సంకలనాలు
Telugu

యోగా దుస్తుల మార్కెట్ సైజ్ రూ.81 వేల కోట్లు

team ys telugu
23rd Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

యోగాభ్యాసం చేసేవారు అనువైన దుస్తులు లేకపోతే చాలా అసౌకర్యంగా ఫీలవుతారు. యోగాభ్యాసకుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ.. వారి అవసరాల నిమిత్తం యోగా దుస్తుల వ్యాపారంకూడా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం అపారెల్‌ మార్కెట్లో యోగా దుస్తుల షేర్‌ జెట్‌ స్పీడ్‌లో సాగుతోంది. దాదాపు 13 వందల కోట్ల డాలర్ల మేరకు (సుమారుగా రూ. 81వేల కోట్లు) వ్యాపారం సాగుతున్నట్టు అంచనా.

ఈ నూతన శైలికి తగ్గట్టుగా యోగా దుస్తులకు ఆధునికతను అద్దడానికి రంగంలో అర్బన్‌ యోగా దిగింది. దీనికి తోడుగా ఇప్పుడు ఫరెవర్‌ యోగా ప్రవేశించింది.

image


సౌకర్యం, ఒంటికి హాయి

యోగా దుస్తుల మార్కెట్టులో మహిళలదే అగ్రస్థానమని చెబుతోంది ఫరెవర్‌ యోగా. మొత్తం మార్కెట్టు సైజులో 70శాతం వినియోగదారులు మహిళలే ఉన్నారంటే, యోగాపట్ల ఆడవారు ఎంతగా ఆకర్షితులవుతున్నారో ఊహించుకోవచ్చు. సౌకర్యంగా, ఒంటికి హాయిని, అందాన్ని సమకూర్చేవిగా ఉండాలని కోరుకుంటున్నారు. అమిత్‌ చంద్‌, శివబాలన్‌, క్షమ మీనన్‌ ఫరెవర్‌ యోగాకి మూలస్తంభాలు. యోగాసనాలు వేసేటప్పుడు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా యధేచ్ఛగా వేసుకునేలా దుస్తులకు రూపకల్పన చేయాలన్నది వీళ్ల ఉద్దేశం.

అందుకు తగ్గట్టుగానే యోగా దుస్తులు రూపొందించి దేశవ్యాప్తంగా అగ్రశ్రేణి యోగాభ్యాసకుల మెప్పు పొందారు. ''మా ఉత్పాదనలు ప్రస్తుత ఫ్యాషన్‌ ట్రెండ్‌ని దృష్టిలో పెట్టుకుని రూపొందించినవి. ఇవి స్టయిల్‌గా ఉంటాయి. సౌకర్యవంతంగానూ ఉంటాయి. కేవలం అలంకారప్రాయం కాకుండా, వాడ్రోబ్‌లో ఒక భాగంగా మారిపోతాయి. 

'యోగాను ధరించు' అన్నదే మా స్లోగన్‌'' అని వివరించారు అమిత్‌ చంద్‌.

కలిసికట్టుగా ముందడుగు

అమిత్‌ చంద్‌, ఫరెవర్‌ యోగా స్థాపకులు

అమిత్‌ చంద్‌, ఫరెవర్‌ యోగా స్థాపకులు


అమిత్‌ చంద్‌, శివబాలన్‌, క్షమ మీనన్‌...ఈ త్రిమూర్తులు ఎనిమిదేళ్లుగా కలిసి పనిచేస్తున్నారు. రిటైల్‌ అమ్మకాలలో అమిత్‌ చంద్‌కి తిరుగులేదు. ముఖ్యంగా మహిళల దుస్తులు, డెనిమ్‌ వేర్‌ ఆయన ఫోలియోలో ప్రత్యేకత. అమిత్‌ బృందానికి సరుకును సకాలంలో అందించే బాధ్యతను క్షమ, శివబాలన్‌ నెరవేర్చేవారు.

గత ఏడాది యోగాభ్యాసకులకు దుస్తుల తయారీపై తన ఆలోచనను క్షమతో పంచుకున్నారు అమిత్‌. దీనిపై శివబాలన్‌తో కలిసి అనేక తర్జనభర్జనలు సాగించారు. మొత్తమ్మీద ముగ్గురికీ ఏకాభిప్రాయం కుదిరింది. క్షమతోపాటుగా తానుకూడా సహ స్థాపకుడిగా చేరడానికి శివ సిద్ధమయ్యారు. 

ఊలు, అల్లికల దుస్తులు యోగాకు వర్తింపజేయాలన్నది వాళ్ల ఆలోచన. క్షమకు అల్లికల తయారీ కేంద్రంగా ఉండగా, శివబాలన్‌ ఊలు తయారీతోపాటు ప్యాబ్రిక్‌, డిజిటల్‌ ప్రింటింగ్‌ డివిజన్‌కూడా ఉంది. 'మాకు పూర్తిస్థాయి సదుపాయాలున్నందువల్ల సకాలంలో మెరుగైన దుస్తులను అందించడానికి వీలు కలిగింది' అన్నారు అమిత్‌.

యోగాభ్యాసకులలో అధిక శాతం మంది నడి వయసువారే ఉంటారు. అందుకే వీళ్లు తమ టార్గెట్‌ వినియోగదారులుగా 21 నుంచి 40 ఏళ్ల వయసువారిని ఎంచుకున్నారు. మొత్తం మహిళా దుస్తుల మార్కెట్‌ వాల్యూలో సగంమంది వీళ్లే ఉంటారట ! అందుకే మగవారు ధరించే యోగా దుస్తులకంటే మహిళా విభాగంపైనే దృష్టి సారించారు. వీరు రూపొందించే యోగావేర్‌ నాజూకైన వారితో మొదలై స్థూలకాయుల వరకూ ఉంటుంది.

ప్రస్తుతం ఫరెవర్‌ యోగా అమ్మకాలు పెంచుకోవడానికి డిజిటల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌నే ఎంచుకుంది.

image


భిన్నత్వం... అదే మార్కెటింగ్‌ సూత్రం

ఫరెవర్‌ యోగా దుస్తులు ఒంటికి అతుక్కుపోయేలా కాకుండా కాస్త వదులుగా ఉంటాయి. ఈ రంగంలోని మిగతావారికంటే భిన్నమైన రీతిలో ఉంటాయి. ఆసనాలు వేసేటప్పుడు ఆత్మవిశ్వాసంతో వేయడానికి మా దుస్తులు బాగా ఉపకరిస్తాయి. తమ శరీరంపట్ల అతి జాగ్రత్తలు తీసుకుంటూ, ఎక్కడైనా అంగ ప్రదర్శన జరుగుతోందేమోననే బెంగతో కాకుండా... కష్టతరమైన ఆసనాలనుసైతం అవలీలగా వేయవచ్చు' అన్నారు అమిత్‌. ఫరెవర్‌ యోగా నిర్వాహకులు క్రీడా దుస్తుల దిశగా వెళ్లడం లేదు. యోగా వేర్‌ పైనే పూర్తి శ్రద్ధ పెట్టారు.

తమ ఆలోచనలకు అనువైన వస్త్రాన్ని సేకరించడమే వీళ్లకు పెద్ద సవాలుగా మారింది. తమ బ్రాండ్‌ సంపూర్ణంగా 'మేడిన్‌ ఇండియా'గా ఉండాలనుకుంటున్నారు. వేర్వేరు నాణ్యతల్లో ప్రత్యేక తరహా వస్త్రాలను తయారు చేయించాలన్నది వీళ్ల ఉద్దేశం. 'దీనివల్ల బ్రాండ్‌ ఇమేజ్‌ పెరగడమేకాకుండా, సమయంకూడా చాలా ఆదా అవుతుంది. ముడి వస్త్రం, ట్రిమ్‌లు, యాక్సిసరీలు... ఒకటేమిటి మా యోగా వేర్‌ మొత్తం మేడిన్‌ ఇండియాగా ఉండాలి అంటున్నారు అమిత్‌.

ఇప్పటికైతే, బెంగళూరు కేంద్రంగా ఈ-కామర్స్‌ ద్వారా ఫరెవర్‌ యోగా అమ్మకాలు సాగిస్తోంది. బెంగళూరు, ముంబైలలో ప్రయోగాత్మకంగా ఎగ్జిబిషన్లు నిర్వహించగా, వీరి యోగా దుస్తులకు మంచి స్పందన లభించింది. ఎగ్జిబిషన్‌ నిర్వహించిన ప్రతిచోట రోజుకు 200 వరకు యోగా వేర్‌ అమ్ముడుపోయాయని తెలిపారు. 'ఈ స్పందన చూశాకనే మేము ఈకామర్స్‌ చేపట్టాం' అన్నారు.

తమ స్థాయికి మించిపోయి ఈ బృందం కష్టపడుతోంది. ఈ-కామర్స్‌తో సరిపుచ్చకుండా దేశవ్యాప్తంగా మేనేజిమెంట్‌ బైఅవుట్‌ ద్వారా అమ్మకాలు పెంచుకోవాలనుకుంటున్నారు. 'మా బ్రాండ్‌ ప్రచారంకోసం బిజినెస్‌ టు బిజినెస్‌, బిజినెస్‌ టు కస్టమర్‌ పద్ధతిలో యోగా అకాడమీలతో ఉమ్మడిగా పనిచేయాలనుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని అకాడమీలతో ఒప్పందాలు చేసుకున్నాం. త్వరలోనే విస్తరిస్తాం' అని అమిత్‌ ధీమా వ్యక్తం చేశారు.


image


మార్కెట్‌లో పోటీ

యోగాభ్యాసకులు పెరుగుతున్న కొద్దీ యోగావేర్‌ రంగంలోనూ పోటీ నెలకొంది. వ్యాయామ, శరీరాకృతికి సంబంధించిన మిగతావాటివలెనే యోగాలోనూ బ్రాండ్స్‌కోసం వినియోగదారులు వెంపర్లాడుతున్నారు. దీంతో వీరికి కేవలం యోగావేర్‌ బ్రాండ్స్‌ వారితోనేకాక, క్రీడా దుస్తుల తయారీదారులు, అమ్మకందారులతోకూడా పోటీ ఎదురవుతోంది.

అంతర్జాతీయంగా, యోగా దుస్తుల మార్కెట్టు విడిగా ఉంది. అక్కడ ప్రాణ, యోగాస్మోగా వంటివి లీడ్‌ చేస్తున్నాయి. మన దేశంలో అలాంటి పరిస్థితి లేదు. క్రీడా దుస్తులవారుకూడా ఇదే రంగంలో కాలూనారు. ఇక్కడ డూ యూ స్పీక్‌ గ్రీన్‌, ఇషా షాపే వంటి చిన్న కంపెనీల నుంచి అర్బన్‌ యోగా తరహా పెద్ద కంపెనీల వరకు యోగా వేర్‌లో పోటీ పడుతున్నాయి.

అంతేకాకుండా, పెద్ద పెద్ద యోగా సెంటర్లు తమకంటూ సొంత బ్రాండ్లు, స్టోర్లు ఏర్పాటు చేసుకున్నాయి. యోగా క్లాస్‌ అయిపోగానే, వాళ్ల స్టోర్‌లోకి వెళ్లి కావలసిన యోగా దుస్తులను అభ్యాసకులు ఎంచుకోగలుగుతున్నారు.

2005లో అర్బన్‌ యోగా ఆరంభమైంది. ఫ్యూచర్‌ లైఫ్‌స్టయిల్‌ గ్రూప్‌నకు చెందిన ఇండస్‌ లీగర్‌ దీనిని లాంచ్‌ చేసింది. మన దేశంలో యోగా దుస్తుల విభాగంలోఉన్న పెద్ద బ్రాండ్లలో అర్బన్‌ యోగా ఒకటి. ఈ విభాగంలో ఒక్క అమెరికాలోనే 2700 కోట్ల డాలర్ల (దాదాపుగా లక్షా 67 వేల కోట్ల రూ.లు) వ్యాపారం జరుగుతోందని తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా లెక్కలు తీసుకుంటే గుండె గుభేలుమంటుంది. యోగావేర్‌ నిత్యం వేసుకునే క్యాజువల్‌ డ్రెస్‌ మార్కెట్టుని దాటిపోనుంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags