సంకలనాలు
Telugu

వీళ్లు కనిపెట్టిన ట్యాబ్ తో టీచర్లంతా ఫుల్ స్మార్ట్ !!

టీచర్ల కష్టాలు తీరుస్తున్న స్కూల్ కాం స్మార్ట్ ట్యాబ్..అటెండెన్స్ నుంచి రిజల్ట్ ఎనాలసిస్ వరకు ట్యాబ్ లో చేసుకునే అవకాశం..

uday kiran
10th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

బోలెడు సెలవులు. కష్టపడాల్సిన పనిలేదు... టీచర్‌ ఉద్యోగమంటే చాలా మంది అభిప్రాయమిది. కానీ ఆ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం ఎంత కష్టమో టీచర్లకు మాత్రమే తెలుసు. స్కూల్‌కు ఎంత మంది స్టూడెంట్స్‌ అటెండ్‌ అయ్యారు? ఎంతమంది డుమ్మా కొట్టారు? క్లాస్‌ రూంలో ఏం చెప్పారు? స్టూడెంట్స్‌ ఎంతమేర అర్థం చేసుకున్నారు? ఎగ్జామ్ రిజల్ట్స్ అనాలసిస్? ఇలా అటెండెన్స్‌ నుంచి ఎగ్జామ్ రిజల్ట్స్‌ వరకు ప్రతి విషయంలోనూ టెన్షన్‌. రిజిస్టర్ల నుంచి స్టూడెంట్ రికార్డుల వరకు పక్కా మెయింటెన్‌ చేయకపోతే ఇక అంతే సంగతులు. ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టేందుకు అందుబాటులోకి తెచ్చిందే స్కూల్‌కాం స్మార్ట్‌ ట్యాబ్‌.

image


స్కూల్‌లో చదువుతున్న స్టూడెంట్స్‌కు సంబంధించి సమగ్ర సమాచారం, టీచర్లు, సెక్షన్ల వివరాలతో పాటు కంప్లీట్‌ డీటెయిల్స్‌ ఇందులో ముందే నిక్షిప్తం చేస్తారు. ఈ స్మార్ట్‌ ట్యాబ్‌ లో వైఫై కనెక్టివిటీతో పాటు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ సింకింగ్‌ టెక్నాలజీ ఇన్‌బిల్ట్‌ గా ఉంది. టీచర్లు ఎంటర్‌ చేసిన డేటాను సింపుల్‌ గ్రాఫిక్‌ రూపంలోకి మార్చి అనాసిస్‌ చేసే అవకాశం ఈ ట్యాబ్లెట్‌లో ఉంది. డేటాను ఆఫ్‌లైన్‌లో రికార్డ్‌ చేసి 2G లేదా 3G నెట్‌వర్క్‌ ద్వారా మొత్తం ప్రొగ్రామ్‌ను సింక్‌ చేసుకోవచ్చు.

ఈ స్టోరీ కూడా చదవండి

టీచర్స్‌, స్టూడెంట్స్‌కు సంబంధించి డే బై డే పర్ఫార్మెన్‌ను అనాలసిస్‌ చేసేందుకు ఈ ట్యాబ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఇన్‌బిల్ట్‌గా ఉన్న మెసేజింగ్‌ సిస్టం సాయంతో స్టూడెంట్స్‌ రిపోర్ట్స్‌తో పాటు యాక్టివిటీస్‌ అన్నింటినీ పేరెంట్స్‌కు పంపే వీలు కలుగుతుంది.

స్కూల్‌కాం ఫౌండర్‌ అయిన మంగళ్‌రామ్‌ పురుషోత్తం యూఎస్‌లో ఉండగా ఈ స్టార్టప్‌ ఐడియా వచ్చింది. జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి మాస్టర్స్‌ కంప్లీట్‌ చేసిన ఆయన ఆ తర్వాత ఓ టెక్నాలజీ కంపెనీలో కన్సల్టెంట్‌గా చేరాడు.

“ఇండియాలో స్కూల్స్‌ నడపాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. విద్యార్థులకు సంబంధించిన సమగ్ర సమచారాన్ని ఒకచోట చేర్చడం ఎంతకష్టమో ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రోజువారీ కీలక నిర్ణయాలు తీసుకోవడం ఎంత కష్టమైన పనో అర్థమైంది. టీచర్ల కష్టాలు తీర్చేందుకు ఏదో ఒకటి చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా.” -మంగళ్‌ రామ్‌ పురుషోత్తం

మంగళ్‌రామ్‌ ఫ్రెండ్‌, సాఫ్ట్‌ వేర్‌ డెవలప్‌మెంట్‌లో ఏళ్ల తరబడి అనుభవం ఉన్న సౌరభ్‌ సక్సేనా ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రపంచంలోనే 500 మంది టాప్‌ ప్రోగ్రామర్లలో ఒకరైన సౌరభ్‌ కో ఫౌండర్‌గా జాయిన్‌ కావడంతో మంగళ్‌కు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది.

ఇంకేముందు నలుగురు టీంతో స్కూల్‌ కాం స్టార్టప్‌ పని మొదలుపెట్టింది. సౌరభ్‌ లీడ్‌ డెవలపర్‌గా ఈ టీం 2013లో ఫస్ట్‌ MVP స్కూల్‌కాంను రూపొందించింది.

అభివృద్ధి పథంలో

స్మార్ట్‌ ట్యాబ్‌ ఏసీ రూంలో కూర్చొని ఆషామాషీగా తయారు చేసింది కాదు. టీం మెంబర్స్ టీచర్లు, స్టూడెంట్స్‌ అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఇందుకోసం గంటల తరబడి స్కూళ్లలో గడిపి ఏమేం అవసరమో అర్థం చేసుకున్నారు. అలా 2013లో 3వేల మంది విద్యార్థుల డేటాతో స్మార్ట్‌ ట్యాబ్‌ రూపొందించారు. ప్రస్తుతం స్టూడెంట్స్‌ సంఖ్య లక్షకు చేరింది.

అవకాశాలు అపారంగా ఉండటంతో ఏటా 100శాతం వృద్ధి నమోదుచేస్తున్నామని అంటోంది స్కూల్‌కాం టీం. ప్రస్తుతం ఈ స్టార్టప్‌కు స్మార్ట్‌ ట్యాబ్‌ అమ్మకాల ద్వారా మాత్రమే ఆదాయం వస్తోంది. స్కూల్‌ అవసరాలను బట్టి ట్యాబ్‌లను రూపొందించి అందుకు అనుగుణంగా ధర నిర్ణయిస్తోంది.

ఫ్యూచర్‌ ప్లాన్‌

“2017నాటికి 10లక్షల మంది విద్యార్థుల్ని స్కూల్‌కాంలో చేర్చాలన్నది మా లక్ష్యం. ఎలాంటి నిధులు సమీకరించకుండానే ఇప్పటికే పది శాతం లక్ష్యం పూర్తి చేశాం.”- మంగళ్‌

ప్రస్తుతం స్కూల్‌కాం టీం కొత్త వెబ్‌సైట్‌ Flapను డెవలప్‌ చేసే పనిలో బిజీగా ఉంది. మాథమేటిక్స్‌ నుంచి మ్యూజిక్‌ వరకు వివిధ సబ్జెక్ట్‌లకు సంబంధించి స్టడీ మెటీరియల్‌ రూపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా పేరున్న టీచర్లు, సబ్జెక్ట్‌ నిపుణులతో కలిసి పనిచేస్తోంది. యూజర్‌ ఏ డివైజ్‌ నుంచైనా వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయి నచ్చిన సబ్జెక్టు గురించి తెలుసుకునే వెసలుబాటు కల్పించాలని స్కూల్‌కాం భావిస్తోంది.

యువర్‌ స్టోరీ టేక్‌

విద్యా విధానంలో వస్తున్న మార్పులతో విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. అందుకు అనుగుణంగా పాలసీలు రూపొందిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల సమగ్ర సమాచారాన్ని ఒకచోట చేర్చడం స్కూల్‌లకు కంపల్సరీ అయింది. యూకేలో ప్రాచుర్యం పొందిన Schoolcomm ప్రేరణతో Schoolcom రూపొందించారు.

భారత్‌లో దాదాపు 13లక్షల స్కూళ్లలో సుమారు 23 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నట్లు ఓ సర్వే చెబుతోంది. 2013లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య 13.67శాతం పెరిగింది. గత రెండు దశాబ్దాల్లో ఇండియన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సిస్టంలో 70మిలియన్‌ స్టూడెంట్స్‌ ఎన్‌రోల్‌ చేసుకున్నారని.. ప్రపంచంలోనే ఇది రికార్డని IBEF రిపోర్ట్‌ చెబుతోంది.

రిపోర్టుల సంగతెలా ఉన్నా మౌలిక సదుపాయల కొరత చాలా స్కూళ్లకు పెద్ద సవాల్‌గా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోని చాలా బళ్లలో స్టేషనరీ మాట అటుంచితే కనీసం మంచినీటి వసతి కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్మార్ట్‌ట్యాబ్‌లతో స్కూల్‌ రూంల రూపురేఖలు మార్చాలనుకోవడం మంచిదే అయినా.. మారుమూల ప్రాంతాల్లోని స్కూళ్లలో ఇది సాధ్యమా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే.

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags