సంకలనాలు
Telugu

మనసుకు నచ్చింది చేస్తేనే మనుగడ

బొమ్మలతో భాషభాషను పదాల్లోనే చెప్పాల్సిన పనిలేదుఎదుటివారికి అది అర్థమవడం ముఖ్యంరమ్య శ్రీరాం ఆలోచనా అదేకార్పొరేట్ మీటింగ్ మినిట్స్‌నూ కామిక్స్ చేస్తుందిమనసుకు నచ్చింది చేస్తూ ముందుకుట్యాప్ సంస్థ వ్యవస్థాపకురాలు రమ్యశ్రీరాం

r k
24th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

నా జీవితంలో నాకు లభించిన వరం నా మనసుకు ఏది అనిపిస్తే వెంటనే దాన్ని అమలు పరిచే స్వేచ్ఛ ఉండటం. పరిస్థితుల బట్టి నా ఆలోచనలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఒక రోజు జూ కీపర్ గా ఉండాలనుకుంటాను. ఇంకో రోజు ఇంట్లో పేపర్లతో ఏదో ఒకటి చెయ్యాలనుకుంటాను. ఏదో ఆషామాషీగా అనుకోవడం కాదు .. సీరియస్‌గా ఆలోచించి నిర్దేశించుకున్నలక్ష్యాలే. ఇది ఎన్నో ఆసక్తికర అనుభవాలకు దారితీసిందంటారు ట్యాప్ సృష్టికర్త రమ్య శ్రీరామ్. ఆమె మాటల్లో చెప్పాలంటే చలించే మనసు నుంచి పెన్సిల్ ఆలోచనల్లో పుట్టుకొచ్చిన కథా నిలయమే ట్యాప్.

బొమ్మలతో భాష...

బొమ్మలతో భాష...


జీవితాన్ని మరింత హాస్యభరితం చెయ్యడమే ట్యాప్ ఉద్దేశం. అంటే భాషాపరమైన వివరణలు అనే సంకెళ్లను బద్దలుకొట్టి బొమ్మలనే భాషగా ఉపయోగించడం ! రెక్కలు విప్పుకున్న తన ఊహలనే బొమ్మల కథలుగా మలచారు రమ్య.

నా గీతలకూ విలువుందని అర్థమైంది

తన కామిక్స్‌పై ఆమెకు ఏ రోజూ పెద్ద నమ్మకాల్లేవు. కానీ తరచుగా సరదాగా చేసే తన ఫేస్ బుక్ పోస్టింగ్ చూసి ఓ ఫ్రెండ్ తన మ్యాగ్జైన్‌లో కామిక్ కాలం నడపమన్నారు. ''అప్పటి వరకు హాబీగా మాత్రమే ఉన్న నా కామిక్ ప్రపంచం తొలిసారిగా అంతకన్నాఎక్కువే అనిపించింది. అప్పటి నుంచి సీరియస్‌గా దృష్టి పెట్టాను . తీవ్రంగా ఆలోచించడం మొదలెట్టాను. భిన్న కథాంశాలను చిత్రీకరించేందుకు విభిన్న పద్ధతులను ఎంచుకున్నాను. గీతలతో (ఆకారాలతో లేదా బొమ్మలతో) ఆడుకోవడం మొదలెట్టాను. వేరొకరి కోసం సచిత్ర కథనాలను సృష్టించడం చాలా సరదాగా అనిపించేదంటారు'' రమ్య.

స్కూల్లో చదువుకున్నరోజుల్లోనే కళలు, బొమ్మలు చెయ్యడం, సంగీతం, డ్యాన్స్ వంటి పాఠ్యాంశేతర విషయాల పట్ల రమ్యకు చాలా ఆసక్తి ఉండేది. PT తరగతుల్లో ఎప్పుడూ పియానో వాయిస్తూ ఉండేవారు. బహుశా ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యగలిగే స్వాతంత్ర్యం ఉండటం వల్లేనేమో.. స్కూల్ చదువు తర్వాత ఏం చెయ్యాలన్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోయారు. ఎలాగైతేనేం.. వెల్లూరులోని వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ పూర్తిచేశారు.

గ్రాడ్యూషన్ అయిన తరువాత కూడా మళ్లీ అదే సమస్య ... ఏం చెయ్యాలి..? కంపెనీలకు, కాలేజీలకు, ప్రవేశ పరీక్షలకు ఇలా ఏది కనిపిస్తే దానికి అప్లై చేశారు. చివరకు ఓ పబ్లిషింగ్ హౌస్‌లో ఎడిటర్ గా చేరారు. ఆ ఉద్యోగంలోనే ఐదేళ్లు ఇరుక్కుపోయారు.

పబ్లిషింగ్ హౌజ్‌లో పని చెయ్యడం వల్లే తనంటే ఏంటో తాను తెలుసుకోగలిగింది. "నేను ఆఫీస్‌లో పుస్తకాలను ఎడిట్ చేసేదాన్ని. ఇంటికెళ్లి కార్టూన్లు గీసే దాన్ని. అకడమిక్ పుస్తకాల్లో అచ్చు తప్పులు సరిచేసేదాన్ని. ఇంటికెళ్లాక ట్రావెల్ స్టోరీస్ రాసేదాన్ని. కొన్నాళ్లకు రాయడం, కామిక్స్ గీయడం రెండూ నా తోడు-నీడ అని తెలుసుకున్నాను. అనుకోకుండానే నాకు నా పిలుపు వినిపించింది".

క్లైంట్ మీటింగ్ మినిట్స్ కూడా కామిక్స్ రూపంలోనే !

క్లైంట్లతో జరిగే సమావేశాల్లో కూడా మీటింగ్ సారాంశాన్ని కామిక్స్‌గా గీసేదాన్ని. ఎప్పుడూ అదే ఆలోచించే సరికి .. ట్యాప్ కోసం అధిక సమయం ఎందుకు కేటాయించ కూడదూ అనిపించింది. దాంతో అప్పటి నుంచి అదే నాకు ప్రపంచమయ్యింది.

పూర్తిగా తన దృష్టినంతటినీ ట్యాప్ పైనే కేంద్రీకరించారు. తన కుటుంబ సభ్యుల నుంచి స్నేహితులను పూర్తి మద్దతు లభించిందనే అంటారు రమ్య. తనను వన్ విమెన్ ఆర్మీ అని పిలిస్తే ఒప్పుకోరు. తనకు అందరి మద్దతూ ఉందంటారు.

నా గురించి , నా కామిక్స్ గురించి నా కుటుంబసభ్యులు, స్నేహితులు కనిపించిన వాళ్లందరికీ చెబుతూ ఉండేదాన్ని. ఎక్సెల్ షీట్లో ఏముందో అర్థం కాకపోయినా... లేదా నేను వేసిన ఆవు బొమ్మ ఆవులా కనిపించకపోయినా వాళ్లు నిర్మోహమాటంగా చెప్పేవారంటారు రమ్య పెద్దగా నవ్వుతూ .

తన వారందరి ప్రేమ, సహయసహకారాలు ఉన్నప్పటికీ వ్యాపారంలో సవాళ్లు ఎదుర్కోక తప్పలేదు

." నేను నో అని చెప్పడానికి అస్సలు ఇష్టబడను. మొదట్లో వచ్చిన ప్రతీ పనిని ఒప్పేసుకునేదాన్ని. చాలా తక్కువ మొత్తానికైనా సరే. కనీసం దాని కోసం ఎంత సమయం వెచ్చిస్తున్నాను... ఎంత కష్టబడుతున్నానని కూడా గుర్తించేదాన్ని కాదు." అంటారు రమ్య.
నీ మనసుకు నచ్చితే కష్టమైనా చేసేయ్...!

నీ మనసుకు నచ్చితే కష్టమైనా చేసేయ్...!


ఆ తరువాత తాను చేసినతప్పేంటో గుర్తించారు. పని చేసే విధానం అది కాదని కూడా అర్థమయ్యింది."నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు అదంటే నీకు బాగా ఇష్టమై ఉండాలి. ఎందుకంటే నువ్వు దానిపై చాలా పెట్టుబడి పెడుతున్నావు. దాన్ని సరైన రీతిలో చూసుకోవాలి. ఇక్కడ పెట్టుబడి అంటే డబ్బే కానవసరం లేదు''. ఇలా తనను తాను రమ్య మార్చుకున్నారు. దేనికైనా ప్రాతినిధ్యం వహించడంలో రమ్య దిట్ట. ప్రస్తుతం ఆమె చేస్తున్నది కూడా అదే. అనుకున్నది అనుకున్నట్లే చేస్తారు. ప్రస్తుతం ఆంట్రప్రెన్యూర్‌షిప్‌కు సంబంధించిన కోర్సు చేస్తూ బిజినెట్ టెక్నిక్స్ తెలుసుకుంటున్నారు.

మూస ధోరణితో మహా ముప్పు

"ఒక అవకాశాన్ని ఎంచుకున్నప్పుడు మిగిలిన వాటిని కోల్పోతామన్న ఒక్క విషయం నన్ను నిజంగా ప్రభావితం చేసింది. అందుకే నేను పెద్ద విషయాలను, చిన్న విషయాలను ఒకేలా చూడటం అలవాటు చేసుకున్నాను. ప్రతి నిర్ణయం నేనే తీసుకుంటాను. ఏం కోల్పోతానని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. దానికొచ్చే సమాధానాన్ని బట్టీ నిర్ణయం తీసుకుంటాను. తప్పదనుకుంటే ఆగిపోతాను."

ఓ వ్యాపారిగా సృజనాత్మకు చోటుండే వివిధ రకాల ప్రాజెక్టులంటే రమ్యకు చాలా ఇష్టం. ఒకే మూసలో ఉండిపోవడం అస్సలు ఇష్టముండదు. ఫుల్ టైం జాబుల్లో ఉండేలా స్నేహితులతో చాయ్, కాఫీ బ్రేక్స్ లేకోపోయినా... కొండల్లో ట్రెక్కింగ్ చెయ్యడానికి సెలవులు ఉండక పోయినా ఆమె పెద్దగా ఫీల్ అయ్యేవారు కాదు.

ఓ ఔత్సాహిక వ్యాపారిగా ఆమె తెలుసుకున్నదేంటంటే ప్రవాహంలో కొట్టుకుపోవడం కాదు... మనకుంటూ కొన్ని నియమాలు, చిన్న చిన్న లక్ష్యాలు ఉండాలి. అవే నిజంగా సాయపడతాయి. మనల్ని వాస్తవంలో ఉంచుతాయి. ఆమె నేర్చుకున్న ఇంకో ముఖ్యమైన విషయం "... నీకు నువ్వు సౌకర్యంగా ఉన్నట్లు అనిపించేంత వరకు ఏ పనైనా చూసుకోవచ్చు. ఎన్నైనా ప్రయోగాలు చెయ్యచ్చు. దేనికోసమో..ఎవరికోసమో నువ్వు ఇబ్బంది పడకూడదు". ఒక సారి అందుకు నేను సిద్ధపడ్డప్పటి నుంచి పనులు చాలా సులభమయ్యాయి.

ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో సవాళ్లు , మరెన్నో డ్రాయింగ్స్ ఇంకెన్నో కథలు ...భవిష్యత్తంతా రమ్యదే . చివరిగా ట్యాప్ వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయ్యాలనుకుంటున్న రమ్య ... ఆన్ లైన్ స్టోర్స్ లో మరిన్ని డ్రాయింగ్స్, కథలు ఉంచాలని కూడా భావిస్తున్నారు..

రమ్య శ్రీరామ్ ..గీతలు రాతలు

రమ్య శ్రీరామ్ ..గీతలు రాతలు


Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags