సంకలనాలు
Telugu

ప్రపంచంలోనే తొలి 360 వర్చువల్ రియాలిటీ కెెమెరా తయారుచేసిన ఐఐటీ కుర్రోడు..!!

25th Mar 2016
Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share


ప్ర‌పంచంలోనే తొలి 360 డిగ్రీస్ త్రీడీ వ‌ర్చువ‌ల్ రియాలిటీ కెమెరా అది! పైగా మేడ్ ఇన్ ఇండియా! భారీ సంఖ్య‌లో ఆర్డ‌ర్లు! దేశవిదేశాల్లో క‌స్ట‌మ‌ర్లు! ఇదీ ఆ ప్రోడ‌క్ట్ స్టామినా! ఇంత‌కూ పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త్రీడీ కెమేరాను త‌యారు చేసిందెవ‌రు? ఏమిటా స్టార్ట‌ప్ క‌థ‌?

మొన్న‌టిదాకా వ‌రల్డ్ వైడ్ గా ఒక అభిప్రాయం ఉండేది. ఇండియాలో కంపెనీ ప్రారంభించ‌డ‌మంటే మాట‌లు కాద‌ని! బిజినెస్ విష‌యంలో ఇండియాది ప్ర‌పంచంలోనే 130వ స్థాన‌మ‌ని వ‌ర‌ల్డ్ బ్యాంక్ కూడా లెక్క‌లు క‌ట్టింది. కానీ అదంతా ఒక‌ప్పుడు. ప్ర‌స్తుతం కేంద్ర‌ ప్ర‌భుత్వం చేప‌ట్టిన స్టార్ట‌ప్ ఇండియా కార్య‌క్ర‌మం.. స్టార్ట‌ప్ ల‌కు వ‌రంలా మారింది. అంకుర ప‌రిశ్ర‌మ‌ల‌కు మ‌ళ్లీ మంచి రోజులు వ‌చ్చాయి.

క్షితిజ్ మార్వాకి కూడా బిజినెస్ లో ఉన్న క‌ష్టాల‌న్నీ తెలుసు. అన్నీ తెలిసే ధైర్యంగా ముంద‌డుగేశాడు. ప‌ట్టుబ‌ట్టి త‌న హార్డ్ వేర్ స్టార్ట‌ప్ - టెస‌ర్ యాక్ట్- ని ఇండియాలోనే ప్రారంభించాడు. అంతేకాదు. ప్ర‌పంచంలోనే తొలి 360 డిగ్రీస్ త్రీడీ వ‌ర్చువ‌ల్ రియాలిటీ కెమేరాను ఇండియాలో త‌యారు చేసి ఔరా అనిపించాడు. ఇంత‌కీ ఎవ‌రీ క్షితిజ్ మార్వా?

క్షితిజ్ మార్వా

క్షితిజ్ మార్వా


ఐఐటీ కుర్రోడి కల..

28 ఏళ్ల క్షితిజ్ మార్వా ఐఐటీ ఢిల్లీ స్టూడెంట్. హార్వ‌ర్డ్ మెడిక‌ల్ స్కూల్, స్టాన్ ఫ‌ర్డ్ యూనివర్సిటీలో ఇంట‌ర్న్ షిప్ చేశాడు. క్షితిజ్ ది డిఫ‌రెంట్ థింకింగ్. అంద‌రిలా రొటీన్ గా ప‌నిచేయ‌డం అత‌డికి ఇష్ట‌ముండ‌దు. అందుకే ఏదైనా స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ చేయాల‌నుకున్నాడు. ఆర్నెల్లపాటు యూర‌ప్ అంతా తిరిగి ఫొటోగ్ర‌ఫీ నేర్చుకున్నాడు. ఇండియా తిరిగొచ్చాక ఎంఐటీ మీడియా లాబ్స్ లో చేరాడు. అక్క‌డ ప‌నిచేసిన అనుభ‌వం బాగా ఉప‌యోగ‌ప‌డింది. 360 డిగ్రీ కెమెరా క‌నిపెట్టాల‌న్న ఆలోచ‌న‌కు అక్క‌డే బీజం ప‌డింది. అదే ఆశ‌యంతో ముందుగా లైట్ ఫీల్డ్ కెమేరా (ఎల్ఎఫ్ సీ) టెక్నాల‌జీ మీద దృష్టి పెట్టాడు. మ‌రో ఆరు నెల‌ల త‌ర్వాత త‌న టీంతో క‌లిసి 360 డిగ్రీ కెమెరా త‌యారీలో నిమ‌గ్న‌మ‌య్యాడు.

ముందుగా చాలా డిజైన్లు అనుకున్నారు. ఆరు కెమెరాలతో డివైజ్ త‌యారు చేస్తే.. వ‌ర్క‌వుట్ కాలేదు. ఫోర్ కెమెరా డిజైన్లో హార్డ్ వేర్ ప్రాబ్ల‌మ్స్ వ‌చ్చాయి. మూడు, రెండు కెమెరాలతో త‌యారు చేసిన ప‌రిక‌రాలు కూడా ఫెయిల‌య్యాయి. ఇక లాభం లేద‌నుకొని టీం అంతా క‌లిసి రౌండ్ ది క్లాక్ ప‌రిశోధ‌న‌కే కేటాయించారు. చివ‌రికి సింగిల్ కెమెరా డివైజ్ ను త‌యారు చేశారు. 360 డిగ్రీస్ లో ప‌ర్ ఫెక్టుగా రొటేట్ అయ్యేలా డిజైన్ చేశారు. ఆ త‌ర్వాత దానికి సూట‌య్యే బ్యాట‌రీని రూపొందించారు. ముంబైలోని ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్ లో తొలి 360 కెమెరా త‌యారైంది. పూర్తిగా అల్యూమినియం ప్రోడక్ట్. డివైజ్ కు మీథేన్ అని పేరు పెట్టారు.

మీథేన్ కెమెరాతో ఫొటోలు, 360 డిగ్రీస్ వ్యూ, త్రీడీ వ‌ర్చువ‌ల్ రియాలిటీ వీడియోలు తీసుకోవ‌చ్చు. ఇళ్లు, కాల‌నీలు, హోట‌ల్స్, రెస్టారెంట్ల‌లో ఇది బాగా ప‌నిచేస్తుంది. ఇప్పుడున్న సీసీ కెమేరాల‌తో పోలిస్తే బెట‌ర్ ఔట్ పుట్ ఇస్తుంది. మీథేన్ డివైజ్ లో డ్యుయ‌ల్ కోర్ 1 గెగా హెర్ట్జ్ ప్రాసెస‌ర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్ బిల్ట్ మెమ‌రీ ఉంటుంది. యాండ్రాయిడ్, ఐఓస్ యాప్ తో కెమెరాను ఆప‌రేట్ చేయొచ్చు. ఇక‌పోతే మీథేన్ డివైజ్ ప్యాకేజింగ్ కూడా క్లాస్ గా ఉంటుంది. యాపిల్ ప్రాడ‌క్ట్ ప్యాకేజింగ్ ను త‌ల‌పిస్తుంది. ఈ ఐడియా క్షితిజ్ దే. ముంబైలోని ధార‌వి ప్రాంతంలో ప్ర‌త్యేకంగా ప్యాకేజ్ బాక్సుల‌ను త‌యారు చేయించారు. దాని మీద మేడ్ ఇన్ ఇండియా అనే ముద్ర సగర్వంగా, ఠీవీగా కనిపిస్తుంది. 

మీథేన్ డివైజ్ మొబైల్ యాప్

మీథేన్ డివైజ్ మొబైల్ యాప్


మా డివైజ్ కు మొద‌ట్లో వై ఫై క‌నెక్టివిటీ ప్రాబ్ల‌మ్ వ‌చ్చింది. 2011లో ఐ ఫోన్ కు కూడా ఇలాంటి స‌మ‌స్యే ఎదురైతే.. యాపిల్ వాళ్లు ఫోన్ బాడీ అంతా యాంటెనాలా త‌యారు చేశారు. సేమ్ టు సేమ్ మేం కూడా మా డివైజ్ ను అలాగే మోల్డ్ చేశాం. దాంతో ప్రాబ్ల‌మ్ సాల్వ్ అయింది. ఆ మ‌ధ్య హైద‌రాబాద్ లో జ‌రిగిన టెడ్ ఎక్స్ లో మీథేన్ కెమెరాను ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచాం. దానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది- క్షితిజ్

త్రీడీ కెమేరా వీడియో ఇక్కడ చూడొచ్చు..


టెసర్ యాక్ట్ ఫ్యూచ‌ర్ ప్లాన్స్ ఇవీ..

టెస‌ర్ యాక్ట్ లో ప్ర‌స్తుతం ప‌ది మంది స‌భ్యులు ఉన్నారు. ఇండియాతో పాటు బ్రెజిల్, అమెరికా, చైనా, యూకే, డెన్మార్క్, జ‌పాన్ లాంటి దేశాల‌కు త‌మ ప్రోడక్ట్ ను ఎక్స్ పోర్ట్ చేస్తున్నారు. ఎక్కువ‌గా ట్రావెల్, హోట‌ల్స్, రియ‌ల్ ఎస్టేట్, మ్యాపింగ్ రంగం నుంచి టెస‌ర్ యాక్ట్ కు క‌స్ట‌మ‌ర్లున్నారు.

మీథేన్ కెమెనా రెండు వేరియంట్ల‌లో ల‌భిస్తుంది. బేసిక్ వెర్ష‌న్ ధ‌ర రూ.1.5 ల‌క్ష‌లు. త్రీడీ సెన్స‌ర్స్ అమ‌ర్చిన అడ్వాన్స్ డ్ ప్రో వెర్ష‌న్ కాస్ట్ రూ.2 ల‌క్ష‌లు.

టెసర్ యాక్ట్ టీం విజయానందం

టెసర్ యాక్ట్ టీం విజయానందం


ప్ర‌స్తుతానికి కంపెనీకి నిధుల సేక‌ర‌ణ ఆలోచ‌న లేదు. ఇన్వెస్ట్ చేయ‌డానికి చాలా మంది ముందుకొచ్చార‌ని క్షితిజ్ చెప్తున్నారు. అయితే త‌మ ఫోక‌స్ అంతా ఇప్ప‌డు 360 డిగ్రీ వ‌ర్చువ‌ల్ వీడియో కెమేరా - వికామ్- మీదే ఉంద‌ని తెలిపారు. అందుకోసం కంపెనీల‌తో సంబంధాలు బ‌లోపేతం చేసుకుంటున్నామ‌ని చెప్పారు. త‌మ ప్రోడ‌క్ట్ బీ నుంచి సీ సెంట‌ర్ కు చేరిన త‌ర్వాత‌.. ఉత్ప‌త్తి పెంచ‌డానికి నిధుల సేక‌ర‌ణ చేప‌డ‌తామ‌ని వివ‌రించారు.

ఇక‌పోతే కొత్త‌ వీకామ్ డివైజ్ ను మ‌రింత చిన్న‌గా, నాజూకుగా త‌యారుచేసే ప‌నిలో ఉంది క్షితిజ్ బృందం. ఇందులో ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ కూడా అధికంగా ఉంటుంద‌ట‌. ప్ర‌స్తుతం మార్కెట్లో అలాంటి ప్రోడ‌క్ట్ కు మంచి డిమాండ్ ఉంద‌ని క్షితిజ్ అంటున్నారు.

ప్ర‌స్తుతం వ‌ర్చువ‌ల్ రియాలిటీ, 360 డిగ్రీల టెక్నాల‌జీ జమానా న‌డుస్తోంది. ఫేస్ బుక్ కూడా ఈమ‌ధ్యే 360 డిగ్రీస్ వీడియోల‌ను ఇంట్రొడ్యూస్ చేసింది. ఇటీవ‌ల‌ శామ్ సంగ్ కంపెనీ గేర్ 360 కెమెరా తీసుకొచ్చింది. ఇంకా పానోపోర్ట‌ర్, 360 ఫ్లై, 360 హీరోస్ లాంటి కంపెనీలు కూడా ఈ రంగంలో ఉన్నాయి. కాబ‌ట్టి టెస‌ర్ యాక్ట్ లాంటి కంపెనీల‌కు ఈ సెగ్మెంట్లో మంచి మార్కెట్ ఉంటుంది.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో స్టార్ట‌ప్ ల కోసం అమెరికా వైపు చూడాల్సిన ప‌నిలేదు. ఇండియాలో బోలెడంత టాలెంట్, పేష‌న్ ఉంది. ఇండియా త్వరలోనే స్టార్ట‌ప్ ల‌కు స్వ‌ర్గ‌ధామంలా మారుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు- క్షితిజ్

వెబ్ సైట్; టెస‌ర్ యాక్ట్

Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share
Report an issue
Authors

Related Tags