంగళూరులోని 5 ఆటోమొబైల్ డీలర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 2 నుంచి ఐదు శాతం కమిషన్ తీసుకుంటారు.

image


క్రేజీ బీ యమా క్రేజీగా ముందుకు పోతుండటంతో ఈ ఏడాది జనవరిలో బీజీంగ్ కి చెందిన ప్లమ్ వెంచర్ నుంచి మరో రౌండ్ ఫండింగ్ పొందారు. ప్రస్తుతం క్రేజీ బీ నాలుగు నగరాల్లో ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. బెంగళూరు, పుణె, మైసూరు, వేళూరులో బ్రాంచీలున్నాయి. మరో పది నగరాల్లో విస్తరించాలన్నది ప్లాన్. హైదరాబాద్ సహా, ముంబై, చెన్నయ్, నాగ్ పూర్, నాసిక్, మణిపాల్ లో క్రేజీ బీ కార్యకలాపాలు సాగించాలని చూస్తోంది.

రోజుకి 1,300 అప్లికేషన్స్ వస్తున్నాయి. అప్రూవల్ రేటు యాభై శాతం దాకా వుంది. ఇప్పటిదాకా 1,70,000 అప్లికేషన్స్ వస్తే, అందులో సంఖ్యా పరంగా 80వేల రుణాలు ఇచ్చారు. ఈ ఒక్క జూన్ లోనే రూ. 7కోట్ల విలువైన 20వేల లోన్లు మంజూరు చేశారంటే క్రేజీ బీ పట్ల ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. కేవలం విద్యార్ధి అయితే చాలు.. ఎలాంటి క్రెడిట్ హిస్టరీ లేకుండా లోన్ ఇస్తారు.

క్రేజీ బీలో 80 మంది సభ్యులున్నారు. వీళ్ల టార్గెట్ వంద కోట్ల రుణాలు మంజూరు చేయడం. అది కూడా వచ్చే రెండు త్రై మాసికాల్లో. ఎడ్యుకేషనల్ ఇకో సిస్టమ్ లో ప్రతీ విద్యార్ధికి అందుబాటులో ఉండాలన్నదే వీరి లక్ష్యం.

అయితే ఈ సెగ్మెంట్ లో క్రేజీ బీ ఒక్క ప్లేయర్ కాదు. స్లైస్ పే అనే మరో సంస్థ దీనిలాగే విద్యార్ధులకు లోన్లు ఇస్తుంటుంది. నెలసరి వాయిదాల్లో ప్రాడక్టులు సమకూరుస్తుంది. అక్టోబర్ 2016లో మొదలైన ఈ స్టార్టప్ 120 కి పైనే కాలేజీలతో పదివేలకు పైనే ట్రాన్సాక్షన్స్ జరిపింది. ముంబైకి చెందిన సింపుల్ అనే మరో స్టార్టప్ కూడా ఎన్బీఎఫ్సీ, బ్యాంకులతో కలిసి పనిచేస్తోంది. 

క్రేజీ బీ వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి