సంకలనాలు
Telugu

మహిళలూ కారు నడపగలరు ! ప్రోత్సహించండి చాలు అంటున్న 'షి కెన్ డ్రైవ్'

Lakshmi Dirisala
3rd Oct 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

అవును! ఆమె కూడా బాగా డ్రైవ్ చెయ్యగలదు.

భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల కోసం మహిళచే స్థాపించబడిన కార్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రమైన “షి కెన్ డ్రైవ్” ప్రొప్రైటర్ స్నేహా కామత్ ని కలుసుకుందాం రండి.

image


సంప్రదాయ మార్వాడీ కుటుంబం నుంచి వచ్చిన స్నేహ.. తోడబుట్టిన వారందిలోకి చిన్నది. చిన్నప్పటినుండి కూడా ఒక అమ్మాయిలా కాకుండా ఏదో ఒకటి భిన్నంగా చెయ్యాలని భావించేది. ఎకనామిక్స్ గ్రాడ్యుయేషన్, సోషియాలజీలో పోస్ట్ గ్రాడ్ర్యుయేషన్ ముంబైలో పూర్తిచేశారు. మొదటి నుంచీ బాగా చదువుకోవాలని కోరిక తనకి. ఎంఎస్ సర్టిఫైడ్ సర్వీస్ ఇంజనీర్ కోర్స్ కూడా చేసింది.

చిన్నతనంలోనే ఆమెను ధృడంగా చేసిన సంఘటన

చిన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోవడం వల్ల ఆమె బాల్యం చేదు జ్ఞాపకాలతో నిండిపోయింది. ఆమె తన నానమ్మతో ఉండేది, నలుగురు తోబుట్టువులు ఏ విధంగా చెల్లాచెదురైపోయారో గుర్తుచేసుకుని బాధపడుతూ ఉంటుంది. తన పదిహేడో ఏటే తండ్రిని కోల్పోయిన స్నేహ ఇలా చెప్తారు... “ నా చదువు కొనసాగడానికి మా అక్క ఏడో తరగతిలోనే చదువు ఆపేసింది, మేము చాలా కష్టాలు అనుభవించాల్సి వచ్చింది”. చిన్నతనంలో ఆమె, ఆమె తోబుట్టువులు కలసి తల్లిదండ్రుల ప్రేమ కోసం ఎంతగా తపించేవారో గుర్తుచేసుకుంటూ ఉంటుంది.

image


స్నేహ మొట్టమొదటి ఉద్యోగం ఆర్చీస్‌లో సేల్స్ గర్ల్. కస్టమర్లకి గ్రీటింగ్ కార్డులు అమ్ముతుండేది. నెలకి వెయ్యి రూపాయలు సంపాదిస్తూ ఆ డబ్బుని తన ఉన్నత చదువులకి ఉపయోగించుకునేది. ఈ ధీర వనిత తనకి పోరాట స్ఫూర్తి అమ్మనుండి వచ్చిందని చెప్తుంది.

ఆ తర్వాత

తర్వాత పదేళ్లలో స్నేహ వివిధ రంగాల్లో పని చేసింది. ఒక్కటైతే ఖచ్చితంగా ఆమెకి తెలుసు-ఎక్కడ పనిచేసినా బాస్‌తో తన పని గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు అనుకునేది. అంత బెరుకుగా ఉండేది. ఆ తర్వాత ఆమెకి వివాహం అయి గర్భం దాల్చడంతో బ్రేక్ తీసుకోవల్సి వచ్చింది.

కాలం గడుస్తున్నకొద్దీ ఆమెకి ఒక విషయం తెలిసివచ్చింది. తను బాగా డ్రైవ్ చెయ్యగలదని. “ మా అన్నయ్య నాకు డ్రైవింగ్ నేర్పించాడు, అప్పటినుండీ నాకు లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్లడమంటే చాలా ఇష్టం ”, అంటూ చెప్పే స్నేహ, తన సోదరి మాత్రం డ్రైవింగ్ నేర్చుకున్న పదహారేళ్ల తర్వాత కూడా సరిగ్గా చెయ్యలేనని చెప్తుంది అంటారు.

ఆశ్చర్యపోయిన స్నేహ ఈ సమస్యకి మూలం ఏమిటా అని ఆరా తీసే పనిలో పడింది. బాగా లోతుగా పరిశీలించేసరికీ అసలు విషయం తెలిసింది. “ మగ ట్రైనర్లు చాలాసార్లు తాకడానికి ప్రయత్నిస్తారు అలాగే మహిళలంటే డ్రైవింగ్ సరిగ్గా నేర్చుకోలేరని, వాళ్లు సమయం వృధా చెయ్యడానికే వస్తారనే అపోహలో ఉంటారు” అని చెప్తారు.

“నేను సెక్రటరీగా, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేసినప్పుడు బాస్‌లకి నా వర్క్ గురించి రిపోర్ట్ చెయ్యడానికే నేను అసౌకర్యంగా భావించినప్పుడు, ఒక పురుషుడు పక్కన కూర్చుని మహిళ డ్రైవింగ్ నేర్చుకోవడమంటే ఖచ్చితంగా అది అంత సౌకర్యవంతంగా ఉండదు అని నేను అర్ధం చేసుకోగలను” అని చెప్తారు స్నేహ. మగవాళ్లు డ్రైవింగ్ సులువుగా చెయ్యగలరు అంటే దానర్ధం వాళ్లు సులువుగా నేర్పించగలరు కూడా అని కాదు.

image


షీ కెన్ డ్రైవ్ ఆరంభం

2012 లో షీ కెన్ డ్రైవ్ మొదలైంది, అప్పటినుండి సుమారు 400 మంది మహిళలకి స్నేహ శిక్షణనిచ్చింది. ఆమె దాన్ని ఓ డ్రైవింగ్ స్కూల్‌గా మార్చలేదు కానీ త్వరలోనే అలా చెయ్యాలని భావిస్తోంది.

విద్యార్ధులతో ప్రవర్తించే వినూత్న తీరుతోనే స్నేహ చాలా పేరు సంపాదించుకుంటోంది. నేను వాళ్ల కారులో అడుగుపెట్టగానే వాళ్లని అడిగే ప్రశ్న వారికి నచ్చేది ఏంటని ? అలా అడిగిన ప్రతీసారీ నాకు రకరకాల సమాధానాలు లభిస్తూ ఉంటాయి. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మహిళలు చాలా గొప్ప గొప్ప పనులు చెయ్యాలనుకుంటారు కానీ వారి లక్ష్యానికి పరిమితి విధించుకుంటారు. అటువంటప్పుడే నేను వారిని అందులోంచి బయటకు తెచ్చి తమంత తాముగా ఏదైనా ప్రారంభించడానికి వాళ్లని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.

ఇప్పటివరకూ చవిచూసిన అనుభవాలు

ఆమె తన మొదటి విద్యార్ధిని గుర్తుచేసుకుంటూ ఇలా చెప్తారు. “నేను ఆమె సొంత కార్ లోనే శిక్షణ అందించాను. కారు కొన్న రెండో రోజే ఆమె దేనికో గుద్దేసింది, జనాలు నన్ను కోప్పడ్డారు. కానీ జరిగిన నష్టాన్ని నేను భరించాను, సమస్య పరిష్కారమైంది. ఇప్పటివరకూ వచ్చిన వాళ్లలో ఆమె నా ’అత్యుత్తమ’ విద్యార్ధి”. స్నేహా దహిసర్ హైవే నుంచి బాంద్రా స్ట్రెచ్ వరకూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

స్నేహ విద్యార్ధుల్లో 58 సంవత్సరాల వయసున్న లీలా దేశ్ పాండేకి, ఎలా అయినా డ్రైవింగ్ నేర్చుకోవాలనే పట్టుదల ఉండేది. అమెరికాలో ఉంటున్న ఆమె భర్త, కొడుకు బాగా నిరుత్సాహపరిచేవారు. ఒక డ్రైవర్‌ని పెడతామని చెప్పేవారు కానీ అందుకు ఆమె ఒప్పుకునేది కాదు. “మొత్తానికి ఆమె అనుకున్నది సాధించింది. స్వయంగా కారు నడపడం వచ్చాక ఆమె ఆనందానికి అవధులు లేవు”, అంటూ గుర్తుచేసుకుంటారు స్నేహ.

బిజీ షెడ్యూల్

మొత్తం రోజంతా ఆమె డ్రైవింగ్ తో బిజీగా ఉంటుంది. ఉదయం 7:30 తో మొదలయ్యే ఆమె దినచర్య అర్ధరాత్రితో ముగుస్తుంది ఎందుకంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కి కేవలం సాయంత్రం, రాత్రి వేళల్లో మాత్రమే శిక్షణ ఇవ్వాలి. కాకపోతే మధ్యాహ్న వేళల్లో మాత్రం ఇంటికి వెళ్లి తన ఏడేళ్ల కూతురి ఆలనా పాలనా చూసుకుని తిరిగి వర్క్ కి వెళ్లేలా ప్రణాళిక వేసుకున్నారు ఈ ఆంట్రప్రెన్యూర్.

image


షీ కెన్ డ్రైవ్ లో ఒక ఆసక్తికరమైన అంశం

నా విద్యార్ధులు పది రోజుల్లోపు శిక్షణ సరిగ్గా పూర్తిచెయ్యలేకపోతే వారికి డబ్బు తిరిగి ఇచ్చేసే పాలసీ ఉంది. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా నాకు డబ్బు తిరిగి ఇచ్చే సందర్భం రాలేదు, దీన్ని బట్టే నైపుణ్యాలు మెరుగుపరచుకోవడంలో మహిళల ఆత్మవిశ్వాసం, నిబద్ధతలు అర్ధం చేసుకోవచ్చని చెప్తారు స్నేహ.

ఆమె భవిష్యత్తు ప్రణాళికలు

బిబిసి, ఇంకా అనేక ఇతర పేరొందిన పబ్లికేషన్స్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన స్నేహ ఇప్పుడు తనవంతుగా సమాజానికి ఏమైనా ఇవ్వాలని ఆశిస్తోంది. “ గ్రామీణ మహిళలకి నేను శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నాను. తద్వారా వాళ్లు నాకోసం పనిచెయ్యాలని కోరుకుంటున్నాను. కొంతమందిని అధికారిక క్యాబ్ డ్రైవర్లుగా కూడా కంపెనీల్లో నియమించాలని ఆలోచిస్తున్నాను. వాళ్లు పనిమనుషులగానే ఉండిపోకూడదు, నేను వాళ్లని శక్తిమంతంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను ” అంటారు స్నేహ చాలా ధీమాగా. 

భారతదేశ వ్యాప్తంగా తన సేవల్ని ప్రారంభించాలని చూస్తున్నారు స్నేహ. స్వంతంగా ఎదిగిన ఈ ఆంట్రప్రెన్యూర్ ఒక విషయాన్ని బలంగా నమ్ముతారు. '' మహిళలకి నమ్మకాన్ని కలగించండి, అప్పుడు వాళ్లు అద్భుతాలు చేస్తారు ! ''

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags