ఇది మూమ్మాటికి మహిళా ప్రపంచమే- షిరోస్ సీఈవో సైరీ చాహల్
పారిశ్రామిక రంగంలో నెగ్గుకురావడం మహిళలకు కష్టం అన్నద ఒకప్పటి మాట. ఆధునిక కాలంలో పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటున్నారు షిరోస్ సీఈఓ సైరీ చాహల్. అవకాశాలను అందిపుచ్చుకుని ముందడుగేస్తే జయించడానికి అతివల కోసం చాలానే ఉందని చెప్తున్నారు.
మహిళాశక్తిని తక్కువ అంచనా వేయొద్దంటారు సైరీ. జిప్ కార్ వ్యవస్థాపకుడు రాబిన్ చేజ్ ను కోట్ చేస్తూ ప్రపంచంలోని తొలి కార్ షేరింగ్ ఐడియా ఓ మహిళదే అని గుర్తు చేశారామె. వ్యాపార రంగంలో మహిళల ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయిందని, వారి దృక్పథం బిజినెస్ ను మించిపోయిందని చెప్తున్నారు.
వ్యాపార విభాగంలోనే కాక, టెక్నాలజీలోనూ పట్టుసాధించాలని మహిళలకు సూచిస్తున్నారు సైరీ. ఈ టాస్క్ లో విమెన్ కు 2016 మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ బాగా సపోర్టు చేస్తున్నాయనేది ఆమె అభిప్రాయం. మైక్రోసాఫ్ట్ 2016 ఫీచర్స్ మహిళా సాధికారతకు ప్రోత్సాహకరంగా ఉందని పేర్కొన్నారు. అంతేకాక ఈ పీఛర్స్ విమెన్ ఆంట్రప్రెన్యూర్స్ కు పలురకాల ఆపరేటింగ్ సిస్టమ్స్, డివైజ్ లతో పనిచేయగల సామర్థ్యాన్ని అందిస్తాయని సైరీ అంటున్నారు.
ఉదాహరణకు మీరో ప్రపోజల్ రాస్తారు. దాన్ని రీవ్యూ చేయమని మీ బాస్ కోరి, మీకు 30 నిమిషాల టైమే ఉంటే, విండోస్ 2016 సాయంతో ఈజీగా గట్టెక్కచ్చు. మైక్రోసాఫ్ట్ అందించే కొత్త ఫీచర్ ద్వారా పనిచేస్తున్న డాక్యుమెంట్ లేదా ఫైల్ నుంచే స్కైప్ చాట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అని సైరీ చెప్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీని తెలుసుకుంటే స్టార్టప్ సెక్టార్ ను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
స్టార్టప్ వ్యవస్థలో " అంతర్లీన శక్తులు, ఆర్ధిక నిర్మాణం, శ్రమ, నూతన వ్యాపార అవకాశాలు" అనే నాలుగు పునాదులు ఉంటాయని సైరీ చెప్తారు. కనెక్టివిటీ, మెషీన్ కేపబిలిటీ, జనాభా, సామాజిక అంచనాలు అంతర్లీన శక్తులకు అనుసంధానమై ఉంటాయని అంటారు. ఈ రోజుల్లో ఓ చోట నుంచి ప్రపంచం నలుమూలలకూ కనెక్టయ్యే అవకాశం ఉంది. కాబట్టి అత్యాధునిక మెషీన్స్ తో పనిచేయడం నేర్చుకోవాలి. అప్పుడే మన సామర్ధ్యం పెరుగుతుందంటారు సైరీ.
ప్రమాణాలు, ప్రపంచీకరణ, ఉత్పాదకత ఆర్ధిక నిర్మాణంలోని అంశాలంటారు సైరీ. ఈ అంశాల ద్వారా మార్కెట్ డిమాండ్స్ తెలుసుకోవచ్చని, గిరాకీని బట్టి ఉత్పత్తిని మాడ్యూల్ చేయొచ్చని చెప్తున్నారు. ప్రస్తుత అవకాశాలను వినియోగించుకుంటూ విస్తృతిని పెంచుకోవాలని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సూచిస్తున్నారామె.
ఇక వర్క్ ఫోర్స్ విషయానికొస్తే జాబ్ మార్కెట్ లో తరచూ మార్పులు జరుగుతున్నాయి. డ్యూటీ, టాలెంట్ దే సింహభాగం. సంస్థపై ఒత్తిడి లేకుండా క్రౌడ్ సోర్సింగ్ సాయంతో వర్క్ ను మేనేజ్ చేయొచ్చు. ఉద్యోగులను మరోచోటికి తరలించనక్కర్లేకుండానే పనులు పూర్తి చేసుకోవచ్చు. ఫలితంగా గ్లోబలైజ్డ్ ఎకానమీ కల సాకారమవుతుందని సైరీ వివరిస్తున్నారు.
మన చుట్టూ ఉన్న పరిసరాలు, సమాచారాన్ని నిత్యం విశ్లేషించుకోవాలంటారు సైరీ. ఇతరుల సహకారం తీసుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయని వివరిస్తున్నారు. కాలానుగుణంగా మారిపోతున్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అద్భుతాలు సాధించేందుకు కృషిచేయాలని అంటున్నారు. అయితే వర్కింగ్ స్టైల్ లో ఆఫీస్ 365, ఆఫీస్ 2016 ఫీచర్స్ ఉపయుక్తంగా ఉన్నాయని, ఈ సరికొత్త ఫీచర్స్ ను ట్రై చేయాలని సూచిస్తున్నారు సైరీ.