సంకలనాలు
Telugu

'కార్పొరేట్ బార్బీ' ఎంట్రీతో మన దేశ అమ్మాయిల ఆలోచనా సరళి మారుతుందా ?

బార్బీ స్టార్టప్‌తో మహిళలకు మరిన్ని అవకాశాలుబార్బీ డాల్స్ మనకు ఎన్నో నేర్పుతాయంటున్న మహిళా పారిశ్రామికవేత్తలుఆంట్రప్రెన్యూర్ బార్బీ సరికొత్త సంచలనం అంటున్న రేష్మ

1st Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

చిన్నారులు ఆడుకునే బొమ్మల్లో బార్బీ బొమ్మలది ప్రత్యేక స్థానం. ముచ్చటగా కనిపించే బార్బీ డాల్స్‌ను చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. మంచి మంచి డ్రస్సులు, హెయిర్ స్టైల్స్, మేకప్ వేసి మురిసిపోతుంటారు. ఆ బొమ్మలకు తమకు నచ్చిన డ్రెస్సు వేసి తెగ సంబరపడిపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఈ బొమ్మలకున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందులోనూ అమ్మాయిలకు బార్బీ అంటే ప్రాణం. బార్బీ అసలు పేరు 'బార్బీ మిలిసెంట్‌ రాబర్ట్ప్‌'. జర్మనీ దేశానికి చెందిన బిల్డ్‌లిలీ అనే బొమ్మ దీనికి మాతృక.

image


బిల్డ్‌లిలీ బొమ్మను చూసిన న్యూయర్క్‌కు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త ఈ బార్బీ బొమ్మకు రూపకల్పన చేశారు. ఇప్పుడు ఈ బొమ్మ అనేక ఆధునిక పోకడలకు అనుగుణంగా రూపాంతరం చెందుతూ ప్రపంచ దేశాల పిల్లలను, పెద్దవారిని సైతం విశేషంగా అలరిస్తోంది.

మొట్టమొదట బార్బీ బొమ్మ నలుపు, తెలుపు స్విమ్‌సూట్‌లో తయారు చేశారు. ఈ బొమ్మ 11.5 అంగుళాల ఎత్తు ఉంది. ఇలా ప్రారంభమైన బార్బీ ప్రస్థానం నేడు ప్రపంచ వ్యాప్తంగా సెకనుకు రెండు అమ్ముడుపోతాయట. అంటే రోజుకు 1,72,800 అన్నమాట. ప్రపంచ వ్యాప్తంగా బార్బీ బొమ్మలు సేకరించే వారి సంఖ్య లక్షదాకా ఉంటుంది. టీచర్‌ బొమ్మ నుంచి పారిశ్రామిక వేత్త వరకు దాదాపు 150రకాలుగా బార్బీ బొమ్మ అవతారాలెత్తింది. అంతేకాదు, బార్బీ బొమ్మ 1965లోనే అంతరిక్షయాత్ర కూడా చేసింది.

బార్బీ సృష్టికర్త మాటెల్ ఎప్పుడూ కలలు కంటూ ఉండేవారు. ఆడపిల్లలు ఎప్పుడూ బార్బీ బొమ్మలతో ఆడుకుంటూ ఉండాలని. ‘‘బార్బీతో కలిసి ఉంటే ఎన్నో అనుభవాలు మీకు అందుబాటులోకి వస్తాయి’’ అంటూ ట్వీట్ చేశారు మాటెల్. అయితే పెద్ద పెద్ద కలలు మాత్రం అమ్మకానికి కుదరవంటారు.

బార్బీ గాళ్స్‌ని చిన్నారుల ఆకాంక్షలకు అనుగుణంగా మారుస్తున్నారు. పెద్ద కాళ్ళు, చిన్న నడుము...ఇలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. బార్బీ డిజైనింగ్ ఇప్పుడో మంచి ఉపాధి మార్గంగా మారింది. అమెరికాకి చెందిన 8 మంది మహిళలు

‘Chief Inspirational Officers’ (CIOs)గా మారారు. 'గాళ్స్ హూ కోడ్' వ్యవస్ధాపకులు రేష్మ సౌజని, వన్ కింగ్స్‌ లేన్‌కి చెందిన సుసాన్ ఫెల్డ్‌మన్, ఎలిసన్ పింకస్, రెంట్ ద రన్‌వే నిర్వాహకులు జెన్నిఫర్ హైమన్ మరియు జెన్నీలు.

‘‘చిన్న నడుము, హై హీల్స్‌తో బార్బీ బొమ్మలు కనబడితే చిన్నారులు ఎంతగా ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు’’ అంటారు టీన్ టెడ్‌ అడోరా స్వితక్.

అడోరా స్విటాక్, టీన్ టెడ్ స్పీకర్

అడోరా స్విటాక్, టీన్ టెడ్ స్పీకర్


అమెరికాలోని సిలికాన్ వ్యాలీ పేరుచెప్పగానే పురుషాధిక్యం ఎక్కువగా ఉన్న కంపెనీలు కనిపిస్తాయి. అక్కడ ఎనిమిది మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ బార్బీ డాల్‌ను విడుదలచేసినప్పుడు భారీ స్పందన వచ్చింది. ట్విట్టర్‌, లింకెడిన్లోనూ ఎంతోమంది కామెంట్లు చేశారు.

‘‘బార్బీ.. బొమ్మకాదు నిజమయిన రూపంలా ఉంటుంది. దానికి కృత్రిమమయిన నవ్వులు, లేనిపోని హంగులు పెట్టవద్దని’’ ఎంతోమంది ట్వీట్ చేశారు. జనం అనుకున్నట్టుగా మేం హడావిడి చేయడం లేదు. మీకు కనిపించేదంత నిజం కాదంటారు రేష్మా సౌజానీ. స్టెమ్(STEM అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్)లో మహిళల భాగస్వామ్యం పెంచడమే మా లక్ష్యం అంటున్నారురేష్మా.

‘‘మనం పురుషాధిక్య సమాజానికి బాగా అలవాటుపడిపోయాం. అమ్మాయిలను ఏదో మామూలుగా పెంచేస్తున్నారు. టెకీగా మార్చడం లేదు. మిగతా వారికి భిన్నంగా వెళతామనే వారిని ప్రోత్సహించడంలేదు. ఈ ధోరణి మారాలి. మార్కెట్లో వస్తున్న టెక్నాలజీ మార్పులను ఆడపిల్లలకు తెలియచేయాలి. హాప్‌స్కాచ్ లాంటి యాప్‌లను వారికి అందుబాటులో ఉంచాలి’’ అంటారు రేష్మా. స్కూళ్ళు, కాలేజీల్లో కూడా టీచర్ల వ్యవహారశైలి మారాలంటారు.

మ్యాడ్ ర్యాట్ గేమ్స్ డైరెక్టర్ మధుమితా హల్దార్ లింగ వివక్ష చూపించి ప్రతిభను మూసలో కట్టెయ్యద్దు అంటారు.

భారతదేశంలో బార్బీ డాల్ అంటే ప్రతిష్టకు సంబంధించింది. విదేశాల్లో ఉండి స్వదేశానికి వచ్చేవారిని మంచి మంచి బార్బీ డాల్స్ తీసుకుని రమ్మని చెబుతారు. చిన్న పిల్లల వార్డ్‌రోబ్‌లో కనీసం 10 బార్బీ మోడల్స్ ఎప్పుడూ మనకు కనిపిస్తూ ఉంటాయి. పుట్టినరోజుల్లో బార్బీ డాల్‌కి మించిన మంచి గిఫ్ట్ లేదంటారు పిల్లలు. అందుకే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఫ్రెండ్స్ బర్త్‌డే పార్టీల్లో బార్బీ కలెక్షన్స్‌ని బహుమతులుగా ఇచ్చేందుకు ఉత్సాహం చూపుతారు.

మ్యాడ్‌ర్యాట్ గేమ్స్ డైరెక్టర్ మధుమితా హల్దార్ కూడా ఇదే విషయం చెబుతారు. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు బార్బీ బొమ్మ కొనుక్కు వెళ్ళలేక పోతే వాళ్ళ మనసు చిన్నబోయేది. ఒకప్పుడు బార్బీ బొమ్మలు కొనడం అంత ఈజీగా ఉండేది కాదంటారు మధుమితా.

మధుమిత హల్డర్,మ్యాడ్ ర్యాట్ గేమ్స్ డైరెక్టర్

మధుమిత హల్డర్,మ్యాడ్ ర్యాట్ గేమ్స్ డైరెక్టర్


ఎంటర్‌ప్రెన్యూర్ బార్బీ అనేది ఈ తరం చిన్నారులకు ఏదైనా చెప్పడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు ఇంటర్‌వేర్ పార్ట్‌నర్ కల్పనా తటవర్తి, ఎంటర్‌ప్రెన్యూర్ బార్బీ అనేది పారిశ్రామికవేత్తలకు పాజిటివ్ ఇమేజ్‌గా ఉపయోగపడాలంటారు టెడ్ ప్రతినిధి అదోనా స్విటెక్.


భారతదేశంలో వేళ్ళమీద లెక్కించదగిన మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలైనా ఉన్నారా? కనీసం టెక్నికల్ డొమైన్‌లల అయినా.. మున్ముందు ఈ పరిస్థితి మారుతుందా? మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లతో సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను అందుకునే అతివలు ఖచ్చితంగా పెరుగుతారు. స్టార్టప్‌ల ఏర్పాటులో ఎదురవుతున్న ఇబ్బందులను, సవాళ్ళను ఇప్పుడిప్పుడే మహిళలు సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు.

కల్పన తటవర్తి, ఇంటర్ వీవ్ వ్యవస్థాపకురాలు

కల్పన తటవర్తి, ఇంటర్ వీవ్ వ్యవస్థాపకురాలు


భారతీయ ఆర్ధిక వ్యవస్థలో తమదైన భూమిక నిర్వహిస్తున్నారు మహిళా పారిశ్రామికవేత్తలు. వారిని ప్రోత్పహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో లక్షలాది చిన్నతరహా పరిశ్రమలకు సారథులు , సూత్రధారులు మహిళలే. అయితే వారికి అనుకున్నవిధంగా ఆర్ధిక సహాయం అందడం లేదంటారు. ప్రపంచబ్యాంకుకి చెందిన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదిక పలు ఆసక్తికర విషయాలను మనముందుంచింది. ‘‘ భారతదేశంలో పూర్తిస్ధాయిలో గానీ, పాక్షికంగా గానీ సుమారు 30 లక్షల పరిశ్రమలు మహిళల చేతుల్లోనే ఉన్నాయిట. అందులో టీ స్టాల్స్, కూరగాయల షాపులు, లాండ్రీలు, సెల్‌ఫోన్ షాపులు వారే నడుపుతున్నారు. వారి వల్ల 80 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు’’ అని నివేదిక చెబుతోంది.

మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాల కొరత ?

మహిళా పారిశ్రామిక వేత్తలకు 2012 నాటికి సుమారుగా 158 బిలియన్ డాలర్ల పెట్లుబడులు కావాలని ఒక అంచనా. అయితే అందుతున్నది మాత్రం 42 బిలియన్ డాలర్లేనట. బ్యాంకులు, సహకార సంఘాలు, ఇతర వనరుల ద్వారా కేవలం 27 శాతం పెట్టుబడులు మాత్రమే మహిళలకు అందుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

లక్ష్మి ప్రాటూరి, ఇంక్ టాక్స్ ఫౌండర్

లక్ష్మి ప్రాటూరి, ఇంక్ టాక్స్ ఫౌండర్


వివిధ పరిశోధనలు, ఇతర అవసరాల కోసం అసంఘటిత రంగం నుంచి మహిళలు అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. అందులో కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి నిధుల సమీకరణ సాగుతోంది. బ్యాంకులు పురుష పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రుణాలు మహిళలకు కూడా ఇవ్వాలంటారు. పురుషులు తమ ఇండస్ట్రీ అవసరాల కోసం 70 శాతానికి పైగా సంప్రదాయ ఆర్దిక సంస్థల నుంచి పొందుతున్నారు.

కల్పనా తటవర్తి కూడా మహిళ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటున్నారు. అంతేకాదు 1500 మందికి ఆమె తన ఇంటర్‌వేర్ ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దలు నేర్చుకునేది చాలా ఉంటుంది. యుసీ బెర్కలీ కాలేజ్‌కి చెందిన అడోరా తన చిన్ననాటి సంగతులను గుర్తుచేసుకుంటున్నారు. ‘‘సంప్రదాయం, అందం గురించి తెలుసుకోవాలంటే మేం బార్బీని చూసేవాళ్ళం. సాయంత్రాలు బార్బీ బొమ్మలతో ఆడుకునేవాళ్ళం. అప్పటికీ ఇప్పటికీ ఇలాంటి అలవాట్లలో ఎలాంటి మార్పులేదు. అయితే ఇప్పుడు బార్బీ బొమ్మల డిజైన్లు మారాయంతే’’ అంటారు అడోరా.

మొత్తం మీద అప్పటికీ ఇప్పటికీ బార్బీ డాల్స్ ప్రపంచం అంతగా మారలేదు. చిన్నపిల్లల జనరేషన్ మారుతున్నా ఎవర్‌గ్రీన్ డాల్‌గా బార్బీ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags